తెలంగాణ తెలుగు అసోసియేషన్ ఉత్సవాలు న్యూజెర్సీ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం ప్రతిబింబించే విధంగా పరిసరాలను తీర్చిదిద్దారు బ్యాంక్ వెట్ విందుతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. వివిధ రంగాల్లో ప్రముఖులకు అవార్డులు అందజేశారు. తెలంగాణాకు చెందిన ఎంపీలు డి అరవింద్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి వివిధ పార్టీల నాయకులు డీకే అరుణ, మధుయాష్కి, మంత్రి జగదీశ్వర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. TTA వ్యవస్థాపక అధ్యక్షుడు పైళ్ల మల్లారెడ్డి, అధ్యక్షుడు పటోళ్ల మోహన్ రెడ్డి, కాన్ఫరెన్స్ కమిటీ కన్వీనర్ గనగొని శ్రీనివాస్ తదితరులు ప్రసంగించారు. యాంకర్ సుమ సంధానకర్తగా వ్యవహరించారు. కోటి సంగీత విభావరి ప్రేక్షకులను ఆకట్టుకుంది. మంచి విందు భోజనాన్ని ఏర్పాటు చేశారు.