Movies

ఆ వీధి పేరు వివేక్‌!

ఆ వీధి పేరు వివేక్‌!

గత ఏడాది కరోనా మహమ్మారి బారినపడి, ఆ తర్వాత గుండెపోటుతో మరణించిన తమిళ హాస్యనటుడు వివేక్‌కు అరుదైన గౌరవం దక్కింది. చెన్నైలోని ఆయన నివశించిన విరుగంబాక్కం ప్రాంతంలోని ఓ వీధికి ‘చిన్న కలైవనర్‌ వివేక్‌’ రోడ్‌ అని పేరు పెట్టారు. గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ సిఫార్సు మేరకు మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, నీటి సరఫరా విభాగం దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. వారం రోజుల క్రితం వివేక్‌ భార్య ఆరుల్‌ సెల్వి తన కూతురుతో కలిసి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ను కలిశారు. వారు నివశిస్తున్న వీధికి వివేక్‌ పేరు పెట్టాల్సిందిగా కోరారు.