DailyDose

నిమ్మకూరులో బాలకృష్ణ.. ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులు

నిమ్మకూరులో బాలకృష్ణ.. ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులు

కృష్ణా జిల్లా నిమ్మకూరులో ఎన్టీఆర్‌ విగ్రహానికి ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ నివాళులు అర్పించారు. ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా నిమ్మకూరు వచ్చిన ఆయన.. వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. తెలుగువారి గుండెల్లో ఎన్టీఆర్‌ చిరస్థాయిలో నిలిచిపోయారని చెప్పారు. ఆయణ్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు నడవాలన్నారు. ఎన్టీఆర్‌ ఆశీస్సులు తెలుగు రాష్ట్రాలపై ఉంటాయని బాలకృష్ణ చెప్పారు. మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగువాడిగా పుట్టాలని నినదించిన ఆయనకు వందనాలని తెలిపారు. మరోవైపు బాలకృష్ణ రాకతో నిమ్మకూరు గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది.
https://i.ibb.co/c3985KL/05282022082543n1.jpg