రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు దావోస్ పర్యటనకు వెళ్తోన్న తెలంగాణ మంత్రి కేటీఆర్, యూకేలో ఉన్న ప్రవాస భారతీయులు థ్యాంక్స్ చెప్పారు. దావోస్లో జరిగే సమావేశానికి హాజరవడానికి ముందు ఆయన యూకేలో కూడా పర్యటిస్తున్నారు.ఈ సందర్భంగా యూకేలో ఉన్న తెలంగాణ ఎన్నారైలు కేటీఆర్కు ఘన స్వాగతం పలికారు. లండన్ నగరంలో భారీ హోర్డింగులు ఏర్పాటు చేశారు. నంబర్ ప్లేట్ కేటీఆర్ అని ఉన్న కారులో ఆయన్ని ఎయిర్పోర్టులో రిసీవ్ చేసుకున్నారు. దీంతో తనకు లభించిన ఘన స్వాగతాన్ని గుర్తు చేసుకుంటూ మంత్రి కేటీఆర్ ట్విటర్లో ప్రవాస తెలంగాణ ఎన్నారైలకు కృతజ్ఞతలు తెలిపారు.
https://twitter.com/KTRTRS/status/1526799664099602432/photo/1
యూకేలోని ప్రవాసులకు థ్యాంక్స్: కేటీఆర్
