NRI-NRT

అమెరికాలో ఇండియన్ అమెరియాకన్ కు అరుదైన గౌరవం

అమెరికాలో ఇండియన్ అమెరియాకన్ కు అరుదైన గౌరవం

అగ్రరాజ్యం అమెరికాలో ఇండియన్ అమెరికన్‌కు అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీ స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నడిచే స్కూల్‌కు డీన్‌గా నియామకం అయ్యారు. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. మారుతున్న జీవన శైలి కారణంగా వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అయితే వీటికి పరిష్కారానికి ప్రపంచ వ్యాప్తంగా అనేక సంస్థలు ఇప్పటికే పని చేస్తున్నాయి. తాజాగా స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ కూడా ఇందుకోసం నడుం బిగించింది. global climate crisisకు పరిష్కారాలను కనుగొనే ప్రక్రియను వేగవంతం చేసేందుకు Stanford Doerr School of Sustainabilityని ఏర్పాటు చేయాలని భావించి ఆ వైపుగా అడుగులు వేసింది. సెప్టెంబర్ 1 దీన్ని ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలోనే కొత్తగా ప్రారంభమయ్యే ఈ స్కూల్‌కు ఇనాగరల్ డీన్‌గా భారత‌కు చెందిన వ్యక్తి అరుణ్ మజుందార్ ను నియమిస్తూ ప్రకటన విడుదల చేసింది. జూన్ 15న ఈ కొత్త బాధ్యతలను ఆయన స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా అరుణ్ మాట్లాడుతూ తనకు దక్కిన గౌరవంపట్ల ఆనందం వ్యక్తం చేశారు. కోల్‌కతా‌కు చెందిన అరుణ్.. 1985లో బాంబే ఐఐటీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచ్‌లర్ డిగ్రీ పట్టా అందుకున్నారు. 1989లో కాలిఫోర్నియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేశారు. 2014లో స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో చేరి, పలు హోదాల్లో విధులు నిర్వర్తించారు.