DailyDoseWorldWonders

గోల్డెన్ బ్రిడ్జి

గోల్డెన్ బ్రిడ్జి

దీనినే కౌ ఆంగ్ వంతెన అని కూడా అంటారు. ఇది వియాత్నంలో ఉంది. ఈ వంతెనను రెండు అర చేతులు పట్టుకున్నట్టుగా రూపొందించారు. దూరం నుంచి చూస్తే ఆ రెండు చేతులే వంతెనను పడిపోకుండా పట్టుకున్నాయా అనిపించేంత అద్భుతంగా దీనిని కట్టారు. డాన్ అంగ్ ప్రాంతంలోని బానా రిసార్ట్స్‌లో దీనిని నిర్చించారు. సముద్రానికి 1400ల అడుగుల ఎత్తులో ఈ వంతెనను నిరించారు. ఈ వంతెన పైనుండి చూస్తే భూమిపైనే స్వర్గం ఉన్నట్టు అనిపిస్తుంది. వంతెనకు అటు ఇటు పర్పుల్ రంగులో ఉండే లొబీలియా చామంతి మొక్కలను నాటారు. పర్యటకులను ఆకర్షించేందుకు రెండు బిలియన్ డాలర్ల ఖరీదైన ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ వంతెనను నిర్మించారు.