భారతీయ వంటకాలు స్పైసీగా ఉంటాయి. విదేశీయులు తినలేరు. మన వంటకాలను మొదటిసారి తిన్న చాలామంది విదేశీయుల రియాక్షన్స్‌ను ఇటీవల వీడియోల ద్వారా చూస్తున్నాం. అలాంటి ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఓ ఆస్ట్రేలియా బాలిక మొదటిసారి భారతీయ ఆహారం రుచిచూసి ఇచ్చిన రియాక్షన్ చూసి నెటిజన్లు ఎంజాయ్ చేస్తున్నారు.ఆస్ట్రేలియాలోని ఓ ఇండియన్ రెస్టారెంట్‌లో ఆస్ట్రేలియన్ అమ్మాయి తొలిసారిగా ఇండియన్ ఫుడ్ ట్రై చేసింది. ఆ అమ్మాయి తన కుటుంబంతో కలిసి వెళ్లి కడాయి చికెన్‌తోపాటు మ్యాంగో కుల్ఫీ తిన్నది. వాటిని తింటున్నంతసేపూ ఆమె హావభావాలు భలేగా ఉన్నాయి. చివరగా మౌత్ ఫ్రెష్‌నర్ తినగా, అది పండ్లలో ఇరుక్కున్నది. సోంపును బయటకు తీసేందుకు ఆ బాలికచేసిన ప్రయత్నం నవ్వు తెప్పించింది. ఈ వీడియోను ఇప్పటివరకూ మూడు లక్షలకుపైగా వీక్షించగా, 7,200 లైక్స్ వచ్చాయి.
https://www.instagram.com/angeerowden/?utm_source=ig_embed&ig_rid=cd82f91b-9e27-4d76-8909-58b255dc3b5c