అమెరికాలో మరోసారి తుపాకులు ఘర్జించాయి. చికాగో (Chicago) నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన కాల్పుల్లో ఎనిమిది మంది మృతిచెందారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. సౌత్ కిల్‌ప్యాట్రిక్, బ్రైటన్ పార్క్, సౌట్ ఇండియానా, నార్త్ కెడ్జి అవెన్యూ, హోమ్‌బోల్ట్ పార్క్‌లో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. వారాంతమైన శుక్రవారం సాయంత్రం సౌత్ కిల్‌పాట్రిక్‌లో ప్రారంభమైన ఈ కాల్పులు శనివారం కూడా కొనసాగాయి. 69 ఏండ్ల వృద్ధుల నుంచి అన్ని వయస్సుల వారు మృతుల్లో ఉన్నారని అధికారులు వెల్లడించారు.అమెరికాలో దుండగులు తుపాలకుతో విరుచుకుపడటంతో సర్వ సాధారణమైపోయింది. ఈ ఏడాది దేశంలో ఇప్పటివరకు 140 మాస్ షూటింగ్స్ అయ్యాయి. కాగా, తాజాగా చికాగోలో జరిగిన కాల్పుల్లో ఎనిమిది మరణించగా, 46 మందికిపైగా గాయపడినట్లు స్థానిక మీడియా తెలిపింది.