DailyDose

తీవ్ర తుపాను నుంచి తుపాన్ గా బలహీనపడిన అసాని – TNI తాజా వార్తలు

తీవ్ర తుపాను నుంచి తుపాన్ గా బలహీనపడిన  అసాని – TNI తాజా వార్తలు

*తీవ్రతుపాను నుంచి తుపానుగా అసాని బలహీనపడిందని, గురువారం ఉదయానికి వాయుగుండంగా బలహీనపడనుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.గడిచిన 6 గంటల్లో గంటకు 6 కి.మీ వేగంతో పశ్చిమవాయువ్య దిశగా కదిలింది… ప్రస్తుతం మచిలీపట్నంకు 50 కి.మీ., కాకినాడ 150 కి.మీ., విశాఖపట్నం 310 కి.మీ., గోపాలపూర్ 530 కి.మీ., పూరీకు 640 కి.మీ దూరంలో కేంద్రీకృతమైందని అధికారులు తెలిపారు. కొన్ని గంటల్లో వాయువ్య దిశగా పయనించి ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం చేరుకునే అవకాశం ఉందన్నారు. సాయంత్రానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి చేరుకునే అవకాశం ఉందని, ఈ రోజు కోస్తాంధ్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతిభారీవర్షాలు పడే అవకాశం ఉందన్నారు. గురువారం ఉత్తరాంధ్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు… అక్కడక్కడ భారీ నుంచి అతిభారీవర్షాలు పడతాయన్నారు. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 75-95 కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు పేర్కొన్నారు.

*వ్యక్తికి రూ.వెయ్యి కుటుంబానికి రూ.2 వేలు:జగన్
‘అసని’ తుపాను బలహీనపడటం ఊరటనిచ్చే అంశమని సీఎం జగన్‌ అన్నారు. తుపాను ప్రభావిత కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు.తుపాను దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై ఆయన ఆదేశాలు జారీ చేశారు. అప్రమత్తంగా ఉండాలి.. ఇప్పటికే నిధులిచ్చామని చెప్పారు. తీర ప్రాంతాల్లో అప్రమత్తం అవసరమని తెలిపారు. ఎక్కడా నిర్లక్ష్యానికి తావు ఉండకూడదన్నారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.అవసరమైన చోట సహాయ, పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. సహాయ శిబిరాలకు తరలించిన వ్యక్తికి రూ.1000, కుటుంబానికి రూ.2వేలు చొప్పున ఇవ్వండని జగన్‌ అధికారులకు చెప్పారు. సహాయ శిబిరాల్లో మంచి సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. జనరేటర్లు, జేసీబీలు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

*తుఫాను ప్రభావిత కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ సమీక్ష
రాష్ట్రంలో అసనీ తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో తుఫాను ప్రభావిత కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎం సమీక్ష చేపట్టారు. తుఫాను నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేశారు. తుఫాను నేపథ్యంలో హై అలర్ట్‌గా ఉండాలని అధికారులను ఆదేశించారు. తుఫాను తీరం వెంబడి ప్రయాణిస్తోంది కాబట్టి తీర ప్రాంతాల్లో మరింత అప్రమత్తం అవసరమన్నారు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. తుఫాను బలహీనపడటం ఊరటనిచ్చే అంశమన్నారు. ఎక్కడా నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని స్పష్టం చేశారు.

*వేసవి కారణంగా ఏర్పడిన వేడి గాలులకు హిమనీనదాలు కరిగి వరదలు ఏర్పడ్డాయి. ఆ వరద తాకిడికి చారిత్రక వంతెన నేలకూలిపోయింది.దానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇది ఎక్కడో అనుకోకండి పాక్‌ఆక్రమిత కశ్మీర్‌లో జరిగిన ఈ ఘటన వైరల్‌ అయ్యింది. హసనాబాద్‌ వంతెన శనివారం కూలిపోయింది. గిల్గిట్‌ – బాల్టిస్థాన్‌ ప్రాంతంలో ఉన్న ఈ వంతెన వరద నీటిలో కొట్టుకుపోయింది. వేల మంది స్థానికులు, పర్యాటకులు ఆ వరదల్లో చిక్కుకు పోయారు.కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పాకిస్థాన్‌ మంత్రి షెర్రీ రెహ్మాన్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ‘పాకిస్థాన్‌ ఉత్తర భాగంలోని మౌంట్‌ షిప్పర్‌ సమీపంలో ఉన్న హిమనీనదాలు కరుగుతున్న కారణంగా ఈ హైవేపై ఉన్న వంతెన కూలిపోయింది’ అని ఆమె పేర్కొన్నారు. ఈ వరదల కారణంగా రెండు జల విద్యుత్తు ప్రాజెక్టులు, కొన్ని వందల ఇళ్లు, వ్యవసాయ భూములు అన్ని నీట మునిగాయి. త్వరలోనే తాత్కాలిక వంతెనను ఏర్పాటు చేస్తామని స్థానిక అధికారులు తెలిపారు. ఇక ఈ సంవత్సరం ఏప్రిల్‌లో పాకిస్థాన్‌లో ఎన్నడూ లేనంతగా గరిష్ఠ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దశాబ్దకాలంగా ఎప్పూడూ లేనంతగా ఈ ఏప్రిల్‌లో 49 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదవ్వడంతో దానిని హాటెస్ట్‌ ఏప్రిల్‌గా పేర్కొన్నారు.

*అసనీ(Asani) తుఫాను ప్రభావంతో ఉప్పాడ, తొండంగిలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఉప్పాడలో కోనపాపపేట తదితర గ్రామాల్లో అలల ఉధృతికి 18 ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇళ్లన్నీ కడలిలో కలిసిపోయాయి. భారీ కెరటాల తాకిడికి తొండంగిలో హెచరీల పైపులైన్లు ధ్వంసమయ్యాయి. భారీ గాలులకు మామిడి, జీడికి భారీ నష్టం వాటిల్లింది. కాకినాడ పోర్టులో ఎగుమతి, దిగుమతి కార్యకలాపాలు రద్దయ్యాయి.

*ఏపీ సచివాలయానికి సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు వచ్చారు. సీఎస్‌ సమీర్‌ శర్మను కలిసేందుకు ఏబీవీ వచ్చారు. పోస్టింగ్ ఆర్డర్లు, పెండింగ్ శాలరీ ఇవ్వాల్సిందిగా ఇప్పటికే సమీర్‌ శర్మకు ఆయన లేఖ రాశారు. ఆ లేఖకు కొనసాగింపుగా ఏబీవీ మరో లేఖ రాశారు. సుప్రీంకోర్టు తీర్పు కాపీతో పాటు తనకు పోస్టింగ్ ఇవ్వాల్సిందిగా ఏబీవీ సీఎస్‌ను కోరనున్నారు.

*తీవ్ర తుఫాన్ నుంచి తుఫాన్‌గా ‘అసాని’ బలహీనపడింది. ప్రస్తుతం మచిలీపట్నంకు 40 కిలోమీటర్ల, కాకినాడకు 130 కిలోమీటర్ల, విశాఖ 272 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. గురువారం ఉదయం వాయుగుండంగా తుఫాన్ బలహీనపడనుంది. కొన్ని గంటల్లో వాయువ్య దిశగా పయనించి.. ఏపీ తీరం సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం చేరుకునే అవకాశం ఉంది. నేడు కోస్తాంధ్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 50-60 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.

*మైదుకూరు సబ్ డివిజన్‌లో రెండు ఎర్రచందనం గ్యాంగ్‌లను పట్టుకున్నామని ఎస్పీ అన్బురాజన్ వెల్లడించారు. వెంకటేష్ అనే అంతర్జాతీయ స్మగ్లర్ దొరికాడన్నారు. ఇతనిపై 11 కేసులున్నాయన్నారు. సుబ్బారాయుడు అనే వ్యక్తి గ్యాంగ్ లీడర్ అని అన్బురాజన్ వెల్లడించారు. సుబ్బారాయుడు, వెంకటేష్‌పై పిడి యాక్ట్ ఓపెన్ చేస్తామన్నారు. గత రెండు వారాలలో 50 మంది స్మగ్లర్‌లను పట్టుకున్నామన్నారు. ఈ రెండు వారాలలో 3 టన్నుల ఎర్రచందనాన్ని సీజ్ చేయడం జరిగిందన్నారు.

*గవర్నర్ బిశ్వభూషన్‌ హరిచందన్‌తో బీజేపీ బృందం బుధవారం ఉదయం రాజ్‌భవన్‌లో భేటీ అయ్యింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, శాంతి భద్రతల పర్యవేక్షణలో ప్రభుత్వ వైఫల్యంపై గవర్న‌కు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో హిందు దేవాలయాలు, సంస్కృతిపై జరుగుతున్న దాడులను గవర్నర్‌కు వివరించారు. హిందూ దేవాలయాలపై దాడులకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. గవర్నర్‌ను బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ బృందం కలిసింది.

* ఇప్ప‌టికే మ‌ట‌న్ రేట్లు మండిపోతుండ‌గా, మ‌రోవైపు చికెన్ ధ‌ర‌లు కూడా ఆకాశాన్నంటాయి. దీంతో అటు మ‌ట‌న్.. ఇటు చికెన్.. కొన‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. మాంసం ధ‌ర‌లు అమాంతం పెరిగిపోవ‌డంతో.. మాంసాహార ప్రియుల నోటికి తాళం వేసిన‌ట్లు అయింది. ప్ర‌స్తుతం కిలో స్కిన్‌లెస్‌ చికెన్ ధ‌ర రూ. 300గా ఉంది.ధ‌ర‌ల పెరుగుద‌ల‌కు పెళ్లిళ్లు కూడా ఓ కార‌ణ‌మ‌ని పౌల్ట్రీల య‌జ‌మానులు చెబుతున్నారు. ఇక బోన్ లెస్ చికెన్ ధ‌ర మ‌ట‌న్ రేటుతో స‌మానంగా ఉంది. కిలో బోన్ లెస్ చికెన్‌ను సుమారు రూ. 600ల‌కు త‌గ్గ‌కుండా విక్రయిస్తున్నారు. ఐదు నెల‌ల క్రితం కిలో చికెన్ ధ‌ర రూ. 80గా ఉండే. నాటుకోడి రేట్లు కూడా పెరిగిపోయాయి. కిలో నాటుకోడి రూ. 480గా ప‌లుకుతోంది.

* గుంటూరు జిల్లాలోని పొన్నూరులో టీడీపీ, జనసేన పార్టీలకు ఊహించిన షాక్‌ తగిలింది. రెండు పార్టీలకు చెందిన నేతలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో బుధవారం వారు పార్టీ కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరిన వారిలో గుంటూరు జిల్లా జనసేన మాజీ అధ్యక్షుడు మాదా రాధాకృష్ణమూర్తి, గుంటూరు జిల్లా టీడీపీ మైనార్టీ సెల్‌ ఉపాధ్యక్షుడు సయ్యద్‌ సుభాని, మాజీ ఎంపీపీ కొండా శివనాగిరెడ్డి, పొన్నూరు మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఎం.షాలిని ఉన్నారు. ఇక, ఈ కార్యక్రమంలో పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య కూడా పాల్గొన్నారు.

*రామకుప్పం ఎస్ఐ వెంకట శివకుమార్ రివాల్వర్ మిస్సింగ్ అయింది. టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన నేపథ్యంలో మిస్సింగ్ వ్యవహారం బయటపడింది. ఎస్ఐహెడ్‌ కానిస్టేబుల్ సుబ్రహ్మణ్యం మధ్య రివాల్వర్ మిస్సింగ్ వివాదం నడుస్తోంది. ఫిబ్రవరి మొదటి వారంలో హెడ్‌కానిస్టేబుల్‌కు ఎస్ఐ రివాల్వర్ అప్పగించారు. సర్వీసింగ్ తర్వాత ఎస్‌ఐకి రివాల్వర్‌ ఇచ్చాననని సుబ్రహ్మణ్యం అంటున్నారు. రివాల్వర్ మిస్సింగ్ ఘటనపై చర్యలకు అధికారులు సిద్ధమవుతున్నారు.

*పార్వతీపురం మన్యం జిల్లా విశాఖ నుంచి నిజాముద్దీన్ వెళ్లే సమత సూపర్ ఫాస్ట్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. సీతానగరం గుచ్చిమి రైల్వే గేట్ సమీపంలో భోగి నుంచి ఇంజన్ విడిపోయింది. సుమారు 150 మీటర్లకు పైగా ఇంజన్ భోగీలను విడిచి వెళ్లింది. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. లోకోపైలెట్ అప్రమత్తతతో తిరిగి ఇంజన్ భోగీల వద్దకు చేరుకుంది. అనంతరం భోగీలతో బయలుదేరింది.

*మైదుకూరు సబ్ డివిజన్‌లో రెండు ఎర్రచందనం గ్యాంగ్‌లను పట్టుకున్నామని ఎస్పీ అన్బురాజన్ వెల్లడించారు. వెంకటేష్ అనే అంతర్జాతీయ స్మగ్లర్ దొరికాడన్నారు. ఇతనిపై 11 కేసులున్నాయన్నారు. సుబ్బారాయుడు అనే వ్యక్తి గ్యాంగ్ లీడర్ అని అన్బురాజన్ వెల్లడించారు. సుబ్బారాయుడు, వెంకటేష్‌పై పిడి యాక్ట్ ఓపెన్ చేస్తామన్నారు. గత రెండు వారాలలో 50 మంది స్మగ్లర్‌లను పట్టుకున్నామన్నారు. ఈ రెండు వారాలలో 3 టన్నుల ఎర్రచందనాన్ని సీజ్ చేయడం జరిగిందన్నారు.

*ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో టీడీపీ, కాంగ్రెస్, వైసీపీలో పనిచేశానని తెలిపారు.పార్టీ ఏదైనా కార్యకర్తలే బలమన్నారు. కార్యకర్తలు ఆస్తులు అమ్ముకుని పార్టీ కోసం కష్టపడతారని, పార్టీలు ఉన్నాయంటా దానికి కారణం కార్యకర్తలేనని తెలిపారు. సమావేశానికి పిలిస్తే పెండింగ్ బిల్లులు వచ్చేలా చూడాలని కార్యకర్తలు అడిగే పరిస్థితి వచ్చిందని శ్రీనివాసులురెడ్డి చెప్పారు.

*ఐక్య రాజ్య సమిటి (UNO)లోని వ్యవస్థల్లో హిందీని ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం రూ.6 కోట్లు అందజేసింది. ప్రపంచవ్యాప్తంగా హిందీ మాట్లాడేవారికి సమాచారాన్ని చేరవేయడానికి 2018లో భారత దేశం ప్రారంభించిన UNO ప్రాజెక్టు కోసం ఈ సొమ్మును ఇచ్చింది. దీనికి సంబంధించిన చెక్కును ఐరాసకు భారత దేశ డిప్యూటీ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఆర్ రవీంద్ర అందజేశారు.

*కోస్తా తీరాన్ని అసాని తుఫాన్ భయపెడుతోంది. ఊహించని విధంగా దిశలు మార్చుకుంటోంది. కాసేపట్లో తీరాన్ని తాకనుండడంతో కాకినాడ తీరంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఉప్పాడ, తొండంగిలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఉప్పాడ, కోనపాపపేట తదితర గ్రామాల్లోని కొన్ని ఇళ్లులు ధ్వంసమయ్యాయి. భారీ కెరటాల తాకిడికి తొండంగిలో హేచరీల పైపులైన్లు ధ్వంసమయ్యాయి. ఈదురు గాలులకు మామిడి, జీడి తోటలు నేలమట్టమయ్యాయి. ఉత్తరకోస్తా.. ఒడిషా మద్యలో తీరం దాటుతుందని తొలుత అధికారులు అంచనా వేయగా.. మచిలీపట్నం వైపు అసాని తుఫాన్ దూసుకొస్తోంది. రాబోయే 24 గంటలు అత్యంత కీలకమని వాతావరణ శాఖ తెలిపింది.మచిలీపట్నం నుంచి విశాఖ వరకు భూభాగంపైనే పయనించి మళ్లీ సముద్రంలోకి ప్రవేశించే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. 10 జిల్లాల్లో అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలకు అరెంజ్ అలర్ట్ జారీ చేశారు. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాబోయే 48 గంటలు ఉమ్మడి కృష్ణ, గుంటూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఈ రెండు జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

*కర్నాటక డీజీపీ పి.రవీంద్రనాథ్ రాజీనామా ఫేక్ ఎస్సీ, ఎస్టీ సర్టిఫికెట్ స్కామ్ లో విచారణ జరపొద్దని డీజీపీపై ప్రభుత్వం ఒత్తిడి ప్రభుత్వ ఒత్తిడి తట్టుకోలేక రాజీనామా చేసిన డీజీపీ

*మచిలీపట్నానికి 50 కి.మీ దూరంలో తుపాను
తీవ్ర తుపాను నుంచి తుపానుగా అసని బలహీనపడింది. దిశను మార్చుకున్న తుపాను మచిలీపట్నానికి 50కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. గంటకు 6 కి.మీ వేగంతో తుపాను కదులుతుండగా.. నర్సాపురం సమీపంలో తీరాన్ని తాకే అవకాశముంది. అనంతరం కాకినాడ దగ్గర సముద్రంలోకి వచ్చి బలహీనపడే సూచనలు కనిపిస్తుండగా.. దీని ప్రభావంతో ఉమ్మడి కృష్ణా,గుంటూరు, ఉభయ గోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

*అవినీతి-నియంత-కుటుంబ పాలనకు వ్యతిరేకంగా కార్యకర్తలు సాగిస్తున్న పోరాటాలతోనే ఈ రోజు టీఆర్‌ఎస్‌కు ప్ర త్యామ్నాయంగా బీజేపీ ఎదిగిందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. మంగళవారం ఉమ్మడి హైదరాబాద్‌, రంగారెడ్డి, వరంగల్‌, ఆదిలాబాద్‌, ఖమ్మం జిల్లాలకు చెందిన దాదాపు 10 వేల మంది బూత్‌ కమిటీ అధ్యక్షులతో ఆయన టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ నెల 14న తుక్కుగూడలో జరగనున్న ప్రజా సంగ్రామయాత్ర ముగింపు సభ విజయవంతానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, జన సమీకరణపై దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో బీజేపీకి అధికారం ఇవ్వాలనే చర్చ జరుగుతోందని.. ఈ నేపథ్యంలో మార్పుకు సంకేతంగా నిలిచేలా కనీవినీ ఎరుగని రీతిలో సభకు భారీ ఎత్తున జనాన్ని తరలించేందుకు కృషి చేయాలని ఆయన కోరారు.

*బెంగళూరులో జరిగిన సౌత్‌జోన్‌ అమెచ్యూర్‌ జూనియర్‌ నేషనల్‌ గోల్ఫ్‌ చాంపియన్‌షి్‌పలో తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ గోల్ఫర్లు అదరగొట్టారు. అఖిల (ఇల్లెందు) స్వర్ణం, అమూల్య (తొర్రూరు) రజతం, అనూష (నాన్‌చర్ల) కాంస్య పతకంతో మెరిశారు.

*ఆగ్నేయ ఢిల్లీలోని న్యూ ఫ్రెండ్స్‌ కాలనీతో పాటు పలు ప్రాంతాల్లో మంగళవారం బుల్డోజర్లతో అక్రమ తాత్కాలిక నిర్మాణాలను కూల్చివేశారు. షాహీన్‌బాగ్‌లో సోమవారం అక్రమ కట్టడాలను కూల్చివేయడానికి అధికారులు, సిబ్బంది బుల్డోజర్‌తో వెళ్లి.. అక్కడి ప్రజల, నేతల ఆందోళనతో వెనుదిరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన తదుపరి రోజే న్యూ ఫ్రెండ్స్‌ కాలనీ సహా పలు ప్రాంతాల్లోకి బుల్డోజర్లు ప్రవేశించడం గమనార్హం. న్యూఫ్రెండ్స్‌కాలనీ పరిధిలోని గురుద్వారా రోడ్‌ సహా పలుప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేశామని అధికారులు తెలిపారు.

* ఇప్పటికే అజోవ్‌ సముద్ర తీర నగరం మారియుపోల్‌ను దాదాపు వశం చేసుకున్న రష్యా.. నల్ల సముద్ర తీర నగరం ఒడెస్సాపై పట్టుకు ప్రయత్నిస్తోంది. సోమవారం రాత్రి ఏకంగా ఏడు క్షిపణులను ప్రయోగించింది. కింజాల్‌, దాగర్‌ హైపర్‌సానిక్‌ క్షిపణులతో చేసిన ఈ దాడుల్లో షాపింగ్‌ మాల్‌, గోదాం, వినోద కేంద్రాలు దెబ్బతిన్నట్లు ఉక్రెయిన్‌ వెల్లడించింది. ఒకరు మృతి చెందారని, ఐదుగురు గాయపడినట్లు పేర్కొం ది. కాగా, కొన్ని రోజుల నుంచి ఒడెస్సాపై రష్యా వరుసగా బాంబు దాడులకు దిగుతోంది.

*నలుగురు భారత ఫొటో జర్నలిస్టులను ప్రఖ్యాత పులిట్జర్‌ అవార్డు వరించింది. రాయిటర్స్‌కు చెందిన దివంగత దానిష్‌ సిద్ధిఖీ, అద్నాన్‌ అబిది, సన్నా ఇర్షద్‌ మట్టో, అమిత్‌ దవే 2022 ఏడాదికి ఈ బహుమతికి ఎంపికయ్యారు. భారత్‌లో కరోనా తీవ్రతను వివరించేలా వా రు తీసిన ఫొటోలకు ఫీచర్‌ ఫొటోగ్రఫీ విభాగంలో అవార్డు దక్కిందని పులిట్జర్‌ అవార్డుల వెబ్‌సైట్‌ పేర్కొంది. దానిష్‌ సిద్ధిఖీ(38) ఈ పురస్కారానికి ఎంపికవ్వడం ఇది రెండోసారి. రోహింగ్యాల సంక్షోభం అప్పుడు తీసిన చిత్రాలకు 2018లో తొలిసారి ఈ అవార్డు అందుకున్నారు. అఫ్ఘాన్‌ బలగాలు, తాలిబన్ల మధ్య జరుగుతున్న షుర్షణల ఫొటోలను తీసేందుకు వెళ్లి నిరుడు జులైలో అఫ్ఘానిస్థాన్‌లో హత్యకు గురయ్యారు. ఇక, రష్యా దురాక్రమణతో తమ దేశంలో నెలకొన్న పరిస్థితిని ప్రపంచానికి తెలియజేస్తున్న ఉక్రెయిన్‌ జర్నలిస్టులకు పులిట్జర్‌ అవార్డు బోర్డు ప్రత్యేక పురస్కారాలు ప్రకటించింది.

*తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను ఒంటరిగా ఎదుర్కోలేక కాంగ్రెస్‌, బీజేపీ ఒక్కటై కుట్రలు పన్నుతున్నాయని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు. మహబూబాబాద్‌లో వైద్య కళాశాల నిర్మాణానికి, జిల్లా ఆస్పత్రిలో రేడియాలజీ సర్వీస్‌ భవనం రెండో అంతస్తు నిర్మాణానికి మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ ఆస్పత్రి అదనపు అంతస్తు, 41 పడకల జనరల్‌ వార్డు, పిల్లల సంరక్షణ కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. వైద్య కళాశాల వద్ద స్థానిక ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి ప్రసంగించారు. వరంగల్‌లో కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, నవోదయ విద్యాలయాలు తెలంగాణకు ఇవ్వకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందని మండిపడ్డారు. వ్యవసాయ బావులు, బోర్ల వద్ద మీటర్లు పెడితేనే రూ.25 వేల కోట్ల నిధులు ఇస్తామని లేకుంటే ఇవ్వం అని బ్లాక్‌మెయిల్‌ చేస్తోందని ఆరోపించారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్‌, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యేలు రెడ్యానాయక్‌, పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, టీఎ్‌సఐఎండీసీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ పాల్గొన్నారు. కాగా, బీపీ, షుగర్‌ వ్యాధిగ్రస్తులకు ఇంటింటికి వెళ్లి అందజేయవలసిన ఎన్‌సీడీ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి సత్యవతిరాథోడ్‌ స్వగ్రామమైన కురవి మండలం పెద్దతండాలో మంత్రి హరీశ్‌ ప్రారంభించారు.

*‘అసాని’ ప్రభావంతో పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆయా జిల్లాల్లో అన్నదాతలు సహా సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చాలా చోట్ల విద్యుత్‌ సరఫరా గంటలపాటు నిలిచిపోయింది. గాలుల తీవ్రత కారణంగా.. పలు చోట్ల చెట్లు, విద్యుత్‌ స్తంభాలు కూలిపోయాయి. అసాని ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి. కాగా ’అసాని’ తుఫాను అన్నదాతలకు అశనిపాతంగా పరిణమించింది. మచిలీపట్నం-విశాఖ మధ్య కేంద్రీకృతమైన తుఫాన్‌ ఏమాత్రం ప్రభావం చూపినా.. వరితో పాటు ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వరి సాగు ఆలస్యం వల్ల కోస్తా జిల్లాల్లో కొంత పొలాల్లోనే ఉంది. నూర్చి అమ్మకానికి సిద్ధం చేసిన మరికొంత ధాన్యం రోడ్లపై ఆరబోశారు. ఈ తరుణంలో వర్షాలు కురిస్తే.. ధాన్యం తడిసిపోయే అవకాశం ఉందని బిక్కుబిక్కుమంటున్నారు.

*ఆర్టీసీ పార్సిల్‌ సర్వీస్‌ ద్వారా మామిడిపండ్ల కోసం మొట్టమొదటగా ఆర్డర్‌ చేసిన కిరణ్‌ రాజా, హేమ దంపతులకు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ మంగళవారం బంగినిపల్లి మామిడిపండ్ల పార్సిల్‌ను అందజేశారు. హైదరాబాద్‌లోని మియాపూర్‌ కాలనీకి చెందిన ఆ దంపతుల ఇంటికి వెళ్లి సజ్జనార్‌ పండ్లు అందించారు. ఆన్‌లైన్‌లో9 (www.tsrtcparcel.in) కిలోకు రూ.115 చెల్లించి కనీసం 5 కిలోలు ఆర్డర్‌ చేసిన వారికి ఆర్టీసీ పార్సిల్‌ సర్వీస్‌ ద్వారా డోర్‌ డెలివరీ చేస్తామని ఆయన పేర్కొన్నారు. బంగినిపల్లి మామిడికి 12 వేల బుకింగ్‌లు వచ్చాయని తెలిపారు.
*కేంద్రంలో కార్మిక వ్యతిరేక బీజేపీ ప్రభుత్వం కొనసాగుతోందని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. కార్మిక చైతన్య మాసోత్సవాల్లో భాగంగా హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో మెగా హెల్త్‌ క్యాంప్‌ను ఆయన ప్రారంభించారు. వరంగల్‌ జిల్లా వర్ధన్నపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రులు హరీశ్‌, ఎర్రబెల్లి ప్రారంభించారు. పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో హరీశ్‌ మాట్లాడారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న 15 లక్షల ఉద్యోగాలను ఎప్పుడు భర్తీ చేస్తారో బీజేపీ నేతలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. జూన్‌ నుంచే ఆసరా కొత్త పింఛన్లు ఇవ్వనున్నట్లు ఎర్రబెల్లి చెప్పారు.
*రాష్ట్రంలో అవినీతి-నియంత-కుటుంబ పాలనకు వ్యతిరేకంగా కార్యకర్తలు సాగిస్తున్న పోరాటాలతోనే ఈ రోజు టీఆర్‌ఎస్‌కు ప్ర త్యామ్నాయంగా బీజేపీ ఎదిగిందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. మంగళవారం ఉమ్మడి హైదరాబాద్‌, రంగారెడ్డి, వరంగల్‌, ఆదిలాబాద్‌, ఖమ్మం జిల్లాలకు చెందిన దాదాపు 10 వేల మంది బూత్‌ కమిటీ అధ్యక్షులతో ఆయన టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ నెల 14న తుక్కుగూడలో జరగనున్న ప్రజా సంగ్రామయాత్ర ముగింపు సభ విజయవంతానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, జన సమీకరణపై దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో బీజేపీకి అధికారం ఇవ్వాలనే చర్చ జరుగుతోందని.. ఈ నేపథ్యంలో మార్పుకు సంకేతంగా నిలిచేలా కనీవినీ ఎరుగని రీతిలో సభకు భారీ ఎత్తున జనాన్ని తరలించేందుకు కృషి చేయాలని ఆయన కోరారు.

*అనంతపురం జిల్లాల విభజన నేపథ్యంలో డ్వామాలోని విజిలెన్స విభాగంలో ఉన్న రికార్డులను శ్రీసత్యసాయి జిల్లాకు తరలించేందుకు సిద్ధం చేశారు. ఇప్పటికే డ్వామాలోని ఉపాధి హామీ పథకం అదనపు పీడీ విజయప్రసాద్‌ను శ్రీసత్యసాయి జిల్లా ఇనచార్జి పీడీగా నియమించారు. అదే విధంగా అనంతపురం డ్వామా పీడీ కార్యాలయంలో పనిచేస్తున్న 15మంది ఉద్యోగులను సత్యసాయి జిల్లాకు కేటాయించారు. శ్రీసత్యసాయి జిల్లా పరిధిలోని 6నియోజకవర్గాలలోని 32మండలాలకు సంబంధించి ఉపాధి హామీ పథకం, వాటర్‌షెడ్‌, జలప్రభ, విజిలెన్స విభాగాలలోని రికార్డులను తరలించేందుకు సిద్ధం చేశారు. సంచుల్లో భద్రంగా రికార్డులను ఉంచారు. రెండు మూడు రోజుల్లో పూర్తిస్థాయిలో రికార్డులను అనంతపురం నుంచి శ్రీసత్యసాయి జిల్లాకు తరలించేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు.

* అనంతపురం ఆర్టీఓ కార్యాలయంలో ఆటోమెటిక్‌ డ్రైవింగ్‌ టెస్ట్‌ ట్రాక్‌ను ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా ట్రాన్సపోర్ట్‌ ఆఫీసర్‌ శివరాంప్రసాద్‌ పేర్కొన్నారు. మంళవారం ట్రాక్స్‌ ఇనచార్జి, కర్నూలు ఆర్టీఓ రమేష్‌, టెక్నిషియన మహే్‌షలు అనంత ఆర్టీఓ ఆఫీ్‌సలో ఆటోమెటిక్‌ డ్రైవింగ్‌ టెస్ట్‌ ట్రాక్‌ ఏర్పాటుపై స్థానిక అధికారులతో సమాలోచనలు జరిపారు. ఈ సందర్భంగా శివరాంప్రసాద్‌ మాట్లాడుతూ రెండు నెలల్లోగా శాస్ర్తీయ పద్దతిలో డ్రైవింగ్‌ పరీక్ష నిర్వహించేలా ఆటోమెటిక్‌ డ్రైవింగ్‌ టెస్ట్‌ ట్రాక్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. దీనివల్ల అధికారుల ప్రమేయం లేకుండా డ్రైవింగ్‌ టెస్టింగ్‌ జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఆర్టీఓ సుధాకర్‌రెడ్డి, ఎంవీఐలు వరప్రసాద్‌, దామోదర్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.

*మంత్రి ఉష శ్రీచరణ్‌ అనుచరులు వీరంగం సృష్టించారు. సొంత పార్టీ నేతపైనే దాడికి తెగబడ్డారు. మంగళవారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని ఎరువుల దుకాణంలో చొరబడి.. దుకాణ యజమాని, వైసీపీ నాయకుడు శ్రీకాంత్‌ రెడ్డిపై పిడిగుద్దులు గుప్పించారు.

*వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కారు అత్యధిక వడ్డీకి అప్పులు తెచ్చింది. రూ.3 వేలకోట్ల రుణం కోసం ఆర్‌బీఐ దగ్గర జగన్ ప్రభుత్వం సెక్యూరిటీ బాండ్ల వేలం వేసింది. బిడ్డింగ్‌లో ఐదు రాష్ట్రాలు పాల్గొన్నాయి. ఏపీ బాండ్లకు అత్యధిక వడ్డీ చెల్లిస్తేనే వేలం వేస్తామని ఆర్‌బీఐ (RBI) స్పష్టం చేసింది. రూ.2 వేల కోట్లకు 7.78 శాతం వడ్డీ (Interest) చెల్లింపు, మరో వేయి కోట్లకు 7.76 శాతం వడ్డీకి వేలం వేశారు. రుణ పరిమితికి అవకాశం ఇచ్చిన తర్వాత మొదటి విడతలోనే రూ.3 వేల కోట్ల బాండ్లను వేలం వేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.28 వేల కోట్లకే కేంద్రం రుణ పరిమితి ఇచ్చింది. రూ.66 వేల కోట్ల రుణపరిమితి ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కోరింది.

*గన్నవరంలో ఎమ్మెల్యే వంశీ అసమ్మతి వర్గం ‘ఛలో తాడేపల్లి’కి పిలుపిచ్చింది. బుధవారం (11న) గడపగడపకు వైసీపీ కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో మరోసారి ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం తెరపైకి వచ్చింది. 2019లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచిన వంశీ..అనంతరం సీఎం జగన్ నేతృత్వంలో వైసీపీకి మద్ధతుపలికారు. దీంతో వైసీపీకి దీర్ఘకాలిక సేవలందించిన నేతల్లో అసంతృప్తి మొదలైంది. ఇప్పటికే పలు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యక్రమాల్లో వర్గ విభేదాలు బయటపడ్డాయి.

*విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలపై అసాని తుపాను తీవ్ర ప్రభావం చూపుతోంది. రెండు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. రాజాంలో భారీ వడగంట్ల వాన హోరెత్తించింది. విజయనగరం జిల్లాలో ఈదురు గాలుల ధాటికి చెట్ల కొమ్మలు విరిగిపడిపోతున్నాయి. విద్యుత్ వైర్లపై చెట్ల కొమ్మలు విరిగిపడడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పూసపాటిరేగ, డెంకాడ మండలాల్లోని సాగర తీరం అల్లకల్లోలంగా మారింది. ఎగిసిపడుతున్న కెరటాలతో తీర ప్రాంతంలో అలజడి నెలకొంది. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

* పీఆర్సీ అమ లు, దాని అనుబంధ అంశాలపై బుధవారం అమరావతి సచివాలయంలో జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌(జేఎస్సీ) సమావేశం జరగనుంది. ఈ భేటీకి హాజరు కావాలని ఏపీఎన్‌జీవో ఆఫీసర్స్‌ అసోసియేషన్‌, ఏపీ సచివాలయ సంఘం, ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌, ఏపీ గవర్నమెంట్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌కు మాత్రమే ప్రభుత్వం ఆహ్వానం పంపింది. జేఎస్సీలో సభ్యత్వం ఉన్న ఉపాధ్యాయ సంఘాలను మాత్రం పక్కన పెట్టింది. ఇప్పటి వరకు ఏ సమావే శం జరిగినా కౌన్సిల్‌లో ఉన్న అన్ని సంఘాలనూ ఆ హ్వానించిన ప్రభుత్వం ఈసారి ఉపాధ్యాయ సం ఘాలను ఆహ్వానించకపోవడంపై ఆయా సంఘాల నేతలు మండిపడుతున్నారు.

* రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ జెన్‌కో, డిస్కమ్స్‌లో పనిచేస్తున్న విద్యుత్‌ ఉద్యోగులకు పదో తేదీ వచ్చినా వారి ఖాతాల్లో వేతనాలు జమకాలేదు. దీనిని నిరసిస్తూ మంగళవారం ఎన్టీటీపీఎస్‌ మెయిన్‌ గేట్‌ వద్ద విద్యుత్‌ ఉద్యోగులు ధర్నాకు దిగారు. వారు మాట్లాడుతూ.. ఎన్టీటీపీఎ్‌సలో పనిచేస్తున్న ఇంజనీర్లు, ఓఅండ్‌ఎం ఉద్యోగులు 2300మందికి నెలకు రూ.32 కోట్లు, జెన్‌కోలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు రూ.12 కోట్లు చెల్లింపులు చేయాల్సి ఉందన్నారు. గతంలో సమస్యల పరిష్కారం కోసం మెయిన్‌గేట్ల వద్ద ధర్నాలు చేసేవాళ్లమని, ఇపుడు నెలవారీ వేతనాల కోసం ధర్నా చేయాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు.

*మంత్రి ఉష శ్రీచరణ్‌ అనుచరులు వీరంగం సృష్టించారు. సొంత పార్టీ నేతపైనే దాడికి తెగబడ్డారు. మంగళవారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని ఎరువుల దుకాణంలో చొరబడి.. దుకాణ యజమాని, వైసీపీ నాయకుడు శ్రీకాంత్‌ రెడ్డిపై పిడిగుద్దులు గుప్పించారు.

* అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వానికైనా మూడు సంవత్సరాల తర్వాత ప్రజల నుంచి కొంత వ్యతిరేకత సహజంగానే వస్తుందని కృష్ణాజిల్లా ఇన్‌చార్జి మంత్రి రోజా అన్నారు. దీనిని తెలుసుకుని, సరిదిద్దుకునేందుకే తమ ప్రభుత్వం ‘గడప గడపకు వైసీపీ’ కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకు వెళుతోందని తెలిపారు. ఇన్‌చార్జి మంత్రి హోదాలో తొలిసారిగా ఆమె మంగళవారం మచిలీపట్నంలోని జెడ్పీ కన్వెన్షన్‌ హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. గడప గడపకు వైసీపీ కార్యక్రమంలో భాగంగా మంత్రులు, శాసనసభ్యులు ఇంటింటికీ వెళ్తారని, ప్రభుత్వం నుంచి పొందిన ప్రయోజనాలను ప్రజలకు వారు వివరిస్తారన్నారు. అధికారులు సహకరించాలని కోరారు.

*సంతబొమ్మాళి సున్నాపల్లి రేవుకు చేరిన ఇతర దేశానికి చెందిన బంగారు వర్ణం కలిగిన రధం అసాని తుపాన్ ప్రభావంతో సముద్రం ఒడ్డుకు కొట్టుకువచ్చింది. అక్కడి ప్రజలు వీక్షించేందుకు ఎగపడుతున్నారు శ్రీకాకుళం జిల్లాలోని సంతబొమ్మాళి మండలం ఎం సున్నాపల్లి సముద్రం రేవుకు ఎప్పుడు చూడని వింతైన రధం మంగళవారం కొట్టుకు వచ్చింది.ఈ రధమపై తేది 16-1-2022 అని విదేశీ బాష లో లిక్కించి ఉందని మలేషియా,థాయిలాండ్ లేదా జపాన్ దేశాలకు చెందినది అయి ఉండవచ్చునని కొంతమంది సీమెన్ లు అంటున్నారు.ఇంతవరకు తితిలి వంటి పెద్ద తుఫానులు వచ్చినప్పుడు కూడా ఇటువంటి విచిత్రమైన మందిర రధం చూడలేదని తెలియజేస్తున్నారు.మేరైన్ పోలీసులు స్వాధీనం చేసున్నట్లు తెలిజేశారు.

*ఈనెల 12వ తేదీన ఏపీ కేబినెట్ భేటీ కానుంది. గురువారం మధ్యాహ్నం 3 గం.లకు అమరావతి సచివాలయం మొదటి బ్లాకులో ముఖ్యమంత్రి వైయస్. జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది.ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ అన్ని శాఖల కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ నెల 13 వతేది ఉ.11గం.లకు రాష్ట్ర మంత్రివర్గం భేటీ జరగాల్సి ఉంది. అయితే, అనివార్య కారణాలతో మంత్రివర్గ సమావేశాన్ని ఒకరోజు ముందుగానే అంటే ఈ నెల 12వ తేదీన మధ్యాహ్నం 3గం.లకు మార్చారు.

*ఆండ్రాయిడ్ ప్లాట్ ఫాంపై పనిచేసే థర్డ్ పార్టీ కాల్ రికార్డింగ్ యాప్ లను గూగుల్ నిషేధం విధించింది. ఈ నెల 11 నుంచి ఈ నిషేధం అమల్లోకి రానుంది. ఈ కాల్ రికార్డింగ్ ఫీచర్.. యూజర్ల ప్రైవసీకి భంగం కలిగిస్తోందని గూగుల్ భావిస్తోంది. దాంతో ఈ నిషేధం విధించింది. ఇకపై ఆయా కాల్ రికార్డింగ్ యాప్ లు గూగుల్ ప్లే స్టోర్ లో కనిపించవు. యాప్ డెవలపర్లు ఆండ్రాయిడ్ ఫోన్లకు సంబంధించి కాల్ రికార్డింగ్ ఏపీఐ యాక్సెస్ పొందడం కుదరదని, అయితే శాంసంగ్, వివో, రెడ్ మీ తదితర కంపెనీల ఫోన్లలో కాల్ రికార్డింగ్ యాప్ లు ఇన్ బిల్ట్ గా వస్తాయి. ఈ ఫోన్లకు సంబంధించి గూగుల్ ఎలాంటి ప్రకటన చేయలేదు…!!

* ధరణి వెబ్‌సైట్‌ రైతుల పట్ల శాపంగా మారిందని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. భూదాన్‌, ల్యాండ్ సీలింగ్‌ భూములపై కేసీఆర్‌ కన్ను పడిందని విమర్శించారు.ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో రైతులను మోసం చేస్తూ భూములు లాక్కుంటున్నారని ఆరోపించారు. అలా సేకరించిన భూములను ప్రైవేటు కంపెనీలకు కట్టబెడుతున్నారని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్‌ స్థిరాస్తి వ్యాపారిగా మారిపోయారని ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు

*తూర్పు గోదావరి జిల్లాలో నూతనంగా విలీనం అయిన కొవ్వూరు రూరల్ పోలీసు స్టేషన్ ను మరియు సర్కిల్ ఆఫీసును ఆకస్మికంగా సందర్శించిన జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి, మంగళవారం తూర్పు గోదావరి జిల్లాలో ఎస్పీ ఐశ్వర్య రస్తోగి కొవ్వూరు రూరల్ పోలీసు స్టేషన్ బౌగోళిక పరిస్థితులను స్వయంగా తెలుసుకునేందుకు ఆకస్మికంగా పోలీసు స్టేషన్ పరిధిని పర్శిలించి అనంతరం కొవ్వూరు సర్కిల్ ఆఫీసు, పోలీసు స్టేషన్ ను సందర్శించి, స్టేషన్ పని తీరు, విజిబుల్ పోలీసింగ్, పిటిషన్ మేనేజ్మెంట్, గత కొన్ని సంవత్సరాలగా ఇక్కడ జరిగిన క్రైమ్ ప్యాటర్న్, ఆస్తి నేరాలు, శారీరక దాడుల నేరాలపై, నాటుసారా నిర్మూలన మరియు ఇతర అంశాలపై కొవ్వూరు SDPO బి.శ్రీకాంత్ మరియు సి.ఐ వై.వి.రమణతో చర్చించారు. ఈ తనిఖీలో ఎస్పీ పోలీస్‌స్టేషన్‌ పరిసరాలు, స్టేషన్ రిసెప్షన్ కౌంటర్, హెల్ప్ డెస్క్, రికార్డ్‌ గది, కంప్యూటర్‌ రూమ్, లను పరిశీలించి, స్టేషన్ కు వచ్చు ఫిర్యాదుదారులతో గౌరవంగా వ్యవహరించాలని, డయల్ 100 కాల్స్‌ పై సిబ్బంది వెంటనే స్పందించాలని అలసత్వం వహించారాదని సిబ్బందికి సూచించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి పోలీసు స్టేషన్ లో సిబ్బంది కొరత ఏమైనా ఉందా, పరిపాలన ఎలా జరుగుతుంది, సిబ్బంది యొక్క సమస్యలు తెలుసుకునేందుకు జిల్లాలో ఉన్న అన్ని పోలీసు స్టేషన్లను ఆకస్మికంగా సందర్శించడం జరుగుతుందని, నేరాలను నియంత్రించేందుకు విజిబుల్ పోలీసింగ్, స్పెషల్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు.

*విశాఖ నుండి నిజముద్దిన్ వెళ్లే సమత సూపర్ ఫాస్ట్ రైలుకు తప్పిన పెను ప్రమాదంగుచ్చిమి రైల్వే గేట్ సమీపంలో భోగి నుండి విడిపోవిడిపోయిన ఇంజన్సుమారు కిలోమీటర్ పైగా భోగీలను విడిచి వెళ్లిన ఇంజన్ఆందోళనకు గురైన ప్రయాణీకులు, లోకోపైలెట్ అప్రమత్తతతో తిరిగి భోగీల వద్దకు చేరుకున్న ఇంజన్

*ఇప్పటి వరకు ఏం కావాలన్నా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవడానికి ప్రజలు అలవాటు పడిపోయారు. కోవిడ్ వల్ల ఇది మరింత మందికి అలవాటైంది. మెడిసిన్స్, ఫుడ్, గ్రాసరీస్, ఎలక్ట్రానిక్ వస్తువులు ఇలా అన్నింటినీ నెట్లో చూసి చకచకా ఆర్డర్ పెట్టేస్తున్నారు. అయితే మందుబాబులకు మాత్రం ఈ సదుపాయం లేక నిరాశకు గురవుతూ వచ్చారు. అయితే ఎట్టకేలకు వారి కల నెరవేరనుంది. మందుబాబులకు ఢిల్లీ ప్రభుత్వం త్వరలో గుడ్ న్యూస్ అందించనుంది. మద్యాన్ని ఇంటికే డెలివరీ చేసేందుకు చర్యలు ప్రారంభించింది. ఈ కొత్త విధానానికి ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల సంఘం ఆమోదం తెలిపింది.ఇటీవల కాలంలో మద్యం కొనుగోళ్లు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో అక్రమాలు కూడా వెలుగు చూస్తున్నాయి. ఈ తరుణంలో మద్యం ధరలను 25 శాతం తగ్గిస్తూ ఢిల్లీ సర్కారు నిర్ణయం తీసుకుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను ఢిల్లీలోని కేజీవాల్ సర్కారు నూతన మద్యం పాలసీ తీసుకొచ్చేందుకు యత్నాలు చేస్తోంది. త్వరలో ఇంటికే మద్యం డెలివరీ విధానానికి శ్రీకారం చుట్టనున్నారు.