Politics

రాజకీయం అంటే జబర్దస్త్ స్టేజ్ షో కాదు – TNI రాజకీయ వార్తలు

రాజకీయం అంటే జబర్దస్త్ స్టేజ్ షో కాదు  – TNI రాజకీయ వార్తలు

* వైసీపీ మంత్రులను టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు చెడుగుడాడేశారు. శనివారం ఆయన మహానాడులో మాట్లాడుతూ.. ‘‘మంత్రి రోజా.. రాజకీయం అంటే జబర్దస్త్ స్టేజ్ షో కాదు. మా తెలుగుదేశం నేతలకు రోజమ్మ ఏదో చీరలు పంపుతుందట. జబర్దస్త్ రింగుల రాణి రోజా తన భర్తకు చీర కట్టించి ఇంట్లో కూర్చొపెట్టింది.తమ్మినేని ఓ దౌర్భాగ్యుడు. వైసీపీ నేతలు మహానాడుకు ఎంత మంది వచ్చారో చూస్తున్నారా..? రాష్ట్రాన్ని వైసీపీ నాశనం చేస్తోంది.చంద్రబాబు సామాన్యుడు కాదు.రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో తెలిసిన వ్యక్తి బాబు.రాబోయే పదేళ్ల ప్రగతి ఆలోచించే వ్యక్తి బాబు.బడుగులకు ప్రాధాన్యం ఇచ్చిన ఘనత టీడీపీదే.బాలయోగి, ఎర్రన్నాయుడు వంటి వారికి ఉన్నత పదవులు ఇచ్చిన ఘనత టీడీపీదే. తెలుగుదేశం అధికారంలోకి రావడం ఖాయం’’ అని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.

*ఆ పని చేసే వారిపై జరిమానా విధించాలి: హరీశ్‌రావు
అందమైన ఆకుపచ్చ, ఆహ్లాదకరమైన సిద్ధిపేట పట్టణం చేద్దామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. శనివారం మున్సిపల్ సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మున్సిపల్ చైర్మన్ కడవేర్గు మంజుల, అడిషనల్ జిల్లా కలెక్టర్ లోకల్ బాడీస్ ముజమ్మీల్ ఖాన్, వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు, మున్సిపల్ కౌన్సిలర్లు హాజరయ్యారు. ఈసమావేశంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొని అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మీడియాతో మాట్లాడుతూ.. నిధులు ఖర్చు చేయడం కంటే.. సద్వినియోగం చేసుకోవడం ముఖ్యమన్నారు. పట్టణంలో త్వరగా మిగిలిన యూజీడీ కనెక్షన్లు పూర్తి చేయాలని చెప్పారు.మున్సిపాలిటీ పన్ను వసూళ్లు చేసి, తాడిపత్రి మున్సిపాలిటీ తరహాలో మిగులు బడ్జెట్ ఉండేలా సద్వినియోగం చేసుకోవాలన్నారు. సిద్ధిపేట పట్టణ తాగునీటి కోసం ప్రతినెలా 80 లక్షలు కరెంటు బిల్లు చెల్లించాలన్నారు.రోజుకూ పట్టణంలో పన్నెండున్నర టన్నులు రావాల్సిన చోట కేవలం 7 టన్నుల పొడిచెత్త వస్తున్న దృష్ట్యా.. డీఆర్సీసీలోనే పొడి చెత్త సెగ్రిగేషన్ జరగాలని సూచించారు. బుస్సాపూర్ డంపింగ్ యార్డుకు కేవలం తడిచెత్త మాత్రమే పోయేలా చూడాలన్నారు.బ్లాక్ స్పాట్లలో చెత్త వేసిన వారిపై తప్పనిసరిగా జరిమానా విధించాలని హెచ్చరించారు.పట్టణంలో 127 బ్లాక్ స్పాట్లు ఉంటే., ప్రస్తుతం 88 బ్లాక్ స్పాట్లు ఉన్నాయని, అన్నీచోట్ల సీసీ కెమెరాలు బిగించి పోలీసు నిఘా విభాగాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు.

*Dharani వల్ల రైతులు బిక్షగాళ్లగా మారారు: దాసోజు శ్రవణ్
ధరణి వల్ల భూమి ఉన్న రైతులు బిక్షగాళ్లగా మారారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘రాహుల్ గాంధీ నేతృత్వంలో తెలంగాణ రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని రైతు సంఘర్షణ సభ పెట్టాం.. 9 అంశాలతో రైతు భరోసా కల్పించడానికి వరంగల్ డిక్లరేషన్‌ని ప్రకటించాం.తెలంగాణ వ్యాప్తంగా 12 ఏళ్ల పిల్లాడికి సైతం డిక్లరేషన్‌ తెలిసేలా అవగాహన కల్పించాం. నెల రోజుల పాటు డిక్లరేషన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యం చేస్తున్నాం..జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్‌కి ఉన్న ఆశ తెలంగాణ రైతాంగానికి దురదృష్టకరంగా ఉంది. నేటికి 93 లక్షల మెట్రిక్ టన్నుల వరి పండిస్తే కేవలం 31 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు మాత్రమే కొన్నారు..ఈ ప్రభుత్వం తుగ్లక్ పరిపాలన అందిస్తుంది. తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవడానికి కేసీఆర్‌కి మనుసు రావడం లేదని దాసోజు శ్రవణ్ ధ్వజమెత్తారు.ఎక్కడికక్కడ టీఆర్ఎస్ నేతలను నిలదీయాలని దాసోజు శ్రవణ్ హెచ్చరించారు. ‘‘మన సొమ్ము వందల కోట్లతో పంజాబ్ రైతులను ఆదుకుంటారు..మరి ఇక్కడ ఏమైంది..?కొనుగోలు కేంద్రాల్లో గన్ని బాగ్స్, టార్పాలిన్‌లు అందుబాటులో లేవు. లక్ష 4 వేల ఎకరాల్లో సోర్గం వేస్తే దానిని కొనే పరిస్థితి లేదు..దేనికి కూడా మద్దతు ధర రావడం లేదు..వడ్లల్లో 6-10 తోడు ఉందని రైతులను మోసం చేస్తున్నారు.. 36 లక్షల 68 వేల మంది రైతుల్లో 5 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసే ప్రయత్నం చేశారు..వాటికి పూర్తిస్థాయిలో ఇవ్వకుండా వెయ్యి కోట్లు మాత్రమే ఇచ్చారు..8 వేల మంది రైతు ఆత్మహత్యలు చేసుకుంటే వెయ్యి మందిని మాత్రమే గుర్తించారు..15 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు…70 శాతం సాగు కౌలు రైతుల చేతిలోనే ఉంది..కౌలు రైతులు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు..ప్రభుత్వం వారిని గుర్తించడం లేదు..వ్యవసాయ కూలీలు ఇబ్బందులు పడుతున్నారు.రైతు కూలీలకు భవిష్యత్ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది’’ అని దాసోజు శ్రవణ్ వ్యాఖ్యానించారు.

*వైసీపీ పతనం మొదలైంది.. ఉగ్ర నరసింహారెడ్డి
వైసీపీ పతనం మొదలైందని టీడీపీ నేత ఉగ్ర నరసింహారెడ్డి పేర్కొన్నారు. జగన్ చెత్త పాలనను చూసి జనం చీదరించుకుంటున్నారని.. పోలీసులు లేకుండా ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని నిర్వహించలేకపోవడమే అందుకు నిదర్శనమన్నారు. మార్కాపురాన్ని జిల్లాగా మార్చాలని డిమాండ్ చేస్తే పట్టించుకోలేదని ఆరోపించారు. ఏపీకి రాజధాని కూడా లేకుండా చేసిన ఘనుడు సీఎం జగన్‌ అని పేర్కొన్నారు.

*నా పాదయాత్రతో టీఆర్ఎస్‌కు చెమటలు పడుతున్నాయ్ : Sharmila
తన పాదయాత్రతో టీఆర్ఎస్‌ కు చెమటలు పడుతున్నాయని వైఎస్సాఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పేర్కొన్నారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఉండవన్నారు. తన పాదయాత్ర తెలంగాణ మొత్తం ఆరు నెలల పాటు కొనసాగుతుందన్నారు. సీఎం కేసీఆర్‌ కు ముందస్తుకు వెళ్లే ధైర్యం లేదన్నారు. ప్రజల నుంచి తమకు బలమైన మద్దతు వస్తోందన్నారు. ప్రజల కోసమే తాను పాదయాత్ర చేస్తున్నానని వైఎస్సాఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పేర్కొన్నారు. నేడు లోటస్ పాండ్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నడిచింది తానే అయినా.. నడిపించింది మాత్రం ప్రజలే అన్నారు. ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందన్నారు. వైఎస్సార్‌ని ప్రజలు మరిచిపోలేదన్నారు. షర్మిలను ఆదరిస్తున్నారంటే.. అది వైఎస్సారే కారణమన్నారు. రూ.860 కోట్ల రూపాయలు TRS పార్టీ అకౌంట్‌లో ఉంటే.. ఆ పార్టీ నేతల అకౌంట్లో ఇంకా ఎన్ని ఉంటాయని ప్రశ్నించారు. ఖజానా ఖాళీ కావడం కేసీఆర్ అసమర్థ పాలనకు నిదర్శనమన్నారు. పెట్టుబడులు వస్తే నిరుద్యోగ సమస్య ఎందుకు తీరడం లేదన్నారు. డబ్బులు ఉన్న వారికే రాజ్యసభ పదవులు ఇస్తున్నారని షర్మిల పేర్కొన్నారు.

*రైతులు ఇబ్బందులు మంత్రికి పట్టవా? .. Jeevan Reddy
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం, మూడు కిలోల కోత‌పై ధర్మపురిలో కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ లక్ష్మణ్ దీక్ష బూనారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆయన దీక్షను విరమింపజేసి, మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు ఇబ్బందులను తెలుసుకోవాల్సిన బాధ్యత మంత్రికి లేదా? ఒక్క కొనుగోలు కేంద్రమైనా తిరిగారా? అని ప్రశ్నించారు. మిల్లర్ల దోపిడీని అరికట్టేదెవరు అంటూనే.. విచారణకు ఆదేశిస్తే.. వాస్తవ పరిస్థితులను నిరూపిస్తానని సవాల్ విసిరారు.

*పల్లె ప్రగతిని విజయవంతం చేయాలి : మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు
పల్లె ప్రగతిని విజయవంతం చేయాలని ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారుల‌కు రాష్ట్ర పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు సూచించారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా మన పల్లెలు బాగు పడుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో ముందంజలో ఉంద‌న్నారు. గ్రామాల‌ను మ‌రింత అభివృద్ధి చేసేందుకు ప‌ల్లె ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మాన్ని పూర్తిగా స‌ద్వినియోగం చేసుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. వచ్చే నెల 3వ తేదీ నుండి చేపట్టనున్న 5వ విడత పల్లె ప్రగతి, నాలుగో విడత పట్టణ ప్రగతి సన్నాహక సమీక్ష సమావేశాన్ని జనగామ కలెక్టరేట్‌లో మంత్రి ఎర్ర‌బెల్లి శనివారం నిర్వహించారు.

*తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటిన గొప్పనేత ఎన్టీఆర్:Talasani
తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటిచెప్పిన గొప్ప నాయకులు, చిరస్మరణీయుడు నందమూరి తారక రామారావు అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్పే ర్కొన్నారు. శనివారం NTR శతజయంతి సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఘననివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక గొప్ప నటుడుగా, ప్రజానాయకుడుగా ఎందరో అభిమానులను తన సొంతం చేసుకొన్నారని పేర్కొన్నారు. తెలుగు ప్రజలు ఎంతో అభిమానంతో “అన్నగారు” అని పిలుచుకొనే నందమూరి తారక రామారావు సామాజిక, పౌరాణికం తదితర పాత్రలతో తెలుగు, తమిళం, హిందీ భాషలలో కలిపి దాదాపు 400 పైగా చిత్రాలలో నటించారని చెప్పారు.

*నెహ్రూ ఫోటో లేకుండా అజాది కా అమృత్ ఉత్సవాలు చేయడమేంటి?: భట్టి
పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఫోటో లేకుండా అజాది కా అమృత్ ఉత్సవాలు చేయడం అక్షేపనీయమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ భట్టి విక్రమార్క పేర్కొన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సాలర్జంగ్ మ్యూజియంకు వెళ్ళిన యువజన కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నాయని భట్టి పేర్కొన్నారు. సావర్కర్ లాంటి వారి ఫోటోలు పెట్టడం దుర్మార్గమన్నారు. మిమ్మల్ని ప్రజలు క్షమించరని.. గుణపాఠం చెబుతారన్నారు. చదువుకోని వారు ప్రధానులు అయితే ఇలాగే చరిత్రను వక్రీకరిస్తారని భట్టి పేర్కొన్నారు.

*పాలన చేతకాక.. మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు: అద్దంకి దయాకర్ప
డిచ్ పల్లి మండలం ధర్మారం (బి) గ్రామంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి మండవ నివాళ్లు అర్పించారు. మాజీ మంత్రి మండవ మాట్లాడుతూ.. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మొదలు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, ఇతర ముఖ్య నేతలంతా గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వారేనన్నారు. రాష్ట్రంలో నాయకులను తయారు చేసింది ఎన్టీఆరేనన్నారు. ఆ నాయకులందరినీ తీర్చిదిద్దింది టీడీపీయేనన్నారు. ఆనాడు ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా నిలబడ్డ రోజు ఇప్పటికీ తనకు బాధ కలిగిస్తుందని మండవ తెలిపారు.

*జగన్‌.. ఫ్లూట్‌ జింక ముందు ఊదు..మా ముందు కాదు: Lokesh
స్వర్గీయ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా సీఎం జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక్క చాన్స్ అని జనాన్ని నమ్మించిన జగన్ మోసపు రెడ్డి అని వ్యాఖ్యానించారు. ఏపీలో మహిళలకు రక్షణ లేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. మహిళ హక్కులు, రక్షణ కోసం పోరాడితే తనపై రాళ్ల దాడి చేశారని మండిపడ్డారు. అక్కచెల్లెళ్లకు అండగా పసుపు జెండా నిలబడుతుందని భరోసా ఇచ్చారు. ‘‘జగన్‌.. ఫ్లూట్‌ జింక ముందు ఊదు.. మా ముందు కాదు. నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదు. జగన్‌ను సీఎం సీటు నుంచి దించే వరకు పోరాడతా’’ అని స్పష్టం చేశారు. ప్రజలపై పన్నుల భారం మోపుతూ బాదేస్తున్నారన్నారని లోకేష్ మండిపడ్డారు.

*బాలకృష్ణ పరిస్థితి చూస్తుంటే బాధేస్తోంది: Roja
ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పై మంత్రి రోజా విమర్శలు గుప్పించారు. బాలకృష్ణ పరిస్థితి చూస్తుంటే బాధేస్తోందన్నారు. శనివారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. నిమ్మకూరులో ఎన్టీఆర్‌ది పెద్ద విగ్రహం పెడతామంటున్నారని… బాలకృష్ణకు ఇన్నేళ్లు నిమ్మకూరు గుర్తుకురాలేదా అని ప్రశ్నించారు. 2019 వరకు తమరే అధికారంలో ఉన్నారు కదా.. నిమ్మకూరును అభివృద్ధి చేయాలని అప్పుడు అనిపించలేదా? అని నిలదీశారు. ఎన్టీఆర్‌ కుటుంబాన్ని వాడుకుని చంద్రబాబు అధికారంలోకి వచ్చారని మంత్రి రోజా వ్యాఖ్యలు చేశారు.

*మహానాడులో జరిగేవి చర్చలా.. క్యాబరేనా: perni nani
ప్రకాశం జిల్లాలో జరుగుతున్న టీడీపీ మహానాడుపై కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. మహానాడులో జరిగేవి చర్చలా?…క్యాబరేనా అని అన్నారు. శనివారం ఏబీఎన్‌తో మాట్లాడుతూ…. మహానాడులో మహిళా నేతలతో జగన్‌ మోహన్‌ రెడ్డిని బూతులు తిట్టిస్తున్నారని మండిపడ్డారు. అసలు మహానాడు నిర్వహించే అధికారం చంద్రబాబు కుటుంబానికి లేదన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఫెయిల్ అయినందునే బస్సు యాత్ర చేస్తున్నామనడం కరెక్ట్‌ కాదన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం ఇప్పట్లో ఆగేది కాదని.. అది నిరంతర ప్రక్రియ అని ఆయన స్పష్టం చేశారు.కోనసీమ జిల్లాకు అంబేద్కర్‌ పేరు పెట్టాలని పవన్‌ పార్టీ, చంద్రబాబు డిమాండ్‌ చేయలేదా అని ప్రశ్నించారు. వంగవీటీ మోహన రంగా పేరు పెట్టాలనే డిమాండ్‌ను ప్రభుత్వం పరిశీలించిందని తెలిపారు. ఆయా అంశాలపై కూడా అవసరమైన సమయంలో నిర్ణయం తీసుకుంటారన్నారు. సీపీఎస్‌ ఉద్యోగులు ఇంటి ముందు పోస్టర్లు వేసుకోవడం సమంజసం కాదని… రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు వారికీ తెలుసని పేర్నినాని పేర్కొన్నారు.

*మీ పార్టీ సామాజిక న్యాయం నేతి బీరలో నెయ్యి లాంటిది: వర్ల రామయ్య
ఏపీ మంత్రి నాగార్జున ఉచ్చ నీచాలు తెలియకుండా మాట్లాడుతున్నారని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. తమ నాయకుడు చంద్రబాబుపై అవాకులు చవాకులు పేలుతున్నాడన్నారు. రాష్త్ర ప్రజలు సీఎం జగన్‌కు, వైసీపీకి త్వరలోనే స్వస్తి పలుకుతారన్నారు. మీ పార్టీ సామాజిక న్యాయం నేతి బీరకాయలో నెయ్యి లాంటిదని ఎద్దేవా చేశారు. అందుకు మీ బస్సు యాత్రకు వస్తున్న స్పందనే నిదర్శనమన్నారు. వైసీపీ నేతలు సభ్యత వీడి మాట్లాడవద్దని వర్ల రామయ్య హితవు పలికారు.

*Mahanaduలో జరిగేవి చర్చలా, క్యాబరేనా?: పేర్ని నాని
తెలుగుదేశం పార్టీ నిర్వహించే మహానాడులో జరిగేవి చర్చలా, క్యాబరేనా అని కృష్ణాజిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. శనివారం ఏబీఎన్‌తో పేర్ని నాని మాట్లాడుతూ… మహానాడులో మహిళా నేతలతో ముఖ్యమంత్రి జగన్మోహన్‌‌రెడ్డిని బూతులు తిట్టిస్తున్నారని మండిపడ్డారు. అసలు మహానాడు నిర్వహించే అధికారం చంద్రబాబు కుటుంబానికి లేదన్నారు.సామాజిక న్యాయ భేరీని మహానాడు తేదీల్లోనే నిర్వహిస్తారనడం సమంజసం కాదన్నారు. ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యకమం ఫెయిల్ అయినందునే ‘బస్సు యాత్ర’ చేస్తున్నామనడం కరక్ట్‌ కాదని చెప్పారు. ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యకమం ఇప్పట్లో ఆగేది కాదు.. అది నిరంతర ప్రక్రియ అని పేర్నినాని అన్నారు.

*ఎవరొచ్చినా ఆహ్వానిస్తాం: Somi Reddy
తమ పార్టీలోకి ఎవరొచ్చినా ఆహ్వానిస్తామని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేసే వారికి తప్పక గుర్తింపు ఉంటుందన్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్‌లో ఉన్న ప్రధాన నేతలంతా ఒకప్పుడు ఎన్టీఆర్ శిష్యులేనన్నారు. కైవల్యా రెడ్డి ఆత్మకూరు టిక్కెట్ అడిగారా..? లేదా..? అనేది తనకు తెలియదన్నారు. టిక్కెట్ల కేటాయింపు చర్చ ఇప్పుడు ఉండదన్నారు.

*మహానాడు పేరిట మాయనాడు: మంత్రి Suresh
తెలుగుదేశం పార్టీ మహానాడు సదస్సు పెట్టి వైసీపీ పైన లేనిపోని ఆరోపణలు చేస్తోందని మంత్రి ఆదిమూలపు సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ… బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా ప్రభుత్వం ఆదుకుంటోందని తెలిపారు. ఈ అంశాన్ని ప్రజల్లోకి సామాజిక న్యాయం పేరిట బస్సు యాత్ర చేపట్టామని వివరించారు. మహానాడు పేరిట మాయనాడు పెట్టి చంద్రబాబు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. స్వతంత్ర భారతావనిలో ఎవరు ఇవ్వని విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు వైసీపీ ప్రభుత్వం పదవులు ఇచ్చిందని తెలిపారు. సామాజిక న్యాయం అంటే స్థితిగతులు బాగుపడడమే అని చెప్పుకొచ్చారు. పార్టీ, ప్రాంతం, కులం చూడకుండా జగన్ అందరివాడుగా మారారన్నారు. మూడేళ్ల పాలన చూసిన తర్వాత ప్రజలంతా జగన్‌కు అండగా ఉండాలని తాము కోరుతున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.

*తెలుగు గడ్డపై పుట్టిన విశిష్ట వ్యక్తుల్లో ఎన్టీఆర్ ఒకరు: Pawan
తెలుగు గడ్డపై జన్మించిన విశిష్ట వ్యక్తులలో ఎన్టీఆర్ కూడా ఒకరు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ… సంప్రదాయ రాజకీయాలే ఆలంబనగా నడుస్తున్న రోజులలో ఒక రాజకీయ పార్టీని స్థాపించి బడుగు బలహీన వర్గాలకు భాగస్వామ్యం కల్పించి అభ్యుదయవాదిగా ఎన్టీఆర్ నిలిచారని తెలిపారు. అటువంటి గొప్ప వ్యక్తి శత జయంతి సందర్భంగా ఆయనకు పవన్ నమస్కారాలు తెలిపారు. తెలుగు భాషపై ఆయనకు ఉన్న మక్కువ, పట్టు నన్నెంతగానో ఆకట్టుకునేదని అన్నారు. తెలుగు భాష కీర్తి ప్రతిష్టలను ఆయన దేశం నలుదిశలా వ్యాపింప చేసిన తీరు అమోఘమని కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా భారతదేశ రాజకీయాలపై తనదైన ముద్ర వేశారని పవన్ కళ్యాణ్ తెలిపారు.

*జగన్‌.. ఫ్లూట్‌ జింక ముందు ఊదు..మా ముందు కాదు: Lokesh
స్వర్గీయ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా సీఎం జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక్క చాన్స్ అని జనాన్ని నమ్మించిన జగన్ మోసపు రెడ్డి అని వ్యాఖ్యానించారు. ఏపీలో మహిళలకు రక్షణ లేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. మహిళ హక్కులు, రక్షణ కోసం పోరాడితే తనపై రాళ్ల దాడి చేశారని మండిపడ్డారు. అక్కచెల్లెళ్లకు అండగా పసుపు జెండా నిలబడుతుందని భరోసా ఇచ్చారు. ‘‘జగన్‌.. ఫ్లూట్‌ జింక ముందు ఊదు.. మా ముందు కాదు. నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదు. జగన్‌ను సీఎం సీటు నుంచి దించే వరకు పోరాడతా’’ అని స్పష్టం చేశారు. ప్రజలపై పన్నుల భారం మోపుతూ బాదేస్తున్నారన్నారని లోకేష్ మండిపడ్డారు.

*పెట్రో ఉత్పత్తులపై పన్నులు తగ్గించండి: రామకృష్ణ
రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై పన్నుల భారం తగ్గించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఈమేరకు సీఎం జగన్‌కు లేఖ రాసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీ కంటే కర్ణాటకలో పెట్రోల్‌ ధర రూ.10 తక్కువగా ఉందన్నారు. పలు రాష్ట్రాలు పెట్రో ఉత్పత్తులపై పన్నులు తగ్గించాయన్నారు. అధిక ధరలు, పన్నుల భారాలను వ్యతిరేకిస్తూ ఈ నెల 30న అన్ని జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల వద్ద ధర్నాలకు వామపక్షాలు పిలుపునిచ్చాయన్నారు.

*వైసీపీలో ‘డోర్‌ డెలివరీ’ సంస్కృతి పెరిగింది: సాకే
‘‘రాష్ట్రంలో దౌర్జన్యాలు ఎక్కువయ్యాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు భద్రత కరువయింది. అడ్డువచ్చిన, ప్రశ్నించిన బలహీన వర్గాల వారిన చంపి డోర్‌ డెలివరీ చేసే సంస్కృతి వైసీపీలో పెరిగింది. ఒకటి, రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన వారి పేర్లు జిల్లాలకు పెడుతున్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ పేరు ఒక జిల్లాకు పెట్టడంలో తప్పేంటి?’’ అని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ ప్రశ్నించారు. ‘‘కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర స్థాయి మేధో మథన సదస్సు కడపలో జూన్‌ 4, 5 తేదీల్లో నిర్వహించనున్నాం. పార్టీ శ్రేణులంతా ఆ సదస్సును విజయవంతం చేయాలి’’ అని శైలజానాథ్‌ విజ్ఞప్తి చేశారు.

*మహానాడు కాదు… వల్లకాడు
‘‘ఒంగోలులో తెలుగుదేశం పార్టీ మహానాడు జరుపుకుంటోంది. ఏంటీ జరుపుకునేది… టీడీపీ కుళ్లి కంపు కొడుతున్న శవం… దానికి దహన సంస్కారం చేస్తున్న వల్లకాడు అది… మహానాడు కాదు. టీడీపీ పని అయిపోయింది’’ అని స్పీకర్‌ తమ్మినేని సీతారాం విమర్శించారు. సామాజిక న్యాయభేరి బస్సు యాత్రలో భాగంగా శుక్రవారం గాజువాకలో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. ‘‘ఇంతవరకూ బీసీ, ఎస్సీ, మైనారిటీలకు గొంతులేకుండా పోయింది. ఇప్పుడు నేనున్నాను… ముందుకు నడవండి అంటూ ప్రోత్సహించే దమ్మున్న సీఎం జగన్‌ ఉన్నారు. నిజమైన సామాజిక న్యాయం ఆయనతోనే సాధ్యం. అలాంటి నేతను విస్మరిస్తే మనందరికీ బతుకు ఉండదు. జగన్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే 3-4 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌ ప్రభంజనంలో టీడీపీ సహా ప్రతిపక్షాలన్నీ కొట్టుకుపోవాల్సిందే’’ అని అన్నారు.

*తమ్మినేనికి సిగ్గు లేదు: కూన రవి
వైసీపీ పార్టీని ప్రేత కళ ఆవరించిందని తెలుగుదేశం పార్టీ శ్రీకాకుళం పార్లమెంటు అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కూన రవి కుమార్‌ వ్యాఖ్యానించారు. మహానాడు ప్రాంగణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘తమ అడుగు జారిపోతోందని వైసీపీ మంత్రులు, నేతలకు అర్థమైంది. రాష్ట్రాన్ని శ్మశానం చేశారు. మంత్రుల ఇళ్లు తగలబెట్టే పరిస్థితి వచ్చింది. వైసీపీ పాడె మోయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మహానాడులో కనిపించిన ప్రజా ప్రభంజనంతో వారికి వణుకు పుట్టింది. టీడీపీలో పుట్టి, తొమ్మిదేళ్లు మంత్రిగా చేసిన సీతారాం సిగ్గు లేకుండా టీడీపీని తిడుతున్నారు. ఆయన వ్యవహారం చూసి నియోజకవర్గ ప్రజలు సజీవ దహనం చేయడానికి సిద్ధంగా ఉన్నారు’’ అని కూన మండిపడ్డారు. అనేక కుట్రలు చేసినా మహానాడును వైసీపీ ప్రభుత్వం ఆపలేకపోయిందని, మంత్రులు ఈ ప్రజా వెల్లువను చూసి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని కిమిడి నాగార్జున విమర్శించారు.

*జగన్‌ హయాంలో 1.60 లక్షల కోట్లు లూటీ
తెలుగుదేశం మహానాడు తీర్మానంలో ఆరోపణ
‘‘జగన్‌రెడ్డి మూడేళ్ల పాలనలో రాష్ట్రంలో అవినీతి ఆకాశాన్ని అంటింది. వివిధ రంగాల్లో రూ.1.60 లక్షల కోట్ల మేర ప్రజా సంపద లూటీ అయింది’’ అని తెలుగుదేశం పార్టీ మహానాడులో ప్రవేశపెట్టిన తీర్మానంలో ఆరోపించింది. ఏ రంగంలో ఎంతెంత లూఠీ జరిగిందో ఆ పార్టీ సమగ్రంగా ఇందులో వివరించింది. మద్యంలో సీసాకు ఇంతని జే ట్యాక్స్‌ రూపంలో ఏడాదికి రూ.5,000 కోట్లు వసూలు చేస్తున్నారని, ఈ మూడేళ్లలో రూ.15,000 కోట్ల మేర ప్రజల నుంచి దోచారని ఆరోపించారు. సిమెంటు ధరల పెంపు ఫలితంగా భారతీ సిమెంట్స్‌ కంపెనీకి వచ్చిన లాభంతో కలుపుకొని మొత్తం రూ.12,000 కోట్లు దోచారని ఆ పార్టీ తెలిపింది. ఇసుక లూటీలో వాటా ద్వారా రూ.10,000 కోట్లు, లాండ్‌ మాఫియా ద్వారా రూ.25,000 కోట్లు, మైనింగ్‌ మాఫియా దోపిడీ ద్వారా రూ.25,000 కోట్లు, ఎర్ర చందనం మాఫియా ద్వారా రూ.25,000 కోట్లు, డ్రగ్‌ మాఫియా ద్వారా రూ.20,000 కోట్లు, గంజాయి మాఫియా ద్వారా రూ.8,000 కోట్లు, రేషన్‌ బియ్యం మాఫియా ద్వారా రూ.4,000 కోట్లు, సెంటు పట్టాలో దోపిడీ ద్వారా రూ.7,000 కోట్లు జగన్‌… ఆయన బృందం కలిసి దోచారని ఆ పార్టీ పేర్కొంది.

*ఈ నిలదీతలు రిహార్సల్స్‌ మాత్రమే: సోమిరెడ్డి
గడప గడపకు కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజల నిలదీతలు రిహార్సిల్స్‌ మాత్రమేనని, తర్వాత ముఖ్యమంత్రినే ప్రజలు నిలదీయడం ఖాయమని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో వ్యవస్థల పతనంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘వ్యవస్థలను బలహీనపరచడం, వాటిని దుర్వినియోగం చేయడం జగన్‌రెడ్డికి అలవాటుగా మారింది. ఒకసారి జైలుకు వెళ్లివచ్చినా ఆయనలో మార్పు రాలేదు. తప్పుడు నిర్ణయాలకు ఐఏఎస్‌ అధికారులు జైలు శిక్షలు వేయించుకోవలసి వస్తోంది. కొన్ని చానళ్లంటే ముఖ్యమంత్రి భయపడుతున్నారు. పాపాలకు మూల్యం చెల్లించుకోక తప్పదు’ అన్నారు.

*తెచ్చింది 85 వేలు.. పంచింది 23 వేలే: జీవీ రెడ్డి
‘‘వైసీపీ ప్రభుత్వం ఈ మూడేళ్లలో తెచ్చిన అప్పులు లెక్క వేస్తే రాష్ట్రంలో ఒక్కో మనిషికి రూ.85 వేలు చొప్పున తెచ్చారు. కాని పథకాల పేరుతో పంచిన మొత్తం లెక్క చూస్తే తలకు రూ.23 వేలు మాత్రమే పంచారు. తెచ్చిన అప్పుల్లో నాలుగో వంతు మాత్రమే పఽథకాల కిందకు వెళ్లింది’’ అని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మహానాడులో జరిగిన చర్చలో పాల్గొంటూ ఆయన ఈ విషయం చెప్పారు.

*జగన్‌ కాదు.. జలగ: కళా వెంకట్రావు
ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి పాలనలో సంక్షేమం అనేది ఒక బోగస్‌ కంపెనీ అని మాజీ మంత్రి కళా వెంకట్రావు విమర్శించారు. ‘బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి ఎన్ని కోట్లు కేటాయించారు? ఆయన జగన్‌ కాదు.. రాష్ట్ర ప్రజలను పట్టిపీడిస్తున్న జలగ’ అని ధ్వజమెత్తారు. పార్టీ సీనియర్‌ నేత ఆనం వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ.. 980 నామినేటెడ్‌ పోస్టులు ఇస్తే 742 రెడ్డి సామాజికవర్గానికి ఇచ్చారని.. 12 మంది వీసీల్లో పది రెడ్లకు ఇచ్చారని.. ఇక సామాజిక న్యాయం ఎక్కడుందో చెప్పాలని నిలదీశారు. రాష్ట్రంలో రైతన్నలు దగాపడ్డారని, అప్పులపాలయ్యారని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. ‘కష్టాల కడలిలో సేద్యం, దగాపడుతున్న రైతన్న’ అనే తీర్మానాన్ని ఆయన ప్రవేశపెట్టారు. ఎమ్మెల్యే మంతెన రామరాజు మాట్లాడుతూ.. రాష్ట్ర ఆక్వా రంగాన్ని దేశంలోనే అగ్రగామిగా తీసుకొచ్చిన ఘనత టీడీపీదేనన్నారు. పోలవరం రాష్ట్రానికి జీవనాడని, జగన్‌రెడ్డి స్వార్థంతో రివర్స్‌ టెండర్‌ పేరిట పోలవరాన్ని సర్వనాశనం చేశారని మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు పేర్కొన్నారు. ప్రాజెక్టును నిట్టనిలువునా చంపేసి.. బ్యారేజీ స్థాయికి దిగజార్చారని మండిపడ్డారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని ఎమ్మెల్సీ దువ్వా రామారావు విమర్శించారు. రోడ్లు అధ్వానం-విద్యుత్‌ అంఽధకారంపై తీర్మానాన్ని ఆయన ప్రవేశపెట్టారు. టీడీపీ హయాంలో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ప్రాజెక్టులు నిర్మించిన ఘనత చంద్రబాబుదేనని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. పడకేసిన ప్రాజెక్టులు, తాగునీటి పథకాలపై ఆయన తీర్మానం ప్రవేశపెట్టి మాట్లాడారు. జగన్‌రెడ్డికి సిగ్గుంటే రాయలసీమకు ఒక్క ప్రాజెక్టయినా తీసుకొచ్చారేమో చెప్పాలన్నారు.

*తెచ్చింది 85 వేలు.. పంచింది 23 వేలే: జీవీ రెడ్డి
‘‘వైసీపీ ప్రభుత్వం ఈ మూడేళ్లలో తెచ్చిన అప్పులు లెక్క వేస్తే రాష్ట్రంలో ఒక్కో మనిషికి రూ.85 వేలు చొప్పున తెచ్చారు. కాని పథకాల పేరుతో పంచిన మొత్తం లెక్క చూస్తే తలకు రూ.23 వేలు మాత్రమే పంచారు. తెచ్చిన అప్పుల్లో నాలుగో వంతు మాత్రమే పఽథకాల కిందకు వెళ్లింది’’ అని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మహానాడులో జరిగిన చర్చలో పాల్గొంటూ ఆయన ఈ విషయం చెప్పారు.

*కేసీఆర్‌ సర్కార్‌ను ఎండగట్టాలి: బండి సంజయ్‌
తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలుగా చేయూతనందిస్తున్నా.. ఏమీ ఇవ్వడం లేదని బదనాం చేస్తున్న కేసీఆర్‌ ప్రభుత్వ తీరును ఎండగట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. రాష్ట్రానికి కేంద్రం ఇస్తున్న నిధుల గురించి ప్రజలకు వివరించాలని సూచించారు. ఏ ఆశయాలు, ఆకాంక్షల కోసం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామో.. వాటికి భిన్నంగా కేసీఆర్‌ కుటుంబం పాలన సాగిస్తోందని ధ్వజమెత్తారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు, కేసీఆర్‌తో కలిసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అనంతరం బీజేపీ చేరిన పలువురు సీనియర్‌ నేతలతో బండి సంజయ్‌ వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సంజయ్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్‌ 2న బీజేపీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో తెలంగాణ ఉద్యమకారులు, కవులు, కళాకారులతో సభను నిర్వహిస్తామని చెప్పారు. కేసీఆర్‌ పాలనలో నిజమైన ఉద్యమకారులు, అమరుల కుటుంబాలతోపాటు ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తామన్నారు.పార్టీ అధికార ప్రతినిధులపై సంజయ్‌ అసంతృప్తిబీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధుల పనితీరు సరిగా లేదంటూ బండి సంజయ్‌ తీవ్ర అసంతృప్తి చేశారు. 9 మంది అధికార ప్రతినిధులు ఉన్నప్పటికీ పార్టీ కోసం ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని వారితో సమావేశమైన సందర్భంగా వ్యాఖ్యానించారు. బీజేపీపై టీఆర్‌ఎస్‌ నేతలు చేస్తున విమర్శల్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని, రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ సరైన సమయంలో.. సరైన విధంగా స్పందించాలని సూచించారు. ప్రతి రోజూ ఒక అధికార ప్రతినిధి పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండాలని ఆయన ఆదేశించారు.

*యువత ఆదర్శంగా తీసుకోవాలి: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌
అంతర్జాతీయ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్‌ను యువత ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. శుక్రవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. క్రీడలను ప్రోత్సహించేందుకే ఉద్యోగ అవకాశాల్లో ప్రభుత్వం 2% రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు చెప్పారు.గ్రామాల్లో క్రీడా మైదానాలు ఏర్పాటు చేయబోతున్నామన్నారు. దేశం గర్వించదగ్గ ప్లేయర్లని తెలంగాణ నుంచి తీసుకోస్తామన్నారు.ప్రతిభ గలవారిని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తెలిపారు.కొందరు పుల్లలు పెట్టేందుకే తెలంగాణకు వస్తారు.. వాళ్లు ఏదీ చేయరు..చేయనివ్వరని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ విమర్శించారు.