Movies

సచిన్‌ కూతురు.. బాలీవుడ్‌ ఎంట్రీ?

సచిన్‌ కూతురు.. బాలీవుడ్‌ ఎంట్రీ?

క్రికెట్‌ లెజెండ్‌ సచిన్‌ టెండూల్కర్‌ కుమార్తె సారా.. బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనుందనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. కట్టిపడేసే అందంతో ఎంతో ఆకర్షణీయంగా కనిపించే 24 ఏళ్ల సారా.. వివిధ సౌందర్య, ఫ్యాషన్‌ ఉత్పత్తులకు మోడల్‌గా వ్యవహరిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పుడూ వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను అప్‌లోడ్‌ చేస్తూ ఉంటుంది. అయితే, తాజాగా ఆమె పోస్టు చేసిన ఓ వీడియో.. గ్లామర్‌ వరల్డ్‌లోకి అడుగుపెట్టడానికే అన్నట్టుగా ఉందని బాలీవుడ్‌లో గుసగుసలాడు కుంటున్నారు. నటించాలనే ఆసక్తి ఉన్న సారా.. యాక్టింగ్‌ కోర్సులో కూడా చేరిందని చెబుతున్నారు.