NRI-NRT

న్యూజెర్సీ స్టేట్ బోర్డ్ ఆఫ్ మెడికల్ ఎగ్జామినర్స్‌లో భారతీయ అమెరికన్‌కు చోటు

న్యూజెర్సీ స్టేట్ బోర్డ్ ఆఫ్ మెడికల్ ఎగ్జామినర్స్‌లో భారతీయ అమెరికన్‌కు చోటు

అగ్రరాజ్యం అమెరికాలో మరో భారతీయ అమెరికన్‌కు కీలక పదవి దక్కింది. న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ మర్ఫీ ప్రముఖ ఇండో-అమెరికన్ వైద్యురాలు నిమిషా శుక్లాను స్టేట్ బోర్డ్ ఆఫ్ మెడికల్ ఎగ్జామినర్స్‌ సభ్యురాలిగా నియమించారు. శుక్లా ప్రస్తుతం SUNY డౌన్‌స్టేట్ మెడికల్ సెంటర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్‌లో చీఫ్ రెసిడెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అలాగే మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీలో ఆమె వైద్య విద్యార్థులకు పాఠాలు కూడా బోధిస్తారు. కాగా, మెట్రోపాలిటన్ న్యూయార్క్ ఏరియా రేడియో స్టేషన్‌ను కొనుగోలు చేయడం ద్వారా ఆమె మొదటి భారతీయ అమెరికన్ మహిళా బ్రాడ్‌కాస్టర్‌గా కూడా నిలిచారు. ఇక న్యూజెర్సీ బోర్డ్ ఆఫ్ మెడికల్ ఎగ్జామినర్స్ ప్రజల ఆరోగ్యం, భద్రత, సంక్షేమాన్ని పరిరక్షించే బాధ్యతను కలిగి ఉంటారు.