Devotional

ఆకట్టుకునే అక్షర్‌ధామ్‌!

ఆకట్టుకునే అక్షర్‌ధామ్‌!

న్యూఢిల్లీలో ఉన్న అక్షర్‌ధామ్‌ టెంపుల్‌ అతి పెద్ద హిందూ దేవాలయాల సముదాయంగా గుర్తింపు పొందింది. ఈ ఆలయ నిర్మాణంలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి.ఈ ఆలయంలో సుమారు 200 మంది ప్రముఖ సన్యాసులు, ఆచార్యులు, రుషుల రాతి శిల్పాలు ఉన్నాయి. ఈ ఆలయ నిర్మాణంలో ఎక్కడా కూడా స్టీల్‌ ఉపయోగించలేదు. మొత్తం ఇసుకరాయితో నిర్మించారు. సుమారు 3వేల టన్నుల రాయిని నిర్మాణంలో ఉపయోగించారు.యమునా నదీ తీరంలో అత్యంత వేగంగా నిర్మాణం పూర్తి చేసుకున్న ఆలయంగా ఇది గుర్తింపు పొందింది. ఆలయ ప్రాంగణంలో కమలం ఆకారంలో ఉన్న గార్డెన్‌ సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటుంది. ఆలయ ప్రాంగణంలో ఉన్న యజ్ఞపురుష్‌ కుండ్‌కు ప్రపంచంలోనే అతిపెద్ద యజ్ఞ కుండ్‌గా గుర్తింపు ఉంది. ఇన్ని ప్రత్యేకతలున్న అక్షర్‌ధామ్‌ టెంపుల్‌కు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డుల్లోనూ చోటుదక్కింది. ఆలయంలో ఉన్న పదకొండు అడుగుల లక్ష్మీనారాయణ ప్రతిమ ఆకట్టుకుంటుంది. ఆలయ ప్రాంగణంలోనే ఉన్న థియేటర్‌లో స్వామినారాయణ జీవితానికి సంబంధించిన విశేషాలను ప్రదర్శిస్తుంటారు.ప్రతిరోజూ సాయంత్రం పదిహేను నిమిషాల పాటు సాగే మ్యూజికల్‌ ఫౌంటెన్‌ షో సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఈ షో పుట్టుక నుంచి మరణం వరకు జీవితచక్రాన్ని కళ్లముందు ఆవిష్కరిస్తుంది.‘సాంస్కృతిక విహారం’ పేరుతో నిర్వహించే బోట్‌ రైడ్‌ పర్యాటకులకు ప్రాచీన భారత నాగరికతను కళ్లకు కడుతుంది