DailyDose

అవి ‘హార్లీ డేవిడ్ సన్’ షేర్ ఆటోలు

Auto Draft

హార్లీ డేవిడ్సన్ … ఖరీదైన మోటారు బైకులకి పేరుగాంచిన బ్రాండ్ ఇది ! ఆ కంపెనీ అమ్మే ప్రతి బైకూ పది నుంచి నలభై లక్షలదాకా ధర పలుకుతుంది . అలాంటి విలాసవంతమైన బైకుని షేర్ ఆటోలుగా మార్చి దిల్లీలో గల్లీ గల్లీ తిప్పిన ఘటన ఇది . ఆ ఘనతకి సాక్ష్యంగా ఈ అందాల షేర్ ఆటో నమూనా ఇప్పటికీ ఢిల్లీలోని మోటార్కార్ మ్యూజియంలో కనిపిస్తుంది . ఈ ఆసక్తికరమైన చరిత్రకి బీజం … రెండో ప్రపంచయుద్ధ సమయంలో పడింది . అమెరికా ఆ యుద్ధమప్పుడు ‘ హార్లీడేవిడ్సన్ – డబ్ల్యూఎస్ఏ ‘ బైకుల్ని విరివిగా వాడింది . ఎందుకూ అంటారేమో … సైనికాధికారులకూ సిపాయిలకూ మధ్య సమాచార మార్పిడి కోసం ! సైనికాధికారులు తమ సందేశాన్ని వార్తాహరులకి చెబితే … వాళ్లు అత్యంత వేగంగా ఈ బైకు నడుపుకుంటూ వెళ్లి దాన్ని సిపాయిలకి చేరవేస్తారన్నమాట . వాళ్ల కోసమే హార్లీడేవిడ్సన్ సంస్థ వేల సంఖ్యలో వీటిని తయారుచేసి అమ్మింది . కానీ …. రెండో ప్రపంచయుద్ధం చివరి ఏడాదిలో వైర్లెస్ కమ్యూనికేషన్ వ్యవస్థ పుంజుకోవడంతో ఈ బైకుల అవసరం తగ్గింది . యుద్ధం ముగిసేనాటికి భారీగా పోగుపడ్డ ఈ బైకుల్ని ఏం చేయాలో తెలియక తుక్కుకింద అమ్మాలనుకుంది అమెరికన్ సైన్యం . అలా వాటిని కొన్న ఢిల్లీలోని వ్యాపారులు కొందరు వాటికి రెండుసీట్లూ , పైకప్పూ జోడించి షేర్ ఆటోలుగా మలిచారు . బలమైన ఇంజిన్ . బరువైన ఆకారం కారణంగా డజనుమంది . ఎక్కినా ఈ బైకు భరించి దూసుకెళ్లేది : ఇంకేం . 1950 ల నుంచి సుమారు యాభయ్యేళదాకా దిల్లీ వీధుల్లో వీటి హవా నడిచింది . హరీడేవిడ్సన్ ఇంజిన్లు సృష్టించే శబ్దం కారణంగా ఈ రిక్షాలని ‘ ఫటటా ‘ అనేవాళ్లు ఢిల్లీవాసులు . కానీ 1998 లో దిల్లీనగరంలో 20 ఏళ్లకి పైపడ్డ వాహనాలేవీ నడపకూడదన్న రూలు రావడంతో హార్డీ డేవిడ్సన్ ఆటోరిక్షాల సుదీర్ఘ యాత్రకి తెరపడింది