ఈబీ-5 వీసాల జారీ చేసే ప్రాంతీయ కేంద్రాలపై అమెరికా పౌర, వలసల సేవల (యూఎ్‌ససీఐఎస్) కొరడా ఝళిపించింది. ఈ కేంద్రాలు మళ్లీ కొత్తగా నమోదు చేసుకుని.. ఆమోదం పొందాకే తమ సేవలు ప్రారంభించాలని యూఎ్‌ససీఐఎస్ కోరింది. దీంతో ఈ వీసాల జారీకి అవసరమైన సేవలు అందించే ఐదు ఇబీ-5 ప్రాంతీయ కేంద్రాలు కోర్టుకెక్కాయి. యూఎ్‌సఐఎ్‌ససీ నిర్ణయం ఈబీ-5 రిఫార్మ్ అండ్ ఇంటిగ్రెటీ యాక్ట్, 2022 (ఆర్‌ఐఏ) నిబంధనలను సవాల్ చేసేలా ఉందని పేర్కొన్నాయి. ఈ ఏకపక్ష నిర్ణయాన్ని కొట్టివేయాలని కోర్టును కోరాయి.
*ఈబీ-5 వీసా అంటే?
అమెరికాలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే సంపన్న విదేశీయులకు ఈ వీసాలు జారీ చేస్తారు. ఇందుకోసం కనీసం 10.5 లక్షల డాలర్లు పెట్టుబడిగా పెట్టాలి. మిగతా వారితో పోలిస్తే ఈబీ-5 వీసాలు ఉన్న వారికి త్వరగా అమెరికాలో శాశ్వత నివాసం ఉండేందుకు వీలు కల్పించే గ్రీన్‌కార్డ్ లభిస్తుంది. దీంతో భారత్‌తో పాటు అనేక దేశాలకు చెందిన సంపన్నులకు ఈ వీసా పెద్ద ఫ్యాషన్‌గా మారింది.