చారు.. దక్షిణ భారతీయ భోజనంలో తప్పనిసరి. తమలపాకులను కలిపి కూడా చారు చేస్తారనే విషయం చాలామందికి తెలియదు. ఇది ఆరోగ్యకరమైంది కూడా. జలుబు, దగ్గు తదితర సమస్యలను తగ్గిస్తుంది. జీవక్రియలను మెరుగుపరుస్తుంది. దీన్ని చేయడమూ తేలికే. జీలకర్ర, మిరియాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిరప, వెల్లుల్లి రెమ్మలతోపాటు తమలపాకులను మిక్సీలో వేసుకోవాలి.మిశ్రమం కచ్చాపచ్చాగా అయ్యేవరకు రుబ్బుకోవాలి. మిశ్రమానికి టమాట చేర్చాలి. తర్వాత కడాయిలో నెయ్యి వేసుకొని మెంతులు, ఆవాలు, ఇంగువ, కరివేపాకుతో కలిపి వేయించాలి. దీనికి చింతపండు రసం, ఉప్పు కలపాలి. తమలపాకు మిశ్రమాన్ని జోడించి, బాగా మరిగించుకుంటే రసం సిద్ధం.