ఐపీఎల్ జట్టైన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను కొనుగోలు చేయడం ద్వారా క్రికెట్ సంబంధిత వ్యాపారంలోకి అడుగుపెట్టిన బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్.. త్వరలోనే ఓ భారీ క్రికెట్ స్టేడియంను నిర్మించాలనే ప్లాన్‌లో ఉన్నాడు. భారీ వ్యయంతో, సుమారు పదివేల మంది సీటింగ్ కెపాసిటీతో (15 ఎకరాల విస్తీర్ణంలో), అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించతలపెట్టిన ఈ ప్రాజెక్ట్‌ను అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో ప్రాంతంలో (ఐర్విన్ సిటీ) నిర్మించేందుకు సన్నాహకాలను మొదలుపెట్టాడు. మేజర్ లీగ్ క్రికెట్ టీ20 (ఎంఎల్సీ) తో కలిసి అతను సహా యజమానిగా ఉన్న నైట్‌రైడర్స్ గ్రూప్ (కేఆర్జీ) ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టనుంది. ఈ మేరకు ఎంఎల్సీ-కేఆర్జీల మధ్య ఒప్పందాలు కూడా పూర్తయ్యాయి. 2024 టీ20 వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్‌తో పాటు యూఎస్ఏ కూడా ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో కింగ్ ఖాన్ ఈ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశాడు. ఇదే విషయమై బాద్షా స్పందిస్తూ.. అమెరికాలో రాబోయే రోజుల్లో క్రికెట్ వ్యాప్తి పెరుగుతుందనే నమ్మకంతో ఎంఎల్సీతో కలిసి పెట్టుబడులు పెడుతున్నామని తెలిపాడు.
🚨 STADIUM NEWS 🚨 Plans are underway to build an iconic home for cricket in the Greater Los Angeles metropolitan area!
"MLC venue in Southern California takes significant step forward with Great Park in the City of Irvine"
👉 https://t.co/WLUigjldoU 👈 #buildamericancricket pic.twitter.com/BKo9CGKpGq
— Major League Cricket (@MLCricket) April 29, 2022