NRI-NRT

రిచ్మండ్ లో వైభవంగా ఉగాది నవమి వేడుకలు

రిచ్మండ్ లో వైభవంగా ఉగాది నవమి వేడుకలు

అమెరిక వర్జీనియా రాష్త్రం రిచ్‌మండ్ నగరంలో గ్రేటర్ రిచ్‌మండ్ తెలుగు అస్సోసియేషన్ (జి. ఆర్. టి. ఏ.) వారి “ఉగాది మరియు శ్రీరామనవమి 2022” వేడుకలు, జి.ఆర్.టి.ఏ అధ్యక్షుడు విజయ్ వేమూరి ఆధ్వర్యంలో శనివారం మే 7,2022న డీప్ రన్ హైస్కూల్లో కన్నుల పండుగగా జరిగాయి. ఈ సంబరాలకి దాదాపు 800 మంది హాజరుకాగా 7 గంటల కార్యక్రమం నిరాఘాటంగా ఆహుతులని అలరించింది. చాలా రోజుల తరువాత జరిగిన ఈ వేడుకలో కళాకారులు అత్యంత ఉత్సాహంతో పాల్గొని ప్రేక్షకులని అలరించారు. శ్రీ గణేషుని పాటతో మొదలైన కార్యక్రమంలో పరిసర ప్రాంతాల తెలుగు వారు ఉత్సాహంగా పాల్గొని పాటలు, సాంప్రదాయ, సినీ నృత్యాలు, ఇన్స్ట్రుమెంటల్, వంటి వైవిధ్య భరితమైన దాదాపు 33 వినూత్న కార్యక్రమాలు ప్రదర్శించారు. కార్యక్రమంలో వ్యక్తిగత మరియు బృంద గానాలు,వ్యకిగత మరియు బృంద నృత్యాలు, పియానో వాద్య ప్రదర్శన, నాటికలు ప్రదర్శింపబడ్డాయి. భక్తి గేయాలు, జానపద గేయాలు, సినిమా పాటలకు ఆడిపాడి సాయంత్రాన్ని ఆహ్లాదభరితం చేసారు. అథిదులు అందరికీ పసందైన విందు భొజనం ఎర్పటు చెసినారు.
Whats-App-Image-2022-05-10-at-7-27-38-AM
అధ్యక్షులు విజయ్ వేమూరి ఆహుతులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఉగాది మరియు శ్రీరామనవమి వేడుకలు ఉత్సవాలలో పాల్గొన్న అందరికీ మరియు తెలుగు నేర్చుకుంటున్న పిల్లలను ప్రోత్సహిస్తున్న తల్లి దండ్రులకు, పిల్లలకు తెలుగు నేర్పిస్తున్న ఉపాధ్యాయులకు, కృతజ్ఞతాభివందనములు అందించారు. ఈ కార్యక్రమానికి ఇంతటి విజయవంతం కావటానికి సహకరించిన కార్య వర్గానికి, కార్య కర్తలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు.
Whats-App-Image-2022-05-10-at-7-27-39-AM-1
ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు కృష్ణారెడ్డి యెనిక, కోశాధికారి సుధీంద్ర అయ్యంపాలయం, ప్రధాన కార్యదర్శి విజయ్ బైర, సాంస్కృతిక కార్యదర్శి మధుసూధన్ రెడ్డి, జి.ఆర్.టి.ఏ కార్యవర్గ సభ్యులు, ఇతర సభ్యులు పాల్గొని విజయవంతం చేసారు. హసిత వజినపెల్లి, జ్యోతిక చెన్న, చార్వి హంస కొండూరు మరియు శ్రేయ వేమూరి ఈ కార్యక్రమాన్ని నడిపించారు.దీర్ఘ విరామం తర్వాత పెద్ద ఎత్తున ఆహ్లదకరమైన వాతావరణంలో ఆనందంగా జరిగిన జి.ఆర్.టి.ఏ కార్యక్రమం ఒక తీపి జ్ఞాపకంగా మిగిలుతుంది అనడంలో అతిశయోక్తి లేదు.