Food

ఆహో.. ఏమి రుచి.. అనరా మై మరచి.. ఇది తింటే వదలరు మరి!

ఆహో.. ఏమి రుచి.. అనరా మై మరచి.. ఇది తింటే వదలరు మరి!

విశాఖ మన్యం అడవుల్లో లభ్యమయ్యే కొంకోడి కూర భలే రుచిగా ఉంటుంది.. ఈ కూరను తిన్నవారు ఆహో.. ఏమి రుచి.. అనరా మై మరచి.. అని పాటలు పాడుకుంటారని గిరిజనులు అంటున్నారు. ప్రతీ ఏటా తొలకరి జల్లులు పడిన అనంతరం ఈ కొంకోడి ఆకులు భూమి నుంచి చిగురిస్తాయి. ఆ లేత ఆకులను సేకరించి కూరగా తయారు చేసుకుని తింటారు. అరుదుగా లభ్యమయ్యే ఈ కొంకోడి కూరకు మన్యం వారపు సంతల్లో, మార్కెట్‌లో మంచి గిరాకీ ఉంటుంది. గిరిజనులు ఎక్కువగా సంతల్లో దీన్ని విక్రయిస్తుంటారు. మామూలు రోజుల్లో మార్కెట్‌(రోడ్డు పక్కన)ఒక వాట రూ.20 చొప్పున అమ్మకాలు చేపడుతుంటారు. ఈ కూర రుచి తెలిసిన మైదాన ప్రాంత ప్రజలు ధరతో లెక్క లేకుండా సంత రోజుల్లో కొనుగోలు చేస్తుంటారు.