Politics

కేటీఆర్ తండ్రి పేరుతో మంత్రి పదవులు అనుభవిస్తున్నారు – TNI రాజకీయ వార్తలు

కేటీఆర్  తండ్రి పేరుతో మంత్రి పదవులు అనుభవిస్తున్నారు – TNI రాజకీయ వార్తలు

* మంత్రి కేటీఆర్ తండ్రి పేరుతో మంత్రి పదవులు అనుభవిస్తున్నారని బీజేపీ నేత లక్ష్మణ్ ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రి హరీష్‌రావును అబద్దాల వర్సిటీకి వీసీని చేయొచ్చన్నారు. తెలంగాణ ద్రోహులు కూడా బీజేపీపై మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ మజ్లిస్ చెప్పుచేతల్లో పనిచేస్తోందని ఆరోపించారు. ఆవాస్ యోజన నిధులు దారిమళ్లిస్తున్నది టీఆర్‌ఎస్ ప్రభుత్వం కాదా? అని లక్ష్మణ్ ప్రశ్నించారు.

*కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు కాంగ్రెస్ పాదయాత్రలు!
ప్రజలకు చేరువయ్యేందుకు పాదయాత్రలు, రచ్చబండలు నిర్వహించాలని కాంగ్రెస్ యోచిస్తోంది. రాహుల్ గాంధీ సహా సీనియర్ నేతలు పాల్గొనే ఈ కార్యక్రమాలు కశ్మీరు నుంచి కన్యా కుమారి వరకు జరుగుతాయని తెలుస్తోంది. ఆ పార్టీ మేధోమథనం సమావేశాల్లో భాగంగా ‘జన జాగరణ్ అభియాన్ 2.0’ కమిటీ ఈ ప్రతిపాదన చేసినట్లు సమాచారం. రాజస్థాన్‌ లోని ఉదయ్‌పూర్‌లో శుక్రవారం ప్రారంభమైన కాంగ్రెస్ నవ సంకల్ప చింతన్ శివిర్ (మేధోమథనం) సమావేశాల్లో వివిధ అంశాలపై వేర్వేరు కమిటీలు చర్చలు జరిపాయి. ప్రజలకు చేరువయ్యేందుకు, దేశంలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్యపై ప్రజలను చైతన్యపరిచేందుకు కశ్మీరు నుంచి కన్యా కుమారి వరకు పాదయాత్రలు, రచ్చబండలు నిర్వహించాలని ‘జన జాగరణ్ అభియాన్ 2.0’ కమిటీ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమాలను ఓ ఏడాదిపాటు కొనసాగించాలని చెప్పినట్లు సమాచారం. నిరంతరాయ ఆందోళన కమిటీ చైర్‌పర్సన్ దిగ్విజయ సింగ్ దీనికి సంబంధించిన సవివరమైన ప్రజంటేషన్‌ను ఇచ్చినట్లు, దీనిపై విస్తృత చర్చ జరిగినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. యువజన కమిటీ కూడా ఇటువంటి సలహానే ఇచ్చిందని చెప్తున్నారు.

*గడపగడపకు వెళ్లలేని నిస్సహాయ స్థితిలో YCP నేతలు: కూన
గడపగడపకు కార్యక్రమం చేపట్టిన వైసీపీ నేతలు ప్రజల్లోకి వెళ్లలేని నిస్సాహాయ పరిస్థితిలో ఉన్నారని TDP నేత కూన రవికుమార్ విమర్శించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ కండువాతో జనాల్లోకి వెళ్లాలంటే వణికి పోతున్నారని, ప్రజలకు ఏం చేశారో చెప్పలేక పోతున్నారని అన్నారు. సచివాలయ సిబ్బంది, అధికారులు ఉంటే తప్ప గ్రామాల్లోకి వెల్లలేకపోతున్నారన్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాం పిచ్చోడైపోయారని, నియోజకవర్గంలో ఒక్క పని కూడా చేయలేకపోయారని విమర్శించారు.రాజకీయాల మీద బెట్టింగ్‌లు కడతామంటున్న సీతారాంని ఏందుకు అరెస్ట్ చేయడం లేదని కూన రవికుమార్ ప్రశ్నించారు. ఉద్యోగాలిస్తానని డబ్బులు దండుకున్నారని, అందుకే మీకు ఓట్లు వేయాలా..? అని నిలదీశారు. హోదా పేరుతో జగన్ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. వైసీపీ నేతలు గడపగడపకు వెళ్తే.. చీవాట్లు తప్ప సత్కారాలు లేవని కూన రవికుమార్ ఎద్దేవా చేశారు

*త్రిపుర ముఖ్యమంత్రిగా మాణిక్ సాహా ప్రమాణ స్వీకారం
త్రిపుర ముఖ్యమంత్రిగా బీజేపీ శాసన సభాపక్ష నేత మాణిక్ సాహా ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. బిప్లబ్ కుమార్ దేబ్ శనివారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో బీజేపీ శాసన సభా పక్షం మాణిక్ సాహాను తమ నేతగా ఎన్నుకుంది. అనంతరం సాహా రాజ్‌ భవన్‌లో గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ ఆర్యను కలిసి, ఎమ్మెల్యేల మద్దతు లేఖను సమర్పించారు. ప్రభుత్వ ఏర్పాటుకు తనను ఆహ్వానించాలని కోరారు. శనివారం బీజేపీ శాసన సభా పక్ష నేతగా ఎన్నికైన తర్వాత మాణిక్ సాహా ఇచ్చిన ట్వీట్‌లో, శాసన సభా పక్ష నేతగా ఎన్నికవడంతో తాను గవర్నర్‌ను రాజ్ భవన్‌లో కలిశానని తెలిపారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని తెలిపానని, బీజేపీ ఎమ్మెల్యేల మద్దతు లేఖను సమర్పించానని తెలిపారు
*అమిత్ షా అవినీతికి బాద్ షా : ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి నిప్పులు చెరిగారు. అమిత్ షా అవినీతికి బాద్ షాలా మారాడ‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ప్ర‌సంగంలో అన్నీ అబ‌ద్ధాలే.. అరుపులే అని పేర్కొన్నారు. అమిత్ షా బెస్ట్ విల‌న్‌గా, బండి సంజ‌య్ బెస్ట్ క‌మెడియ‌న్‌గా, కిష‌న్ రెడ్డి క‌న్ఫ్యూజ‌న్ రెడ్డిగా మారార‌ని జీవ‌న్ రెడ్డి ఎద్దెవా చేశారు.టీఆర్ఎస్ఎల్పీలో జీవ‌న్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తుక్కుగూడ స‌భ త‌ర్వాత బీజేపీ తుక్కు తుక్కు అయింద‌న్నారు. అమిత్ షా స‌భ‌కు జ‌నం స్పంద‌న క‌రువైంద‌న్నారు. కేటీఆర్ లేవ‌నెత్తిన ఒక్క ప్ర‌శ్న‌కు కూడా స‌మాధానం చెప్ప‌కుండా అమిత్ షా పారిపోయాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు. నిన్న‌టి క‌మ‌లం స‌భ కామెడి షోగా మారింద‌న్నారు. బీజేపీ నేతలు ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం కాలేదన్నారు.కేసీఆర్‌ది నిజాం పాలన కాదు నిజాల పాలన అని జీవ‌న్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. విభ‌జ‌న హామీల‌ను అమ‌లు చేయ‌డంలో బీజేపీ తెలంగాణ‌ను మోసం చేసింద‌న్నారు. తెలంగాణ‌కు రూ. 2 ల‌క్ష‌ల 52 వేల కోట్లు ఇచ్చామ‌ని బీజేపీ నేత‌లు చెబుతున్నారు. ఆ డ‌బ్బుల‌న్నీ అమిత్ షా అకౌంట్లో వేసుకున్నారా? లేక కిష‌న్ రెడ్డి అకౌంట్లో వేసుకున్నారా? అని నిల‌దీశారు. తెలంగాణ‌లో ఎప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా టీఆర్ఎస్‌దే విజ‌యం అని జీవ‌న్ రెడ్డి తేల్చిచెప్పారు. బీజేపీకి మ‌ళ్లీ డిపాజిట్లు గ‌ల్లంతేన‌ని చెప్పారు

*కొందరు టూరిస్ట్‌లను తీసుకొచ్చి సభ పెట్టారు: Malla reddy
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కొందరు టూరిస్ట్‌లను తీసుకొచ్చి సభ పెట్టారని తెలంగాణ మంత్రి మల్లారెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ సభలో అమిత్‌షా మతిభ్రమించి మాట్లాడారని, బీజేపీ డబుల్ ఇంజన్‌ కాదు.. సింగిల్ డిజిట్ కూడా తెచ్చుకోలేదని అన్నారు. సీఎం కేసీఆర్ కుటుంబంపై విమర్శలు చేయడం మానకుంటే తడాఖా చూపిస్తామని అన్నారు. బీజేపీ జూటా పార్టీ అని.. ఆ పార్టీని ప్రజలు ఎప్పటికీ నమ్మరని అన్నారు. బీజేపీ నేతలకు దమ్ముంటే తెలంగాణకు కేంద్రం ఏమిచ్చిందో చెప్పాలని మల్లారెడ్డి సవాల్ చేశారు

*కేంద్రం ఎక్కడ నిధులు ఇచ్చింది.. దేనికి ఇచ్చింది?: Jeevan Reddy
కేంద్రమంత్రి అమిత్‌షా ( కు దమ్ముంటే మంత్రి కేటీఆర్ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కూడా రాలేదని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ సభల్లో ఎక్కడా తెలంగాణ నినాదం వినిపించలేదన్నారు. కేంద్రం ఎక్కడ నిధులు ఇచ్చింది, దేనికి ఇచ్చిందని ప్రశ్నించారు. ఇచ్చిన నిధులు బండి సంజయ్‌ అకౌంట్‌లో వేశారా? అని అన్నారు. పాకిస్థాన్‌లో ప్రధాని మోదీ టీ తాగి వచ్చారు… అంటే బీజేపీ స్టీరింగ్ పాకిస్థాన్‌ చేతిలో ఉన్నట్టా? అని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ప్రశ్నించారు

*ప్లీజ్‌.. గ్యాస్‌ ధరలు దగ్గించండి: మంత్రి సబితా రెడ్డి
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌ ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్నదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణలో ఒక్కసారి అవకాశం ఇవ్వండి ప్లీజ్‌ అని కేంద్ర మంత్రి అమిత్‌ షా అన్నారని, ప్లీజ్‌ గ్యాస్‌ ధరలు తగ్గించండని ప్రజలు అంటున్నారని చెప్పారు. పెట్రోల్‌ ధరల పెంపును నిరసిస్తూ మహేశ్వరం నియోజకవర్గంలోని బాలాపూర్‌ చౌరస్తాలో టీఆర్‌ఎస్‌ భారీ ధర్నా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్యాస్‌ ధరలు తగ్గించే వరకు బీజేపీ వాళ్లను గల్లీల్లోకి రానివ్వద్దు పిలుపునిచ్చారు. ధరలు తగ్గించకపోతే ప్రజలు మిమ్మల్ని గద్దె దించుతారని చెప్పారు

*దమ్ముందా.. ఒకేసారి ఎన్నికలకు వెళ్దాం.. బీజేపీకి మంత్రి తలసాని సవాల్‌
కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి దేశ వ్యాప్త ఎన్నికలకు బీజేపీ సిద్ధమా అని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సవాల్‌ విసిరారు. అధికారంలో ఉన్నాం కదా అని ఏదైనా మాట్లాడుతామంటే కుదరదని చెప్పారు. కేంద్రమంత్రి హోదాలో అమిత్‌ షా అలా మాట్లాడటం సరికాదన్నారు. సనత్‌నగర్‌ బన్సీలాల్‌పేటలో డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డితో కలిసి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ ప్రారంభించారు. గుజరాత్‌లో డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. కళ్లుండి చూడలేని కబోదులు బీజేపీ నాయకులు అని విమర్శించారు. ప్రజలంతా టీఆర్‌ఎస్‌ వైపే ఉన్నారని చెప్పారు.పేదల సొంతింటి కలను సీఎం కేసీఆర్‌ సాకారం చేశారని చెప్పారు. కేసీఆర్‌ ముందుచూపుతోనే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని చెప్పారు. డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను పకడ్బందీగా కేటాయిస్తున్నామని, ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని వెల్లడించారు. అబద్దాల వలస పక్షులకు చెంపపెట్టులా డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల పథకం నిలుస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి మంచినీరు అందిస్తున్నామని చెప్పారు. బండ మైసమ్మ నగర్‌లో బస్తీ దవాఖానా, అంగన్‌వాడీ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు

*అమిత్ షా అవినీతికి బాద్ షా : ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి నిప్పులు చెరిగారు. అమిత్ షా అవినీతికి బాద్ షాలా మారాడ‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ప్ర‌సంగంలో అన్నీ అబ‌ద్ధాలే.. అరుపులే అని పేర్కొన్నారు. అమిత్ షా బెస్ట్ విల‌న్‌గా, బండి సంజ‌య్ బెస్ట్ క‌మెడియ‌న్‌గా, కిష‌న్ రెడ్డి క‌న్ఫ్యూజ‌న్ రెడ్డిగా మారార‌ని జీవ‌న్ రెడ్డి ఎద్దెవా చేశారు.టీఆర్ఎస్ఎల్పీలో జీవ‌న్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తుక్కుగూడ స‌భ త‌ర్వాత బీజేపీ తుక్కు తుక్కు అయింద‌న్నారు. అమిత్ షా స‌భ‌కు జ‌నం స్పంద‌న క‌రువైంద‌న్నారు. కేటీఆర్ లేవ‌నెత్తిన ఒక్క ప్ర‌శ్న‌కు కూడా స‌మాధానం చెప్ప‌కుండా అమిత్ షా పారిపోయాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు. నిన్న‌టి క‌మ‌లం స‌భ కామెడి షోగా మారింద‌న్నారు. బీజేపీ నేతలు ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం కాలేదన్నారు.కేసీఆర్‌ది నిజాం పాలన కాదు నిజాల పాలన అని జీవ‌న్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. విభ‌జ‌న హామీల‌ను అమ‌లు చేయ‌డంలో బీజేపీ తెలంగాణ‌ను మోసం చేసింద‌న్నారు. తెలంగాణ‌కు రూ. 2 ల‌క్ష‌ల 52 వేల కోట్లు ఇచ్చామ‌ని బీజేపీ నేత‌లు చెబుతున్నారు. ఆ డ‌బ్బుల‌న్నీ అమిత్ షా అకౌంట్లో వేసుకున్నారా? లేక కిష‌న్ రెడ్డి అకౌంట్లో వేసుకున్నారా? అని నిల‌దీశారు. తెలంగాణ‌లో ఎప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా టీఆర్ఎస్‌దే విజ‌యం అని జీవ‌న్ రెడ్డి తేల్చిచెప్పారు. బీజేపీకి మ‌ళ్లీ డిపాజిట్లు గ‌ల్లంతేన‌ని చెప్పారు

*అమిత్ షాకు అల్జీమ‌ర్స్ వ్యాధి ఏమైనా ఉందా?.. హ‌రీశ్‌రావు ఫైర్
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు.అమిత్ షా నిన్న‌ తెలంగాణకు వ‌చ్చి మాట్లాడిన మాట‌లు వింటే ఆయ‌న నిజంగానే అమిత్ షా కాదు అబ‌ద్దాల షా అని రుజువు చేసుకున్నార‌ని ధ్వ‌జమెత్తారు. న‌డ్డానేమో అబ‌ద్ధాల‌కు అడ్డ‌గా, అమిత్ షానేమో అబ‌ద్ధాల‌కు బాద్ షాగా నిరూపించుకున్నాడ‌ని తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. అమిత్ షాకు అల్జీమ‌ర్స్ వ్యాధి ఏమైనా ఉందా? అని హ‌రీశ్‌రావు ప్ర‌శ్నించారు. మెద‌క్ జిల్లా తుప్రాన్‌లో ఎంపీ కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డితో క‌లిసి మంత్రి హ‌రీశ్‌రావు మీడియాతో మాట్లాడారు

*గడపగడపకు వెళ్లలేని నిస్సహాయ స్థితిలో YCP నేతలు: కూన Ravikumar
గడపగడపకు కార్యక్రమం చేపట్టిన వైసీపీ నేతలు ప్రజల్లోకి వెళ్లలేని నిస్సాహాయ పరిస్థితిలో ఉన్నారని TDP నేత కూన రవికుమార్ విమర్శించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ కండువాతో జనాల్లోకి వెళ్లాలంటే వణికి పోతున్నారని, ప్రజలకు ఏం చేశారో చెప్పలేక పోతున్నారని అన్నారు. సచివాలయ సిబ్బంది, అధికారులు ఉంటే తప్ప గ్రామాల్లోకి వెల్లలేకపోతున్నారన్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాం పిచ్చోడైపోయారని, నియోజకవర్గంలో ఒక్క పని కూడా చేయలేకపోయారని విమర్శించారు.రాజకీయాల మీద బెట్టింగ్‌లు కడతామంటున్న సీతారాంని ఏందుకు అరెస్ట్ చేయడం లేదని కూన రవికుమార్ ప్రశ్నించారు. ఉద్యోగాలిస్తానని డబ్బులు దండుకున్నారని, అందుకే మీకు ఓట్లు వేయాలా..? అని నిలదీశారు. హోదా పేరుతో జగన్ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. వైసీపీ నేతలు గడపగడపకు వెళ్తే.. చీవాట్లు తప్ప సత్కారాలు లేవని కూన రవికుమార్ ఎద్దేవా చేశారు.

*చిల్లర పార్టీ BJP: కేటీఆర్కేం
ద్రమంత్రి అమిత్‌షా ప్రసంగంపై మంత్రి కేటీఆర్కౌం టరిచ్చారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అమిత్‌షా వ్యాఖ్యలను తెలంగాణ ప్రజలు విశ్వసించరని తెలిపారు. అమిత్‌షా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. పదవులు అమ్ముకునే చిల్లర పార్టీ బీజేపీ అని ధ్వజమెత్తారు. నిజాంను వారి వారసులకంటే.. బీజేపీ నేతలే ఎక్కువ తలుచుకుంటున్నారని విమర్శించారు. బాధ్యత గల కేంద్రంమంత్రి ఇన్ని అబద్ధాలు ఆడతారా? అని ప్రశ్నించారు. బీజేపీ నేతలో ఒక్కొక్కరు ఒక్కో మాట మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని కేటీఆర్ హెచ్చరించారు. తెలంగాణ ఇచ్చిన డబ్బుతో బీజేపీ రాష్ట్రాలు బతుకుతున్నాయని తెలిపారు. అప్పులు బీజేపీ వాళ్లు చేస్తూ.. తమను నిందిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం 60 ఏళ్లల్లో చేసిన అప్పులను ప్రధాని మోదీ 8 ఏళ్లల్లో చేశారని వెల్లడించారు. మిషన్ భగీరథకు రూ.25వేల కోట్లు ఇచ్చారా? అని ప్రశ్నించారు. నీతి ఆయోగ్ చెప్పినా.. తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. తాము అప్పుచేసి కాళేశ్వరం, మిషన్ భగీరథ, కాకతీయ చేశామని తెలిపారు. పెట్రోల్ రేట్లు పెంచి ప్రజల నుంచి రూ.26లక్షల కోట్లు వసూలు చేశారని విమర్శించారు. బీజేపీ ఆటల ఇక ఎన్నో రోజులు సాగవని కేటీఆర్ హెచ్చరించారు.

*Amit Shah అబద్దాలను సాక్ష్యాలతో సహా నిరూపిస్తా: హరీష్‌రావు
కేంద్రమంత్రి అమిత్‌షా అబద్దాలను సాక్ష్యాలతో సహా నిరూపిస్తామని మంత్రి హరీష్‌రావు సవాల్ విసిరారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అమిత్‌షా మాటలను ప్రజలు నమ్మరని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దుకు టీఆర్‌ఎస్ మద్దతు ఇచ్చామో లేదో రికార్డులు చూపాలని నిలదీశారు. తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదని తప్పుబట్టారు. కేంద్రం ఇవ్వకున్నా 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామని చెప్పారు. మిషన్ భగీరథ కు కేంద్రం రూ.2500 కోట్లు కాదు.. రూ.2 కూడా ఇవ్వలేదని విమర్శించారు. తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ అమలవుతుందని, పార్లమెంట్‌లో కేంద్రమంత్రే ప్రకటించారని హరీష్‌రావు గుర్తుచేశారు.

* ఆ గాడిదలను అప్పుడే తరిమికొట్టాం: ఉద్ధవ్‌
బీజేపీపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే విరుచుకుపడ్డారు. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీతో పొత్తు తెంచుకున్నప్పుడే తాము ‘గాడిద’లను తరిమికొట్టామంటూ వ్యాఖ్యానించారు. ముంబైలో శనివారం శివసేన పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో ఠాక్రే మాట్లాడుతూ బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్‌ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు.‘మేము గధా(గాడిద) ధారి హిందువులమని ఫడ్నవిస్‌ అంటున్నారు. అయితే ఇక్కడ మీకు ఒకటి చెబుతున్నాను.. బీజేపీతో పొత్తు తెంచుకున్నప్పుడే మేం గాడిదలను తరిమికొట్టాం’ అని పేర్కొన్నారు. బీజేపీతో పొత్తుతో 25 ఏండ్లు వృథా అయ్యాయని అన్నారు. బీజేపీ ఫేక్‌ హిందూత్వ బురఖా ధరించిందన్నారు. మహారాష్ట్ర నుంచి ముంబైని వీడదీయాలనే కుట్రలు ఫలించవని ఈ సందర్భంగా ఠాక్రే స్పష్టంచేశారు.

* అమిత్ షా అవినీతికి బాద్ షా : ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి నిప్పులు చెరిగారు. అమిత్ షా అవినీతికి బాద్ షాలా మారాడ‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ప్ర‌సంగంలో అన్నీ అబ‌ద్ధాలే.. అరుపులే అని పేర్కొన్నారు. అమిత్ షా బెస్ట్ విల‌న్‌గా, బండి సంజ‌య్ బెస్ట్ క‌మెడియ‌న్‌గా, కిష‌న్ రెడ్డి క‌న్ఫ్యూజ‌న్ రెడ్డిగా మారార‌ని జీవ‌న్ రెడ్డి ఎద్దెవా చేశారు.టీఆర్ఎస్ఎల్పీలో జీవ‌న్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తుక్కుగూడ స‌భ త‌ర్వాత బీజేపీ తుక్కు తుక్కు అయింద‌న్నారు. అమిత్ షా స‌భ‌కు జ‌నం స్పంద‌న క‌రువైంద‌న్నారు. కేటీఆర్ లేవ‌నెత్తిన ఒక్క ప్ర‌శ్న‌కు కూడా స‌మాధానం చెప్ప‌కుండా అమిత్ షా పారిపోయాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు. నిన్‌ుటి క‌మ‌లం స‌భ కామెడి షోగా మారింద‌న్నారు. బీజేపీ నేతలు ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం కాలేదన్నారు.కేసీఆర్‌ది నిజాం పాలన కాదు నిజాల పాలన అని జీవ‌న్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. విభ‌జ‌న హామీల‌ను అమ‌లు చేయ‌డంలో బీజేపీ తెలంగాణ‌ను మోసం చేసింద‌న్నారు. తెలంగాణ‌కు రూ. 2 ల‌క్ష‌ల 52 వేల కోట్లు ఇచ్చామ‌ని బీజేపీ నేత‌లు చెబుతున్నారు. ఆ డ‌బ్బుల‌న్నీ అమిత్ షా అకౌంట్లో వేసుకున్నారా? లేక కిష‌న్ రెడ్డి అకౌంట్లో వేసుకున్నారా? అని నిల‌దీశారు. తెలంగాణ‌లో ఎప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా టీఆర్ఎస్‌దే విజ‌యం అని జీవ‌న్ రెడ్డి తేల్చిచెప్పారు. బీజేపీకి మ‌ళ్లీ డిపాజిట్లు గ‌ల్లంతేన‌ని చెప్పారు.

* BJPకి ఒక్కసారి అవకాశం ఇస్తే..ఉరి వేసుకున్నట్లే: Narayana
బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇస్తే.. ఒక్కసారి ఉరి వేసుకున్నట్లేని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్‌పై బీజేపీకి స్పష్టమైన రాజకీయ వ్యూహం లేదని విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బీజేపీ ధ్వంసం చేసిందని మండిపడ్డారు. విభజన చట్టంలో హామీలను అమలు చేయకుండా మాటలకే పరిమితమైందని, వ్యతిరేక చట్టాలను సీఎం కేసీఆర్ సమర్థించారని ఆరోపించారు. బీజేపీ రాజకీయ బలం పెంచుకోవటానికి టీఆర్ఎస్ అవకాశం కల్పించిందని, ఒక్క అవకాశమని బీజేపీ అడుక్కోవడం సిగ్గుచేటని నారాయణ ఎద్దేవా చేశారు.

*కర్ణాటక నుంచి రాజ్యసభకు ప్రియాంకగాంధీ?
కాంగ్రెస్‌ పార్టీ కీలక నేత ప్రియాంకగాంధీని కర్ణాటక నుంచి రాజ్యసభ సభ్యురాలిగా పంపేందుకు కసరత్తు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఉదయ్‌పూర్‌లో జరుగుతున్న చింతన్‌ శిబిర్‌లో ప్రియాంక గాంధీని రాజ్యసభ సభ్యురాలిని చేసే అంశం చర్చకు వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం కర్ణాటక నుంచి రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్న బీజేపీకి చెందిన కేసీ రామమూర్తి, నిర్మలాసీతారామన్‌, కాంగ్రె్‌సకు చెందిన జైరాంరమేశ్‌ పదవీ కాలం ముగుస్తోంది. వీరితో పాటు కేంద్రమాజీ మంత్రి అస్కర్‌ఫెర్నాండెజ్‌ మృతితో ఖాళీ అయిన స్థానంతో కలిపి మొత్తం నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కాలం నుంచి కర్ణాటకతో ఆ కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నాయి. ఇందిరాగాంధీకి రాజకీయంగా ఇబ్బందులు కలిగినప్పుడు రాష్ట్ర నేతల సూచన మేరకు చిక్కమగళూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయించి విజయం సాధించారు. ప్రస్తుతం అదే కుటుంబానికి చెందిన ప్రియాంకను రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపాలనే ప్రయత్నాలు జోరందుకున్నాయి. పైగా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జైరాంరమేశ్‌ వల్ల రాష్ట్రానికి, రాష్ట్ర పార్టీకి ఒనగూరింది లేదని ఓ వర్గం వ్యతిరేకతతో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రియాంక కర్ణాటక నుంచి పోటీ చేసే విషయం మరో 2,3 రోజుల్లోనే తేలనున్నట్లు తెలిసింది.

*అవినీతి రహిత ఉద్యోగ నియామకాలు : హిమంత బిశ్వ శర్మ
ప్రభుత్వోద్యోగ నియామకాల్లో పారదర్శకతను పాటిస్తున్నట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చెప్పారు. శనివారం ఆయన 22,958 మంది యువతకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. వీరు 11 ప్రభుత్వ శాఖల్లో నియమితులయ్యారు.ఈ సందర్భంగా శర్మ మాట్లాడుతూ, 2011 నుంచి తాను అవినీతి రహిత, పారదర్శక నియామకాలను ప్రారంభించానని చెప్పారు. ఇప్పటి వరకు దాదాపు 2 లక్షల మందికి నియామక పత్రాలను అందజేశానన్నారు. అవినీతి లేకుండా, పారదర్శకంగా నియామకాలను చేపట్టడం వల్ల రాజకీయంగా నష్టం జరిగే అవకాశం ఉన్నప్పటికీ, పార్టీ కన్నా దేశానికే పెద్ద పీట వేయాలని తమకు బీజేపీ బోధించిందన్నారు. ఎన్నికల్లో తన గెలుపు కోసం పగలు, రాత్రి తేడా లేకుండా కృషి చేసినవారు తన నుంచి కొంత ఆశిస్తారన్నారు. కానీ తాను వారికి ఏమీ ఇవ్వలేనని చెప్పారు. అవినీతి రహిత నియామకాల కోసం తాను, తన పార్టీ అనేక త్యాగాలు చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఇలా చేయాలని తనపై ఎటువంటి ఒత్తిళ్ళు లేవన్నారు. అస్సాం భవిష్యత్తు కోసం, తాము రాజకీయంగా నష్టపోతున్నప్పటికీ, 2011లో పారదర్శక నియామకాల ప్రక్రియను ప్రారంభించామన్నారు.

*పిల్లలు పుట్టాక పెళ్లి కానుక ఇస్తారా..: అయ్యన్న
పెళ్లి కానుక పథకం ఏమైందో చెప్పాలని సీఎం జగన్మోహన్‌రెడ్డిని, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. ‘‘పెళ్లి కానుక డబ్బులు చంద్రబాబు కంటే ఎక్కువ ఇస్తానని ఎన్నికలకు ముందు జగన్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో 65 వేల మంది ఇందుకోసం దరఖాస్తుల చేసుకొని ఎదురు చూస్తున్నారు. మూడేళ్ల నుంచి ఈ పథకాన్ని ఎందుకు అమలు చేయలేకపోయారు? ఇది వారిని మోసం చేయడం కాదా? వివాహ స మయంలో ఇచ్చే కానుకను…పిల్లలు పుట్టిన తర్వాతఇస్తారా?’’ అని నిలదీశారు.

*సీఎం రాజ్యాంగ ద్రోహి: జనసేన
అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ, రాష్ట్రంలో తన సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్‌ రాజ్యాంగ ద్రోహి అని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి టి.శివశంకర్‌ విమర్శించారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ను రాష్ట్ర ద్రోహి, దేశ ద్రోహి అని జగన్‌ సంబోధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నగరంలోని డాబాగార్డెన్స్‌ వీజేఎఫ్‌ ప్రెస్‌క్లబ్‌లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల్లోకి వచ్చినప్పుడు ఎవరో రాసి ఇచ్చిన స్ర్కిప్ట్‌ను చదవడం తప్ప, ప్రజా సమస్యలపై సీఎంకి కనీస అవగాహన లేదన్నారు. పవన్‌ కల్యాణ్‌ చేపట్టిన కౌలు రైతుల సహాయ కార్యక్రమాన్ని జీర్ణించుకోలేక, ఈ ప్రభుత్వం దిగజారుడు విమర్శలు చేస్తోందన్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ, వైసీపీ పేరును ద్రోహం పార్టీగా మార్చుకోవాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో జనసేన రాష్ట్ర పీఏసీ సభ్యులు కోన తాతారావు, అధికార ప్రతినిధి పరుచూరి భాస్కరరావు, పసుపులేటి ఉషాకిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

*పాదయాత్రకు ఇంతవరకు అనుమతి ఇవ్వలేదు: btech ravi
ఈనెల 18న చంద్రబాబు జిల్లాలో పర్యటించనున్నట్లు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి వెల్లడించారు. వైసీపీ నేతలు రైతులపై దృష్టి పెట్టకుండా.. వివేకా కేసు నిందితుడు..శివశంకర్‌రెడ్డిని బయటకు తేవాలని ఆలోచిస్తున్నారని అన్నారు. రైతుల కోసం పాదయాత్ర చేయాలని అనుమతి కోరితే ఇంతవరకు అనుమతి ఇవ్వలేదన్నారు.

*సొమ్మొకడిది.. సోకొకడిదిలా ఉంది జగన్ వైఖరి: యనమల
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు. సొమ్మొకడిది.. సోకొకడిదిలా జగన్ వైఖరి ఉందని యనమల మండిపడ్డారు. ఓఎన్జీసీ పైపులైన్లతో నష్టపోయిన మత్య్సకారులకు పరిహారమిచ్చేది కేంద్రమని, సొంత జేబులో నుంచి ఇస్తున్నట్లు జగన్ వ్యవహారం ఉందని మాజీ మంత్రి యనమల ఆరోపించారు. మత్స్యకారులకు పరిహారాన్ని 6 నెలలుగా తొక్కిపెట్టారని, పరిహారం ఇవ్వకుండా తొక్కిపెట్టడం జగన్‌ మోసం చేయడమే అని యనమల తెలిపారు. మూడేళ్లలో మీరేం చేశారో చెప్పే దైర్యం లేదా? అని సీఎంను యనమల ప్రశ్నించారు.

*ఆ జాబితాలో ఏపీ ముందజలో ఉంది: పట్టాభి
పేదలకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడానికి వైసీపీ ప్రభుత్వం రూపాయి కూడా ఇవ్వదట అని టీడీపీ నేత పట్టాభి అన్నారు. జగనన్న కాలనీలతో విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడానికి రూ.4,500 కోట్ల ఖర్చు అన్నారు. కనెక్షన్లపై సీఎంతో అధికారులు చెప్పినా డబ్బులు లేవన్నారట అని చెప్పారు. విద్యుత్ చార్జీలు పెంచి జనాలను దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగనన్న కాలనీల్లో కనీస సౌకర్యాలు లేకపోతే వారెక్కడ ఉండాలని ప్రశ్నించారు. విద్యుత్ సరఫరా కంపెనీలకు ఏపీ భారీ బకాయిలు చెల్లించాలని పేర్కొన్నారు. విద్యుత్ బకాయిల జాబితాలో అందరికంటే ముందంజలో ఏపీ ఉందన్నారు.

*పేదల గుడిసెల కూల్చివేత దారుణం: చాడ
వరంగల్‌ శివార్లలో 17 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నిమ్మాయి చెరువు ప్రాంతంలో పేదలు వేసుకున్న గుడిసెలను పోలీసు, రెవెన్యూ యంత్రాంగం కూల్చివేయడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. అదే చెరువును రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు కబ్జా చేసి ప్లాట్లు చేస్తుంటే ప్రేక్షక పాత్ర పోషిస్తున్న అధికారులు.. పేదల గుడిసెలను మాత్రం తీసేయడమేంటని శనివారం ఓ ప్రకటనలో ప్రశ్నించారు.

*మా పార్టీకీ స్థలాలివ్వాలి: తమ్మినేని
టీఆర్‌ఎస్‌కు కేటాయించినట్లుగానే తమ పార్టీ జిల్లా కార్యాలయాల నిర్మాణానికి కూడా స్థలాలు కేటాయించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శనివారం లేఖ రాశారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల కార్యాలయాల నిర్మాణం కోసం జిల్లా కేంద్రాల్లో ఎకరం వరకు స్థలం కేటాయించాలని 2018 ఆగస్టు 18న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తుచేశారు. దీంతో పలు జిల్లాల్లో తమ పార్టీకి స్థలాలను కేటాయించాలని అర్జీలు పెట్టుకున్నామని, కానీ నేటికీ సీపీఎంతో పాటు ఇతర పార్టీలకు కూడా స్థలాలు ఇవ్వలేదన్నారు. దీనిని 2019 జూన్‌ 24న సీఎం కేసీఆర్‌, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి.. 2020 ఆగస్టు 24న మరోసారి ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, అన్ని జిల్లాల కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లామన్నారు. అయినా ఇప్పటిదాకా స్థలాల కేటాయింపు జరగలేదని చెప్పారు. టీఆర్‌ఎస్‌కు అన్ని జిల్లాల్లో రూ.కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలాలను కేటాయించారని, దీనిని బట్టి ఈ జీవో కేవలం అధికార పార్టీ కోసమే తెచ్చినట్లు కనిపిస్తోందని తమ్మినేని విమర్శించారు.

*మా పార్టీకీ స్థలాలివ్వాలి: తమ్మినేని
టీఆర్‌ఎస్‌కు కేటాయించినట్లుగానే తమ పార్టీ జిల్లా కార్యాలయాల నిర్మాణానికి కూడా స్థలాలు కేటాయించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శనివారం లేఖ రాశారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల కార్యాలయాల నిర్మాణం కోసం జిల్లా కేంద్రాల్లో ఎకరం వరకు స్థలం కేటాయించాలని 2018 ఆగస్టు 18న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తుచేశారు. దీంతో పలు జిల్లాల్లో తమ పార్టీకి స్థలాలను కేటాయించాలని అర్జీలు పెట్టుకున్నామని, కానీ నేటికీ సీపీఎంతో పాటు ఇతర పార్టీలకు కూడా స్థలాలు ఇవ్వలేదన్నారు. దీనిని 2019 జూన్‌ 24న సీఎం కేసీఆర్‌, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి.. 2020 ఆగస్టు 24న మరోసారి ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, అన్ని జిల్లాల కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లామన్నారు. అయినా ఇప్పటిదాకా స్థలాల కేటాయింపు జరగలేదని చెప్పారు. టీఆర్‌ఎస్‌కు అన్ని జిల్లాల్లో రూ.కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలాలను కేటాయించారని, దీనిని బట్టి ఈ జీవో కేవలం అధికార పార్టీ కోసమే తెచ్చినట్లు కనిపిస్తోందని తమ్మినేని విమర్శించారు.

*ధాన్యంలో తారం తీస్తే కఠిన చర్యలు: గంగుల
రైతులు విక్రయించే ధాన్యంలో నుంచి కిలో తారం తీసినా రైస్‌ మిల్లులపై కఠిన చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ హెచ్చరించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో మిల్లులకు ఎలాంటి సంబంధం లేదని, ఎక్కడైనా తారం తీసినట్టు తెలిస్తే అధికారులకు, తనకూ ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగాలు పొందేందుకు పైరవీల జోలికి వెళ్లొదని, ప్రతిభతో చదివి ఉద్యోగాలు పొందాలని నిరుద్యోగ యువతకు సూచించారు. శనివారం మంత్రి పువ్వాడ అజయ్‌తో కలిసి ఖమ్మంలో నూతనంగా రూ.3.50 కోట్లతో నిర్మించిన బీసీ స్టడీ సర్కిల్‌ను ప్రారంభించారు. అనంతరం వైరాలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి ఖమ్మం డీపీఆర్సీ భవనంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు.

*‘రైతు బంధు’ను ఇక మర్చిపోవాల్సిందే..: విజయశాంతి
రైతుబంధు పథకాన్ని ఇక మర్చిపోవాల్సిందే అని బీజేపీ నేత విజయశాంతి అన్నారు. ఎన్నికల ముందు బంగారు తెలంగాణ అంటూ.. ప్రస్తుతం రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చారన్నారు. తెలంగాణను మరో శ్రీలంకలా మారుస్తున్నారని, ఇప్పటికైనా ప్రజలు మేల్కోవాలని సూచించారు. సోషల్ మీడియా వేదికగా ఆమె టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..‘‘కేసీఆర్ బంగారు తెలంగాణ అంటూ… రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చిండు. తెలంగాణ‌ను మ‌రో శ్రీ‌లంక‌ల మారుస్తున్నడు. కేసీఆర్ సర్కార్ ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయింది. తెలంగాణ ఏర్పడిన‌ప్పుడు ధ‌నిక రాష్ట్రంగానే ఉండేది. కానీ ఇప్పుడు అప్పుల కుప్పగా మారిపోయింది. రైతులు కేసీఆర్ పాల‌న‌లో అరిగోస‌లు ప‌డుతున్నారు. ఈ నెలలో పడాల్సిన రైతు బంధు పైసల గురించి మర్చిపోవాల్సిందే. ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేవ్. ఈ నెలలోనే కాదు… కనీసం వచ్చే నెలలోనైనా రైతు బంధు పైసలు పడతాయనే గ్యారెంటీ లేదు. ప్రస్తుత సీజన్లో మొత్తం రూ.7,600 కోట్లు పంపిణీ చేయాల్సి ఉంటుందని వ్యవసాయ, ఆర్థిక శాఖలు ప్రాథమికంగా అంచనా వేశాయి. ఇంత పెద్ద మొత్తంలో నిధులు సమకూర్చుకోవడం కష్టంగా మారింది. 2018లో రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టినపుడు మే నెలలోనే చెక్కులు పంపిణీ చేశారు’’.

*తెలంగాణకు రావాలంటే కల్వకుంట్ల కుటుంబం పర్మిషన్‌ తీసుకోవాలా?: కిషన్ రెడ్డి
లంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. తెలంగాణకు రావాలంటే ఆయన కుటుంబం అనుమతి తీసుకోవాలా అని ప్రశ్నించారు. తుక్కుగూడ బీజేపీ బహిరంగ సభలో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. నిజాం షుగర్‌ ఫ్యాక్టరీని ఎందుకు తెరవలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన కిషన్ రెడ్డి.. టీఆర్ఎస్‌ను దళితులు నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు. అంతకు ముందు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ KCRపై విమర్శలు గుప్పించారు. రైతులను మోసం చేసిన దౌర్భాగ్యాపు సీఎం కేసీఆర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలులో చేతులెత్తేసి కేంద్రంపై నిందలేస్తున్నారని మండిపడ్డారు. అన్ని వర్గాల్లో కేసీఆర్‌పై వ్యతిరేకత ఉందని, హుజురాబాద్ తీర్పు తెలంగాణ అంతటా రిపీట్ అవుతుందని జోస్యం చెప్పారు. తెలంగాణ కేసీఆర్ కబంధ హస్తాల్లో చిక్కుకుందని ఈటల ఆరోపించారు.

*కేటిఆర్ పై విషం కక్కడానికి వస్తున్నారు: puvvada ajay kumar
తెలంగాణ రాష్ట్రంలో నాయకులు పర్యాటనలు కాంగ్రెస్, బీజెపి నేతలు క్యూ కడుతున్నారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. తెలంగాణలో కేసీఆర్, కేటిఆర్ పై విషం కక్కడానికి వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సహకారం అందకపోయనా అభివృద్ధి సాగుతుందన్నారు. ఆర్ బిఐ మీద ఒత్తిడి చేసి నిధులు రాకుండా కేంద్రం అడ్డుకుంటుందని ఆరోపించారు. రాష్ట్రంలో సంక్షేమాన్ని అడ్డుకోవాలని చూస్తుందన్నారు. అమిత్ షా భ్రమలు కల్పించడానికి వస్తున్నారని విమర్శించారు. అబద్దాలు చెప్పే నాయకులు న్యాయ స్థానంలో సమస్యలు ఎదుర్కోవలిసి వస్తాదన్నారు. ఈ రాష్రానికి శ్రీ రామ రక్షగా కేసీఆర్ ఉన్నారని పేర్కొన్నారు.