ఆంగ్ల అక్షరాల క్రమాన్ని అల్ఫాబెటికల్ ఆర్డర్ అంటారు కానీ నిజానికి అసలు ‘ఏ’ నుంచి ‘జడ్’ వరకు అక్షరాలను ఆ క్రమంలో అమర్చిందెవరో ఎవరికీ తెలియదు. పురాతన ఈజిప్షియన్లు బొమ్మల లిపినే భాషగా వాడుతున్న రోజుల్లోనే అక్కడ స్థిరపడిన కొందరు విదేశీయులు ఈ అక్షరాలను రూపొందించారట. క్రీ.పూ. 1500-300 మధ్య కాలంలో అభివృద్ధి చెంది, క్రీ. శ. ఎనిమిదో శతాబ్దం నాటికి గ్రీసులో వాడుకలో ఉన్న ఈ అక్షరాలకి రోమ్లో ఒక రూపం వచ్చిందట. మొదట్లో ఉన్న జడ్’ని చివరికి తెచ్చి, కొత్తగా వై’ని చేర్చి అల్ఫాబెటికల్ ఆర్డర్ని తయారు చేసింది వారేనట. అంటే ఎనిమిదో శతాబ్దం నుంచీ ఆంగ్ల అక్షరమాల ఇలాగే ఉందన్నమాట.