గర్భస్రావ హక్కులపై అమెరికా సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించే అవకాశాలున్నాయి. అబార్షన్ హక్కులను తొలగిస్తూ, ఆ చట్టాన్ని రద్దు చేసేలా కోర్టు ఆదేశాలు ఇవ్వనున్నట్టు ఓ డ్రాఫ్ట్ లెటర్ లీక్ అయింది. ఈ మేరకు ప్రముఖ వార్తాసంస్థ ‘పొలిటికో’ వెల్లడించింది. జస్టిస్ సామ్యూల్ ఆలిటో ఈ ముసాయిదాలో కొన్ని కీలక అంశాలను పేర్కొన్నట్టు కథనంలో వెల్లడించింది.1973లో రో వర్సెస్ వాడే కేసులో ఇచ్చిన తీర్పును శామ్యూల్ తప్పుగా పేర్కొన్నట్టు వివరించింది. సోమవారం రాత్రి లీక్ అయిన ఈ సమాచారంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. అయితే, సుప్రీంకోర్టు నుంచి డాక్యుమెంట్ లీక్ కావడం ఆధునిక చరిత్రలో ఎప్పుడూ జరుగలేదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.