Movies

ఇప్పుడెలా చూస్తారనేది ముఖ్యం

ఇప్పుడెలా చూస్తారనేది ముఖ్యం

ఇరవై ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో నాయికగా ప్రయాణం కొనసాగించాను, భిన్నమైన పాత్రల్లో నటించాను. కానీ ఇప్పుడు తెరపై ఎలా కనిపించాలి అనేదే నాకు ముఖ్యం అంటున్నది బాలీవుడ్‌ తార కరీనా కపూర్‌. రెండు దశాబ్దాల కెరీర్‌లో అగ్ర నాయికగా వెలిగింది కరీనా కపూర్‌. సైఫ్‌ అలీఖాన్‌తో పెళ్లయ్యాక సినిమాల ఎంపికలో దారి మార్చింది. గ్లామర్‌ ప్రధానం కాకుండా నటనకు ఆస్కారమున్న పాత్రలను ఎంచుకుంటున్నది. ఆమె ప్రస్తుతం అమీర్‌ఖాన్‌తో కలిసి ‘లాల్‌ సింగ్‌ చద్దా’ అనే చిత్రంలో నటిస్తున్నది. కరీనా కపూర్‌ స్పందిస్తూ…‘సినిమాల ఎంపికలో నాకు కథ, క్యారెక్టర్‌, నేను పనిచేయబోయే మనుషులు ముఖ్యం. నాయికగా రెండు దశాబ్దాల కెరీర్‌ చూశాను. ఇప్పుడు నాకు కెరీర్‌తో పాటు కుటుంబం ముఖ్యం. రెండింటినీ బ్యాలెన్స్‌ చేస్తున్నాను. ఇప్పుడు తెరపై ఎలా కనిపిస్తే బాగుంటుంది అనే విషయానికే ప్రాధాన్యతనిస్తున్నా’ అని చెప్పింది.