DailyDose

బండి సంజయ్‌కు కేటీఆర్‌ లీగల్‌ నోటీసులు – TNI తాజా వార్తలు

బండి సంజయ్‌కు కేటీఆర్‌ లీగల్‌ నోటీసులు  – TNI తాజా వార్తలు

* తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కు.. మంత్రి కేటీఆర్‌ శుక్రవారం లీగల్‌ నోటీసులు పంపించారు.ఈ నెల 11వ తేదీన ట్విటర్‌లో మంత్రి కేటీఆర్‌పై బండి సంజయ్‌ ఆరోపణలు చేశారు. అయితే ఆ ఆరోపణలపై ఆధారాలు చూపించాలని కేటీఆర్‌ తాజాగా డిమాండ్‌ చేశారు. ఆధారాలు చూపించకుంటే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు కేటీఆర్‌. ఈ నేపథ్యంలో.. తాజాగా నోటీసులు పంపడం విశేషం. 48 గంటల్లోపు స్పందించాలని నోటీసుల్లో కేటీఆర్‌, బండి సంజయ్‌కు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే బాధ్యతగల ప్రజాప్రతినిధిగా అలా వ్యవహరించడం సరికాదని లీగల్‌ నోటీసులో బండి సంజయ్‌కు కేటీఆర్‌ చురకలు అంటించారు.

* పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన గురుపూజ మహోత్సవాల్లో భాగంగా గురువారం బ్రహ్మంగారు, గోవిందమాంబల రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సాయంత్రం 5 గంటలకు మఠం పెద్దాచార్యులు భద్రయ్య ఆధ్వర్యంలో రథం ప్రారంభానికి సిద్ధమైంది. ముందుగా రథం నిర్మాణ ఉభయ దాతలకు సన్మానం చేశారు.

* మాజీ మంత్రి నారాయణ బెయిల్‌ రద్దు చేయాలంటూ చిత్తూరు కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ప్రభుత్వం తరపున అడిషనల్‌ ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. టెన్త్ క్లాస్ పేపర్ లీకేజీ వ్యవహారం లో ఈ నెల 10న నారాయణ అరెస్టయిన విషయం తెలిసిందే. 11వ తేదీ తెల్లవారుజామున నారాయణకు చిత్తూరు నాల్గవ అదనపు జడ్జి బెయిలు మంజూరు చేశారు. టెన్త్‌ క్లాస్‌ పేపర్‌ లీకేజీ వ్యవహారంలో నారాయణ కుట్ర ఉందని, బెయిల్‌ రద్దు చేయాలని ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది.

*మంత్రి ఆదిమూలపు సురేష్‌పై వృద్ధురాలు ఫిర్యాదు చేసింది. తన రెండెకరాల భూమిని మంత్రి సురేష్ ఆక్రమించారని కలెక్టర్ స్పందన కార్యక్రమంలో వృద్ధురాలు రంగ లక్ష్మమ్మ ఫిర్యాదు చేశారు. ఇటీవల దర్శి స్పందనలో వినతి పత్రం ఇచ్చినా.. అధికారుల నుంచి స్పష్టత రాకపోవడంతో మరోసారి వినతిపత్రం ఇచ్చారు. తనకు న్యాయం కావాలని జిల్లా అధికారులను వృద్ధురాలు విన్నవించుకున్నారు.

*కర్నూలు జిల్లాలో ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యానికి శిశువు మృతి చెందింది. ప్రసవం కోసం వరలక్ష్మిని ఆమె కుటుంబసభ్యులు గురువారం ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. తొలుత ప్రసవం చేస్తామని వైద్యులు చెప్పారు. చివరకు అర్ధరాత్రి సమయంలో పరికరాలు లేవని, ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పడంతో అక్కడకు తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు కూడా ప్రసవం చేయడం కష్టమని, కర్నూలుకు తీసుకెళ్లాలని చెప్పడంతో కుటుంబసభ్యులు వరలక్ష్మిని తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు ప్రసవం చేశారు. అయితే శిశువు చనిపోయింది. ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం వల్లే శిశువు తమకు దక్కలేదని వరలక్ష్మి బంధువులు ఆరోపిస్తున్నారు.

*దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌‌పై నమోదైన కేసును కోర్టు కొట్టివేసింది. మహిళలపై దాడి చేశారని 2011లో ఏలూరు టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో చింతమనేని ప్రభాకర్‌‌పై కేసు నమోదు అయ్యింది. శుక్రవారం విజయవాడ ప్రజా ప్రతినిధుల న్యాయస్థానానికి చింతమనేని హాజరయ్యారు. నేరం రుజువు కాకపోవడంతో చింతమనేనిపై నమోదైన కేసును న్యాయమూర్తి కొట్టివేశారు

*జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్.. వివాదంగా మారిన జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టపర్తి పర్యటన.. కొత్తచెరువు లో టీడీపీలోని ఇరువర్గాలు మొహరింపు — జెసి ప్రభాకర్ రెడ్డి పర్యటన ను అడ్డుకునేందుకు రఘునాథ్ రెడ్డి వర్గం ముందస్తుగా ఏర్పాట్లు.. అందుకు ప్రతిగా భారీ ఎత్తున చేరుకున్న జేసీ మద్దతుదారులు – శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉండడంతో పోలీస్ అధికారుల అప్రమత్తత మరూరు టోల్గేట్ వద్ద జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ — రాప్తాడు పోలీస్ స్టేషన్ కు తరలించే అవకాశం

*తాను ఎక్కడికి పారిపోలేదని, వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా చేశానని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మాజీ అధ్యక్షురాలు, నటి దివ్య స్పందన(రమ్య) తెలిపారు. కర్ణాటక కాంగ్రెస్‌ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేయమని కాంగ్రెస్ తన కార్యకర్తలను ఆయన ఆదేశించారని ట్విటర్‌లో పేర్కొన్నారు.

*తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీని ఛ‌త్తీస్‌గ‌ఢ్ శాస‌న‌స‌భ స్పీక‌ర్ డాక్ట‌ర్ చ‌ర‌ణ్ దాస్ మ‌హంత్ శుక్ర‌వారం సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా చ‌ర‌ణ్ దాస్‌కు రాష్ట్ర శాస‌న‌స‌భ స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. స్పీక‌ర్ చాంబ‌ర్‌లో చ‌ర‌ణ్ దాస్‌ను శాలువాతో స‌త్క‌రించి, రాష్ట్రంలో జ‌రుగుతున్న అభివృద్ధిని వివ‌రించారు. ఆ త‌ర్వాత తెలంగాణ శాస‌న‌స‌భ త‌ర‌పున చ‌ర‌ణ్ దాస్‌కు ఓ జ్ఞాపిక‌ను బ‌హుక‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో శాస‌న‌స‌భ సెక్ర‌ట‌రీ డాక్ట‌ర్ న‌ర‌సింహాచార్యులు పాల్గొన్నారు.

*రాష్ట్రంలో త్వ‌ర‌లో చేప‌ట్ట‌బోయే ప‌ల్లె, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మాల‌పై ఈ నెల 18వ తేదీన ఉద‌యం 11 గంట‌ల‌కు ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌మీక్షించ‌నున్నారు. ఈ స‌మీక్షా స‌మావేశానికి మంత్రులు, అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లు, లోక‌ల్‌బాడీ క‌లెక్ట‌ర్లు, డీపీవోలు, అట‌వీశాఖ అధికారులు, మున్సిప‌ల్ కార్పొరేష‌న్ల మేయ‌ర్లు, చైర్మ‌న్లు, క‌మిష‌న‌ర్ల‌తో పాటు సంబంధిత ఉన్న‌తాధికారులు పాల్గొన‌నున్నారు.

*జయశంకర్ భూపలపల్లి మండల పరిధి ఎడ్లపల్లి అటవీ ప్రాంతంలోని బొగ్గులవాగు ప్రాజెక్టులో ఓ మృతదేహం కనిపించింది. ఎడ్లపల్లి గ్రామానికి చెందిన మత్సకారులు ఉదయం చేపలు పట్టేందుకు వెళ్లగా.. ప్రాజెక్టులో తేలాడుతున్న శవం కనిపించింది. దీంతో వారు వెంటనే కొయ్యూర్‌ పోలీసులకు సమాచారం అందించారు. కాటారం డీఎస్పీ బోనాల కిషన్‌, సీఐ రంజిత్‌రావు, ఎస్సై-2 ప్రశాంత్‌ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించారు. ఎవరో హత్య చేసి తలకు, కాళ్లకు బండరాళ్లు కట్టి ప్రాజెక్టులో వేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. నాలుగైదు రోజులు కావడం వల్ల మృతదేహం కుళ్లిపోయి, గుర్తు పట్టలేని స్థితిలో ఉందన్నారు. మృతుడి వయసు 40 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉంటుందని, ఎత్తు 5.6 ఉంటాడని, ఒంటిపై పసుపు రంగు హాఫ్‌ హ్యాండ్‌ జెడ్‌ బ్రాండ్‌ షర్ట్‌ ఉన్నాయని వివరించారు. మృతదేహాన్ని గుర్తించిన వారు కొయ్యూర్‌, కాటారం పోలీసులను సంప్రదించాలని కోరారు. ఎడ్లపల్లి వీఆర్వో సంగీత్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మహదేవపూర్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించినట్టు చెప్పారు

*కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలో టీడీపీ వ్యవసాయ స్టీరింగ్ కమిటీ బృందం శుక్రవారం పర్యటించింది. అసాని తుఫాన్ వల్ల నష్టపోయిన పంట పొలాలను టీడీపీ బృందం పరిశీలించింది. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నేతృత్వంలో పలు పంట పొలాలను టీడీపీ బృందం సభ్యులు పరిశీలించారు. ఈ క్రమంలో టీడీపీ బృందం వద్ద రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదు అని రైతులు ఆవేదన చెందారు.

*సంతనూతలపాడు ఎమ్మెల్యే sudhakar babuకు ఎదురుదెబ్బ
ప్రకాశం జిల్లాలోని సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్‌బాబుకు ఎదురుదెబ్బ తగిలింది. శుక్రవారం గ్రామంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి సుధాకర్‌బాబు హాజరయ్యారు. కాగా… సుధాకర్‌బాబు తీరుకు వ్యతిరేకంగా ఎంపీపీ, జడ్పీటీసీ, మండలపార్టీ అధ్యక్షుడు, ఎంపీటీసీలు కార్యక్రమాన్ని బహిష్కరించారు. ముఖ్య నాయకులు లేకుండానే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.

*నంద్యాల: జిల్లాలోని శ్రీశైలంలో వడ్డీ వ్యాపారి బ్రహ్మారెడ్డి అరాచకానికి పాల్పడ్డాడు. అప్పు డబ్బులు కట్టలేదని తన భర్తను వడ్డీ వ్యాపారి కిడ్నాప్ చేశారంటూ జలదుర్గ అనే మహిళ ఆరోపించింది. రూ.20 లక్షల అప్పు డబ్బులు కడితేనే భర్తను విడిచి పెడతాను అని బ్రహ్మారెడ్డి బెదిరింపులకు గురి చేస్తున్నాడని తెలిపింది. ఇప్పటికే లక్షా 90 వేల రూపాయలు బ్రహ్మారెడ్డి కొడుకు అకౌంట్లో వేసానని… మిగతా డబ్బులు ఇస్తామన్నా వినడం లేదని మహిళ వాపోయింది. ‘‘ఏడాది కాలంగా అప్పు చెల్లించాలని బ్రహ్మారెడ్డి వేధింపులకు గురి చేస్తున్నాడు… పోలీసులకు చెప్తే నీ భర్త నీకు దక్కడాన్ని వార్నింగ్ ఇస్తున్నాడు’’ అంటూ బాధితురాలు జలదుర్గ ఆవేదన చెందారు.

*పల్నాడు: జిల్లాలోని చిలకలూరిపేటలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును పోలీసులు అడ్డుకున్నారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి పధకాన్ని ప్రారంభించేందుకు పుల్లారావు చిలకలూరిపేటకు వచ్చారు. అయితే ఎన్టీఆర్ సుజల పధకానికి అనుమతి లేదని మున్సిపల్ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ప్రారంభోత్సవం చేయకుండా పుల్లారావు పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు – టీడీపీ వర్గీయుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.

*హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌ వద్ద రూ.10 కోట్లతో ఏర్పాటు చేస్తున్న నీరా కేఫ్‌ను జూన్‌ 2న దీనిని ప్రారంభిస్తామని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. గురువారం రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌ మండలం ముద్విన్‌లో నీరా పైలెట్‌ ప్రాజెక్టు కేంద్రాన్ని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌తో కలసి ఆయన ప్రారంభించారు.

* విశాఖపట్నం విమానాశ్రయం నుంచి విమానాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కరోనాకు ముందు రోజూ 90 విమాన సర్వీసులు ఉండేవి. ఆ తరువాత ఆంక్షల కారణంగా విదేశీ విమానాలతో పాటు దేశీయ సర్వీసులు కూడా తగ్గిపోయాయి. ఇప్పుడు మళ్లీ విమానాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం రోజుకు 70 సర్వీసులు నడుస్తున్నాయి. సింగపూర్‌ విమానాన్ని పునరుద్ధరించారు.

*అసాని తుఫాను బాధిత ప్రాంతాల్లో దెబ్బ తిన్న పంటలను తెలుగుదేశం పార్టీ బృందం శుక్రవారం పరిశీలించనుంది. తుఫాను బాధిత ప్రాంతాల్లో పర్యటనకు పార్టీ తరఫున ఒక స్టీరింగ్‌ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ శుక్రవారం కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలోని తోట్ల వల్లూరులో పర్యటిస్తుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కమిటీలో మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పత్తిపాటి పుల్లారావు, కాల్వ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, ధూళిపాళ్ల నరేంద్ర, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు సభ్యులుగా ఉన్నారు.

*‘వైసీపీ నిర్వహిస్తున్న ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ తొలిరోజునే అభాసుపాలైంది. గడప గడపలో గందరగోళం పథకంగా తయారైంది’’ అని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి అన్నారు. గురువారం ఆయన ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. ‘‘విద్యుత్‌, ఆర్టీసీ చార్జీల పెంపు, నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరగడం, పొరుగు రాష్ట్రాల్లో పెట్రోలు, డీజల్‌ ధరలు ఎక్కువగా ఉండడం తదితర విషయాలపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నట్లు ఈ కార్యక్రమంలో తెలుస్తోంది. గోపాలపురం వైసీపీ ఎమ్మెల్యే వెంకటరావుపై భౌతికదాడి జరిగినట్లే గడపగడప కార్యక్రమంలో కొన్నిచోట్ల వైసీపీ ఎమ్మెల్యేల మీద ప్రజలు భౌతిక దాడులు చేసే ప్రమాదముంది. శ్రీలంకలో ప్రధాని మహీంద రాజపక్సేకు పట్టిన దురవస్థ మన రాష్ట్ర పరిపాలకులకు పట్టినా ఆశ్చర్యం లేదు’’ అని అన్నారు. ‘‘కడపలో ఒక ముసుగు మనిషి సీబీఐ బృందాన్ని హెచ్చరించడం విడ్డూరం. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుంది’’ అని విమర్శించారు.

v*వివిధ అవసరాల నిమిత్తం విదేశాలకు వెళ్లే వారు 9 నెలల ముందు కూడా బూస్టర్‌ డోసును తీసుకునే వెసులుబాటును కల్పిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ప్రకటించారు. ఈమేరకు కొవిన్‌ పోర్టల్‌లో త్వరలోనే మార్పులు చేస్తామని వెల్లడించారు.

*స్వచ్ఛంద సంస్థలు విదేశీ విరాళాలు పొందేందుకు అవసరమైన అనుమతుల మంజూరులో లంచాలు రాజ్యమేలుతున్నాయి. మధ్యవర్తులను ఏర్పాటు చేసుకున్న కేంద్ర హోం శాఖ పరిధిలోని కొందరు అధికారులు పది శాతం మేర మామూళ్లు తీసుకుంటున్నట్టు సీబీఐ గుర్తించింది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం కింద అనుమతుల మంజూరులో అక్రమాలకు పాల్పడినందుకు ఆరుగురు ప్రభుత్వ ఉద్యోగులు సహా 14 మందిని అరెస్టు చేసిన కేసులో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి.

*ఆర్థిక నేరాల కేసుల్లో మోసానికి గురైన వారికి డబ్బులు ఇప్పించడంపైనే దర్యాప్తు సంస్థలకు ప్రాథమిక దృష్టి ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిందితులను జైల్లో పెట్టించడంపై కాకుండా బాధితులకు సొమ్ములు అందేలా కృషి చేయాలని సూచించింది. నిందితులపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవడం తర్వాతి దశ కిందికి వస్తుందని పేర్కొంది. జనాల నుంచి డిపాజిట్లు సేకరించి మోసం చేసిన హీరా గోల్డ్‌ కంపెనీ అధినేత నౌహీరా షేక్‌కు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీ్‌స(ఎ్‌సఎ్‌ఫఐవో) దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం న్యాయమూర్తులు జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ ఎంఎం సుందరేశ్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం కొట్టివేసింది. తాజాగా నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌పై స్టే విధించింది. ఎఫ్‌ఐఆర్‌ రద్దు చేయడంపై ప్రభుత్వం నుంచి సూచనలు తీసుకోవాలని అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్వీ రాజుకు సూచించింది.

*శ్రీకృష్ణ జన్మభూమి-షాహి ఈద్గా మసీదు వివాదంపై అలహాబాద్‌ హైకోర్టు కీలక నిర్ణయం వెలువరించింది. దీనికి సంబంధించిన కేసులన్నిటిపై సత్వర విచారణ జరపాలని మథుర కోర్టును గురువారం ఆదేశించింది. ఇందుకు నాలుగు నెలల గడువు విధించింది. ఈ వివాదంలోని కేసులన్నిటినీ త్వరగా విచారించాలని కోరుతూ పిటిషనర్‌ మనీష్‌ యాదవ్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో కక్షిదారైన సున్నీ వక్ఫ్‌ బోర్డు గురువారం విచారణకు హాజరు కాలేదు. మొగల్‌ చక్రవర్తి ఆదేశాల మేరకు శ్రీకృష్ణ జన్మభూమి ఆలయంలో ఓ భాగాన్ని ధ్వంసం చేసి షాహి ఈద్గా మసీదును నిర్మించారని, ఆ భాగం దరిదాపుగా 13.37 ఎకరాలు ఉంటుందని.. దానిని ఆలయానికి తిరిగి ఇవ్వాలని.. ఆలయాన్ని పునరుద్ధరించాలని కోరుతూ మథుర కోర్టులో పది పిటిషన్లు దాఖలయ్యాయి. రెండేళ్లుగా విచారణ సాగుతోంది. ఈ రెండేళ్లలో సున్నీ వక్ఫ్‌ బోర్డు తన వాదనలను కోర్టుకు సమర్పించలేదని.. కావాలనే జాప్యం చేస్తోందని పిటిషనర్‌ మనీష్‌ యాదవ్‌ మీడియాకు తెలిపారు.

*కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ (సీఈసీ)గా రాజీవ్‌ కుమార్‌ నియమితులయ్యారు. ఈ నెల 15న ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సుశీల్‌ చంద్ర పదవీకాలం మే 14న ముగియనుంది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. రాజీవ్‌ కుమార్‌ నియామకానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదముద్ర వేశారు. 2025 ఫిబ్రవరి వరకు రాజీవ్‌ కుమార్‌ సీఈసీగా కొనసాగుతారు. త్వరలో జరిగే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలను ఆయన పర్యవేక్షిస్తారు. 2024 లోక్‌సభ ఎన్నికలతోపాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా రాజీవ్‌ కుమార్‌ హయాంలోనే జరుగుతాయి. రాజీవ్‌ కుమార్‌ 1984 బ్యాచ్‌కు చెందిన బిహార్‌/జార్ఖండ్‌ క్యాడర్‌ ఐఏఎస్‌ అధికారి. 2020 ఫిబ్రవరిలో ఆయన పదవీ విరమణ పొందారు. అనంతరం 2020 సెప్టెంబరులో కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. దీనికిముందు పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ సెలక్షన్‌ బోర్డు చైర్‌పర్సన్‌గా సేవలందించారు.

*త్వరలో దేశవ్యాప్తంగా ఖాళీ అవబోతున్న 57 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. ఆయా స్థానాలకు ఈ నెల 24న నోటిఫికేషన్‌ జారీ కానుంది. నామినేషన్ల స్వీకరణకు తుది గడువు ఈ నెల 31వ తేదీ. జూన్‌ 1న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. అదే నెల 3వ తేదీ వరకు అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. ఇక జూన్‌ 10వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. పోలింగ్‌ ముగిసిన తర్వాత అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్‌ను విడుదల చేసింది. దీన్ని అనుసరించి… జూన్‌ నుంచి ఆగస్టు నెల వరకు 15 రాష్ట్రాల్లో మొత్తం 57 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వీటన్నింటికీ కలిపి ఎన్నికల సంఘం ఒకేసారి షెడ్యూల్‌ను విడుదల చేసింది.*ఆయన పేరు సురేందర్‌రెడ్డి. రెండు నెలల క్రితం రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండల పంచాయతీ అధికారి(ఎంపీవో)గా ఉన్న సమయంలో విధులు సక్రమంగా నిర్వహించలేదన్న ఆరోపణలు వచ్చాయి. అనుమతిలేని నిర్మాణాలపై చర్యలు తీసుకోలేదనే ఆరోపణలూ రావడంతో డీపీవో విచారణ జరిపి సస్పెన్షన్‌ వేటు వేశారు. అయితే, ఇటీవల సస్పెన్షన్‌ ఎత్తివేయడంతో సంగారెడ్డి మండలంలో బుధవారం ఎంపీవోగా చేరడానికి సిద్ధమయ్యారు. ఇలాంటి సమయంలో మేడ్చల్‌ జిల్లా జవహర్‌నగర్‌లోని ఆయన ఇంట్లో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు బుధ, గురువారం సోదాలు నిర్వహించడం గమనార్హం. మొత్తం రూ.2,31,63,600 విలువైన అక్రమాస్తులను గుర్తించారు. రూ.43.79 లక్షల విలువ చేసే 4 ఓపెన్‌ ప్లాట్లు, రూ.8 లక్షల విలువైన వ్యవసాయ భూముల పత్రాలు, 190 తులాల బంగారం, రూ.4.22 లక్షల నగదును సీజ్‌ చేసినట్లు ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. బినామీలు, ఇతర వివరాలపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. సురేందర్‌రెడ్డిని అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు. తదుపరి విచారణ సాగిస్తున్నారు. సురేందర్‌రెడ్డి ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.20 కోట్ల మేరకు ఉంటుందని సమాచారం.

* కృష్ణా నదీ జలాల్లో సాగు నీటి వినియోగానికి సంబంధించిన వివాదంపై విచారణను బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ జూన్‌ 13, 14, 15వ తేదీలకు వాయిదా వేసింది. తెలంగాణ చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. నిజానికి, ఈ విచారణ మే 18, 19వ తేదీల్లో జరగాల్సి ఉంది. సాగు నీటి వినియోగంపై తెలంగాణ అఫిడవిట్‌ వేయగా. రాష్ట్రం తరపున ప్రొఫెసర్‌ పళినిస్వామి సాక్షిగా ఉన్నారు. కానీ పళినిస్వామి విచారణకు హాజరయ్యే పరిస్థితిలో లేనందున వాయిదా వేయాలని తెలంగాణ అభ్యర్థించింది. ఇక, శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల ఆపరేషన్‌ ప్రోటోకాల్‌, రూల్‌కర్వ్‌పై వేసిన మరో అఫిడవిట్‌లో సీడబ్ల్యూసీ మాజీ అధికారి చేతన్‌ పండిట్‌ సాక్షిగా ఉన్నారు. ఆయనను త్వరలోనే ట్రైబ్యునల్‌లో క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేయనున్నారు.

*అసాని తుఫాన్‌ ప్రభావంతో వీచిన ఈదురు గాలులు, భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. లేనిపక్షంలో ప్రజా ఉద్యమం తప్పదు’’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హెచ్చరించారు. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం, బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లి గ్రామంలో గురువారం ఆయన పర్యటించారు. తుఫాన్‌ ప్రభావంతో దెబ్బతిన్న అరటి తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా రామకృష్ణ విలేకరులతో మాట్లాడారు. ‘‘తుఫాన్‌ బాధితుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. పంట నష్టపోయి రైతాంగం బాధపడుతోంది. అయినా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్నింటా విఫలమయ్యారని విమర్శించారు. పంట నష్టపోయిన ప్రతి రైతుకూ ఎకరాకు రూ.లక్ష పరిహారం అందజేయాలని డిమాండ్‌ చేశారు. లేదంటే రైతులును సమీకరించి ప్రభుత్వంపై దండయాత్ర చేస్తామని హెచ్చరించారు.

*హిందూ మహాసముద్రంలో మేఘాల ప్రభావంతో ఈ నెల 15వ తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్‌ సముద్రంలోకి ప్రవేశిస్తాయని ఐఎండీ పేర్కొంది. సాధారణంగా అండమాన్‌ నికోబార్‌ దీవుల్లోకి మే 22న నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని, ఈ ఏడాది వారం ముందే ప్రవేశించనున్నాయని తెలిపింది.

*హిందూ మహాసముద్రంలో మేఘాల ప్రభావంతో ఈ నెల 15వ తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్‌ సముద్రంలోకి ప్రవేశిస్తాయని ఐఎండీ పేర్కొంది. సాధారణంగా అండమాన్‌ నికోబార్‌ దీవుల్లోకి మే 22న నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని, ఈ ఏడాది వారం ముందే ప్రవేశించనున్నాయని తెలిపింది.

* ప్రభుత్వ పథకాల ప్రచారానికి జగన్‌ ప్రభుత్వం తలపెట్టిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం అధికార పార్టీ నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇంటికొచ్చిన ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులను జనం ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. తమ సమస్యలు ఎప్పుడు పరిష్కరిస్తారని ప్రశ్నిస్తున్నారు. గురువారం అన్నమయ్య జిల్లా ఒంటిమిట్ట మండలం నరవకాటిపల్లెలో రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, జడ్పీ చైర్మన్‌ ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి అధికారులు, వైసీపీ నాయకులతో కలిసి పర్యటించారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తుండగా స్థానికంగా ఉన్న ఓ మహిళ కలుగజేసుకుంది. ‘మా వీధంతా బురదమయంగా ఉంది. రోడ్డు ఎప్పుడు వేస్తారు? నేను పేదరాలిని. కనీసం ఇల్లు కూడా లేదు. రోజూ అధికారుల చుట్టూ తిరిగినా ఏదో ఒక సాకుతో న్యాయం చేయడం లేదు’ అని గట్టిగా నిలదీసింది. వెంటనే స్థానికంగా ఉన్న నాయకులు, అధికారులు ఆమెను సముదాయించారు. సమస్యను పరిష్కరించాలని నాయకులు అధికారులకు చెప్పి వెళ్లిపోయారు.

*సాలార్ జంగ్ మ్యూజియంలో మే 16 నుంచి 21 వరకు అంతర్జాతీయ మ్యూజియం వారోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా మ్యూజియంలో ‘ వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సాలార్ జంగ్ మ్యూజియం డైరెక్టర్ డాక్టర్ నాగేందర్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మే 18న అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని నిర్వహిస్తున్నదని తెలిపారు. “మ్యూజియంల ప్రాధాన్యత” అనే ఇతివృత్తంతో అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్నినిర్వహిస్తామని అన్నారు. మ్యూజియంలు కేవలం సాంస్కృతిక వారసత్వ ప్రదర్శనశాలలు మాత్రమే కాదని ఆయన స్పష్టం చేశారు. గత చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలపై సందర్శకులకు విజ్ఞానం అందించే విద్యా కేంద్రాలుగా మ్యూజియంలు పనిచేస్తాయని ఆయన అన్నారు.అంతర్జాతీయ మ్యూజియం వారోత్సవాల సందర్భంగా నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమాలను డాక్టర్ నాగేందర్ రెడ్డి వివరించారు.

*ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యయమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్‌ భేటీ ముగిసింది. కేబినెట్ భేటీ అనంతరం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై విస్తృతంగా చర్చ జరిగింది.ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌.. ప్రజలకు ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను వివరించాలని ఆదేశించారు. అలాగే.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా కచ్చితంగా ప్రతీ ఇంటికి మంత్రి, ఎమ్మెల్యే వెళ్లాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను వివరిస్తే తక్షణమే పరిష్క రించాలని స్పష్టం చేశారు.

*కరోనా సమయంలో నర్సుల సేవలు వెల్లకట్టలేనివని ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ప్రపంచ నర్సుల దినోత్సవం సందర్భంగా గాంధీ మెడికల్‌ కాలేజీలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. హరీశ్‌ మాట్లాడుతూ త్వరలో 4,722 నర్సింగ్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇవ్వనున్నట్లు తెలిపారు. అనంతరం తెలంగాణలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న సీనియర్‌ నర్సులకు ప్రశంసాపత్రాలను మంత్రి అందజేశారు. కార్యక్రమంలో ఫ్యామిలీ వెల్ఫేర్‌ కమిషనర్‌ వాకాటి కరుణ, డీఎంఈ డాక్టర్‌ రమే్‌షరెడ్డి, డీఎంఓ శ్రీనివాస్‌, గాంధీ, ఉస్మానియా సూపరింటెండెంట్‌లు ప్రొఫెసర్‌ రాజారావు, నాగేందర్‌ పాల్గొన్నారు.

*వెస్ట్‌జోన్‌ పరిధిలో ఉన్న పోలీస్‌స్టేషన్‌లలో 60 శాతం మంది సిబ్బంది బీపీ, షుగర్‌, అధిక బరువుతో బాధపడుతున్నారని తెలిసిందని సీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు. కమిషనరేట్‌ పరిధిలో ఉన్న 17 వేల మంది సిబ్బందికి మాస్టర్‌ హెల్త్‌ చెకప్‌ చేయించేందుకు హెల్పింగ్‌ హ్యాండ్‌ ఆధ్వర్యంలో ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. కమిషనరేట్‌లో గురువారం ఇన్‌స్పెక్టర్‌, ఆపై స్థాయిలో ఉన్న అధికారులతో సీపీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆరోగ్యంపై పోలీసులు తగిన శ్రద్ధ చూపాలన్నారు. ఏసీపీ ఆపై స్థాయి అధికారి రోజూ సాయంత్రం 3 నుంచి 5 వరకు ఫిర్యాదులు స్వీకరించాలని, ఈ మేరకు నోటీస్‌ బోర్డ్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సివిల్‌ వివాదాల్లో తలదూర్చడం, గ్యాంబ్లింగ్‌ డెన్‌లపై కేసుల నమోదులో అలక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో అడిషనల్‌ సీపీలు శ్రీనివాస్‌, చౌహాన్‌, జాయింట్‌ సీపీలు రంగనాథ్‌, విశ్వప్రసాద్‌లతోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

*ఎన్నో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అన్నమయ్య కాలిబాటకు ఎట్టకేలకు మోక్షం లభించనుంది. ఈ కాలిబాట ఏర్పాటుకు ముఖ్యమంత్రి కార్యాలయం ఆమోదం తెలిపినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఇంజనీరింగ్‌ అధికారులకు ఉత్తర్వులు అందాయి. అన్నమయ్య కాలిబాట ఏర్పాటు కోసం జడ్పీ చైర్మన్‌ ఆకేపాటి అమరనాథరెడ్డి అనేక ఏళ్లుగా పాదయాత్ర చేస్తున్నారు. కాలిబాటను ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌కు నివేదించారు. ఈ మేరకు ఇటీవల టీటీడీ (TTD) కూడా ఆమోదముద్ర వేసింది. టీటీడీ చైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి ఇంజనీరింగ్‌ అధికారులతో కలిసి కుక్కలదొడ్డి నుంచి వెళ్లే కాలిబాటను పరిశీలించారు.

*వర్కింగ్‌ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఇండియన్‌ జర్నలిస్ట్స్‌ యూనియన్‌, ఏపీయూడబ్ల్యూజే నేతల బృందం రాజ్‌భవన్‌లో గురువారం గవర్నర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో అపరిష్కృతంగా ఉన్న పలు సమస్యలను యూనియన్‌ నేతలు గవర్నర్‌ దృష్టికి తీసుకువెళ్లారు. 15 అంశాలతో కూడిన వినతిపత్రాన్ని ఆయనకు అందజేశారు. జర్నలిస్టుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ యూనియన్‌ నేతలకు హామీ ఇచ్చారు. గవర్నర్‌ను కలిసిన వారిలో ఐజేయూ జాతీయ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు, జాతీయ కార్యవర్గ సభ్యుడు డి.సోమసుందర్‌, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఐ.వి.సుబ్బారావు, కె.జయరాజ్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చావా రవి తదితరులు ఉన్నారు.

* స్విట్జర్లాండ్‌లోని దావోస్‌ పర్యటన అనగానే ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడులు తెస్తారనే అభిప్రాయం ప్రజల్లో ఉందని పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్‌ అన్నారు. అయితే అది పెట్టుబడుల సదస్సు కాదని, ప్రపంచ వాణిజ్య సదస్సు అని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రత్యేకతలను, పెట్టుబడుల అవకాశాలను సదస్సులో వివరిస్తామని.. పెట్టుబడులు తెచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు. దావో్‌సలో ఈ నెల 22 నుంచి 26 వరకు నిర్వహించే 52వ ప్రపంచ వాణిజ్య సదస్సుకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి హాజరవుతారని తెలిపారు. ఆయన అధికారంలోకి వచ్చాక ఈ మూడేళ్లలో పెట్టుబడుల కోసం విదేశాలకు వెళ్లడం ఇదే తొలిసారి. పెట్టుబడుల ఆకర్షణ కోసం ఒక్క విదేశీ సదస్సుకూ హాజరు కాలేదన్న విమర్శలు రావడంతో ఆయన తొలిసారి దావోస్‌ సదస్సుకు వెళ్లనున్నారు. అక్కడ మూడు కీలక సమావేశాల్లో పాల్గొంటారని.. ఈ నెల 23న వైద్య రంగంపై, 24న విద్య, నైపుణ్య రంగాలపైన, అదే రోజు వికేంద్రీకృత ఆర్థిక వ్యవస్థ దిశగా మార్పుపై జరిగే సమావేశాల్లో పాలుపంచుకుంటారని అమర్నాథ్‌ చెప్పారు. దావోస్‌ పర్యటన వివరాలను ఆయన గురువారమిక్కడ ఏపీఐఐసీ కార్యాలయంలో వివరించారు. ప్రజలు, పురోగతి, అవకాశాలు అనే థీమ్‌తో ప్రపంచానికి రాష్ట్ర ప్రత్యేకతను చాటేలా లోగోను మంత్రి ఆవిష్కరించారు. సీఎం వెంట వెళ్లే అమర్నాథ్‌తోపాటు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, ఏపీఐఐసీ చైర్మన్‌ గోవిందరెడ్డి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్‌, ఏపీఐఐసీ ఎండీ సుబ్రమణ్యం జవ్వాది తదితరులు ఉంటారు.

*నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో కృషక్‌ భారతి కో-ఆపరేటివ్‌ లిమిటెడ్‌(క్రిబ్కో) ఆధ్వర్యంలో రెండు విడతల్లో బయో ఇథనాల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి(ఎ్‌సఐపీబీ) ఆమోదం తెలిపింది. రూ.560 కోట్లతో 250 కేఎల్‌డీ సామర్ధ్యంతో వంద ఎకరాల్లో ఏర్పాటుచేసే ఈ ప్లాంట్‌ ద్వారా 400 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ముఖ్యమంత్రి జగన్‌ అధ్యక్షతన గురువారమిక్కడ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఎస్‌ఐపీబీ సమావేశంలో ఈ పెట్టుబడుల ప్రతిపాదనను ఆమోదించారు. ఈ ప్లాంట్‌ ఏర్పాటుతో పాటు వివిధ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నట్లు సదరు కంపెనీ ప్రభుత్వానికి తెలిపింది. మరోవైపు.. ఇప్పుడున్న ఎగుమతులను ఐదేళ్లలో రెట్టింపు చేసేలా ఎగుమతి ప్రోత్సాహక విధానం (2022-27) ద్వారా మరిన్ని చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు.

*పదో తరగతి తెలుగు ప్రశ్నపత్రం లీకేజీ కేసులో అరెస్టయిన నిందితులు దాఖలు చేసుకున్న బెయిల్‌ పిటిషన్‌పై చిత్తూరులోని నాలుగో కోర్టులో గురువారం సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. వాదనలు విన్న న్యాయమూర్తి బెయిల్‌ పిటిషన్‌పై ఉత్తర్వులను శుక్రవారం వెల్లడించనున్నారు. ఈ కేసులో విద్యాశాఖ అదికారుల ఫిర్యాదుతో సీఐడీ పోలీసులు గిరిధర్‌రెడ్డి, సుధాకర్‌, మోహన్‌, అరీ్‌ఫబాషా, సురేశ్‌బాబు, పవన్‌కుమార్‌రెడ్డి, సోమును అరెస్టు చేశారు. వీరు బెయిల్‌ కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

*ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో భాగంగా గురువారం జరిగిన మ్యాథ్స్‌-ఎ పరీక్షలో 18 మంది విద్యార్థులు మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడ్డారు. వారందరినీ పరీక్షల నుంచి డిబార్‌ చేశారు. 4,86,165 మంది విద్యార్థులకు 4,65,747 విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా.. 20,148 మంది గైర్హాజరయ్యారు.

*ప్రభుత్వాసుపత్రులకు వచ్చే రోగులకు వైద్యసేవలందించడంలో ఏ మాత్రం అలసత్వం వద్దని ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు చెప్పారు. గురువారం ఆయన జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సేవలపై ఫిర్యాదులు స్వీకరించేందుకు అనుగుణంగా 104 కాల్‌సెంటర్‌ను మరింత బలోపేతం చేస్తామన్నారు. ఆరోగ్యశ్రీ సేవల్లో అలసత్వం, డ్రైవర్ల ప్రవర్తన, డబ్బులు డిమాండ్‌ చేయడం, వాహనాలు అందుబాటులో లేకపోవడం వంటి వాటిపై 104కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. బాధితుల ఫిర్యాదులపై వెంటనే సమగ్ర విచారణ జరిపి, మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తామన్నారు. కొవిడ్‌కు సంబంధించిన పెండింగ్‌ బిల్లులన్నింటినీ ఈ నెల 25లోగా పంపించాలని, ఆలస్యమైతే సంబంధిత అధికారులే బాధ్యత వహించాలన్నారు. ప్రభుత్వాస్పత్రులకు మందుల కోనుగోలు కోసం ప్రభుత్వం రూ.650 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. ఆస్పత్రుల్లో ఏ చిన్న సంఘటన జరిగినా కలెక్టర్లు వెంటనే స్పందించాలన్నారు. జిల్లా, బోధనాసుపత్రులతోపాటు ఇతర అన్ని ప్రభుత్వాస్పత్రులకు కూడా మహాప్రస్థానం సేవల్ని విస్తరిస్తామని తెలిపారు. జిల్లాల్లో క్యాడర్‌ వారీగా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి ప్రతినెలా శిక్షణ ఇవ్వాలని, శానిటేషన్‌, సెక్యూరిటీ సిబ్బందికి సమయానికి జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

*తాడికొండలోని ఆంధ్రప్రదేశ్‌ గురుకుల పాఠశాలలో 2022-23 విద్యా సంవత్సరానికి 5వ తరగతి ఇంగ్లీష్‌ మీడియంలో చేరుటకు అర్హులైన బాలుర నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్‌ డీపీవీఎ్‌సఆర్‌. లక్ష్మి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాల కోసం 9866559633, 9703329594 నెంబర్లను సంప్రతించాలన్నారు.

*గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు వచ్చే నెలలో ప్రొబేషన్‌ను ఖరారు చేసి కొత్త పేస్కేలు అమలు చేస్తామని సచివాలయ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు అజయ్‌జైన్‌ హామీ ఇచ్చినట్లు ఆంధ్రప్రదేశ్‌ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాస్‌, పోతురాజు తెలిపారు. గురువారం సంఘం నాయకులు అజయ్‌జైన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

*కుప్పంలో చంద్రబాబు సొంత ఇల్లు నిర్మించుకుంటే చూడాలన్న నియోజకవర్గ ప్రజల కల త్వరలోనే తీరనుంది. దీనికి అవసరమైన స్థలం రిజిస్ట్రేషన్‌కోసం సంబంధిత పత్రాలపై ఆయన సంతకం కూడా అయిపోయింది. పార్టీ వర్గాలనుంచి సేకరించిన వివరాల ప్రకారం.. కుప్పం-పలమనేరు జాతీయ రహదారి సమీపంలో శాంతిపురం మండల పరిధిలోని కడపల్లె, కనమలదొడ్డి గ్రామాల మధ్య శివపురం ఎదురుగా 2.10 ఎకరాల స్థలాన్ని చంద్రబాబు సొంత ఇంటి నిర్మాణం కోసం కొనాలని నిర్ణయించారు. కుప్పం పర్యటనకు వచ్చిన చంద్రబాబు గురువారం ఉదయం ఆ స్థలం రిజిస్ట్రేషన్‌ పత్రాలపై సంతకాలు చేసి వేలిముద్రలు వేశారు. ఈనెల 29న స్థలానికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. జూన్‌ 5న చంద్రబాబు, తన సతీమణి భువనేశ్వరితో కుప్పం వచ్చి ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. ఇక్కడ గృహంతోపాటు పార్టీ సమావేశాల కోసం ప్రత్యేకంగా కార్యాలయ భవనం కూడా నిర్మించనున్నారు.

* సంక్షేమ కేలండర్‌, సాగునీటి విడుదలకు సంబంధించిన ప్రణాళికలను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ నెల 16న రైతు భరోసా…జూన్‌ 21వ తేదీన అమ్మ ఒడి ఇస్తామని ప్రకటించింది. అదేవిధంగా సాగునీటి విడుదలను ఏ డెల్టాకు ఎప్పుడు విడుదల చేస్తామన్నదీ చెప్పింది. గురువారం వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు, జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, వ్యవసాయ శాఖమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. చెల్లుబోయిన వేణు మాట్లాడుతూ… .సంక్షేమా నికి క్యాలండర్‌ ప్రకటించిన తొలి పాలకుడు జగన్‌. శుక్రవారం సీఎం ముమ్మిడివరంలో మత్స్యకార భరోసా పథకం ద్వారా నిధులు విడుదల చేస్తారు. ఈ నెల 16న రైతు భరోసా పథకంలో భాగంగా రూ.5,500 ఖాతాల్లో వేస్తారు. ఇదే పథకం కింద ప్రధానమంత్రి కిసాన్‌ యోజన కింద వచ్చే రూ.2వేలు ఈ నెల 31వ తేదీన వేస్తాం. 19న పశువుల కోసం అంబులెన్స్‌లు ప్రారంభిస్తాం. జూన్‌ 6వ తేదీన 3వేల ట్రాక్టర్లు, 4,200హార్వెస్టర్ల పంపిణీ చేస్తాం. జూన్‌ 14న వైఎస్సార్‌ పంటల బీమా ద్వారా 2021ఖరీఫ్‌ సీజన్‌లో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అంది స్తాం. జూన్‌ 21వ తేదీన అమ్మ ఒడి తల్లుల ఖాతాల్లో వేస్తాం’’ అని పేర్కొ న్నారు. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని నాణ్యతతో చేయా లని సీఎం చెప్పారని, వైసీపీ ఎమ్మెల్యేలు లేనిచోట్ల ప్రభుత్వ సిబ్బంది, పార్టీ కార్యకర్తలు కలిసి ఈ కార్యక్రమం చేస్తారని చెల్లుబోయిన తెలిపారు.

*కరోనా సమయంలో నర్సుల సేవలు వెల్లకట్టలేనివని ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు (Health Minister) అన్నారు. ప్రపంచ నర్సుల దినోత్సవం సందర్భంగా గాంధీ మెడికల్‌ కాలేజీలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. హరీశ్‌ మాట్లాడుతూ త్వరలో 4,722 నర్సింగ్‌ ఉద్యోగాలకు (Nursing) నోటిఫికేషన్‌ ఇవ్వనున్నట్లు తెలిపారు. అనంతరం తెలంగాణలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న సీనియర్‌ నర్సులకు ప్రశంసాపత్రాలను మంత్రి అందజేశారు. కార్యక్రమంలో ఫ్యామిలీ వెల్ఫేర్‌ కమిషనర్‌ వాకాటి కరుణ, డీఎంఈ డాక్టర్‌ రమే్‌షరెడ్డి, డీఎంఓ శ్రీనివాస్‌, గాంధీ, ఉస్మానియా సూపరింటెండెంట్‌లు ప్రొఫెసర్‌ రాజారావు, నాగేందర్‌ పాల్గొన్నారు.

*బుద్గాం జిల్లా పర్యటనకు బయలుదేరడానికి ముందే తనను ప్రభుత్వాధికారులు గృహనిర్బంధం చేశారని పీడీపీ అధక్షురాలు, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ముఫ్తీ శుక్రవారం తెలిపారు.Budgam జిల్లా ఛదూర ప్రాంతంలోఒకరని అతని కార్యాలయం వద్దే ఉగ్రవాదులు గురువారం కాల్చిచంపిన ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. కశ్మీర్ పండిట్ కుటుంబానికి సంఘీభావం తెలిపేందుకు తాను బుద్గాం వెళ్లాలనుకున్నానని, అయితే తనను శ్రీనగర్ నివాసం నుంచి బయటకు అధికారులు వెళ్లనీయలేదని మెహబూబా ముఫ్తీ తాజాగా ట్వీట్ చేశారు. కశ్మీర్ పండిట్లకు రక్షణ కల్పించడంలో భారత ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.దీనికి ముందు గురువారంనాడు ఒక ట్వీట్‌లో కశ్మీర్ పండిట్ హత్యను మెహబూబా ముఫ్తీ ఖండించారు. ”మరో జీవితం బలైపోయింది. మరో కుటుబం అతలాకుతలమైంది. బాధిత కుటుంబ సభ్యులను తలుచుకుని నా మనసెంతో ఆవేదనతో నిండిపోయింది. కశ్మీర్‌లో ప్రశాంత పరిస్థితి నెలకొందనే తప్పుడు వాదనల్లో నిజం లేదని రుజువైంది” అని ఆమె అన్నారు. కాగా, ఉగ్రవాదుల చేతులో హతమైన కశ్మీర్ పండిట్ రాహుల్ భట్ అంత్యక్రియలను జమ్మూ కశ్మీర్ పండిట్ల నిరసనలు, ఆందోళనల మధ్య నిర్వహించారు. భట్‌కు 2011-12లో మైగ్రెంట్ స్పెషల్ ఎంప్లాయిమెంట్ ప్యాకేజీ కింద గుమాస్తా ఉద్యోగం లభించింది.

* వైకాపా ప్రభుత్వ కక్ష సాధింపు చర్యల వల్లే సర్పవరం ఎస్‌ఐ ఆత్మహత్య చేసుకున్నారని తెదేపా నేత లోకేశ్‌ మండిపడ్డారు. నిజాయతీగా పనిచేసే పోలీసు అధికారిని బలి తీసుకున్నారని మండిపడ్డారు.ప్రతిపక్షాలు, ప్రజలు అయిపోయారు ఇప్పుడు పోలీసుల వంతు వచ్చింది. నిజాయితీగా పనిచేసే ఒక పోలీసు అధికారిని కక్ష సాధింపు చర్యలతో బలితీసుకుంది వైసిపి ప్రభుత్వం. కాకినాడ జిల్లా సర్పవరం ఎస్ఐ గోపాల‌కృష్ణ‌ని వెంటాడి వేధించి చంపేశార‌ని అనుమానాలున్నాయి.జాయితీగా పనిచేసే ఒక పోలీసు అధికారిని కక్ష సాధింపు చర్యలతో వైకాపా ప్రభుత్వం బలితీసుకుందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. కాకినాడ జిల్లా సర్పవరం ఎస్ఐ గోపాల‌కృష్ణని వెంటాడి వేధించి చంపేశార‌ని ఆరోపించారు. ‘ప్రతిపక్షాలు, ప్రజలు అయిపోయారు. ఇప్పుడు పోలీసుల వంతు వచ్చింది’ అని ట్వీటర్ వేదికగా మండిపడ్డారు. క‌క్ష సాధింపుల వ‌ల్లే గోపాల‌కృష్ణ మ‌ర‌ణించ‌గా.., సాటి పోలీసులే క‌ట్టుక‌థ‌లు అల్లటం విచార‌క‌రమన్నారు.ఎస్ఐ అనుమానాస్పద మృతిపై న్యాయ‌విచార‌ణ జ‌రపాలని డిమాండ్‌ చేశారు. దోషులు ఎవ‌రైనా క‌ఠినంగా శిక్షించాలన్నారు. మృతిచెందిన గోపాల‌కృష్ణ కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు. చ‌నిపోయింది తమవాడు కాద‌నుకునే పోలీసుల వ‌ర‌కూ ఈ క‌క్ష సాధింపులు వ‌స్తాయని.., అప్పుడు వారి వైపు ఎవ‌రూ ఉండ‌రని లోకేశ్‌ అన్నారు.

* అధికార, వ్యక్తిగత పర్యటనలో భాగంగా సీఎం జగన్ ఈనెల 20 నుంచి 10 రోజుల పాటు విదేశాలకు వెళ్లనున్నారు. దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరు కానున్న సీఎం..సదస్సు అనంతరం వ్యక్తిగత పర్యటనలో ఉండనున్నారు.ఈ నెల 20 నుంచి 31 వరకూ ముఖ్యమంత్రి జగన్ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. అధికారిక, వ్యక్తిగత పర్యటనల నిమిత్తం 10 రోజుల పాటు ఆయన విదేశాల్లో గడపనున్నారు. ఈనెల 20న కుటుంబంతో సహా సీఎం జగన్ స్విట్జర్లాండ్ వెళ్లనున్నారు. మే 22, 23, 24 తేదీల్లో దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు సీఎం హాజరవుతారు. పలు విదేశీ కార్పోరేట్ సంస్థలకు చెందిన ప్రతినిధులతో సమావేశం కానున్నారు. సదస్సులో ఏపీ పెవిలియన్ నిర్వహించే కార్యక్రమాలకూ జగన్ హాజరు కానున్నట్లు సీఎంవో వెల్లడించింది. అనంతరం మే 25 నుంచి జగన్ వ్యక్తిగత పర్యటనలో ఉండనున్నారు