Politics

ఏపీలో 17వేల జగనన్న కాలనీలు వస్తున్నాయ్

Auto Draft

ప్రతి ఒక్కరికీ సొంతిల్లు ఉండాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం జగన్‌ అన్నారు. సుమారు 30.7లక్షల మందికి ఇళ్లు కట్టి ఇస్తున్నామని తెలిపారు. స్థలాలు, ఇళ్లకు మొత్తం రూ.55వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు.ఇప్పటికే 15.6లక్షల ఇళ్లు పూర్తి చేసినట్లు ఆయన వివరించారు. ‘నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్‌ మాట్లాడారు.”రాష్ట్రంలో 17వేల జగనన్న కాలనీలు వస్తున్నాయి. త్వరలో రెండో దశ ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తాం. ఇళ్లు లేని వారు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేయాలి. పైడివాడ అగ్రహారంలో లక్షా 23వేల మందికి పట్టాలు ఇచ్చాం. జిల్లాలో ఒక్క కాలనీలోనే 10,228 ఇళ్లు నిర్మిస్తున్నాం. ప్రతి మహిళకు రూ.10లక్షల విలువైన ఇల్లు ఇస్తున్నాం” అని జగన్‌ అన్నారు