సొంత దేశం తీరును తప్పుబట్టకుండానే.. రష్యాకు, ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు మద్ధతు వ్యాఖ్యలు చేస్తుంటాడు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన పుతిన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. రష్యాతో, పుతిన్‌తో అనుబంధం గురించి పియర్స్ మోర్గాన్ .. డొనాల్డ్ ట్రంప్‌పై ప్రశ్నల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో పుతిన్‌పై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పియర్స్ మోర్గాన్ అన్‌సెన్సార్డ్ పేరిట జరిగిన ఇంటర్వ్యూలో.. ‘‘ఒకవేళ అధ్యక్ష స్థానంలో ఉండి ఉంటే.. ఉక్రెయిన్ తాజా పరిణామాలపై ఎలా స్పందించేవార’’ని ట్రంప్‌ను పియర్స్ అడిగాడు. దానికి.. ట్రంప్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ఈ పరిణామాలను ఆధారంగా చేసుకుని పుతిన్‌పై విరుచుకుపడతానని చెప్పాడు. క్రెమ్లిన్ నేత(పుతిన్‌ను ఉద్దేశించి).. పదే పదే అణు అనే పదం ఉపయో గిస్తున్నాడు. నేనే గనుక అధ్యక్ష స్థానంలో ఉండి ఉంటే.. ఆ పదం వాడొద్దంటూ గట్టిగా హెచ్చరించేవాడిని. పుతిన్ ప్రతీరోజూ ఆ పదం వాడుతూనే ఉన్నాడు. అంతా భయపడుతున్నారు. ఆ భయాన్ని చూసి ఇంకా పదే పదే ఆ పదాన్నే రిపీట్ చేస్తున్నాడన్నారు.