ట్విటర్ ఎలన్ మస్క్ చేతిలోకి వచ్చిన తరవాత భారీ ఎత్తున మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని అకౌంట్లకు ఫాలోవర్లు తెగ పెరుగుతుంటే, మరికొందరికి గణనీయంగా తగ్గుతున్నారు. ఉదాహరణకు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఫాలోవర్లు ఎకాఎకిన మూడు లక్షల మంది తగ్గారు. బ్రెజిల్ ప్రెసిడెంట్ విషయంలో రెండు లక్షల మంది పెరిగారు. భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో ఏదైనా కామెంట్ చేయొచ్చు అని ఎలన్ మస్క్ భావిస్తుండడంతో ట్విటర్ అకౌంట్ కారణంగా ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉందని చాలా మంది భావిస్తున్నారు. దీనికంటే అకౌంట్ క్లోజ్ చేసుకుంటే బెటర్ అనే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ట్విటర్ అకౌంట్ నుంచి శాశ్వతంగా బైటకు రావాలంటే కొన్ని చర్యలు తీసుకోవాలి.మోర్ ఐకాన్(హారిజాంటల్ త్రీడాట్ ఐకాన్)పై క్లిక్ చేయాలి. డ్రాప్‌డౌన్ మెనూ నుంచి ‘సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ’లోకి వెళ్ళాలి.మీ ‘యువర్ అకౌంట్ టాబ్’ నుంచి డీయాక్టివేట్ యువర్ అకౌంట్‌పై క్లిక్ చేయాలి. అక్కడ డీయాక్టివేషన్ సమాచారాన్ని చదివిన తరవాత ‘డీయాక్టివేట్’ను క్లిక్ చేయాలి.పాస్‌వర్డ్ అడుగుతుంది. ఎంటర్ చేసిన తరవాత, ‘డీయాక్టివేట్ అకౌంట్’ బటన్‌పై క్లిక్ చేయాలి. అయితే అకౌంట్ పర్మినెంట్‌గా డిలీట్ అయ్యేందుకు 30 రోజులు ఆగాల్సి ఉంటుంది. ఈ లోపు రీయాక్టివేట్ చేసుకోని పక్షంలో ఇంతకుమునుపు మీరు చేసిన ట్వీట్లను రికవర్ కూడా చేసుకోలేరు. ఈ 30 రోజుల్లో మీ యూజర్ నేమ్, పబ్లిక్ ప్రొఫైల్ కూడా ట్విటర్‌లో లేదా వెబ్‌సైట్‌పై కూడా కనపించదు. అలాగే ఒకసారి శాశ్వతంగా డిలీట్ అయితే, ఇతర అకౌంట్స్ మీ యూజర్ నేమ్‌తో రిజిస్ట్రేషన్‌కు అవకాశం కలుగుతుంది.