ఉపాధ్యాయుడు కనిపించగానే తొండం పైకెత్తి నమస్కారం చేస్తాయి.. ఉదయాన్నే ఎంచ క్కా స్నానం చేస్తాయి.. సందర్శకులు వస్తే వారికి తొండంతో దీవెనలు ఇస్తాయి.. పెద్ద పెద్ద దుంగల్ని వాహనాల్లోకి ఎక్కిస్తాయి..ఇవన్నీ చేసేది ఏనుగులని అర్థమైంది కదా! ఏనుగులకు ఇలాంటి శిక్షణ ఇవ్వడానికి కేరళలో పాఠశాలు ఉన్నాయి. ఏనుగులు అక్కడ ఎంతో క్రమశిక్షణగా ఉంటాయి..
*చదువుకోవడానికిసంగీతం నేర్చుకోవడానికిబొమ్మలు గీయడానికినృత్యం చేయడానికివాహనాలు నడపడానికి…. ఏది నేర్చుకోవాలన్నా పాఠశాలలు లేదా శిక్షణ కేంద్రాలున్నట్టే కేరళలో ఏనుగులకు కూడా శిక్షణ కేంద్రాలున్నాయి. రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాలో రాజేంద్రప్రసాద్ ఎలా చెపితే అలా ఏనుగు వింటుంది కదా…అలానే ఇక్కడి ఏనుగులు కూర్చోమంటే కూర్చుంటాయి. నిలుచోమంటే నిలుచుంటాయి..దండం పెట్టమంటే బుద్ధిగా పెడతాయి. కేరళలోని పత్తనంతిట్ట జిల్లాకు 11 కిలోమీటర్ల దూరంలోకొన్ని అనే ఏనుగుల శిక్షణ కేంద్రం ఉంది. వయనాడ్ జిల్లాలో ముథంగా అనే మరో శిక్షణ కేంద్రం ఉండగాకొడనాడ్‌లో ఉన్న ఏనుగుల శిక్షణ కేంద్రం దక్షిణ భారతదేశంలోనే పెద్దది. అంతేకాదు దీనికి ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉంది. 1941 సంవత్సరంలో దీన్ని ప్రారంభించారు.1. హిందువులు ఏనుగును దైవంగా భావిస్తారు. కేరళలో అయితే ఏ వేడుక చేయాలన్నాఏ ఉత్సవం జరపాలన్నా ఏనుగులు ఉండాల్సిందే. ఉత్సవాల్లో దేవుళ్లను ఏనుగులపైనే ఊరేగిస్తారు.2.కేరళలోని పెరియార్ నదీ తీరంలో గల కొడనాడ్ ఏనుగుల శిక్షణ కేంద్రం అతి ప్రాచీనమైంది.3.ఈ శిక్షణ కేంద్రంలో ఏనుగుల కోసం ప్రత్యేకమైన తరగతి గదులుంటాయి. వీటిని చెక్కలతో నిర్మిస్తారు. స్థానికంగా వీటిని ఆనకూడు అంటారు.
ఇందులో ఒకేసారి 3-4ఏనుగులకు తరగతులు నిర్వహిస్తారు. శిక్షణ కేంద్రం దాదాపు 9ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది.4.అడవుల్లో ఒంటరిగా సంచరిస్తున్నగాయపడ్డ ఏనుగుల్ని ఈ కేంద్రానికి తీసుకు వచ్చి శిక్షణ ఇస్తారు.5.నిపుణులైన శిక్షకుల ఆధ్వర్యంలోనే వాటికి శిక్షణ ఉంటుంది. ఏడాదిరెండేళ్ల వయసున్నప్పటి నుంచే ఏనుగుల శిక్షణ మొదలవుతుంది. శిక్షకులు మొదట వాటిని మచ్చిక చేసుకునిప్రత్యేక పద్ధతుల్లో వాటికి శిక్షణ ఆరంభిస్తారు.6.ప్రతిరోజు ఏనుగులతో వ్యాయామాలు చేయిస్తారు. ఆరుబయట వాటిని అరగంట పాటు నడిపిస్తారు. ఆ తర్వాత స్నానం చేయడం నేర్పిస్తారు. ప్రత్యేకమైన ఆహారాన్ని వాటికి అందిస్తారు.7.సందర్శకులకు అభివాదం చేయడంస్నానం చేయడందుంగల్ని వాహనాల్లోకి ఎక్కించడంఉత్సవాల్లో దుందుడుకుగా ప్రవర్తించకుండాక్రమశిక్షణతో మెలగడం మొదలైనవన్నీ శిక్షణలో భాగంగా నేర్పిస్తారు.8.వీటి కోసం ప్రత్యేకంగా వైద్యబృందం అందుబాటులో ఉంటుంది. ప్రతి నిత్యం ఎంతో జాగ్రత్తగా వీటిని చూసుకుంటారు.9. దీనికి అనుబంధంగా జంతు ప్రదర్శన శాల ఉంది. ఏనుగులకు సంబంధించిన ఒక మ్యూజియం కూడాఇక్కడ ఉంది.