అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం సృష్టించాయి. ఓక్లహోమాలో జరిగిన వేడుకల్లో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. దీంతో మహిళ మృతిచెందగా, ఏడుగురు గాయపడ్డారు. ఆదివారం తెల్లవారుజామున (అమెరికా కాలమానం ప్రకారం) ఓక్లహోమాలోని ఓల్డ్ సిటీ స్కేర్‌లో మెమోరియల్ డే ఫెస్టివల్ జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో 15 వందల మందికిపైగా పాల్గొన్నారు. అయితే ఆహుతుల మధ్య చిన్న గొడవ కాస్తా ఘర్షణకు దారితీసింది.ఈ క్రమంలో సహనం కోల్పోయిన స్కైలర్ బక్నర్ అనే 26 ఏండ్ల యువకుడు ఒక్కసారిగా కాల్పులు జరిపాడు. దీంతో ఓ నల్లజాతి మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. మరో ఏడుగురు గాయపడ్డారు. వారిలో తొమ్మిదేండ్ల చిన్నారి కూడా ఉన్నాడని పోలీసులు తెలిపారు. అయితే కాల్పుల అనంతరం అక్కడినుంచి పారిపోయిన బక్నర్.. ఆదివారం సాయంత్రం పోలీసులకు లొంగిపోయాడు. ఈ ఘనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.గతవారం టెక్నాస్‌లోని ఉవాల్డాలో ఓ లిమెంటరీ స్కూల్‌లో జరిగిన కాల్పుల్లో 19 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు మరణించిన విషయం తెలిసిందే. అనంతరం పోలీసుల కాల్పుల్లో ఆ ఉన్మాది కూడా హతమయ్యాడు.