Movies

నేను నాలాగే

Auto Draft

తమ ఇద్దరి ఆలోచనలు విభిన్నంగా ఉంటాయని , అందుకే తమ మధ్య జరిగే చర్చలు ఆసక్తి కరంగా వుంటాయని ప్రేమికుడు మథియాస్ గురించి మురిపెంగా చెప్పుకున్నది తాప్సిపన్ను . “చిత్రపరిశ్రమ కాకుండా బయటి వ్యక్తితో నాకు అనుబంధం కుదరాలని భావించాను . నాకు ఎవ రితో వుంటే బావుంటుందో అలాంటి వ్యక్తే దొర కడం సంతోషంగా వుంది. నా పెళ్ళిలో నేను నాలాగే కనిపించేలావుంటాను. అతిగా మేకప్ వేసుకోను. వంకీలు తిరిగివుండే నా జుట్టును అలాగే వదిలేస్తా” అని చెప్పింది. డెన్మార్క్ క్రీడాకారుడు మథియాస్ బోతో ప్రేమలో పడిన సంగతి పాతదే.