కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఐశ్వర్య మెరిసింది. అక్కడ నుండే తన ప్రెగ్నెన్సీ గురించి రూమర్స్ వైరల్ అయ్యాయి. ఒకప్పుడు హీరోయిన్లుగా చాలామంది ప్రేక్షకులకు క్రష్‌గా మారిన చాలామంది హీరోయిన్లు ప్రస్తుతం వారి పర్సనల్ లైఫ్‌తోనే బిజీ అయిపోయారు. చాలావరకు హీరోయిన్లు పెళ్లి తర్వాత నటించడానికి పెద్దగా ఇష్టపడరు. అలాగే ఫరెవర్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ కూడా పెళ్లి తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు. తాజాగా ఓ ఐశ్వర్య గురించి వైరల్ అయిన ఓ వీడియోలో తన ప్రెగ్నెంట్ అని బాలీవుడ్ మీడియా ప్రచారం చేస్తోంది. ఐశ్వర్య రాయ్.. హీరోయిన్‌గా తన కెరీర్ ఫుల్ ఫామ్‌లో ఉండగానే బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్‌ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత పలు కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలలో నటించినా.. అవేవీ కమర్షియల్ సక్సెస్ సాధించకపోవడంతో మళ్లీ సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇటీవల జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022లో ఐశ్వర్య రాయ్ మెరిసింది. కానీ అక్కడ నుండే తన ప్రెగ్నెన్సీ గురించి రూమర్స్ వైరల్ అయ్యాయి. వెనక్కి తగ్గనంటూ.. భారీ గౌన్లతో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022కు హాజరయ్యింది ఐశ్వర్య రాయ్. అయితే అక్కడ నుండి తిరిగి వస్తున్న సమయంలో ఎయిర్‌పోర్టులో భర్త అభిషేక్ బచ్చన్, కూతురు ఆరాధ్యతో ఐశ్వర్య ఉన్న ఫోటోలు బయటికొచ్చాయి. అయితే ఈ ఫోటోలు తీస్తున్న సమయంలో ఐశ్వర్య తన పొట్టను ఊరికే కవర్ చేసుకుంటూ ఉండడంతో తను ప్రెగ్నెంట్ అని నెటిజన్లు భావిస్తున్నారు.