NRI-NRT

బ్రిటన్‌లో సత్తా చాటిన భారత్‌కు చెందిన వ్యాపారవేత్త

Auto Draft

ఇండియాకు చెందిన వ్యాపారవేత్త సునీల్ చోప్రా బ్రిటన్‌లో సత్తా చాటారు. లండన్ బరో ఆఫ్ సౌత్‌వార్క్‌కు తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆయన రెండోసారి మేయర్‌గా ఎన్నికయ్యారు. నగర మేయర్‌గా శనివారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. లండన్ బరో ఆఫ్ సౌత్‌వార్క్‌కు చోప్రా 2014-15 సంవత్సరంలో కూడా మేయర్ బాధ్యతలు నిర్వర్తించారు. అంతకు ముందు 2013-14లో డిప్యూటీ మేయర్‌గా పని చేశారు. ఢిల్లీలో పుట్టిన చోప్రా అక్కడి వొకేషనల్ స్టడీస్ కాలేజీ తొలి అధ్యక్షుడిగా పనిచేశారు. కాలేజీ రోజుల్లో ఆయన ఢిల్లీ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా, ఎన్‌ఎస్‌యూఐ ఢిల్లీ అధ్యక్షుడిగా పనిచేశారు.