పై చదువులు , ఉద్యోగాల కోసం అమెరికాకు వస్తున్న విద్యార్థుల్లో కొందరు బోగస్ ధ్రువపత్రాలు సమర్పిస్తున్నట్లు గుర్తించిన అక్కడి ప్రభుత్వం అలాంటి వారి సీట్లను రద్దు చేయటంతో పాటు కేసులు సైతం పెట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది . అమెరికన్ కాన్సులేట్ ఫిర్యాదుతో దిల్లీ లు తాజాగా తెలుగు రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కొందరు విద్యార్థులపై కేసులు నమోదు చేయడం సంచలనం రేపింది. తాజాగా అమెరికా విడుదల చేసిన గణాంకాల ప్రకారం .. ఆ దేశంలో ఎఫ్ -1 వీసా ( విద్యార్థి ) పై ప్రస్తుతం 2.32 లక్షల మంది భారత విద్యార్థులు చదువుతున్నారు. అమెరికా వెళ్లే విద్యార్థుల్లో ఎక్కువ మంది నాణ్యమైన చదువు కంటే అక్కడ హెచ్ 1 – బి వీసా ద్వారా స్థిరపడాలన్న లక్ష్యంతోనే వెళుతున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఐఐటీ పట్టభద్రుడి కన్నా అమెరికా వెళ్లిన సాధారణ విద్యార్థి మెరుగ్గా సంపాదిస్తున్నాడన్న భావన ఇక్కడి యువతలో ఉంది..
అందుకనే ఇటీవల మధ్య, దిగువ మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులూ అక్కడికి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ పరిస్థితుల్లో కొందరు అక్రమ మార్గాలు వెతుకుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నిపుణులతో జీఆర్ఆ రాయించి మంచి స్కోర్ పొందటం, బ్యాంకు ఖాతాలో విదేశీ చదువుకు అవసరమైన డబ్బు ఉన్నట్లు చూపడం, గతంలోనే బీటెక్ పూర్తయినవారు అప్పటి నుంచి ఉద్యోగం లేకున్నా ఉన్నట్లు చూపటం, చిన్న కంపెనీల నుంచి అనుభవ ధ్రువపత్రాలు సమర్పించడం తదితరాలను అవలంబిస్తున్నారు. దీన్ని అరికట్టేందుకు అమెరికా ప్రభుత్వం నిఘాను పెంచి, కేసులు పెట్టేందుకు సిద్ధమైందని హైదరాబాద్కు చెందిన ఓ విదేశీ కన్సల్సెన్టీ నిర్వాహకుడు ఒకరు తెలిపారు. కొన్ని ప్రముఖ కన్సల్టెన్సీలే తమ ఫీజు కోసం విద్యార్థులను అలా ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
**విద్యార్థులూ.. తల్లిదండ్రులూ ..
పారాహుషార్ హైదరాబాద్ లోని అమెరికన్ కాన్సులేట్ అధికారులు నకిలీ ధ్రువపత్రాలపై తరచూ రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తూనే ఉన్నార . ఈక్రమంలోనే ఇటీవల పోలీసులు నకిలీ ధ్రువపత్రాల ముద్రణ ముఠాలను పలుచోట్ల అరెస్టుచేశారు. అక్రమాలపై రాష్ట్ర ఉన్నత విద్యామండలితో జరిగిన సమావేశంలో డీజీపీ మహేందర్రెడ్డి చర్చించార . ఫలితంగా రాష్ట్రంలోని 15 వర్సిటీలకు చెందిన గత పదేళ్ల ధ్రువపత్రాలను ఒకచోటకు తెచ్చినట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛర్మన్ ఆచార్య లింబాద్రి తెలిపారు. వెబ్సైట్ ద్వారా ఆయా ధ్రువపత్రాలను కంపెనీలు తనిఖీ చేసుకోవచ్చన్నారు. మరోవ .. నకిలీ ధ్రువపత్రాలు ముద్రించినవారినే కాక తీసుకున్న వారిపైనా కేసులు నమోదు చేసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఓయూ, జేఎన్టీయూ హెచ్ తో పాటు ఏపీలోని కొన్ని వర్సిటీలు నకిలీ ధ్రువపత్రాలను తనిఖీ చేసి వాటి గుట్టు చెబుతున్నాయి. ఆయా విదేశీ విశ్వవిద్యాలయాలు విద్యార్థులు సమర్పించిన సర్టిఫికెట్లను థర్డ్ పార్టీ ద్వారా సంబంధిత వర్సిటీలకు పంపి తనిఖీ చేయిస్తున్నాయి. ఒక వర్సిటీ లేదా కంపెనీలో తప్పించుకున్నా మరో కొలువు మారినప్పుడు ఆ పరిశ్రమలు తనిఖీ చేయిస్తున్నాయి. ఫలితంగా ఇటీవల పదుల సంఖ్యలో ఇలా దొరికిపోయి, భారత్కు తిరిగి వస్తున్నారు. గత ఫిబ్రవరి 17 న అమెరికాలోని అరిజోనా స్టేట్ యూనివర్సిటీ ఓ తెలుగు విద్యార్థిని విశ్వవిద్యాలయం నుంచి వెనక్కి పంపించింది. కారణం గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామ్ ( జీఆర్ ) సందర్భంగా మరో వ్యక్తి సహకారం తీసుకొని స్కోర్ సాధించారని తేలడమే.