*టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లాల పర్యటనలు ప్రారంభించారు. బుధవారం ప్రారంభమై ఇవి విడతలవారీగా కొనసాగనున్నాయి. ఈ నెలాఖరులో జరిగే మహానాడు వరకూ ఆయన వారానికి కొన్ని జిల్లాల చొప్పున పర్యటిస్తారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. మొదటగా శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస దల్లావలసలో బుధవారం సాయంత్రం బాదుడే బాదుడు ఆందోళన కార్యక్రమంలో బాబు పాల్గొంటారు.
*నేషనల్ రియల్ ఎస్టేట్ డెవల్‌పమెంట్ కౌన్సిల్(నరెడ్కో) నూతన కార్యవర్గం విజయవాడలో సోమవారం ఎన్నికైంది. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్.శ్రీనగేశ్, రాబోయే టర్మ్‌కు జి.చక్రధర్ ఎన్నికయ్యారు. సెక్రటరీ జనరల్‌గా ఎం.సీతారామయ్య, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా పీవీఎల్ నరసింహరరాజు ఎన్నికయ్యారు. జగనన్న స్మార్ట్ టౌన్‌షి్‌పలో నరెడ్కో భాగస్వామ్యం కావాలని ఆ సంస్థ చైర్మన్ జి.హరిబాబు అన్నారు. ప్రభుత్వం సూచించిన విధంగా ప్రజలకు అందుబాటు ధరల్లో ఫ్లాట్లు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు
*apలోనే ఎక్కువగా నేరాలు జరుగుతున్నాయని National Crime Records అదే విషయాన్ని చెబుతున్నాయని YCP MP Raghurama Krishnamraju అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో మహిళలపై నేరాలు 2019లో 10వ స్థానంలో ఉంటే.. 2020లో 8వ స్థానానికి చేరిందని మండిపడ్డారు. ఏపీలో ప్రతి 3 గంటలకు దళితులపై దాడులు జరుగుతున్నాయని చెప్పారు.గంజాయి, లిక్కర్ వల్లే Crime rate పెరుగుతోందన్నారు. Ration shopల్లో బియ్యం తప్ప ఏమైనా దొరుకుతున్నాయని ఎద్దేవా చేశారు. 175 సీట్లు రావాలంటే YCP, ప్రభుత్వం ప్రక్షాళన జరగాలని ఎంపీ రఘురామ కృష్ణరాజు వ్యాఖ్యానించారు
*ప్రధాని మోదీ సలహాదారుగా పెట్రోలియం శాఖ మాజీ కార్యదర్శి తరుణ్ కపూర్ నియమితులయ్యారని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సోమవారం తెలిపింది. 1994వ బ్యాచ్ ఐఏఎస్ అధికారులు హరిరంజన్ రావు, అతీశ్ చంద్ర పీఎంవోలో అదనపు కార్యదర్శులుగా నియమితులయ్యారు.
*ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. తనపై జరిగిన దాడి గురించి ఫిర్యాదు చేసేందుకు డీసీపీ కార్యాలయానికి వెళ్లాలని పాల్ భావించారు. ఈ నేపథ్యంలో కేఏ పాల్‌ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు.
*టీటీడీకి బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి లీగల్ నోటీసులు ఇచ్చారు. తిరుమలలో కాటేజీల కోసం భూమి కేటాయింపుల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయి. సరిదిద్దుకోవాలని చెప్పినా పట్టించుకోని పాలక మండలికి నోటీసులు ఇచ్చినట్టు తెలిపారు. ఇద్దరు మాజీ టీటీడీ పాలక మండలి సభ్యుల పేర్లతో… రూ. 25 లక్షలకే తిరుమలలో స్థలాలు కేటాయించాలని పాలక మండలి నిర్ణయించిందన్నారు. బహిరంగ టెండర్‌లో స్థలం విలువ రూ. 12 కోట్లు పలుకుతోందన్నారు. టీటీడీ స్పందించకపోతే కోర్టును ఆశ్రయిస్తామని బీజెపీ నేత భాను ప్రకాష్ రెడ్డి తెలిపారు.
*ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై జరుగుతున్న వరుస ఘటనలపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగిన సామూహిక అత్యాచారం, నెల్లూరులో మరో ఘటన , నిన్న రేపల్లే రైల్వేస్టేషన్‌లో ఘటనను మరువక ముందే విజయనగరం జిల్లా కేంద్రం ఉడాకాలనీలో మహిళపై అర్ధరాత్రి అత్యాచారం జరిగింది.పార్వతీపురం మన్యం జిల్లా నుంచి ఉపాధి కోసం వచ్చిన మహిళ విజయనగరంలో టీ దుకాణం నిర్వహిస్తుంది. మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటోంది. అయితే మహిళపై కన్నేసిన ఇద్దరు కామాంధులు సోమవారం అర్ధరాత్రి ఆమె ఇంట్లోకి చొరబడి లైంగికదాడికి పాల్పడ్డారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీం సేకరించిన ఆధారాలతో దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
*అనంతపురం జిల్లా రాప్తాడు పోలీసుల తీరు చర్చనీయాంశంగా మారింది. బొమ్మేపర్తికి వెళ్తున్న టీడీపీ నేత పరిటాల శ్రీరామ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. బొమ్మేపర్తి గ్రామ సరిహద్దులో పరిటాల శ్రీరామ్ కాన్వాయ్‌ను అడ్డగించారు. పరిమితికి మించి వెళ్లకూడదంటూ వాహనాలను డీఎస్పీ వీరరాఘవరెడ్డి, ఇటుకలపల్లి సీఐ విజయ భాస్కర్ గౌడ్ అడ్డగించారు. పోలీసుల తీరుపై పరిటాల శ్రీరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాహనాలు ఎక్కడిక్కడ ఆగిపోయాయి. పరిటాల శ్రీరామ్ సమక్షంలో బొమ్మేపర్తి గ్రామానికి చెందిన చిట్టి బాల తిరుపతి రెడ్డి టీడీపీలో చేరనున్నారు.
*ఎన్టీపీసీ సింహాద్రిలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. 2 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఒక్కసారిగా నిలిచిపోవడంతో ఎన్టీపీసీ పరిసర ప్రాంతాల్లో అంథకారం నెలకొంది. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి విద్యుత్ నిలిచిపోయింది. గ్రిడ్ నుంచి ఎన్టీపీసీ సింహాద్రికి సరఫరా లేదు. ఒకేసారి 4 యూనిట్లలోనూ ఎప్పుడూ విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోలేదని నిపుణులు చెబుతున్నారు. దాదాపు రెండు గంటల తర్వాత విజయనగరం జిల్లా… 4 వందల కేవీ విద్యుత్ స్టేషన్ నుంచి పాక్షికంగా విద్యుత్ పునరుద్ధించారు.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పాండిచ్చేరిలో పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం కొనసాగుతోంది. ఈ ఘటనతో అధికార యంత్రాంగం అత్యవసర మరమ్మతు పనుల్లో నిమగ్నమైంది. కాగా ఏపీలో పరిశ్రమలు విద్యుత్ వాడకంపై ఆంక్షలు ఈ నెల 15 వరకు కొనసాగనున్నాయి. ఇందుకు ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి తాజాగా ఆమోదం తెలిపింది. ఒకవైపు పరిశ్రమలు, వాణిజ్య, వర్తక సంస్థల కరెంట్ వినియోగంపై నియంత్రణలు కొనసాగుతున్నప్పటికీ విద్యుత్ వినియోగం పెరుగుతుందే తప్పా.. తగ్గడంలేదు. విద్యుత్ డిమాండ్‌ను తట్టుకోడానికి డిస్కంలు బహిరంగ మార్కెట్లో యూనిట్ రూ. 11.60 చొప్పున 32.71 మిలియన్ యూనిట్లను కొనుగోలు చేశాయి. రాష్ట్రంలో ఆదివారం ఒక్క రోజు 207.221 మిలియన్ యూనిట్ల డిమాండ్ నమోదయింది. గత ఏడాది ఇదే రోజున 195 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంది.
*రేపల్లె అత్యాచార కేసులో శవరాజకీయాలు చేస్తున్నారన్న మంత్రి సురేష్ వ్యాఖ్యలు కరెక్ట్ కాదని టీడీపీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామి అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచార ఘటనల్లో వైసీపీ కార్యకర్తలు, నాయకులు ఉన్నారని ఆరోపించారు. అత్యాచారానికి గురైన బాధితురాలు దళితురాలు కావడంతో పరిహారం అందించడంలో వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. బాధితురాలికి 10 లక్షలు పరిహారం, ఐదు ఎకరాల సాగు భూమి, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒక చోట వైసీపీ ఎమ్మెల్యేపై తిరగబడి కొట్టారు…మరో చోట ఎమ్మెల్యే గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల తిరుగుబాటు మొదలైందన్నారు.
*భారత సంతతి వ్యక్తులు, గల్ఫ్ దేశాలలో పని చేస్తున్న వారి పిల్లల కోసం బీటెక్, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ, పీహెచ్‌డీ కోర్సులలో అడ్మిషన్ల కోసం ప్రత్యేక నోటిఫికేషన్‌ను జేఎన్‌టీయూ హైదరాబాద్ విడుదల చేసింది. 2022-23 విద్యా సంవత్సరానికి యూజీ కోర్సులలో మే 2 నుంచి జూలై 4వ తేదీ వరకు, పీజీ కోర్సులలో ఆగస్టు 30వతేదీ వరకు www.jntuh.ac.in/ www.jntuhdufr.com నుంచి ప్రవేశాలు పొందాలని వివరించింది
*కోర్టు ధిక్కరణ కేసులో ఐఏఎస్ అధికారికి జైలు శిక్ష. ఐఏఎస్ అధికారి చినవీరభద్రుడుకి 4 వారాలు సాధారణ జైలు శిక్ష .
రూ.2 వేల జరిమానా విధించిన కోర్టు .2021లో ఎస్సీ, ఎస్టీఉద్యోగులు B.PED చదువుకునేందుకు వీలు కల్పిస్తూ ఆర్డర్ పాస్ చేసిన ఏపీ హైకోర్టు.B.PED కోర్సు అభ్యసించే సమయంలో ఉద్యోగులకు పూర్తి జీత భత్యాలు చెల్లించాలని ఆదేశించిన హైకోర్టు.
కోర్టు ఉత్తర్వులు అమల్లో జాప్యం చేసిన చినవీరభద్రుడుకి శిక్ష విధించిన న్యాయమూర్తి బట్టు దేవానంద్.అప్పిల్ కు శిక్షను రెండు వారాలు సస్పెండ్ చేసిన ధర్మాసనం
*దాయాదుల మధ్య భూమి పంచాయితీ.. పంచాయతీరాజ్ డీఈ ఇల్లు, కార్యాలయంలో ఏసీబీ సోదాకు దారితీసింది. ఈ దాడులతో విలువైన భూములకు సంబంధించిన ఆసక్తికర వివరాలు బయటకు వచ్చాయి. పిండిగ కరుణాసాగర్.. నల్లగొండ జిల్లా నకిరేకల్ పంచాయతీరాజ్ డీఈగా పనిచేస్తున్నారు. ఈయనకు, దాయాదులకు వారసత్వంగా 100 ఎకరాల పైగా భూమి వచ్చింది. తన వాటాగా కుడకుడ ప్రాంతంలో కొంత భూమి రాగా, మరికొంత దాయాదుల నుంచి కొన్నారు. ఈ క్రమంలో సర్వే చేయించగా ఏడెకరాలు మిగులు తేలింది. అయితే, భార్య తహసీల్దార్ కావడంతో రెవెన్యూ శాఖలోని లొసుగుల ఆధారంగా దొంగ పత్రాలు సృష్టించి 2008లో దీనిని కరుణాసాగర్ పట్టా చేసుకున్నట్లు దాయాదుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ భూమి విలువ ప్రస్తుతం ఎకరా రూ.3 కోట్లపైనే ఉంది. దాయాదుల ఆందోళన నేపథ్యంలో కుడకుడకు చెందిన టీఆర్‌ఎస్ నాయకుడు, రియల్టర్ ద్వారా రాజీకి యత్నించారు. అవి కొలిక్కిరాకముందే కరుణాసాగర్ ఇల్లు, కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోమవారం తనిఖీలు చేశారు. సూర్యాపేట కుడకుడలోని ఆయన నివాసంలో పత్రాలు, నకిరేకల్‌లోని కార్యాలయంలో రికార్డులు, రెండు చెక్కు బుక్‌లు, పాస్‌బుక్‌ను ఏసీబీ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. దాయాదుల ఫిర్యాదుతోనే ఈ దాడులు జరిగినట్లు, ఏసీబీ దాడి సమాచారం అందడంతో కరుణాసాగర్ నకిరేకల్‌లోని కార్యాలయం నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది.
*సుస్థిరాభివృద్ధికి సేంద్రియ వ్యవసాయమే ఉత్తమ మార్గమని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నా రు. భూసారాన్ని కాపాడుకోవడం ద్వారానే భవిష్యత్ తరాలకు ఆహారాన్ని అందించగలమని స్పష్టం చేశారు. సహజ వనరులైన భూమి, నీరు అపరిమితం అనే ఆలోచన సరికాదని, పరిమితమైన ఈ వనరులను పరిరక్షించుకుంటూ సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భూసారం ప్రాముఖ్యంపై రూపొందించిన భూమి సుపోషణ్ పుస్తకాన్ని సోమవారం ఆయన ఢిల్లీలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోని కొన్ని ప్రాంతాల్లో భూసారం నానాటికీ తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. క్రిమిసంహారకాలు, రసాయనాలను అవసరానికి మించి వినియోగిస్తుండటమే దీనికి కారణమన్నారు. దీనిపై అన్నదాతల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
*ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌పై టీఆర్‌ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. వడగండ్ల వానకు నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లాకు బయలుదేరారు. సిరిసిల్ల వెళ్తున్న పాల్‌ను సిద్దిపేట సరిహద్దులో టీఆర్‌ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. పాల్ ప్రయాణిస్తున్న కారుకు అడ్డంగా టీఆర్‌ఎస్ కార్యకర్తలు పడుకుని నిరసన వ్యక్తం చేశారు. కేఏ పాల్ కారు దిగి టీఆర్‌ఎస్ కార్యకర్తలతో మాట్లాడుతుండగా అక్కడే ఉన్న టీఆర్‌ఎస్ కార్యకర్త ఆయనపై చేయి చేసుకున్నారు. పాల్‌పై దాడి చేయడంతో ఆయన అనుచరులు నిరసనకు దిగారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఇరువర్గాలను కట్టడి చేసేందుకు ప్రయత్నించారు. దూకుడుగా వస్తున్న టీఆర్‌ఎస్ కార్యకర్తలను పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు. పాల్నుసిరిసిల్ల జిల్లాకు రాకుండా పోలీసులు హైదరాబాద్‌కు వెనక్కి పంపారు. పాల్‌పై చేయిచేసుకున్న టీఆర్‌ఎస్ కార్యకర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాల్‌పై దాడి చేసిన వ్యక్తిని తంగాళ్లపల్లి మండలం జిల్లెళ్లకు చెందిన అనిల్‌రెడ్డిగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్ యూత్ నాయకుడిగానేరెళ్ల సింగిల్ విండో డైరెక్టర్‌గా అనిల్‌రెడ్డి ఉన్నారు.
*డియంట్ అప్లయెన్సెస్ అండ్ ఎలక్ట్రానిక్స్ తమ అత్యాధునిక తయారీ యూనిట్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. మంత్రులు కేటీఆర్సబితా ఇంద్రారెడ్డిరాష్ట్ర ఐటీవాణిజ్యశాఖల ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్టీఎస్ఐఐసీ వీసీఎండీ నరసింహారెడ్డిటీఫైబర్ సీఈవో సుజాయ్ కరంపురిరేడియంట్ అప్లయెన్సెస్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఎండీ రమీందర్‌సింగ్ సోయిన్ఆ సంస్థ డైరెక్టర్ మణికందన్ నరసింహన్ తదితరులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు
*వ్యభిచార గృహానికి కస్టమర్‌గా వెళ్లిన వ్యక్తిపై కేసు నమోదు చేసి, ప్రాసిక్యూట్ చేయడానికి వీల్లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. గుంటూరులోని ప్రత్యేక జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్(మొబైల్) కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసును రద్దు చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి. రమేశ్ ఇటీవల తీర్పు ఇచ్చారు. గుంటూరు జిల్లా నగరంపాలెం పోలీసులు 2020లో నమోదు చేసిన కేసు ఆధారంగా గుంటూరులోని ప్రత్యేక జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్(మొబైల్) కోర్టులో ఉన్న కేసును రద్దు చేయాలంటూ ఓ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. వ్యభిచార గృహంపై దాడి చేసినప్పుడు పిటిషనర్ కస్టమర్‌గా ఉన్నట్లు పోలీసులు అందులో పేర్కొన్నారని, కస్టమర్‌గా వెళ్లిన వ్యక్తిపై కేసు పెట్టి విచారించడానికి వీల్లేదని తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. వ్యభిచార గృహాలను నిర్వహించేవారు, ఇంటిని వ్యభిచారం కోసం ఇచ్చేవారే శిక్షకు అర్హులని హైకోర్టు పలు తీర్పులు ఇచ్చిందని గుర్తు చేశారు.
*ముఖ్యమంత్రి జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులు సునీల్ యాదవ్ (ఏ-2), గజ్జల ఉమాశంకర్ రెడ్డి (ఏ-3), దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి (ఏ-5) బెయిల్ కోసం దాఖలు చేసిన వ్యాజ్యాలపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ల తరఫున వాదనలు ముగియడంతో సీబీఐతో పాటు వివేకానందరెడ్డి కుమార్తె సునీత తరఫున వాదనలు వినేందుకు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ విచారణను బుధవారానికి వాయిదా వేశారు. వాస్తవానికి వీరి బెయిల్ పిటిషన్లను హైకోర్టు గతంలో ఒకసారి కొట్టివేసింది. సీబీఐ దర్యాప్తు కీలక దశలో ఉన్నందున బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. తాజాగా వారు మరోసారి బెయిల్ కోసం పిటిషన్లు వేశారు.
*రాష్ట్రంలో పరిశ్రమల విద్యుత్ వాడకంపై ఆంక్షలు ఈ నెల 15వ తేదీ దాకా కొనసాగనున్నాయి. ఇందుకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) తాజాగా ఆమోదం తెలిపింది. ఒకవైపు పరిశ్రమలపైనా.. వాణిజ్య, వర్తక సంస్థల కరెంటు వినియోగంపై నియంత్రణల కొనసాగుతున్నప్పటికీ.. సరఫరా డిమాండ్ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. డిమాండ్‌ను తట్టుకోవడానికి డిస్కంలు బహిరంగ మార్కెట్లో యూనిట్ రూ.11.60 చొప్పున చెల్లించి 32.71 మిలియన్ యూనిట్లను బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేశాయి. రాష్ట్రంలో ఆదివారం 207.221 మిలియన్ యూనిట్ల డిమాండ్ నమోదైంది. గత ఏడాది ఇదే రోజున 195 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంది. ఒకవైపు డిమాండ్ పెరుగుతుంటే.. థర్మల్ విద్యుత్కేంద్రాలకు బొగ్గు సరఫరాలో వేగం కనిపించడంలేదు. వీటీపీఎ్‌సలో రోజుకు 285,00 మెట్రిక్ టన్నుల అవసరం కాగా.. 30,196 మెట్రిక్ టన్నులే ఉన్నాయి. ఆర్‌టీపీపీలో రోజుకు 21,000 మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం. 22,772 మెట్రిక్ టన్నులే నిల్వ ఉంది. కృష్ణపట్నంలో రోజుకు 19,000 మెట్రిక్ టన్నులు కావాలి. 6.39 రోజులకు సరిపడా 1,21,454 మెట్రిక్ టన్నుల నిల్వ ఉంది. బొగ్గు నిల్వలు అరకొరగా ఉండడం ఇంధన శాఖను కలవరానికి గురిచేస్తోంది
*తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులపాటు భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. విదర్భ నుంచి తెలంగాణ మీదుగా..తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. ద్రోణి ప్రభావంతో తెలుగురాష్ట్రాల్లో రెండ్రోజులపాటు భారీ వర్షాలు పడనున్నాయి. తెలంగాణలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. ఇక ఏపీలో కూడా అక్కడక్కడా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
*గత నెలలో 122.2 మిలియన్ టన్నుల సరుకులను రవాణా చేసి సరికొత్త రికార్డు నెలకొల్పినట్లు భారతీయ రైల్వే సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. సరుకు రవాణాలో 2021-22 సంవత్సరం నుంచి అత్యుత్తమ పనితీరు కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. గత ఏడాది 2021 ఏప్రిల్‌లో 111.64 మిలియన్ మెట్రిక్ టన్నుల సరుకులను రవాణా చేస్తే, గత నెలలో అంతకు మించి 10.5 మిలియన్ మెట్రిక్ టన్నులు అధికంగా రవాణా చేసినట్లు వెల్లడించింది. ఇందులో ఆహార ఽధాన్యాలు, ఎరువులు, ఐరన్‌ఓర్, స్టీల్, బొగ్గు, ఇతర ముడి సరుకులు ఉన్నట్లు వివరించింది.
*విద్యుత్ ఉద్యోగులకు జీతాల చెల్లింపు ఈ నెల కూడా ఆలస్యం కానుంది. నిధులన్నీ విద్యుత్ కొనుగోళ్లకే వెచ్చించాల్సి వస్తుండటంతో ఏప్రిల్ జీతాలకు డబ్బులు లేని పరిస్థితి నెలకొంది. గత నెల 8న జీతాలు చెల్లించారు. ఈ నెలలో 3, 4 తేదీలు సెలవు దినాలు కాగా 5 తర్వాతే ఉద్యోగులకు జీతాలు చేతికి రానున్నాయి.
*రైస్ మిల్లుల్లో భారత ఆహార సంస్థ(ఎ్‌ఫసీఐ) తనిఖీలు ప్రారంభించింది. సోమవారం ప్రారంభమైన ఈ తనిఖీలు ఈ నెల 15వ తేదీలోగా పూర్తవ్వాలని ఎఫ్‌సీఐ లక్ష్యాన్ని నిర్దేశించింది. రాష్ట్రంలో మొత్తం 2,320 రైస్ మిల్లులు ఉండగా.. 958 మిల్లుల్లో ఈ తనిఖీలను పూర్తిచేయనుంది. ముఖ్యంగా ఇటీవల రైస్ మిల్లుల్లో అక్రమాలు బయటపడడం, బియ్యం మాయమవ్వడం వంటి ఉదంతాలు చోటుచేసుకున్న నేపథ్యంలో.. ఈ తనిఖీల్లో స్టాక్ లెక్కలను పక్కాగా తేల్చాకే.. బియ్యం సేకరణకు సిద్ధమవ్వాలని నిర్ణయించింది. జిల్లాల వారీగా స్థానిక పౌరసరఫరాల శాఖ, ఇతర విభాగాల అధికారుల సాయంతో ఈ తనిఖీలను కొనసాగిస్తోంది. దీంతో.. తమ అవినీతి ఎక్కడ బయటపడుతుందోనని రైస్ మిల్లర్ల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
*డిమాండ్ల సాధన కోసం చేపట్టిన నిరవధిక బంద్‌ను సిరిసిల్ల టెక్స్‌టైల్ పార్క్‌లోని పరిశ్రమల యజమానులు విరమించా రు. అధికారులు హామీ ఇవ్వడంతో సమ్మెను విరమిస్తున్నట్లు యజమాను లు ప్రకటించారు. ఈ మేర కు సిరిసిల్ల టెక్స్‌టైల్ పార్క్ ఎదుట సోమవారం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. డిమాండ్ల సాధన కోసం సిరిసిల్ల టెక్స్‌టైల్ పార్క్‌లోని పరిశ్రమల యజమానులు ఆదివారం కార్మిక దినోత్సవం రోజున బంద్ పాటించడం చర్చనీయాంశంగా మారింది.