Movies

వజ్రాలు పొదిగిన షారుక్​ ఇంటి నేమ్​ప్లేట్​ మిస్సింగ్​!.. దాని విలువ ఎంతో తెలుసా?

వజ్రాలు పొదిగిన షారుక్​ ఇంటి నేమ్​ప్లేట్​ మిస్సింగ్​!.. దాని విలువ ఎంతో తెలుసా?

‘షారుక్​ ఖాన్​ ఇంటికి కేరాఫ్ అయిన ‘మన్నత్​’ నేమ్​ప్లేట్​ కనిపించట్లేదు. కారణం తెలుసా?’.. ఇటీవల సోషల్​ మీడియాలో అభిమానులు చర్చించుకున్న విషయం ఇదే. దానిని ఎవరో దొంగిలించారు అని కొందరు అంటే.. వేరే కారణం ఉందంటున్నారు మరికొంతమంది. ఇంతకీ అసలు ఏం జరిగింది? మన్నత్​.. బాంద్రా బీచ్​ రోడ్డులో వెళ్తుంటే బాలీవుడ్​ సూపర్​స్టార్​ షారుక్​​ నివాసానికి కేరాఫ్​గా ఆయన ఇంటిముందు ఉండే పేరిది. అభిమానులు, ప్రముఖులు ఎవరైనా షారుక్​ను కలవాలంటే మన్నత్​ ముందు అడుగుపెట్టాల్సిందే. బీటౌన్​లో షారుక్​ ఇంటికి బ్రాండ్​గా నిలిచిన ఈ పేరు ఇప్పుడు కనిపించకుండాపోతోంది! అదేనండి.. ఆ ఇంటి ముందు ఉన్న మన్నత్​ నేమ్​ప్లేట్​ మిస్​ అయింది. ఇదే ప్రస్తుతం అభిమానుల్లో హాట్​ టాపిక్​గా మారింది. ఈ బోర్డు చోరీకి గురైందా? లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అని నెటిజెన్లు చర్చించుకుంటున్నారు. అన్నట్టు.. ఈ నెమ్​ప్లేట్​ విలువ రూ. 25 లక్షలకుపైనే అని సమాచారం.

ఇదీ అసలు విషయం:
షారుక్​ ఇంటి బాధ్యత మొత్తం ఆయన సతీమణి గౌరీ ఖానే చూస్కుంటూ ఉంటారు. ఇంటీరియర్​ డిజైనర్​ కావడం వల్ల.. ఇల్లు ఎలా ఉండాలి అనేది ఆవిడే తేల్చిచెప్తారు. ఇటీవల ఏప్రిల్​లో పాత నేమ్​ప్లేట్​ను తీసేసి.. వజ్రాలు పొదిగిన బోర్డును తగిలించారు. ఖరీదైన నేమ్​ప్లేట్​గా చెప్పుకుంటున్న ఈ బోర్డులో.. ఒక చిన్న వజ్రం మిస్​ అయిందట. అందుకే దానిని రిపేయిర్ కోసం తొలగించారని.. త్వరలోనే మళ్లీ​ ఇంటి ముందు పెట్టిస్తారని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి​.