Movies

దాచేస్తే దాగదు..

దాచేస్తే దాగదు..

సెలబ్రిటీల వ్యక్తిగతం జీవితంపై ప్రతి ఒక్కరికి ఆసక్తి ఉండటం సహజమని, అనవసరమైన చర్చలకు తావు లేకుండా తన ప్రేమ వ్యవహారాన్ని అందరికి తెలియజేశానని చెప్పింది పంజాబీ సుందరి రకుల్‌ప్రీత్‌సింగ్‌. బాలీవుడ్‌ నిర్మాత జాకీ భగ్నానీతో ఈ భామ కొంతకాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని కొన్ని నెలల క్రితం ఆమె సోషల్‌మీడియా ద్వారా వెల్లడించింది. రకుల్‌ప్రీత్‌సింగ్‌ మాట్లాడుతూ ‘ప్రేమలో పడటం చాలా సహజమైన విషయం. దాని గురించి ఏవో ఊహాగానాలు చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. మేమిద్దరం ప్రేమలో పడిన తొలిరోజుల్లోనే ఎలాంటి దాపరికం లేకుండా మా బంధం గురించి అందరికి చెప్పాలని నిర్ణయించుకున్నాం. అలా చెప్పడమే మంచిదైంది. ఒకవేళ మా వ్యవహారాన్ని దాచిపెట్టి ఉంచితే మీడియాలో వచ్చే రకరకాల కథనాలతో మనశ్శాంతి కరువయ్యేది’ అని చెప్పింది.