* అంతర్జాతీయ పరిణామాలు మార్కెట్‌కు ప్రతికూలంగా మారుతుండటంతో ప్రపంచ వ్యాప్తంగా అనేక మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. వీటి ప్రభావం దేశీ ఇన్వెస్టర్లపై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. షాంగైలో లాక్‌డౌన్ కొనసాగుతుండం, ఉక్రెయిన్ యుద్ధం విషయంలో అమెరికాపై రష్యా తీవ్ర విమర్శలు చేయడం, వివిధ దేశాల రిజర్వ్ బ్యాంకులు వరుసగా వడ్డీ రేట్లు పెంచడం తదితర కారణాలు ఇందుకు కారణం. దీంతో ఈ రోజు ఉదయం మార్కెట్ ఆరంభం కావడంతోనే భారీ నష్టాలను చవి చూసింది. గత వారమే దాదాపు 4 శాతం వరకు మార్కెట్లు క్షీణించాయి.
* ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్.. 2021-22 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. జనవరి-మార్చి త్రైమాసికంలో బ్యాంక్ నికర లాభం ఏకంగా 64.90 శాతం వృద్ధితో రూ.1,666 కోట్లుగా నమోదైంది. వడ్డీ ఆదాయాలు గణనీయంగా పెరగటంతో పాటు మొండి పద్దులు తగ్గటం కలిసివచ్చిందని కెనరా బ్యాంక్ ఎండీ, సీఈఓ ఎల్‌వీ ప్రభాకర్ వెల్లడించారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2020 -21) ఇదే కాలంలో బ్యాంక్ నికర లాభం రూ.1,010,87 కోట్లుగా ఉంది. త్రైమాసిక సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం కూడా రూ.21,040.63 కోట్ల నుంచి రూ.రూ.22,323.11 కోట్లకు పెరిగింది. కాగా మార్చి త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం 25 శాతం వృద్ధితో రూ.7,005 కోట్లుగా ఉందని ప్రభాకర్ తెలిపారు.
*దేశీయ ఐటీ రంగంలో మెగా విలీనం జరగనుంది. ఎల్ అండ్ టీ గ్రూప్‌నకు చెందిన రెండు ఐటీ కంపెనీలు ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ (ఎల్‌టీఐ), మైండ్‌ట్రీ ఒక్కటి కాబోతున్నాయి. ఈ విలీన ప్రతిపాదనకు మైండ్‌ట్రీ, ఎల్‌టీఐ బోర్డులు శుక్రవారం ఆమోదం తెలిపాయి. తద్వారా 350 కోట్ల డాలర్ల (రూ.26,600 కోట్లు) వార్షికాదాయ ఐటీ సంస్థగా అవతరించనుంది. అలాగే, విలీనం తర్వాత కంపెనీ పేరు ‘ఎల్‌టీఐమైండ్‌ట్రీ’గా మారనుంది. పూర్తిగా షేర్ల మార్పిడి ద్వారా జరగనున్న ఈ డీల్‌లో భాగంగా మైండ్‌ట్రీకి చెందిన ప్రతి 100 షేర్లకు గాను 73 ఎల్ అండ్ టీ షేర్లను కేటాయించనున్నారు.వచ్చే 9-12 నెలల్లో విలీన ప్రక్రియ పూర్తి కావచ్చని అంచనా. మెర్జర్ తర్వాత ఏర్పడే సంస్థలో ఎల్ అండ్ టీ 68.73 శాతం వాటా కలిగి ఉండనుంది. విలీనం పూర్తయ్యేవరకు రెండు కంపెనీలు విడివిడిగా కార్యకలాపాలు కొనసాగించనున్నాయని, ప్రక్రియ సజావుగా జరిగేలా చూసేందుకు ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఎల్ అండ్ టీ చైర్మన్ ఏఎం నాయక్ తెలిపారు.
*ప్రభుత్వ రంగంలోని షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌సీఐ) అమ్మకానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ కంపెనీకి చెందిన కీలకేతర ఆస్తులను ప్రత్యేక కంపెనీకి బదిలీ చేసి సెప్టెంబరు కల్లా ఎస్‌సీఐ అమ్మకం కోసం ఫైనాన్షియల్ బిడ్స్ ఆహ్వానిస్తామని అధికార వర్గాలు చెప్పాయి. ముంబైలో ఎస్‌సీఐ నిర్వహణలోని షిప్పింగ్ హౌస్, పోవైలోని నావికా శిక్షణా సంస్థలను ప్రత్యేక కంపెనీకి బదిలీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఏడాది మార్చి నాటికి ఈ కీలకేతర ఆస్తుల విలువ రూ.2,392 కోట్లుగా ఉన్నట్లు అంచనా. ఎస్‌సీఐ ఈక్విటీలో కేంద్ర ప్రభుత్వానికి 63.75 శాతం వాటా ఉంది. గత ఏడాది మార్చిలో ప్రభుత్వం ఈ సంస్థను అమ్మకానికి పెట్టింది. పలు సంస్థలు ఇందు కోసం ఆసక్తి వ్యక్తీకరణ బిడ్స్ దాఖలు చేశాయి.
*హైదరాబాద్‌లో మరో ప్రతిష్ఠాత్మక కేంద్రం ఏర్పాటు కానుంది. కార్పొరేట్ వివాదాల పరిష్కార కోసం హైదరాబాద్‌లో తమ ఆర్బిట్రేషన్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేయాలని ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండి యా (ఐసీఎ్‌సఐ) నిర్ణయించింది. హైదరాబాద్‌లోని ఐసీఎ్‌సఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ఈ సంస్థను ఏర్పాటు చేస్తామని ఆ సంస్థ జాతీయ అధ్యక్షుడు దేవేంద్ర దేశ్‌పాండే ప్రకటించారు. అలాగే ఇదే కేంద్రంలో సామరస్యంగా కార్పొరేట్ వివాదాల పరిష్కారం కోసం మీడియేషన్ కేంద్రాన్నీ ఏర్పాటు చేస్తామన్నారు.
*కమర్షియల్ విమాన సర్వీసుల పునరుద్ధరణ సిద్ధంగా ఉన్న జెట్ ఎయిర్ వేస్ కు కేంద్ర హోంశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికెట్ పొందే క్రమంలో గత గురువారమే జెట్ ఎయిర్ వేస్ సన్నాహక విమానం(టెస్ట్ ఫ్లైట్)ను నడిపింది. టెస్ట్ ఫ్లైట్ ను విజయవంతంగా నడపడంతో హోంశాఖ అనుమతులు లభించాయి. ఈ మేరకు మే 6న జెట్ ఎయిర్ వేస్ కు లేఖ అందింది. కంపెనీ లేదా సంస్థ షేర్ హోల్డింగ్ మార్పునకు సంబంధించి సెక్యూరిటీ క్లియరెన్స్ లభించిందని లేఖలో కేంద్రం స్పష్టం చేసింది. షెడ్యూల్డ్ ఆపరేటర్ పర్మిట్ దక్కిందని వివరించింది. కాగా జలాన్- కల్రాక్ కన్సార్టియం జెట్ ఎయిర్ వేస్ కొత్త ప్రమోటర్ గా ఉంది. కాగా పాత యజమాని నరేష్ గోయల్ సారధ్యంలోని జెట్ ఎయిర్ వేస్ ఏప్రిల్ 17,2019న చివరి సర్వీసును నడిపిన విషయం తెలిసిందే.
*వడ్డీ రేట్లను పెంచుతూ కేంద్ర బ్యాంక్ RBI తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యం కలిగించిందని కేంద్ర ఆర్థిక మంత్రి Nirmala Sitharaman వ్యాఖ్యానించారు. రెండు ద్రవ్య విధాన సమీక్షల మధ్య రేట్ల పెంపు నిర్ణయం వెలువడడం ఇందుకు కారణమని ఆమె చెప్పారు. వడ్డీ రేట్ల పెంపు ప్రకటన వచ్చిన సమయం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. అయితే ఎప్పుడైనా జరగాల్సిందే కదా అని జనాలు భావించారని అన్నారు. ముంబైలో శనివారం జరిగిన ది ఎకనామిక్ టైమ్స్ అవార్డ్స్ ఫర్ కార్పొరేటు ఎక్స్ లెన్స్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కరోనా సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థను నిర్వహించిన తీరుకుగానూ నిర్మలా సీతారామన్ కు అవార్డ్ దక్కింది. ప్రభుత్వ మౌలికరంగ పెట్టుబడులకు సంబంధించి ఆర్బీఐ నిర్ణయం ప్రభావం చూపుతుందని భావించడంలేదన్నారు. తగ్గింపు రేటుతో క్రూడ్ ఆయిల్ విక్రయిస్తున్న రష్యా నుంచి కొనుగోలు చేయడం సబబేనన్నారు. రెపో రేటును 40 బేసిస్ పాయింట్ల మేర పెంచుతూ కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ గత బుధవారం ప్రకటన చేసింది. క్యాష్ రిజర్వ్ రేసియో 50 బేసిస్ పాయింట్ల మేర పెంచింది.
*భారతదేశంలోని సుప్రసిద్ధ ఆటో విడిభాగాల తయారీదారులలో ఒకటైన సుందరం క్లేటాన్ లిమిటెడ్ (Sundaram-Clayton Limited) మేనేజింగ్ డైరెక్టర్‌గా డాక్టర్ లక్ష్మీవేణు (Lakshmi Venu) బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఆమె సుందరం క్లేటాన్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. గత దశాబ్దకాలంగా సంస్థను ముందుండి నడిపిస్తున్న ఆమె సంస్థ అంతర్జాతీయంగా విస్తరించడంలో కీలక పాత్ర పోషించారు. వోల్వో, హ్యుందాయ్, డైమ్లెర్, కమ్మన్స్ లాంటి సంస్థలతో లోతైన సంబంధాలను నిర్మించడంలోనూ ఆమె పాత్ర ఎనలేనిది.
*విస్తరణ ప్రణాళికలో భాగంగా రెండేళ్లలో లారస్ లేబొరేటరీస్ రూ.2,000- 2,500 కోట్ల వరకూ పెట్టుబడు లు పెట్టనుంది. 2022-23, ఆ తర్వాతి ఆర్థిక సంవత్సరంలో ఈ మేరకు పెట్టుబడులు పెట్టనున్నట్లు లారస్ ల్యాబ్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ చావా సత్యనారాయణ తెలిపారు. గతంలో రూ.1,500-1,700 పెట్టుబడులు పెట్టాలని కంపెనీ భావించినప్పటికీ.. మార్కెట్లో అవకాశాలను పరిగణనలోకి తీసుకుని పెట్టుబడులను పెంచనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 100 కోట్ల డాలర్ల (దాదాపు రూ.7,500 కోట్లు) ఆదాయ లక్ష్యా న్ని చేరాలని కూడా కంపెనీ భావిస్తోంది. 2021-22లో లారస్ ల్యాబ్స్ రూ.4,936 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.
*విస్తరణ ప్రణాళికలో భాగంగా రెండేళ్లలో లారస్ లేబొరేటరీస్ రూ.2,000- 2,500 కోట్ల వరకూ పెట్టుబడు లు పెట్టనుంది. 2022-23, ఆ తర్వాతి ఆర్థిక సంవత్సరంలో ఈ మేరకు పెట్టుబడులు పెట్టనున్నట్లు లారస్ ల్యాబ్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ చావా సత్యనారాయణ తెలిపారు. గతంలో రూ.1,500-1,700 పెట్టుబడులు పెట్టాలని కంపెనీ భావించినప్పటికీ.. మార్కెట్లో అవకాశాలను పరిగణనలోకి తీసుకుని పెట్టుబడులను పెంచనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 100 కోట్ల డాలర్ల (దాదాపు రూ.7,500 కోట్లు) ఆదాయ లక్ష్యా న్ని చేరాలని కూడా కంపెనీ భావిస్తోంది. 2021-22లో లారస్ ల్యాబ్స్ రూ.4,936 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.
*సాగర్ సిమెంట్‌కు రూ.350 కోట్ల నిధులు లభించనున్నాయి. ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ ప్రేమ్‌జీ ఇన్వె్‌స్టకు చెందిన పీఐ ఆపర్చ్యునిటీస్ ఫండ్-1 స్కీమ్ 2కు ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా రూ.2 ముఖ విలువ కలిగిన 1,32,07,548 షేర్లను కేటాయించడానికి కంపెనీకి చెందిన సెక్యూరిటీస్ అలాట్‌మెంట్ కమిటీ అంగీకరించింది. రూ.2 ముఖ విలువ కలిగిన షేర్‌ను రూ.265కు కేటాయిస్తున్నట్లు వెల్లడించింది. ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ ఫండ్‌కు షేర్లను ప్రిఫరెన్షియల్ ఇష్యూ చేయడానికి గత నెలలో జరిగిన ఏజీఎంలో వాటాదారులు ఆమోదం తెలిపారు. ఈ షేర్ల కేటాయింపు తర్వాత సాగర్ సిమెంట్ చెల్లించిన మూలధనం రూ.23.5 కోట్ల నుంచి రూ.26.14 కోట్లను మించుతుంది. ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా లభించిన నిధులను కొత్త సిమెంట్ ప్లాంట్ల ఏర్పాటు, ఉన్న ప్లాంట్ల విస్తరణకు వినియోగించనుంది.
*ఒక రాష్ట్రానికి చెందిన రవా ణా సంస్థకు 1,400 ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేయడానికి ఒలెకా్ట్ర గ్రీన్‌టెక్‌కు చెందిన ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అతి తక్కువ బిడ్‌ను దాఖలు చేసింది. లీస్ట్ కోటెడ్ (ఎల్-1) బిడ్డర్‌గా ఈవీని ఆ రవాణా సంస్థ ప్రకటించిందని ఒలెకా్ట్ర తెలిపింది. గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (జీసీసీ)/ఒపెక్స్ మోడల్ కింద కాంట్రాక్టు కాలపరిమితి 12 ఏళ్లు ఉంటుంది. ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేయడంతో పాటు ఈ కాలంలో వాటి నిర్వహణ బాధ్యతలను కూడా చేపట్టాలి. రవాణా సంస్థ నుంచి లెటర్ ఆఫ్ అవార్డు లభించిన వెంటనే ఎలక్ట్రిక్ బస్సులను ఒలెకా్ట్ర గ్రీన్‌టెక్ నుంచి ఈవీ ట్రాన్స్ పొందుతుంది. ఏడాది కాలంలో ఈ మొత్తం ఎలక్ట్రిక్ బస్సులను ఒలెకా్ట్ర సరఫరా చేస్తుంది. 1,400 బస్సుల విలువ దాదాపు రూ.2,450 కోట్లు ఉంటుంది.
*స్టార్ట్‌పల రంగంలో భారత్ మరో రికార్డు సాధించింది. దేశంలో యూనికార్న్ హోదా సాధించిన స్టార్ట్‌పల సంఖ్య 100కు చేరుకుంది. నియో బ్యాంకింగ్ సేవల స్టార్టప్ ‘ఓపెన్’.. ఈ నెల 5న దేశంలోని వందో యూనికార్న్‌గా అవతరించింది. ఐఐఎ్‌ఫఎల్‌తో పాటు ప్రస్తుత వాటాదారుల నుంచి 5 కోట్ల డాలర్లు సేకరించిన సందర్భంగా ఓపెన్ ఈ హోదాను అందుకుంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా ప్రకటించారు. దేశంలోని 100 యూనికార్న్‌ల మొత్తం మార్కెట్ విలువ 33,270 కోట్ల డాలర్లు (సుమారు రూ.25.62 లక్షల కోట్లు)గా ఉంది. కనీసం 100 కోట్ల డాలర్ల (ప్రస్తుత మారకం రేటు ప్రకారం మన కరెన్సీలో దాదాపు రూ.7,700 కోట్లు) మార్కెట్ విలువ కలిగిన స్టార్ట్‌పలను యూనికార్న్‌లుగా పిలుస్తారు.
*సెలెక్ట్ మొబైల్ స్టోర్లు త్వరలో 100కు చేరనున్నాయని సెలెక్ట్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వై.గురు తెలిపారు. ప్రస్తుతం 83 స్టోర్లు ఉన్నాయన్నారు. నాలుగో వార్షికోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. సెలెక్ట్‌ను ప్రారంభించి నాలుగేళ్లు అయిన సందర్భంగా సెలెక్ట్ వినియోగదారులకు ఆఫర్లను ప్రకటించింది. ఇందులో భాగంగా ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా పాత ఫోన్‌తో కొత్త ఫోన్‌ను మార్చుకునే అవకాశం కల్పిస్తున్నట్లు గురు తెలిపారు. ఈఎంఐల ద్వారా మొబైల్ ఫోన్‌ను కొనుగోలు చేయొచ్చని.. జెస్ట్ మనీ ద్వారా మొబైల్ కొనుగోలుపై ఒక ఈఎంఐని ఉచితంగా పొందవచ్చని చెప్పారు. ప్రతి మొబైల్ కొనుగోలుపై బై వన్ గెట్ వన్ ఆఫర్‌ను ఇస్తున్నామన్నారు.