Sports

ఈ నెల 30న తారల క్రికెట్‌ సందడి

ఈ నెల 30న తారల క్రికెట్‌ సందడి

కోలీవుడ్‌ వెండితెర, బుల్లితెర తారల క్రికెట్‌ పోటీలు ఈ నెల 30వ తేదీన నిర్వహించనున్నారు. సినిమాలు, టీవీ సీరియళ్లలో నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న నటి నిరోషాలో ఓ క్రికెట్‌ వీరాభిమాని కూడా ఉన్నారు. దీంతో ఆమె తొలిసారిగా స్టార్స్‌ క్రికెట్‌ పోటీలను నిర్వహించడానికి సిద్ధమయ్యారు. మీడియా క్రికెట్‌ ఛాంపియన్‌ షిప్‌ పేరుతో ఈ నెల 30వ తేదీన స్థానిక పోరూరు టెన్నిస్‌ మైదానంలో ఈ పోటీలను ఏర్పాటు చేయనున్నారు. టోర్నీ వివరాలను సోమవారం రాత్రి చెన్నైలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన క్రీడాకారుల జెర్సీ, ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆమె వెల్లడించారు.ఈ పోటీలో ఆరు జట్లతో కూడిన 90 మంది నటులు పాల్గొననున్నారని నిరోషా తెలిపారు. గెలిచిన జట్టుకు రూ. లక్షన్నర నగదు బహుమతి, పలు కానుకలు అందిస్తామని పేర్కొన్నారు. సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్‌ కుమార్‌ ముఖ్య అతిథిగా పాల్గొని, టోర్నీని నిర్వహిస్తున్న మార్క్‌ సంస్థ నిర్వాహకులతో కలిసి గెలిచిన జట్టుకు ట్రోఫీని ప్రదానం చేస్తారని వెల్లడించారు.