NRI-NRT

సిలికానాంధ్ర మనబడి లో సెప్టెంబర్ 10 నుండి ప్రవేశాలు

సిలికానాంధ్ర మనబడి లో సెప్టెంబర్ 10 నుండి ప్రవేశాలు

సిలికానాంధ్ర మనబడి నూతన విద్యాసంవత్సరం సెప్టెంబర్ 10, 2022 నుండి ప్రారంభం కాబోతోంది. నేటి వరకు అమెరికా, కెనడాలలో 75,000 మందికి పైగా విద్యార్థులకు తెలుగు భాష నేర్పిన ఘనత ఒక్క సిలికానాంధ్ర మనబడికే దక్కింది! పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం” వారి అనుబంధంతో, ప్రతిష్ఠాత్మక ACS-WASC (USA) వారి అధికారిక గుర్తింపు పొంది, అనేక స్కూల్ డిస్ట్రిక్టులలో ఫారిన్ లాంగ్వేజ్ (FLC) గుర్తింపు లభించిన ఏకైక తెలుగు విద్యాలయం సిలికానాంధ్ర మనబడి! ఇందుకు అహర్నిశలూ శ్రమిస్తోన్న 2,000 మందికి పైగా ప్రణాళిక, కీలక నాయకత్వబృందాలు, మనబడి కేంద్ర సమన్వయకర్తలు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద కార్యకర్తలకూ మరియు గత 15 సంవత్సరాలుగా మనబడి వెన్నంటి ప్రోత్సహిస్తోన్న తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులకు మనబడి మనఃపూర్వక ధన్యవాదాలు తెలుపుతోంది!
మీ పిల్లలను నేడే మనబడిలో నమోదు చేయండి!
నమోదుకు: https://manabadi.siliconandhra.org/
ప్రశ్నలుంటే: 1 (844) 626-BADI (2234) లేదా info@manabadi.siliconandhra.org సంప్రదించండి.
సిలికానాంధ్ర మనబడి లో సెప్టెంబర్ 10 నుండి ప్రవేశాలు