*తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఈనెల 18న భేటీ కానున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పలు రాజకీయ సమీకరణాలపై కేసీఆర్‌కు నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం. పార్టీ వీక్‌గా ఉన్న నియోజకవర్గాలపై సీఎంకు రిపోర్ట్ ఇవ్వనున్నట్లు తెలియవచ్చింది. కాగా అదే రోజు ప్రగతి భవన్‌లో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమం అనంతరం ప్రశాంత్ కిషోర్‌తో సీఎం కేసీఆర్ భేటీ కానున్నట్లు సమాచారం.
*అమడగూరు మండలం, లోకోజూపల్లిలో లక్ష్మీదేవి అనే మహిళ దారుణ హత్యకు గురైంది. అల్లుడు బాబు అత్త లక్ష్మీదేవిని కిరాతకంగా హతమార్చాడని స్థానికులు చెబుతున్నారు. తన భార్య ప్రవర్తన మారడానికి అత్త లక్ష్మీదేవే కారణమంటూ అల్లుడు బాబు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. భార్య మీద అనుమానంతో అత్తను హతమార్చాడని స్థానికులు చెబుతున్నారు.
*ఎస్.ఎన్ గొల్లపాలెం ఎంట్రన్స్‌లో వైసీపీ, టీడీపీ బ్యానర్లను గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. ఆదివానం అంకాలమ్మ తల్లి జాతర మూడేళ్లకు ఒక సారి జరుగుతుంది. ఈ జాతర సందర్భంగా గ్రామ ముఖ ద్వారం వద్ద వైసీపీ, టీడీపీ నాయకులు స్వాగత బ్యానర్లు ఏర్పాటు చేశారు. గత రాత్రి బ్యానర్లను గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు.
*అన్నవరం సత్యదేవుని ఉత్సవాలలో అధికారుల మందు విందు, చిందులు.. ఉత్సవాల ఊరేగింపులో మందేసి చిందేసిన ఆలయ అధికారులు, మరియు సిబ్బంది.. సినిమా పాటలకు డాన్సులు చేస్తూ, భక్తులు విస్తుపోయేలా చేశారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇటువంటి నృత్యాలు మందు విందులు చేస్తారా, అని భక్తులు ప్రశ్నిస్తున్నారు
వీడియోలు ప్రసారం చేసిన మీడియా సంస్థ ల నుంచి సంజాయిషీ ఇవ్వాలని ప్రెస్ నోట్ విడుదల చేసిన EO
*సచివాలయ ఉద్యోగులకు త్వరలో బదిలీలు.. జూన్ నెలాఖరు లోగా సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రొబేషన్ పూర్తయిన తర్వాత అర్హులైన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సాధారణ బదిలీలు తో పాటు అంతర్ జిల్లాల బదిలీలకు వీలు కల్పించేందుకు సీఎం జగన్ సుముఖత వ్యక్తం చేసినట్లు ఉద్యోగులు తెలిపారు. ఇందుకు గాను సీఎం జగన్ కు సచివాలయ ఉద్యోగులు కృతజ్ఞతలు తెలియజేశారు.
*10 వ తరగతి విద్యార్థులు పొందిన మార్కుల ఆధారంగానే వైయస్‌ఆర్ జిల్లా ఇడుపులపాయ రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీలలో 2022-23 విద్యాసంవత్సరానికి సీట్లు కేటాయించనున్నారు. కరోనా నేపథ్యంలో గత రెండేళ్లుగా ఆర్జీయూకేటీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించి విద్యార్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా సీట్లు కేటాయించింది. ఈసారి పదోతరగతి పరీక్షలు నిర్వహించడంతో యథావిధిగా విశ్వవిద్యాలయం ప్రారంభం నుంచి ఉన్న పద్దతి ప్రకారం ప్రతిభ ప్రాతిపదికన సీట్లు కేటాయించాలని నిర్ణయించారు. పదోతరగతి పరీక్షల ఫలితాలు వెల్లడైన రెండు, మూడురోజుల అనంతరం ట్రిపుల్‌ఐటీలలోని సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆర్జీయూకేటీ కులపతి. ఆచార్య కేసీరెడ్డి తెలిపారు.
*టమోటా ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. బహిరంగ మార్కెట్‌లో నాణ్యత కలిగిన కాయలు కిలో రూ.100 పలికింది. శనివారం రామకుప్పం మినీమార్కెట్ యార్డులో 15 కిలోల బాక్సు ధర గరిష్ఠంగా రూ.1150 , వి.కోట, కుప్పం, ఏడోమైలు మార్కెట్లలో రూ.1000 వరకు పలికింది. నాణ్యతను బట్టి రూ.850 నుంచి రూ.1150 పెట్టి వ్యాపారులు కొనుగోలు చేశారు. రీటైల్ మార్కెట్లో ధరలు మండాయి. కిలో నాణ్యతను బట్టి కిలో రూ.80 నుంచి రూ.100 వరకు విక్రయిస్తున్నారు. తమిళనాడు, కర్ణాటకలో మండుటెండలు, ఎడతెరపిలేని వర్షాల కారణంగా దిగుబడి తగ్గడం ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. మరో వైపు టమోటా ధరలు పెరగడంతో రైతులు సంతోషంగా ఉన్నారు.
*భారత 25వ ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC)గా Rajiv Kumar ఆదివారం మధ్యాహ్నం బాధ్యతలు చేపట్టారు. ఇంతవరకూ సీఈసీగా ఉన్న సుశీల్ చంద్ర తన పదవీ కాలం ముగియడంతో శనివారంనాడు పదవీ విరమణ చేశారు. ఆ స్థానంలో రాజీవ్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. సీనియర్ మోస్ట్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్‌ను సీఈసీగా కేంద్రం ఈ నెల 12న నియమించింది. ఆయన నియామకం 15వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. రాబోయే లోక్‌సభ, రాష్ట్రపతి ఎన్నికలు, ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఆయన ఆధ్వర్యంలోనే జరగనున్నాయి
*నెలలు నిండకముందే పుట్టి, శారీరక సమస్యలో ఉన్న శిశువుకు కిమ్స్ కడిల్స్ ఆస్పత్రి వైద్యులు శస్త్ర చికిత్స చేసి పూర్తిగా నయం చేశారు. వివరాలు క్లినికల్ డైరెక్టర్, సీనియర్ కన్సల్టెంట్ నియోనాటాలజీ, పీడియాట్రిక్స్ డాక్టర్ సి.అపర్ణ వివరించారు. సంగారెడ్డి ఫసల్‌వాడీ ప్రాంతానికి చెందిన చిన్నారికి పుట్టుకతోనే శరీరం లోపల ఉండాల్సిన పేగులు, ఇతర భాగాలు బయట కనిపిస్తున్నాయి. బృహద్దమని మూసుకుపోయింది. శిశువు తల్లిగర్భంలో ఉన్నప్పుడే అంఫలోసీల్ సమస్యను గుర్తించామని వైద్యులు తెలిపారు. అప్పటికే 26వారాలు గర్భం కావడంతో అబార్షన్‌కు అవకాశం లేకపోయిందన్నారు. డెవలరీ అయిన రెండో రోజు శిశువుకు డాక్టర్లు అనిల్, నాగరాజన్, సుదీప్ బృందం శస్త్ర చికిత్స చేసింది. పీడియాట్రిక్ సర్జన్లు డాక్టర మనీషారెడ్డి బృందంతో కృత్రిమ గ్రాఫ్ట్‌తో అంఫలోసీల్‌తో మూసివేశారు. ప్రస్తుతం శిశువు పూర్తిగా కోలుకోవడంతో డిచ్చార్జి చేశామని పేర్కొన్నారు.
* కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన ఉన్న తిరుమలలో ఏనుగుల సంచారం కలకలం రేపింది. ఆదివారం వేకువజామున పాపవినాశనం రోడ్డులో పార్వేట మండపం వద్ద ఏనుగులు గుంపు సంచరించాయి. రోడ్డు పక్కన డివైడర్లను, గోడలను ధ్వంసం చేశాయి. ఏనుగులను చూసిన వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. సంచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
* అసోంలో వరదలు బీభత్సం సృస్టిస్తున్నాయి. శనివారం సాయంత్రం కుంభవృష్టి కురువడంతో రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో వరదలు పోటెత్తాయి. దీంతో 94 గ్రామాలు నీటమునగగా, 24,681 మంది వరదల్లో చిక్కుకున్నారు. దిమా హసావ్ జిల్లాలోని 12 గ్రామాల్లో కొంచరియలు విరిగిపడ్డాయి. వరదల ధాటికి హాఫ్లాంగ్ ప్రాంతంలో ముగ్గురు మృతిచెందగా, 80 ఇండ్లు దెబ్బతిన్నాయి. ఒక్కసారిగా వరద పోటెత్తడంతో రోడ్డు కొట్టుకుపోయాయి.
* 10 వ తరగతి విద్యార్థులు పొందిన మార్కుల ఆధారంగానే వైయస్‌ఆర్ జిల్లా ఇడుపులపాయ రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీలలో 2022-23 విద్యాసంవత్సరానికి సీట్లు కేటాయించనున్నారు. కరోనా నేపథ్యంలో గత రెండేళ్లుగా ఆర్జీయూకేటీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించి విద్యార్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా సీట్లు కేటాయించింది. ఈసారి పదోతరగతి పరీక్షలు నిర్వహించడంతో యథావిధిగా విశ్వవిద్యాలయం ప్రారంభం నుంచి ఉన్న పద్దతి ప్రకారం ప్రతిభ ప్రాతిపదికన సీట్లు కేటాయించాలని నిర్ణయించారు. పదోతరగతి పరీక్షల ఫలితాలు వెల్లడైన రెండు, మూడురోజుల అనంతరం ట్రిపుల్‌ఐటీలలోని సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆర్జీయూకేటీ కులపతి. ఆచార్య కేసీరెడ్డి తెలిపారు.
* చారిత్రక పర్యాటక నగరం మహాబలిపురంలో చెస్ ఒలంపియాడ్ పోటీలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేపడుతోంది. ఆ మేరకు శనివారం ఉదయం సచివాలయంలో ముఖ్యమంత్రి స్టాలిన్ సమక్షంలో ఈ పోటీల నిర్వహణకు సంబంధించి అఖిల భారత చదరంగపు క్రీడా పోటీల సమాఖ్య (ఏఐసీఎ్‌ఫ)తో అవగాహన ఒప్పందం కుదిరింది. సమాఖ్య అధ్యక్షుడు సంజయ్ కపూర్ ఒప్పంద పత్రంపై సంతకం చేశారు. ఈ పోటీల్లో 186 దేశాలకు చెందిన రెండువేలకు పైగా చెస్ క్రీడాకారులు పాల్గొననున్నారు. ఈ పోటీలు వచ్చే జూలై 28 నుంచి ఆగస్టు 10 వ తేదీ వరకు నిర్వహించనున్నారు. దేశంలోనే తొలిసారిగా జరుగనున్న చెస్ ఒలంపియాడ్ పోటీలను నిర్వహించేందుకు ప్రభుత్వం భారీ సన్నాహాలు చేపడుతోందని ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. అవగాహన ఒప్పందం కుదిరిన తర్వాత సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జాతీయ చెస్‌క్రీడాకారులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరై అన్బు, యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖల మంత్రి మెయ్యనాధన్, ఆ శాఖ ప్రధాన కార్యదర్శి అపూర్వా, రాష్ట్ర క్రీడాభివృద్ధి సంస్థ మెంబర్ సెక్రటరీ భరత్‌సింగ్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ పోటీల నిర్వహణకుగాను ప్రత్యేకంగా 18 కమిటీలను ఏర్పాటు చేసినట్లు స్టాలిన్ తెలిపారు. ఆ మేరకు స్వాగత ఏర్పాట్ల కమిటీకి డి. జగన్నాథన్ రవాణా ఏర్పాట్ల కమిటీకి కె. గోపాల్ స్పాన్సర్‌షిప్ ఏర్పాట్ల కమిటీకి ఎస్. కృష్ణన్ ప్రారంభ ముగింపు సభల కమిటీకి డి. కార్తికేయన్ కనీస సదుపాయాల కమిటీకి శివదాస్ మీనా ఆతిథ్య కమిటీకి పి. చంద్రమోహన్ ప్రసారమాధ్యమాల కమిటీకి వీపీ జయశీలన్ భద్రతా ఏర్పాట్ల కమిటీకి డీజీపీ శైలేంద్రబాబు నాయకత్వం వహిస్తారని ఆయన వివరించారు.
*గోవా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రచారానికి వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తాగిన నీళ్ల బాటిల్ ధర రూ.850 అని ఆ రాష్ట్ర మంత్రి రవి నాయక్ బయటపెట్టారు. గోవాలో ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. రాబోయే రోజుల్లో నీళ్ల ధర ఆకాశానికి పెరుగుతుందని చెప్తూ.. అమిత్ షా తాగిన నీళ్ల బాటిల్ ధరను వెల్లడించారు.‘ప్రచారం కోసం వచ్చినప్పుడు హిమాలయ బ్రాండ్ నీళ్లు కావాలని షా అడిగారు. పనాజీ నుంచి 10 కిలోమీటర్ల దూరం నుంచి ఆ నీళ్ల బాటిళ్లను తెప్పించాం. ప్రస్తుతం స్టార్ హోటళ్లలోనూ ఒక్కో నీళ్ల బాటిల్ ధర రూ.150-160 ఉంటున్నది’ అని తెలిపారు.
*విజయవాడ దుర్గా ఫ్లైఓవర్ సమీపంలో ప్రకాశం బ్యారేజ్ వద్ద గుర్తు తెలియని 45. సం.మహిళ నీళ్లలోకి దూకడంతో సకాలంలో స్పందించిన ట్రాఫిక్ వన్. ఎస్ ఐ . చిట్టి బాబు. కానిస్టేబుల్. కనకరాజు. ప్రసాద్. హుటాహుటిన దగ్గరలో నున్న ఎన్డీఆర్ఎఫ్ బలగాలు రప్పించి మహిళలను ప్రాణాపాయం నుంచి రక్షించి 108. వాహనంలో ఆస్పత్రికి తరలించారు మహిళా వివరాలు తెలియాల్సి ఉంది.
*కర్నూలు రేంజ్ పరిధిలో రెండు జిల్లాల్లో 12 మంది ఎస్‌ఐలను బదిలీ చేశారు. వీరితో ముగ్గురు సీఐలను కూడా బదిలీ చేశారు. మొత్తం 15 మంది బదిలీకి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు.
* ఆర్టీసీకి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి వచ్చిన ఆదాయంలో తిరుపతి టాప్‌లో నిలిచింది. 40 రోజుల్లో రూ.60.48 కోట్లు వచ్చినట్లు జిల్లా ప్రజారావాణాధికారులు తెలిపారు. జిల్లాల విభజన తర్వాత తిరుపతి జిల్లాకు 11డిపోలు, 838 బస్సులను కేటాయించారు. ఇందులో సిటీ ఆర్డినరీ 12, పల్లె వెలుగు 221, హయ్యర్ 49, అల్ర్టా పల్లె వెలుగు 13, ఎక్స్‌ప్రెస్‌లు 127, సూపర్‌లగ్జరీ 53, అల్ర్టా డీలక్స్ 15, అమరావతి 12, గరుడ 4, డాల్ఫిన్‌క్రూజ్ 2, సప్తగిరి ఎక్స్‌ప్రెస్ 300, వెన్నెల 2, ఇంద్ర 8, మెట్రోఎక్స్‌ప్రెస్ 20 బస్సులు ఉన్నాయి. గతనెల 4న ఆర్టీసీని విభజించారు. అప్పటి నుంచి శుక్రవారం వరకు అంటే 40రోజుల్లో రూ.60.48 కోట్ల ఆదాయం సమకూరిందని అధికారులు పేర్కొన్నారు. తిరుమల, తిరుపతి మధ్య ప్ర యాణించే భక్తులు సంఖ్య ఎక్కువగా ఉండటంతోపాటు రెండేళ్ల తర్వాత శ్రీవారి దర్శనాలను పూర్తిస్థాయిలో పునఃప్రారంభించడం తదితర కారణాలతో తిరుమల, తిరుపతి, మంగళం, అలిపిరి డిపోల బస్సులు కళకళలాడాయి. అందువల్లే ఇతర జిల్లాల కంటే అధికంగా ఆదాయం లభించినట్లు అధికారులు అభిప్రాయపడుతున్నారు.
*ప్రధాని నరేంద్ర మోదీకి కర్ణాటకలోని హనుమద్ జన్మభూమి ట్రస్టు.. ట్రస్టీ గోవిందానంద సరస్వతి లీగల్ నోటీసు పంపించారు. టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి డిప్యుటేషన్ గడువు ముగిసినందున తక్షణం ఆయనను కేంద్రంలోని మాతృశాఖకు పంపించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సంబంధిత కేంద్ర శాఖలు, పలువురు అధికారులకు లేఖలు రాశారు. ఈ నెల 12న జారీ చేసిన లీగల్ నోటీసులో ఏం పేర్కొన్నారంటే.. ‘‘ధర్మారెడ్డి వాస్తవానికి కేంద్ర ప్రభుత్వ అధికారి. ఐడీఈఎస్(ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీస్) ద్వారా రక్షణ శాఖలో జాయింట్ సెక్రటరీ హోదాలో ఉద్యోగం చేస్తున్నారు. నిబంధనల మేరకు డిప్యుటేషన్‌పై బదిలీ అయితే గరిష్ఠంగా ఏడేళ్లకు మించి కొనసాగడానికి వీల్లేదు. ధర్మారెడ్డి ఇప్పటికి ఏడేళ్ల గరిష్ఠ వ్యవధిని పూర్తి చేశారు. శనివారంతో ఆయన గడువు ముగిసింది. కేంద్రం డిప్యుటేషన్ పొడిగింపు ఉత్తర్వులు ఇస్తే తప్ప ఆయన ఇపుడున్న హోదాలో కొనసాగే వీలు లేదు. దీన్ని పరిగణనలోకి తీసుకుని ఆయనను మాతృశాఖకు పంపండి’’ అని లీగల్ నోటీసులో పేర్కొన్నారు. కేంద్ర విభాగాలకు రాసిన లేఖల్లో.. ధర్మారెడ్డి తిరుమల ప్రతిష్ఠ దెబ్బతినేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు.
*అకాల వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా ఉండేలా మహానాడు వేదికను గుళ్లాపల్లి వద్ద గల మహి ఆగ్రోస్ ఆవరణలోకి మార్చాలని టీడీపీ నాయకులు ప్రాథమికంగా నిర్ణయించారు. శనివారం పలువురు ముఖ్య నాయకులువేదిక నిర్మాణ పనులు చేసే సంస్థ ప్రతినిధులుఆ స్థలాన్ని పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చారు. ఒంగోలు బైపా్‌సలోని ఖాళీ స్థలంలో నిర్వహించాలని తొలుత నిర్ణయించుకోవటంవర్షం వస్తే ప్రత్యామ్నాయంగా మినీ స్టేడియంను అధికారికంగా బుక్ చేసుకోవడానికి ప్రయత్నించడందానిని లీజుకిచ్చేందుకు ప్రభుత్వం నిరాకరించటం తెలిసిందే. దీంతో ప్రత్యామ్నాయంగా గుళ్లాపల్లి వద్ద ఉన్న మహి ఆగ్రోస్ స్థలాన్ని శనివారం పరిశీలించారు. దామచర్ల కుటుంబానికి భాగస్వామ్యం ఉన్న ఈ కంపెనీ ప్రస్తుతం ఖాళీగా ఉంది. తొలిరోజు వేల మంది ప్రతినిధులతో నిర్వహించే కార్యక్రమానికి అనువైన గోడౌన్ అందులో ఉంది. ఆ పక్కనే సుమారు ఎకరాలకు పైగా స్థలం ఖాళీగా ఉంది. దానిని చదును చేసి బహిరంగ సభ నిర్వహించుకోవచ్చని భావించారు. ఒంగోలులో బస సౌకర్యం తక్కువగా ఉన్నందున రాత్రికి గుంటూరువిజయవాడ వెళ్లేవారిని కూడా దృష్టిలో ఉంచుకుని మొత్తం మహానాడు కార్యక్రమాన్ని అక్కడే నిర్వహిస్తే అనువుగా ఉంటుందని భావిస్తున్నారు. అయితే బుధవారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వచ్చి చూసి అధినేత చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటారు
*‘రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలకు రక్షణ లేకుండా పోయింది. జగన్ పాలనలో మైనార్టీలపై అనేక అఘాయిత్యాలు జరుగుతున్నాయి’’ అని టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా ముస్తాక్ అహ్మద్ ధ్వజమెత్తారు. అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అండతో ఆయన అనుచరులు, వైసీపీ నేతలు కనేకల్ మండలం ఆలూరు మైనార్టీ వర్గానికి చెందిన హసీనా, ఆమె భర్త హుస్సేన్ బాషాలను నానా రకాలుగా హింసించారని ఆరోపించారు. శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో బాధితులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదును కూడా తీసుకోకుండా పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారని మండిపడ్డారు. హసీనాను ఎమ్మెల్యే అనుచరులు మక్బూల్, ముక్దసిర్ దారుణంగా హింసించి, అత్యాచారానికి ప్రయత్నించారని ఆరోపించారు. పోలీస్ కానిస్టేబుల్ హసీనాతో తెల్లకాగితంపై సంతకం పెట్టించుకుని, తర్వాత ఎఫ్‌ఐఆర్ రాశారని చెప్పారు. ముగ్గురు ఆడపిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంటామన్న హసీనా దంపతులకు ధైర్యం చెప్పి మీడియా ముందుకు తెచ్చామన్నారు. బాధితురాలు హసీనా మాట్లాడుతూ… మక్బూల్ బాషా, అతని కుమారుడు ముక్దసిర్ తనను దారుణంగా హింసించారని చెప్పారు. హసీనా భర్త హుస్సేన్ బాషా మాట్లాడుతూ.. తమ గ్రామంలో ఉంటే ప్రాణాలతో మిగులుతామనే నమ్మకం లేక ఊరొదిలి వచ్చామని వాపోయారు.
*అకాల వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా ఉండేలా మహానాడు వేదికను గుళ్లాపల్లి వద్ద గల మహి ఆగ్రోస్ ఆవరణలోకి మార్చాలని టీడీపీ నాయకులు ప్రాథమికంగా నిర్ణయించారు. శనివారం పలువురు ముఖ్య నాయకులు, వేదిక నిర్మాణ పనులు చేసే సంస్థ ప్రతినిధులు, ఆ స్థలాన్ని పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చారు. ఒంగోలు బైపా్‌సలోని ఖాళీ స్థలంలో నిర్వహించాలని తొలుత నిర్ణయించుకోవటం, వర్షం వస్తే ప్రత్యామ్నాయంగా మినీ స్టేడియంను అధికారికంగా బుక్ చేసుకోవడానికి ప్రయత్నించడం, దానిని లీజుకిచ్చేందుకు ప్రభుత్వం నిరాకరించటం తెలిసిందే. దీంతో ప్రత్యామ్నాయంగా గుళ్లాపల్లి వద్ద ఉన్న మహి ఆగ్రోస్ స్థలాన్ని శనివారం పరిశీలించారు. దామచర్ల కుటుంబానికి భాగస్వామ్యం ఉన్న ఈ కంపెనీ ప్రస్తుతం ఖాళీగా ఉంది. తొలిరోజు 10 వేల మంది ప్రతినిధులతో నిర్వహించే కార్యక్రమానికి అనువైన గోడౌన్ అందులో ఉంది. ఆ పక్కనే సుమారు 25 ఎకరాలకు పైగా స్థలం ఖాళీగా ఉంది. దానిని చదును చేసి బహిరంగ సభ నిర్వహించుకోవచ్చని భావించారు. ఒంగోలులో బస సౌకర్యం తక్కువగా ఉన్నందున రాత్రికి గుంటూరు, విజయవాడ వెళ్లేవారిని కూడా దృష్టిలో ఉంచుకుని మొత్తం మహానాడు కార్యక్రమాన్ని అక్కడే నిర్వహిస్తే అనువుగా ఉంటుందని భావిస్తున్నారు. అయితే బుధవారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వచ్చి చూసి అధినేత చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటారు
*ఓఎన్‌జీసీ పైపులైన్లతో నష్టపోయిన మత్స్యకారులకు పరిహారం ఇచ్చేది కేంద్రం. అదేదో తానే సొంత జేబులో నుంచి ఇస్తున్నట్లు జగన్ ఫోజులు కొట్టడం హాస్యాస్పదం. కేంద్రానికి చెందినవారిని పిలవకుండా అదేదో తన ఘనకార్యంగా చెప్పడం విడ్డూరం. మత్స్యకారులకు ఇప్పుడిచ్చిన పరిహారం కూడా సగమే. 6 నెలలుగా పరిహారం ఇవ్వకుండా తొక్కిపెట్టడం మత్స్యకారులకు జగన్మోసం కాదా? మిగిలిన సగం పెండింగ్ పెట్టడం జగన్మోసం కాదా? సాక్షి మీడియా యాడ్స్ చెల్లింపుల్లో సగం ఇలాగే పెండింగ్ పెట్టారా? సొంత మీడియాకో న్యాయం, మత్స్యకారులకో న్యాయమా?’’ అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. మత్స్యకారుల భరోసా కార్యక్రమంలో సీఎం చెప్పిన మాయ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మల్లాడి సత్యలింగ నాయకర్ పేరెత్తే అర్హత మీకుందా అని జగన్‌ను ప్రశ్నించారు. ఎంఎ్‌సఎన్ ట్రస్ట్ ఆస్తులు కబ్జా చేయాలని చూడలేదా? టీడీపీ అడ్డుకోవడంతో వెనక్కితగ్గడం నిజం కాదా? అని నిలదీశారు.
*టమోటా ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. బహిరంగ మార్కెట్‌లో నాణ్యత కలిగిన కాయలు కిలో రూ.100 పలికింది. శనివారం రామకుప్పం మినీమార్కెట్ యార్డులో 15 కిలోల బాక్సు ధర గరిష్ఠంగా రూ.1150 , వి.కోట, కుప్పం, ఏడోమైలు మార్కెట్లలో రూ.1000 వరకు పలికింది. నాణ్యతను బట్టి రూ.850 నుంచి రూ.1150 పెట్టి వ్యాపారులు కొనుగోలు చేశారు. రీటైల్ మార్కెట్లో ధరలు మండాయి. కిలో నాణ్యతను బట్టి కిలో రూ.80 నుంచి రూ.100 వరకు విక్రయిస్తున్నారు. తమిళనాడు, కర్ణాటకలో మండుటెండలు, ఎడతెరపిలేని వర్షాల కారణంగా దిగుబడి తగ్గడం ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. మరో వైపు టమోటా ధరలు పెరగడంతో రైతులు సంతోషంగా ఉన్నారు.
*ప్రధాని నరేంద్ర మోదీకి కర్ణాటకలోని హనుమద్ జన్మభూమి ట్రస్టు.. ట్రస్టీ గోవిందానంద సరస్వతి లీగల్ నోటీసు పంపించారు. టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి డిప్యుటేషన్ గడువు ముగిసినందున తక్షణం ఆయనను కేంద్రంలోని మాతృశాఖకు పంపించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సంబంధిత కేంద్ర శాఖలు, పలువురు అధికారులకు లేఖలు రాశారు. ఈ నెల 12న జారీ చేసిన లీగల్ నోటీసులో ఏం పేర్కొన్నారంటే.. ‘‘ధర్మారెడ్డి వాస్తవానికి కేంద్ర ప్రభుత్వ అధికారి. ఐడీఈఎస్(ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీస్) ద్వారా రక్షణ శాఖలో జాయింట్ సెక్రటరీ హోదాలో ఉద్యోగం చేస్తున్నారు. నిబంధనల మేరకు డిప్యుటేషన్‌పై బదిలీ అయితే గరిష్ఠంగా ఏడేళ్లకు మించి కొనసాగడానికి వీల్లేదు. ధర్మారెడ్డి ఇప్పటికి ఏడేళ్ల గరిష్ఠ వ్యవధిని పూర్తి చేశారు. శనివారంతో ఆయన గడువు ముగిసింది. కేంద్రం డిప్యుటేషన్ పొడిగింపు ఉత్తర్వులు ఇస్తే తప్ప ఆయన ఇపుడున్న హోదాలో కొనసాగే వీలు లేదు. దీన్ని పరిగణనలోకి తీసుకుని ఆయనను మాతృశాఖకు పంపండి’’ అని లీగల్ నోటీసులో పేర్కొన్నారు. కేంద్ర విభాగాలకు రాసిన లేఖల్లో.. ధర్మారెడ్డి తిరుమల ప్రతిష్ఠ దెబ్బతినేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు.
*ఆర్టీసీకి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి వచ్చిన ఆదాయంలో తిరుపతి టాప్‌లో నిలిచింది. 40 రోజుల్లో రూ.60.48 కోట్లు వచ్చినట్లు జిల్లా ప్రజారావాణాధికారులు తెలిపారు. జిల్లాల విభజన తర్వాత తిరుపతి జిల్లాకు 11డిపోలు, 838 బస్సులను కేటాయించారు. ఇందులో సిటీ ఆర్డినరీ 12, పల్లె వెలుగు 221, హయ్యర్ 49, అల్ర్టా పల్లె వెలుగు 13, ఎక్స్‌ప్రెస్‌లు 127, సూపర్‌లగ్జరీ 53, అల్ర్టా డీలక్స్ 15, అమరావతి 12, గరుడ 4, డాల్ఫిన్‌క్రూజ్ 2, సప్తగిరి ఎక్స్ ప్రెస్ 300, వెన్నెల 2, ఇంద్ర 8, మెట్రోఎక్స్‌ప్రెస్ 20 బస్సులు ఉన్నాయి. గతనెల 4న ఆర్టీసీని విభజించారు. అప్పటి నుంచి శుక్రవారం వరకు అంటే 40రోజుల్లో రూ.60.48 కోట్ల ఆదాయం సమకూరిందని అధికారులు పేర్కొన్నారు. తిరుమల, తిరుపతి మధ్య ప్ర యాణించే భక్తులు సంఖ్య ఎక్కువగా ఉండటంతోపాటు రెండేళ్ల తర్వాత శ్రీవారి దర్శనాలను పూర్తిస్థాయిలో పునఃప్రారంభించడం తదితర కారణాలతో తిరుమల, తిరుపతి, మంగళం, అలిపిరి డిపోల బస్సులు కళకళలాడాయి. అందువల్లే ఇతర జిల్లాల కంటే అధికంగా ఆదాయం లభించినట్లు అధికారులు అభిప్రాయపడుతున్నారు.
*కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ సహా పలువురు సీనియర్ ఆటగాళ్లకు దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీ్‌సకు విశ్రాంతి ఇవ్వనున్నారు. అలాగే విరాట్ కోహ్లీ, బుమ్రా, రిషభ్ పంత్ తదిరులు కూడా ఆ సిరీ్‌సలో పాల్గొనడంలేదు. ఈ నేపథ్యంలో సీనియర్ ఓపెనర్ ధవన్, ఈసారి ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌ను సమర్థంగా నడిపిస్తున్న హార్దిక్ పాండ్యాలలో ఒకరికి టీమిండియా కెప్టెన్సీ అప్పగించే అవకాశాలున్నాయి. దక్షిణాఫ్రికాతో సిరీస్ వచ్చేనెల 9న మొదలవనుంది. ఇక ఆ సిరీ్‌సకు జట్టును ఈనెల 22న ఎంపిక చేస్తారు.
*దక్షిణ డిస్కమ్(ఎస్పీడీసీఎల్)లో ఏప్రిల్ నెల వినియోగానికి సంబంధించి రూ.1094.39 కోట్ల మొత్తానికి బిల్లులు జారీ చేశారు. గృహ, గృహేతర వినియోగదారులకు జారీ అయిన బిల్లులను పరిశీలిస్తే.. అవి భారీగా ఉన్నాయి. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కరెంట్ చార్జీలు పెరిగిన విషయం విదితమే. ఏప్రిల్‌లో గృహ విద్యుత్ వినియోగం కూడా గణనీయంగా పెరిగింది. ఇక ఫిబ్రవరి నెల వినియోగానికి సంబంధించి మార్చిలో రూ.627.48 కోట్ల మొత్తానికి బిల్లులు జారీ కాగా.. మార్చి వినియోగానికి సంబంధించి ఏప్రిల్‌లో జారీ అయిన బిల్లులు రూ.894.53 కోట్లుగా ఉన్నాయి. ఏటా మార్చి, ఏప్రిల్, మే నెలలో భారీగా గృహ వినియోగం ఉంటుంది. అయితే ఈ దఫా కరెంట్ బిల్లులే కాదు.. ఎండలూ పెరిగాయి. దీంతో వినియోగానికి కరెంట్ చార్జీల పెరుగుదల కూడా కలవడంతో ఏప్రిల్ నెల వినియోగానికి భారీగా బిల్లులు వచ్చాయి. చార్జీల భారంతో పెరిగిన బిల్లులు ఏ మేర ఉంటాయనే దానిపై జూన్ నెల వినియోగంతోనే (జూలైలో జారీ అయ్యే బిల్లులు) స్పష్టత రానుంది. కరెంట్ చార్జీలను లోటెన్షన్(ఎల్టీ) కేటగిరిలో గృహ వినియోగదారులకు యూనిట్‌కు 0.50 పైసలు, అదే గృహేతర, హెచ్‌టీ వినియోగదారులకు యూనిట్‌కు రూపాయి చొప్పున చార్జీలు పెరిగాయి.
*సీపీఎ్‌సకు ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వం తెస్తున్న జీపీఎ్‌సకు నిరసనగా ఆదివారం విజయవాడలో ఏపీసీపీఎస్ ఉద్యోగుల సంఘం తలపెట్టిన నిరసన దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. వారం రోజుల కిందట అనుమతి కోరితే చివరి నిమషంలో అనుమతి ఇవ్వకపోవడం బాధాకరమని ఏపీసీపీఎస్ ఉద్యోగుల సంఘం మీడియా ఇన్‌చార్జి గంటా వీర్రాజు అన్నారు. వంద మందితో, శాంతియుతంగా నిరసన దీక్ష చేపట్టాలని నిర్ణయించామని, అయినా ఎందుకు అనుమతి ఇవ్వడంలేదో అర్థం కావటం లేదన్నారు. సమస్యలపై ఉద్యమిస్తుంటే నిర్బంధాలు విధించడం దారుణమన్నారు.
*అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్ రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఆయన దానిని నిలుపుకోవాలి. ఆ మేరకు జీపీఎస్ కాదు… ఓపీఎస్ ఇవ్వాలి’’ అని ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. శనివారం అనంతపురం వచ్చిన ఆయన నగరంలోని కృష్ణకళామందిర్‌లోని రెవెన్యూ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సీపీఎస్ రద్దుకు మూడేళ్లుగా 2 లక్షల మంది ఉద్యోగులు ఎదురు చూస్తున్నారన్నారు. ఇప్పుడు సీపీఎస్ బదులు జీపీఎ్‌సను ప్రభుత్వం తెరపైకి తీసుకురావడం అందరినీ ఆవేదనకు లోనుచేస్తోందన్నారు. సచివాలయ ఉద్యోగులు పరీక్ష పాసైతేనే రెగ్యులర్ చేస్తామనడం సరికాదన్నారు. జూన్ 30 నాటికి పరీక్షలు పాస్ నిబంధనతో సంబంధం లేకుండా 1.10 లక్షల మంది సచివాలయ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి, పేస్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అర్హత, నిబంధనల మేరకు ఎంపికైన కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరిస్తామని సీఎం మాటిచ్చారనీ, దానిని నిలుపుకోవాలని బొప్పరాజు కోరారు.
*టీటీడీ పాలకమండలి పనితీరుపై విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడున్న పాలకమండలి పెద్దగా ధార్మిక కార్యక్రమాలు చేపట్టినట్టు దాఖలాలు లేవని వ్యాఖ్యానించారు. తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా ఆలయానికి వచ్చిన ఆయన భక్తులనుద్దేశించి మాట్లాడారు. టీటీడీ పాలకమండలికి బుద్ధిమాంద్యమో లేక కరోనా కారణమో తెలియదు కానీ నిస్తేజంగా ఉందని వ్యాఖ్యానించారు. పక్కనే ఉన్న తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర రెడ్డిని ఉద్దేశించి.. ఆయన టీటీడీ చైర్మన్‌గా ఉన్నప్పుడు అనేక ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారని, శారదా పీఠం కూడా ఆయనకు అండగా ఉండేదని గుర్తుచేశారు. కరుణాకర రెడ్డి లాంటి మరోవ్యక్తి టీటీడీ పాలకమండలికి రాబోరని కితాబిచ్చారు. తిరుపతిలో ఆదిశంకరాచార్య విగ్రహం ప్రతిష్ఠించాలని కరుణాకర రెడ్డిని కోరారు. శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర, మంత్రి కారుమూరు శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం తిరుమల శారదా పీఠానికి చేరుకున్న స్వరూపానందేంద్రకు టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు.
*హిందూ మహాసముద్రం నుంచి బంగాళాఖాతం వైపు బలంగా రుతుపవన గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసరాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా ఉత్తర కోస్తా పరిసరాల్లో సముద్ర మట్టానికి 1.5 కి.మీ. నుంచి 5.8 కి.మీ. మధ్యన ఉపరితల ఆవర్తనం ఉంది. ఇంకా అరేబియా సముద్రం నుంచి దక్షిణాది రాష్ట్రాలపైకి తేమగాలులు వీస్తున్నాయి. వీటన్నింటి ప్రభావంతో శనివారం రాయలసీమ, కోస్తాల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి. మిగిలిన ప్రాంతాల్లో ఉక్కపోత, ఎండ తీవ్రత కొనసాగాయి. రానున్న 24 గంటల్లో రాయలసీమ, కోస్తాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
*లబ్ధిదారులకు పంపిణీ చేసే రేషన్ డోర్ డెలివరీ వాహనాల ఆపరేటర్లు సమ్మె బాట పడుతున్నారు. రాయితీ నగదు వసూలు చేయడం, ప్రభుత్వమే కడతామన్న బీమా ప్రీమియం భారాన్ని తమపై మోపడం, కరోనా సమయంలో చనిపోయిన ఆపరేటర్ల కుటుంబాలకు పరిహారం ఇవ్వకపోవడం వంటి సమస్యలపై వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా సమ్మెకు దిగాలని నిర్ణయించారు. ఈ మేరకు ఏపీ రాష్ట్ర ఎండీయూ ఆపరేటర్ల యూనియన్ తరఫున అన్ని జిల్లాల్లో కలెక్టర్లు, తహసీల్దార్లకు సమ్మె నోటీసులు అందజేస్తున్నారు. ఈ నెల 25లోగా ఈ ప్రక్రియ పూర్తిచేసి జూన్ 1 నుంచి పూర్తిస్థాయిలో సమ్మెకు దిగాలని నిర్ణయించారు. రేషన్ పంపిణీలో డోర్ డెలివరీ విధానాన్ని ప్రవేశపెట్టిన వైసీపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 9,260 వాహనాలను రాయితీపై లబ్ధిదారులకు అప్పగించింది. తొలుత అందరి నుంచి 10% నగదు రూ.63 వేలు కట్టించుకుని వాహనాలు ఇచ్చింది.
*‘మేనిఫెస్టో… భగవద్గీత, బైబిల్, ఖురాన్‌తో సమానం. మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలలో 95 శాతం ఇప్పటికే అమలు చేశాం’ అని సీఎం జగన్‌రెడ్డి చెప్పడం హాస్యాస్పదమని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. శనివారం ఆయన ఒక ప్రకటన చేశారు. జగన్‌రెడ్డి ఇచ్చిన హామీలు, అమలు చేస్తున్నామంటున్న పథకాలు, క్షేత్ర స్థాయిలో వాటి అమలు తీరును వివరిస్తూ సునిశిత విమర్శ చేశారు. అదే సమయంలో మద్యం, ఇసుక, సిమెంటు, పెట్రోలు, డీజలు ధరలు, విద్యుత్, ఆర్టీసీ చార్జీలు పెంచి ప్రజల జేబుల్లో నుంచి ప్రభుత్వం రూ.3.40 లక్షల కోట్లు దోచుకున్నది, రూ.5 లక్షల కోట్లు అప్పు తెచ్చి ప్రజల నెత్తిమీద అప్పుల భారం మోపిందీ వాస్తవం కాదా అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం జేబుదొంగ పాత్ర పోషిస్తోందని ప్రజలకు అర్థమైందన్నారు. అందుకే గడప గడపలో గడబిడ జరుగుతోందని తులసిరెడ్డి విమర్శించారు.
*ఉన్నత విద్యామండలి ఎక్స్‌లెన్స్ అవార్డుల దరఖాస్తు గడువు ఏప్రిల్‌తో ముగిసినా, పలు విజ్ఞప్తుల మేరకు ఈ నెలాఖరు వరకు పొడిగించినట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ విశ్వవిద్యాలయాల పరిధిలో చదువుతున్న విద్యార్థులకు ఎక్స్‌లెన్స్ అవార్డులు ఇవ్వనున్నారు. వీటికింద ఎంపికయ్యేవారికి వరుసగా లక్ష రూపాయలు, రూ.60వేలు, రూ.30వేలు, మరో నలుగురికి రూ.10వేల చొప్పున అందజేస్తామని తెలిపారు. ఏపీఎ్‌ససీహెచ్‌ఈ.ఏపీ.గవ్.ఇన్/ఎక్స్‌లెన్స్ అవార్డు అనే వెబ్‌సైట్ ద్వారా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
* ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న విభజన వివాదాల పరిష్కారానికి ఏర్పాటైన కేంద్ర హోం శాఖ సబ్ కమిటీ ఈ నెల 25న మరోసారి సమావేశంకానుంది. హోం శాఖ సంయుక్త కార్యదర్శి (కేంద్ర రాష్ట్రాల) అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్సు ద్వారా జరిగే సమావేశంలో పాల్గొనాలని తెలంగాణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావు, ఏపీ ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్‌కు కేంద్ర హోం శాఖ లేఖ రాసింది. నాలుగు అంశాలతో సమావేశ ఎజెండాను ఖరారు చేశారు. ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన, రాష్ట్ర విభజన చట్టంలోని షెడ్యూల్ 9 సంస్థల విభజన, సింగరేణి, ఏపీ భారీ యంత్రాల ఇంజనీరింగ్ సంస్థ (ఆప్మెల్) విభజన, చట్టంలో ఎక్కడా పేర్కొని లేని సంస్థల విభజన గురించి సమావేశంలో చర్చించనున్నారు.
*హైదరాబాద్, కాకినాడ నుంచి తిరుపతికి వేసవి ప్రత్యేక రైళ్లను వేశారు. హైదరాబాద్-తిరుపతి(07433) రైలు ఈ నెల 17న, తిరుపతి-హైదరాబాద్(07434) 19న.. అలాగే.. తిరుపతి-కాకినాడ(07435) 18న, కాకినాడ-తిరుపతి(07436) 19న బయలుదేరతాయని అధికారులు తెలిపారు.
*త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ దేవ్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మానిక్ సాహా నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. బీజేపీ రాష్ట్ర శాఖలో ఇటీవల అంతర్గత పోరు కొనసాగుతోంది. దీంతో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో సీఎంను మార్చాలని అధిష్ఠానం నిర్ణయించింది. గురువారం ఢిల్లీ వెళ్లి హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలను కలిసి వచ్చిన విప్లవ్ దేవ్ శనివారం గవర్నర్ ఎస్‌ఎన్ ఆర్య కు రాజీనామా లేఖను అందజేశారు. అనంతరం సమావేశమైన బీజే పీ శాసనసభాపక్షం మానిక్ సాహాను తమ నేతగా ఎన్నుకుంది. ఈ విషయాన్ని ట్విటర్‌లో వెల్లడించిన విప్లవ్ దేవ్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. డెం టిస్ట్ అయిన సాహా గతనెలలోనే రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. కాగా, విప్లవ్‌దేవ్ అసమర్థతపై బీజేపీ బాస్‌లు విసిగిపోయారంటూ తృణమూల్ కాంగ్రెస్ విమర్శించింది.
*ఓటరు జాబితాతో ఆధార్ అనుసంధానించే విషయ మై కేంద్ర ప్రభుత్వం త్వరలో నిబంధనలు జారీ చేయనుంది. ఆధార్ వివరాలు సమర్పించడం స్వచ్ఛందమే అయినప్పటికీ, ఇవ్వననడానికి తగిన కారణాలు చెప్పాల్సి ఉంటుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా శనివారం పదవీ విరమణ చేసిన సుశీల్ చంద్ర ఈ విషయాలు వెల్లడించారు.
*ఇప్పటికే బాబ్రీ మసీదును కోల్పోయిన ముస్లింలు.. మరో మసీదును కోల్పోవాలని కోరుకోవడం లేదని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. జ్ఞానవాపి మసీదు సర్వేపై వారాణసీ కోర్టు తీర్పు 1991 నాటి ప్రార్ధనా స్థలాల చట్టాన్ని ఉల్లంఘించడమే అన్నారు.
* త్రిపుర కొత్త ముఖ్యమంత్రిగా పార్లమెంటు సభ్యుడు (రాజ్యసభ) డాక్టర్ మాణిక్ సాహాను బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది. బిప్లబ్ కుమార్ దేబ్ శనివారంనాడు రాజీనామా చేయడంతో కొత్త సీఎం పేరును పార్టీ ప్రకటించింది. మాణిక్ సాహా సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. లెజిస్లేచర్ పార్టీ నేతగా ఎన్నికైన డాక్టర్ మానిక్ సహాకు (69) బిప్లవ్ కుమార్ దేబ్ ఒక ట్వీట్‌లో అభినందనలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ విజన్, ఆయన నాయకత్వంలో త్రిపుర అభ్యుదయ పథంలో సాగుతుందనే నమ్మకం తనకుందని ఆయన అన్నారు. 2023లో త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో నాయకత్వం మార్పు ప్రాధాన్యం సంతరించుకుంది.
* గోనెగండ్ల మండలం, పెద్ద మర్రివీడు సర్పంచ్ మౌనిక కు గోల్డ్ మెడల్ వచ్చింది. అనంతపురం జేఎన్టీయూలో ఎంటెక్‌లో ఈఈఈ గ్రూపులో యూనివర్సిటీ టాపర్‌గా మౌనిక నిలిచింది. ఈ సందర్బంగా జేఎన్‌టీయూ పన్నెండవ స్నాతకోత్సవంలో ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ చేతుల మీదుగా మౌనిక గోల్డ్ మెడల్, సర్టిఫికెట్ అందుకుంది. కాగా 2021లో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో మౌనిక పోటీ చేసి విజయం సాధించింది.
* తూర్పు గోదావరి: జిల్లాలో మరోసారి కరోనా లకలం రేపింది. కొత్తగా రెండు కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మలికిపురంకు చెందిన యువకుడు అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కొవిడ్ పరీక్ష చేయగా పాజిటీవ్‌గా నిర్ధారణ అయింది. అలాగే రాజమండ్రిలోని ఓ వార్డు సచివాలయం ఉద్యోగికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో ఆయనకు ప్రభుత్వ ఆసుపత్రి కొవిడ్ వార్డ్‌లో ఉంచి చికిత్స అందజేస్తున్నారు.
* దేశంలో కరోనా వైరస్ మళ్లీ అక్కడక్కడ విస్తరిస్తోంది. దేశంలో కొత్తగా 2,487 కరోనా కేసులు నమోదు అవగా, కోవిడ్ వల్ల 13 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 17,692 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి కోలుకొని 2878 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశవ్యాప్తంగా కరోనా కారణంగా మొత్తం 5,24,214 మంది మృతి చెందినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.