అక్షయ తృతీయ సందర్భంగా గంగోత్రి, యమునోత్రి ధామ్ ఆలయాల తెరుచుకోగా.. చార్‌ధామ్ యాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 6న కేదార్‌నాథ్, 8న బద్రీనాథ్ ఆలయాల తలుపులను భక్తుల కోసం తెలియనున్నట్లు సీఎం ప్రకటించారు. యాత్రను సజావుగా నిర్వహించేందుకు ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది.ఈ సారి చార్‌ధామ్ యాత్రకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని అంచనా వేస్తున్నారు. యాత్ర నేపథ్యంలో వసతి, ఆరోగ్యం, విద్యుత్, నీటి ఏర్పాట్లు చేయడం ప్రభుత్వానికి పెద్ద సవాల్‌గా మారింది. కరోనా మహమ్మారి తర్వాత రెండు సంవత్సరాల తర్వాత చార్‌ధామ్ యాత్ర పూర్తిస్థాయిలో ప్రారంభమవుతున్నది. అయితే, ఈ సారి చార్‌ధామ్ యాత్రపై భక్తుల్లో ఉత్కంఠ నెలకొంది. యాత్ర ఈ సారి చరిత్రాత్మకం అవుతుందని ప్రభుత్వం కూడా అంచనా వేస్తున్నది.