గతేడాది విడుదలైన ‘ అఖండ ‘ చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది . ఈ సినిమా టికెట్ ధరలు పెంచకుండానే మంచి వసూళ్లు రాబట్టి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇప్పటివరకు వీరిద్దరూ కలిసి చేసిన మూడు సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. గతేడాది విడుదలైన ‘ అఖండ ‘ చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది . ఈ సినిమా టికెట్ ధరలు పెంచకుండానే మంచి వసూళ్లు రాబట్టి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. బాలయ్య ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా దాదాపుగా రూ.125 కోట్లకు పైగా వసూలు చేసింది అయితే ఈ సినిమా చివర్లో సీక్వెల్ ఉంటుందని దర్శకుడు బోయపాటి హింట్ ఇచ్చాడు. ప్రస్తుతం బోయపాటి కూడా అదే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ‘అఖండ 2’ సినిమాకి సంబంధించి రచయితలతో కథా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. నిజానికి అఖండ మూవీ తర్వాత బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో ఓ పొలిటికల్ మూవీ రావాల్సి ఉంది. వచ్చే ఎన్నికలలోగా ఈ సినిమాని విడుదల చేసేలా ప్లాన్ చేశారు.. అయితే ఇప్పుడు ‘అఖండ’ సీక్వెల్ పై బోయపాటి దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. రుద్ర సికిందర్ అఘోరాను తలదన్నేలా బోయపాటి కథను సిద్ధం చేస్తున్నాడని సమాచారం.. ‘అఖండ’ చిత్రాన్ని నిర్మించిన మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సీక్వెల్‌ను భారీ బడ్జెట్‌తో రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారట.. అయితే ఈ సీక్వెల్ ని పాన్ ఇండియా లెవల్ లో తీసుకెళ్లేందుకు బోయపాటి ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం బాలయ్య గోపీచంద్ మలినేని ఓ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత అనిల్ రావిపూడితో ఓ సినిమా చేయనున్నాడు. ఆ రెండు సినిమాలు పూర్తయ్యాక ‘అఖండ 2’ సెట్స్ పైకి వెళ్లనుంది.