Movies

డార్లింగ్స్‌ప్రత్యేకం

డార్లింగ్స్‌ప్రత్యేకం

బాలీవుడ్‌ అగ్ర కథానాయిక అలియాభట్‌ నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న తొలి చిత్రం ‘డార్లింగ్స్‌’. షారుఖ్‌ఖాన్‌కు చెందిన రెడ్‌చిల్లీస్‌ సంస్థ కూడా నిర్మాణ భాగస్వామిగా ఉంది. తల్లీకూతుళ్ల అనుబంధాన్ని ఆవిష్కరిస్తూ వినోదప్రధానంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.అలియాభట్‌ తల్లి పాత్రలో షఫాలీషా నటిస్తున్నది. ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయబోతున్నట్లు అలియాభట్‌ తెలిపింది. ఆమె మాట్లాడుతూ ‘నిర్మాతగా తొలిచిత్రమిది కాబట్టి నా కెరీర్‌లో ప్రత్యేకమని భావిస్తున్నా. చక్కటి వినోదాన్ని పండిస్తూనే సస్పెన్స్‌, థ్రిల్లర్‌గా మెప్పిస్తుంది.త్వరలో నెట్‌ఫ్లిక్స్‌ ద్వారా మీ ముందుకొస్తుంది’ అని పేర్కొంది. ఈ చిత్రానికి జష్మీత్‌ కీ రీన్‌ దర్శకత్వం వహించారు. అలియాభట్‌ ప్రస్తుతం కరణ్‌జోహార్‌ దర్శకత్వంలో ‘రాఖీ ఔర్‌ రాణీకి ప్రేమ్‌ కహానీ’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.