Politics

‘వైకాపా ఎమ్మెల్యేలతో వాలంటీర్లు తప్ప కార్యకర్తలెవరూ లేరు’- TNI రాజకీయ వార్తలు

‘వైకాపా ఎమ్మెల్యేలతో వాలంటీర్లు తప్ప కార్యకర్తలెవరూ లేరు’- TNI రాజకీయ వార్తలు

* తెలుగుదేశం పార్టీలో పదవులు అనుభవించిన వారంతా.. కార్యకర్తలను పట్టించుకోవడం లేదని జేసీ ప్రభాకర్రెడ్డి అన్నారు. తెదేపా నేతలందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయగలమని జేసీ ప్రభాకర్రెడ్డి అన్నారు. వైకాపా కార్యకర్తలకు దూరమైనా.. వాలంటీర్లను తయారు చేసుకున్నారని.. తెదేపాకు అలాంటి పరిస్థితి లేదన్నారు.వైకాపా ఎమ్మెల్యేలు, ఎంపీలు కార్యకర్తలను గాలికొదిలేశారని తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి అన్నారు. గడపగడపకు కార్యక్రమంలో వార్డు వాలంటీర్లు తప్ప.. ఒక్క కార్యకర్త కూడా ఎమ్మెల్యేల వెంటలేరని ఆయన ఆరోపించారు. పార్టీని అధికారంలోకి తెచ్చిన కార్యకర్తల కంటే వాలంటీర్లే వైకాపా ఎమ్మెల్యేలకు ఎక్కువయ్యారని చెప్పారు. తెలుగుదేశం పార్టీలో పదవులు అనుభవించిన వారంతా కార్యకర్తలను పట్టించుకోవటం లేదన్నారు. చంద్రబాబు త్యాగాలు చేయాలని ఓవైపు చెబుతున్నప్పటికీ.. తమ నాయకులు సిద్ధం కాలేదన్నారు. తెదేపా కార్యకర్తలను జైళ్లకు పంపుతుంటే కూడా తమ పార్టీ నాయకులు కనీసం స్పందించటం లేదని అందుకే తమ పార్టీ మాదిరిగానే వైకాపా కూడా తయారైందన్నారు. వైకాపా… కార్యకర్తలకు దూరమైనా.. వాలంటీర్లను తయారు చేసుకున్నారని, తెదేపాకు అలాంటి పరిస్థితిలేదన్నారు. అందరం కలిసికట్టుగా పనిచేస్తేనే చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయగలమని జేసీ ప్రభాకర్రెడ్డి హితవు పలికారు.

*దుష్టచతుష్టయం ఎవరో రాష్ట్ర ప్రజలకి తెలుసు – మాజీ మంత్రి సోమిరెడ్డి
దేశంలో అంటరాని పార్టీ ఏదైనా ఉందంటే అది వైకాపానేనని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు దుష్టచతుష్టయం ఎవరో తెలుసని మండిపడ్డారు. దేశంలో అంటరాని పార్టీ ఏదైనా ఉందంటే అది వైకాపానేనని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబును ఉద్దేశించి సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. తాము ఎవరితో కలిస్తే జగన్ కి వచ్చిన నష్టమేంటని ఆయన నిలదీశారు. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎవరితో కలిసారో జగన్ మర్చిపోయారా అని ప్రశ్నించారు. జగన్ చెప్పే అబద్ధాలు ప్రజలు విశ్వసించరని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలందరికీ దుష్టచతుష్టయం ఎవరో తెలుసని అన్నారు. రాష్ట్రంలో రోడ్లు పరిస్థితి చూసి ప్రజలు భయపడుతున్నారన్నారు. వైకాపా పాలన మూడేళ్లలో ఏం ఒరగపెట్టారని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మండిపడ్డారు.

*మున్సిపాలిటీల్లో త్వ‌ర‌లోనే నియామ‌కాలు చేప‌డుతాం : మంత్రి కేటీఆర్
త్వరలో మున్సిపాలిటీల్లో సిబ్బంది కొరతను అధిగమించేందుకు నియామ‌కాల‌ ప్రాసెస్‌ని పూర్తి చేస్తామ‌ని ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్ర‌క‌టించారు. పురపాలికల్లో వార్డ్ ఆఫీసర్ల వ్యవస్థ, ఇందుకు సంబంధించిన సిబ్బంది నియామకం త్వరలో పూర్తి అవుతుంద‌న్నారు. న‌గ‌రంలోని వెంగ‌ళ్రావున‌గ‌ర్‌లో నిర్వ‌హించిన ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మంపై మేయ‌ర్లు, చైర్మ‌న్ల‌కు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి ప్ర‌తి ప‌ట్ట‌ణంలో మోడ‌ల్ మార్కెట్లు, డిజిట‌ల్ డోర్ నంబ‌రింగ్, ఆధునిక దోబీ ఘాట్‌లు, మాన‌వ వ్య‌ర్థాల శుద్ధి, నిర్వ‌హ‌ణ ప్లాంట్, మోడ‌ల్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు, వైకుంఠ‌ధామాలు, ప్ర‌తి ఇంటికి న‌ల్లా క‌నెక్ష‌న్, బ‌యో మైనింగ్ వంటి ల‌క్ష్యాల‌ను పురపాలికలు సాధించాలన్నారు.రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నిర్దేశించిన హరితహారానికి సంబంధించిన లక్ష్యాలను పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ప్రభుత్వం చట్టప్రకారం నిర్దేశించిన టీఎస్ బీపాస్ ప్రకారం 21 రోజుల్లోనే అనుమ‌తులు ఇచ్చేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. ఈ విషయంలో అధికారులు కానీ, ప్ర‌జాప్ర‌తినిధులు కానీ అవకతవకలకు పాల్పడితే, చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్ప‌వ‌ని కేటీఆర్ హెచ్చ‌రించారు. ఇప్పటికే పట్టణాలకు సంబంధించిన అభివృద్ధి విషయంలో అద్భుతమైన ప్రగతి కార్యక్రమాల నేపథ్యంలో ప్రతి పురపాలిక తన ప్రగతి ప్రస్థానం పైన ఒక నివేదికను సిద్ధం చేయాలని సూచించారు. జూన్ 2వ తేదీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాటికి ప్రతి పురపాలికల్లో చేపట్టిన అభివృద్ధిని నగర పౌరుల ముందు ఉంచేలా చర్యలు తీసుకోవాల‌ని కేటీఆర్ చెప్పారు

*రేప్‌ల రాజ్యంగా ఏపీ మారింది: Pratibha bharathi
రాష్ట్రంలో ప్రతీ రోజు మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై మాజీ స్పీకర్ ప్రతిభా భారతి స్పందించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రంలో ఉదయం ఒకరేప్, మధ్యాహ్నం ఒక రేప్, సాయంత్రం ఒక రేప్ ఇలా రేప్‌ల రాజ్యంగా రాష్ట్రం మారిందన్నారు. సీఎం జగన్(Jagan) ఇంటి పక్కనే మహిళపై అఘాయిత్యం జరిగితే పట్టించుకునే నాధుడు లేడని మండిపడ్డారు. రాష్ట్రంలో కీచకులు, కిరాతకులు అధికమయ్యారని, వారికి భయమనేది లేదన్నారు. మహిళలను వేధించే ప్రభుత్వమిది అంటూ విమర్శించారు. పోలీసుల లెక్క ప్రకారం రాష్ట్రంలో 2 లక్షల పైచిలుకు మహిళా అఘాయిత్య కేసులు నమోదయ్యాయని మాజీ స్పీకర్ తెలిపారు. అధికార పార్టీ అండదండలతోనే అఘాయిత్యాలు జరుగుతున్నాయన్నారు. తల్లిదండ్రులు పిల్లల్ని బయటికి పంపాలంటే భయపడుతున్నారని అన్నారు. ఆడబిడ్డల మానప్రాణాలు పోతున్నా ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలస్ వదలరని ఆగ్రహం వ్యక్తం చేశారు. హోమ్ మంత్రికి పరిపాలనలో అనుభవ రాహిత్యముందన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో రాక్షస రాజ్యం నడుస్తోందని తెలిపారు. మహిళా సాధికారత అనే నినాదంతో నారా చంద్రబాబు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారని ప్రతిభా భారతి చెప్పుకొచ్చారు

*టీ హబ్‌లో 3డీ ప్రింటింగ్ ప్రత్యేక ల్యాబ్
టీ హబ్‌లో 3డీ ప్రింటింగ్ ప్రత్యేక ల్యాబ్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్(KTR) తెలిపారు. శుక్రవారం నగరంలోని హెచ్ఐసీసీలో మెడికల్ డివైజెస్, ఇంప్లాంట్స్ 3డీ ప్రింటింగ్‌పై నిర్వహించిన సదస్సులో మంత్రి పాల్గొని ప్రసంగించారు. టీ వర్క్స్ ద్వారా ఇప్పటికే అనేక రకాల ప్రోటోటైప్స్ రూపొందిస్తున్నామని అన్నారు. 3డీ ప్రింటింగ్ ఆరోగ్య విభాగంలో చాలా ఉపయోగపడుతుందన్నారు. ఆర్థోపెడిక్, డెంటల్ విభాగాల్లో 3డీ ప్రింటింగ్ కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

*కేసీఆర్ ప్రభుత్వం ప్రజల్లో పలచబడింది: Etela
కేసీఆర్ ప్రభుత్వం ప్రజల్లో పలచబడిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శలు గుప్పించారు. కేంద్ర మంత్రి అమిత్ షా సభా ప్రాంగణాన్ని శుక్రవారం ఉదయం బీజేపీ నేతలతో కలసి ఈటల పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… ప్రజాస్వామ్యాన్ని మరిచి రాజ్యం మాదిరిగా కేసీఆర్ పాలిస్తున్నారని మండిపడ్డారు. కుట్రలు కుతంత్రాలతో కేసీఆర్ పాలనా సాగుతోందన్నారు. కేసీఆర్ నియంతృత్వ పాలన అంతం చేయటానికే బండి సంజయ్ పాదయాత్ర అని చెప్పుకొచ్చారు. పాదయాత్ర ముగింపు సభకు అమిత్ షా ముఖ్య అతిథిగా వస్తున్నారని తెలిపారు. కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఎలా మాటలు చెప్తున్నారని ప్రశ్నించారు. ప్రధానమంత్రిని కూడా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు అహంకారం పెరిగిందని, సర్కార్‌పై ప్రజలు కన్నెర్ర చేస్తున్నారని ఈటెల రాజేందర్ అన్నారు

*వాయిదాల పర్వంగా ‘విద్యాదీవెన’
విద్యాదీవెన ఒక బూటకమని ఏపీ బీజేపీ నాయకుడు (AP BJP LEADER) దినకర్ ఒక ప్రకటనలో ఆరోపించారు. ఈ పథకం వాయిదాల పర్వంగా కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. అసమర్థ (AP.GOVT)రాష్ట్ర ప్రభుత్వం వల్లే కళాశాలల్లో ఫీజుల చెల్లింపు ఆలస్యం కావడం వల్ల పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాదీవెన పథకానికి సంబంధించి మీడియాలో వస్తున్న ప్రకటనలకు, వాస్తవ పరిస్థితులకు చాలా వ్యత్యాసం ఉందని దినకర్ పేర్కొన్నారు.

*మీటర్లు బిగించాలన్న ప్రభుత్వ నిర్ణయం దురదృష్టకరం
వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించడం దురదృష్టకరమని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి(Tulasi reddy) అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ… ఇది రైతు వ్యతిరేక నిర్ణయమన్నారు. పంపు సెట్లకు మీటర్లు బిగించడం రైతుల మెడలకు ఉరి తాళ్లు బిగించడం ఒకటే అని వ్యాఖ్యానించారు. ఇది ఉచిత విద్యుత్ పథకాన్ని ఎత్తివేసే పన్నాగమని మండిపడ్డారు. ఉచిత విద్యుత్ పథకం కాంగ్రెస్ పార్టీ మానస పుత్రిక అని తెలిపారు. మీటర్లు బిగిస్తే రైతుల ఆత్మహత్యలు పెరుగుతాయన్నారు. మీటర్లు బిగించే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు.

*కేసీఆర్‌ అవినీతిపై అమిత్‌ షాకు ఫిర్యాదు: కేఏ పాల్‌
తెలంగాణలో సీఎం కేసీఆర్‌ అవినీతి, తనపై జరిగిన దాడి గురించి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాకు ఫిర్యాదు చేసినట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ వెల్లడించారు. గురువారం ఆయన ఢిల్లీలో కేంద్ర మంత్రి షాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణలో జరుగుతున్న అవినీతి, అన్యాయం, అక్రమాలను తన జీవితంలో ఎన్నడూ చూడలేదని తెలిపారు. సీఎం కేసీఆర్‌ తనపై దాడి చేయించారని, దాని పరిణామాలు త్వరలో చూస్తారని హెచ్చరించారు. తనపై జరిగిన దాడిని అమిత్‌ షా ఖండించారని అన్నారు. రాష్ట్రంలో లక్షల కోట్ల రూపాయలు మాయమయ్యాయని తెలిపారు. తెలంగాణ డీజీపీ తనకు సమయం ఇవ్వలేదని, కానీ కేంద్ర హోం మంత్రి అడగ్గానే సమయం ఇచ్చారని తెలిపారు. ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు తనకు ఇచ్చే గౌరవాన్ని అందరూ చూడాలన్నారు. కాగా… దేశం శ్రీలంకలా మారుతుందని పాల్‌ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ అప్పు రూ.8 లక్షల కోట్లు, తెలంగాణ అప్పు రూ.4.5లక్షల కోట్లకు చేరిందన్నారు. ప్రజాశాంతి పార్టీ తెలుగు రాష్ట్రాల్లో అన్ని చోట్లా పోటీ చేస్తుందని ప్రకటించారు. కేంద్ర మంత్రి పురుషోత్తమ్‌ రూపాలాను కూడా కలిసి తెలంగాణ పరిస్థితులపై కేఏ పాల్‌ చర్చించారు.

*వెయ్యి కోట్ల ఆస్తులున్న టీఆర్‌ఎస్‌ ఎకరం భూమి కొనుక్కోలేదా?: ప్రవీణ్‌కుమార్‌
వెయ్యికోట్ల రూపాయల ఆస్తులున్న టీఆర్‌ఎస్‌ పార్టీ ఎకరం భూమి కొనుక్కోలేదా? అని బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌ మండిపడ్డారు. ‘ఏం వెలగబెట్టిండ్రని మీకు నగరంలో వందల కోట్ల విలువైన భూమి ఫ్రీగా ఇయ్యాలె?’ అని ట్విట్టర్‌ వేదికగా నిలదీశారు. ప్రత్యేకంగా జీవో జారీ చేయాల్సిన అసాధారణ పరిస్థితిలేమిటో చెప్పాలని సీఎ్‌స సోమేశ్‌ కుమార్‌ను ప్రశ్నించారు. సర్కారు భూమిని సీఎస్‌.. టీఆర్‌ఎస్‌కు ధారాదత్తం చేస్తున్నారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ మండిపడ్డారు. గురువారం గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌కు కూతవేటు దూరంలో మళ్లీ అదే పార్టీకి వంద కోట్ల భూమిని… ఎందుకు ఇచ్చారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో అన్ని పార్టీలను కలుపుకొని ఉద్యమిస్తామన్నారు.

*సీఎం కాన్వాయ్ కు కార్లు పెట్టుకోలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం:చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో వ్యవస్థల పతనం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ముఖ్యమంత్రి కాన్వాయ్‌కు కార్లు పెట్టిన వారికి బిల్లులు చెల్లించకపోవడం రాష్ట్ర దుస్థితికి నిదర్శనమన్నారు.సీఎం, మంత్రులు, ప్రముఖుల కాన్వాయ్‌లకు కార్లు పెట్టిన వారికి రూ.17.5 కోట్ల బకాయిలను మూడేళ్లుగా ప్రభుత్వం బాకీ పడిన వైనంపై చంద్రబాబు స్పందించారు. చిత్తూరు జిల్లా కుప్పంలో రెండో రోజు పర్యటనలో ఉన్న చంద్రబాబు ప్రజలనుద్దేశించి మాట్లాడారు. కనీసం సీఎం కాన్వాయ్‌కు కార్లు కూడా పెట్టుకోలేని స్థితిలో రాష్ట్రం ఉండడం అవమానకరం అని మండిపడ్డారు. ఈ మొత్తం అంశాన్ని ఒక శాఖలో పెండింగ్ బిల్లుల అంశంగా మాత్రమే చూడకూడదని.. ఇది రాష్ట్ర ఆర్థిక నిర్వహణకు, వ్యవస్థల ధ్వంసానికి అద్దం పడుతోందని చెప్పారు. ఇలాంటి ఘటనలు రాష్ట్ర బ్రాండ్‌ ఇమేజ్‌ను దారుణంగా దెబ్బ తీస్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.”మూడేళ్లుగా బిల్లులు చెల్లించకపోతే అధికారులు ఎలా కార్లు ఏర్పాటు చేశారు? బిల్లులు రాక వాహనాల యజమానులు పడే బాధలకు ఎవరు బాధ్యత వహిస్తారు? వ్యవస్థల నిర్వీర్యంతో అధికారులు, ఉద్యోగులు కూడా తీవ్ర ఒత్తిడికి లోనై తప్పులు చేసే పరిస్థితి వచ్చింది. ఒంగోలులో వాహనదారుడి కారును సీఎం కాన్వాయ్ కోసం తీసుకెళ్లడం వ్యవస్థ తెచ్చిన అవస్థ తప్పా మరొక్కటి కాదు. బాధ్యత లేని ప్రభుత్వం, పాలన తెలియని సీఎం ఇలాంటి ఘటనలు జరగడానికి కారణం. పాలకుల వైఫల్యాలు అటు ప్రజలతో పాటు అధికారులు, ఉద్యోగులకు కూడా శాపంలా మారుతున్నాయి. అసలు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన అప్పులు ఎంత?పెండింగ్‌లో ఉన్న బిల్లులు ఎంత? అనే అంశంపై శ్వేతపత్రం విడుదల చేయాలి” అని చంద్రబాబు డిమాండ్ చేశారు.

*రాజ్యసభకు కిల్లి కృపారాణి!
రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ తరఫున బరిలో నిలిచే అభ్యర్థులు దాదాపు ఖరారయ్యారు. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణికి వైసీపీ తరఫున అవకాశమివ్వాలని సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నిర్ణయించారు. అలాగే వైసీపీపీ నేత విజయసాయిరెడ్డిని రెండోసారి కూడా పార్లమెంటు ఎగువ సభకు పంపనున్నారు. అదేవిధంగా ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీకి గానీ లేదంటే ఆయన భార్య ప్రీతి అదానీకి గానీ టికెట్‌ ఇవ్వాలని ఇదివరకే నిశ్చయించినట్లు సమాచారం. అయితే మహిళ కోటాలో కృపారాణిని పంపుతున్నందున గౌతమ్‌ అదానీకే అవకాశం లభిస్తుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇక సార్వత్రిక ఎన్నికల తర్వాత టీడీపీ నుంచి వైసీపీలో చేరిన బీద మస్తాన్‌రావుకు బీసీ కోటా రాజ్యసభ సీటివ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైన నేపథ్యంలో.. అభ్యర్థుల పేర్లను ముఖ్యమంత్రి ఖరారు చేశారని.. ఒకట్రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటిస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

*కాంబాబు బర్తరఫ్‌ ఖాయం: అయ్యన్న
‘‘మహిళా జర్నలిస్టుపై లైంగిక వేధింపులకు పాల్పడిన కాంబాబు బూతుపురాణం సీఎంతో సహా సంబంధిత వ్యవస్థలకు చేరింది. త్వరలో కాంబాబు బర్తరఫ్‌ ఖాయం’’ అని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు గురువారం ట్వీట్‌ చేశారు. ‘‘సార్‌… మీ ఇంటర్వ్యూ కావాలి అంటూ కాంబాబుకి వాట్సా్‌పలో మెసేజ్‌ చేసింది యూట్యూబ్‌ చానల్‌ యాంకర్‌. ఇంటర్వ్యూ ఇస్తా, నాకేం ఇస్తావ్‌? అంటూ రిప్లై ఇచ్చాడు కాంబాబు. అక్కడితో ఆ వ్యవహారం ఆగలేదు. త్వరలో ఆ వివరాలు ప్రపంచానికి’’ అని అయ్యన్న ట్వీట్‌ చేశారు.

*అఘాయిత్యాలు లేని రోజు లేదు: అనిత
‘‘ఆడబిడ్డలపై అఘాయిత్యాలు జరగకుండా రాష్ట్రంలో రోజు గడవడం లేదు. ఇదేమిటని ప్రశ్నిస్తే ప్రతిపక్షాలను బూతులు తిట్టి ముఖ్యమంత్రి ఇంట్లో పడుకొంటున్నారు. తన పనితీరుపై ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ఆత్మ విమర్శ చేసుకోవాలి’’ అని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. గురువారం ఆమె ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ‘‘అనేక సంఘటనలు పదేపదే జరుగుతున్నా వైసీపీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. సమాజంలో జరుగుతున్న ఘోరాలను ప్రశ్నిస్తే అది యాగీ అవుతుందా? ముఖ్యమంత్రి స్పృహలో ఉండే మాట్లాడుతున్నారా? గడప గడపకూ తిరుగుతున్న వైసీపీ నేతలు అఘాయిత్యాలకు గురైన ఆడబిడ్డల ఇళ్లకెళ్లి ఎందుకు పరామర్శించరు?’’ అని అనిత ప్రశ్నించారు.

* ‘మూడోసారీ నేనే ప్రధాని’… క్లారిటీ ఇచ్చిన మోదీ!
రెండుసార్లు ప్రధానమంత్రి పదవి చేపడితే అంతా అయిపోయినట్లు కాదని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ప్రధాని పదవిలో కొనసాగడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి పదవిలో కొనసాగడంపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు విశ్రాంతి తీసుకోవాలన్న ఉద్దేశం అసలే లేదని వ్యాఖ్యానించారు. రెండుసార్లు ప్రధాని పదవి చేపడితే అంతా అయిపోయినట్లు కాదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఓ విపక్ష నాయకుడి మాటలను గుర్తు చేసుకున్నారు. గుజరాత్ ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం పొందుతున్న వృద్ధులు, వితంతువులు, పేద ప్రజలతో మోదీ వర్చువల్గా ముచ్చటించారు. ఈ సందర్భంగా తాజా వ్యాఖ్యలు చేశారు.”ఒకరోజు ఓ సీనియర్ రాజకీయ నాయకుడు నన్ను కలిశారు. రాజకీయంగా నన్ను ఆయన తరచుగా విమర్శిస్తుంటారు. కానీ నేను ఆయనను గౌరవిస్తాను. ఆయనకు కొన్ని విషయాలపై ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి నన్ను కలిసేందుకు వచ్చారు. అప్పుడు ఆయన.. ‘మోదీజీ.. ఈ దేశం మిమ్మల్ని రెండుసార్లు ప్రధానిని చేసింది. మీరు ఇంకా ఏం కోరుకుంటున్నారు?’ అని అడిగారు. రెండుసార్లు ప్రధాని అయితే అన్నీ సాధించినట్టేనని ఆయన అభిప్రాయంతో ఉన్నారు. కానీ, మోదీ అందరికంటే చాలా భిన్నమని ఆయనకు తెలీదు. మోదీ గుజరాత్ గడ్డ మీద పెరిగాడు. అందుకే నేను దేన్నీ అంత తేలికగా తీసుకోను. విశ్రాంతి తీసుకోవాలని అనుకోను. సంక్షేమ పథకాలను వంద శాతం మంది లబ్ధిదారులకు అందేలా చూడటమే నా కల.”-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి… అయితే, ఆ విపక్ష నేత ఎవరన్నది మోదీ పేర్కొనలేదు. అయితే, గత నెలలో ఎన్సీపీ నేత, రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్ మోదీని దిల్లీలో కలిశారు. శివసేన ఎంపీ సంజయ్ రౌత్పై కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు ఒత్తిడి పెంచిన నేపథ్యంలో మోదీని కలిశారు పవార్.

*చైర్మ‌న్లు, మేయ‌ర్ల‌కు రెక్వెస్ట్.. ఆ దుర‌లవాటు మానుకోండి : మంత్రి కేటీఆర్
ఆయా మున్సిపాలిటీల్లోని మేయ‌ర్లు, చైర్మ‌న్లు, కౌన్సిల‌ర్ల‌కు మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ సుతిమెత్త‌గా చుర‌క‌లంటించారు. మున్సిప‌ల్ అధికారుల‌పై అరిస్తే.. గొప్ప అనుకునే వారిని కేటీఆర్ హెచ్చ‌రించారు. అధికారిక స‌మావేశాల్లో అర్థ‌వంత‌మైన చ‌ర్చ‌లు జ‌రిపి, స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కారం చేసుకునే దిశ‌గా ముందుకు వెళ్లాల‌ని కేటీఆర్ సూచించారు.న‌గ‌రంలోని వెంగ‌ళ్రావు న‌గ‌ర్‌లో నిర్వ‌హించిన ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మంపై స‌మీక్ష సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడారు.చైర్మ‌న్ల‌కు, మేయ‌ర్ల‌కు రెక్వెస్ట్.. మ‌న దేశంలో ఒక దుర‌లవాటు ఉంది. కౌన్సిల్ స‌మావేశాల‌కు గ‌తంలో నేను కూడా అటెండ్ అయ్యాను. అటెండ్ అయిన‌ప్పుడు కూడా చెప్పాను. మ‌ళ్లీ కూడా చెప్తున్నాను. మ‌న దేశంలో ఉన్న దుర‌లవాటు ఏంటంటే.. అధికారుల మీద అర‌వ‌డం, ఎగిరెగిరి ప‌డ‌టం, తిట్ట‌డం అనేది కొన‌సాగుతోంది.. అదే గొప్ప‌.. అట్ల మాట్లాడిత‌నే ప‌నులు అవుతాయని కొంద‌రు భ్ర‌మ ప‌డుతున్నారు. సాయంత్రం సీటి కేబుల్‌లో చూపెడుతార‌ని కొంద‌రు ప‌నికిమాలిన ఆలోచ‌న‌ల‌తో ఉంటారు. మ‌నం ఆ క‌ల్చ‌ర్‌ను ఎంక‌రేజ్ చేయొద్ద‌ని కేటీఆర్ సూచించారు.