ఆధునిక కాలంలో గుండె జబ్బుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన తర్వాత వచ్చే గుండె జబ్బులు ఇప్పుడు చిన్న వయసులోనే వస్తున్నాయి. మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, మానసిక ఒత్తిడి గుండెజబ్బులకు కారణమవుతున్నాయి. గుండెపోటు వచ్చిన వ్యక్తుల్లో గుండె రక్తప్రసరణ సాధారణ స్థాయి కంటే తక్కువుంటుంది. అందువల్ల ఆ వ్యక్తి నడిచినా, మెట్లెక్కినా ఆయాసం, గుండెలో నొప్పి, గుండె పట్టేసినట్లు ఉండడం, ఒక్కోసారి భోజనం చేసిన తర్వాత కూడా ఇలా జరగొచ్చు. అయితే తాజా అధ్యయనం మరో షాకింగ్ విషయాన్ని వెళ్లడించింది. వంధ్యత్వం ఉన్న మహిళలు గుండెపోటుతో బాధపడుతున్నారని పరిశోధనలో వెల్లడైంది.
అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాజీ జర్నల్ లో ఈ పరిశోధన ఫలితాలు ప్రచురించబడ్డాయి. ఈ పరిశోధన ప్రకారం.. పిల్లలు ఉన్న మహిళల కంటే వంధ్యత్వం ఉన్న మహిళలకే గుండె ఆగిపోయే అవకాశం 16 శాతం ఎక్కువగా ఉందట. అలాగే గర్బధారణ సమయంలో సమస్యలు ఎదుర్కొన్న మహిళలకు భవిష్యత్తులో గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని నివేదిక వెల్లడిస్తుంది. పరిశోధకులు రెండు రకాల గుండె వైఫల్యాన్ని అధ్యయనం చేశారు. గుండె వైఫల్యంలో రెండు రకాలు.. రక్తాన్ని పంప్ చేసిన తర్వాత గుండె కండరాలు పూర్తిగా విస్తరించలేవు. అలాంటి సమయంలోనే గుండెపోటు వస్తుంది. ప్రతి బీట్ తర్వాత శరీరానికి వెళ్లాల్సిన రక్తం మొత్తం గుండె దిగువ భాగానికి వెళ్లలేకపోతుంది.
మహిళల్లో గుండె వైఫల్యానికి HFpEF కారణం. గర్బధారణ సమస్యలుల ఉన్న మహిళలు అధిక రక్తపోటు సమస్యతో బాధపడే అవకాశం ఉంది. పిల్లలు పుట్టడం పుట్టకపోవడం మీ చేతిలో లేని పని. కానీ దీనివల్ల గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాంటి మహిళలు ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలి. వంధ్యత్వం అంటే ఏమిటీ.. ఏదైనా కారణం చేతనో లేకపోతే ఏదైనా లోపం వల్లో గర్బం ధరించపోతే దాన్ని వంధ్యత్వం అంటారు. వంధ్యత్వానికి కారణం.. స్త్రీల శరీరంలో హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా వంధ్యత్వానికి దారి తీస్తుంది. శరీరంలో సాధారణ హార్మోన్లలో మార్పులు లేనప్పుడు అండాశయాల నుంచి ఎగ్స్ రిలీజ్ కావు. దీనికి కారణం ఒత్తిడి, వయసు, ఆధునిక జీవన శైలి మొదలైనవి.
గర్భంలో పాలిప్స్, నియోప్లాజమ్స్, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వంటి సమస్యలు ఉంటే గర్భధారణ సమయంలో ఇబ్బంది కలుగుతుంది. వంధ్యత్వం లక్షణాలు.. మహిళ రుతుచక్రం 35 రోజులు లేదా అంతకంటే ఎక్కువ రోజులు ఉంటే అది వంధ్యత్వానికి లక్షణం కావొచ్చు. అలాగే కొన్ని రోజుల్లేనే రుతుస్రావం లేదా 21 రోజుల ముందే రుతుస్రావం ప్రారంభం కావడాన్ని అపక్రమ రుతుస్రావం అంటారు. ఇది కూడా వంధ్యత్వానికి దారితీస్తుంది. వంధ్యత్వాన్నిఎలా నివారించాలి.. రుతుస్రావం లో ఏదైనా మార్పుకనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. అలాగే సమతుల్య ఆహారం తీసుకోండి. జంక్ ఫుడ్, వేయించిన ఆహారాలకు దూరంగా ఉండండి. ప్రతిరోజూ ఉదయం ఒక అరగంట పాటు వ్యాయామం చేయండి. ముఖ్యంగా ఒత్తిడికి దూరంగా ఉండాలి.