DailyDose

22 మందితో ప్ర‌యాణిస్తున్న విమానం ఆచూకీ గ‌ల్లంతు.. – TNI నేర వార్తలు

22 మందితో ప్ర‌యాణిస్తున్న విమానం ఆచూకీ గ‌ల్లంతు.. – TNI  నేర వార్తలు

* శ్రీకాళహస్తి ఫిన్‌కేర్‌ బ్యాంక్ చోరీ కేసులో భారీ ట్విస్ట్‌ చోటుచేసుకుంది. దోపిడీపై పిర్యాదు ఇచ్చిన బ్యాంక్ మేనేజర్ స్రవంతినే అసలు దొంగగా పోలీసులు నిర్ధారించారు. కేసుపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు ముందు నుంచే ఇంటి దొంగల ప్రాతపై అనుమానం కలిగింది. స్రవంతి బ్యాంకులో గిల్టు నగలు తాకట్టు పెట్టి డబ్బు కాజేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఆడిట్‌లో వ్యవహారం బయటపడుతందని దొంగతనం డ్రామా ఆడినట్లు తేల్చారు. ఇందుకు చెన్నైకి చెందిన ముగ్గురు యువకులతో కాంట్రాక్టు కుదుర్చుకొని బ్యాంకు దోపిడికి ప్లాన్‌ వేసినట్లు తెలిపారు.

*నేపాల్‌లో తారా ఎయిర్ 9 NAET ట్విన్-ఇంజిన్ విమానం ఆచూకీ దొర‌క‌డం లేదు. 22 మంది ప్ర‌యాణికుల‌తో ప్ర‌యాణిస్తున్న ఈ విమానం ఆచూకీ దొర‌క‌డం లేద‌ని, ఏటీసీతో ఈ విమానానికి సంబంధాలు పూర్తిగా తెగిపోయాయ‌ని అధికారులు పేర్కొంటున్నారు. ఈ 22 మంది ప్ర‌యాణికుల్లో న‌లుగురు భార‌తీయులు, ముగ్గురు జ‌పాన్ పౌరులు, మిగితా వారంద‌రూ నేపాల్ పౌరులే వున్నారు.ఈ విమానం ఉద‌యం 9ః55 నిమిషాల‌కు పోఖ్రా నుంచి జోమ్‌సోమ్‌కు బ‌య‌ల్దేరింద‌ని, ఆ త‌ర్వాత ఏటీసీతో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయ‌ని అధికారులు పేర్కొంటున్నారు. విమానాన్ని ముస్తాంగ్ జిల్లాలోని జోమ్సోమ్ ప్రాంతంలో మొద‌ట‌ గుర్తించామ‌ని, త‌ర్వాత‌ మౌంట్ ధౌలగిరి వైపు మళ్లింద‌ని అధికారులు అంటున్నారు. దీని త‌ర్వాత మాత్రం త‌మ‌తో ట‌చ్‌లో లేకుండా పోయింద‌ని పేర్కొంటున్నారు. దీని ఆచూకీని గుర్తించ‌డానికి ఇత‌ర విమానాల‌ను ఉప‌యోగిస్తున్నామ‌ని అధికారులు పేర్కొంటున్నారు.

*నైజీరియాలోని పోర్ట్ హార్‌ కోర్ట్‌ సిటీలో విషాద ఘటన చోటుచేసుకున్నది. హార్‌ కోర్ట్‌ లోని చర్చి వద్ద జరిగిన తొక్కిసలాటలో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం ఉదయం చర్చి వద్ద నిర్వహించిన చారిటీ ఈవెంట్‌లో భాగంగా ఆహార పదార్థాలు, కానుకలు పంపిణీ చేశారు. దీంతో పెద్ద సంఖ్యలో ప్రజలు దూసుకురావడంతో తొక్కిసలాట చోటుచేసుకున్నది. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారని అధికారులు వెల్లడించారు.

*కాకినాడ జిల్లా ప్రత్తిపాడు పరిసరాల్లో పులి సంచారం కలకలం రేపుతుంది. నిన్న పోతులూరు గ్రామంలో ఒక గేదెను చంపగా ఇప్పటివరకు పులి దాడిలో పది గేదెలు మృతి చెందాయని గ్రామస్తులు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న అటవి అధికారులు, సిబ్బంది గ్రామానికి వెళ్లి వివరాలను సేకరించారు. పులిని బంధించేందుకు సుమారు 120 మంది అటవి సిబ్బంది సమీప ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. సాయంత్రానికి బోన్లను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

*ఏ.కొండూరు మండలం లోని రేపూడి తండా గ్యాస్ సిలిండర్ పేలి చికెన్ షాప్ దగ్ధం.._ప్రమాదంలో 50వేలు విలువైన కోళ్లు మృత్యువాత.. బూడిద పాలైన నగదు.._సంఘటన స్థలానికి చేరుకుని మంటలార్పిన అగ్నిమాపక సిబ్బంది.._

* తిరువూరు మండలం లక్ష్మీపురం వద్ద అతివేగంతో వెళ్తున్న బైకు అదుపుతప్పి డివైడర్ను ఢీకొన్న వైనం..వాహనం నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలు, చికిత్స నిమిత్తం 108 సహాయంతో తిరువూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు..

* నకిలీ పత్తి విత్తన ముఠాలపై పోలీసులు ముప్పేట దాడులు చేశారు. ఏపీలోని కర్నూలు జిల్లా నంద్యాల నుంచి హైదరాబాద్‌కు ఓఆర్‌ఆర్‌ మీదుగా నకిలీ పత్తి విత్తనాలను తరలిస్తున్నట్లు గుర్తించి, దుండిగల్‌, ఎస్‌వోటీ పోలీసులు దాడులు చేసినట్లు బాలానగర్‌ డీసీపీ గోనె సందీప్‌ వెల్లడించారు. కరీంనగర్‌ జిల్లాకు చెందిన మూల హరీశ్‌, నంద్యాలకు చెందిన మధ్యవర్తి అలీషాతో కలిసి ఈ దందా చేస్తున్నట్లు వివరించారు. హరీశ్‌, మేడ్చల్‌లోని ఇందిరానగర్‌కు చెందిన డ్రైవర్‌ దేశం హరిప్రసాద్‌ను అరెస్టు చేసి, 400 కిలోల నకిలీ పత్తి విత్తనాలను సీజ్‌ చేశామని చెప్పారు. ఈ విత్తనాల విలువ రూ. 16.20 లక్షలుగా ఉంటుందని, అలీషా పరారీలో ఉన్నాడని తెలిపారు. అటు రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ సమీపంలోని పాల్మాకుల వద్ద ఎస్‌వోటీ పోలీసులు 570 కిలోల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారని శంషాబాద్‌ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి వెల్లడించారు. శుక్రవారం రాత్రి కృష్ణా జిల్లా కంచికచర్ల నుంచి తరలిస్తున్న 21.6 కిలోల బీటీ-3 పత్తి విత్తనాలను వ్యవసాయ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

*ఉరేసుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని ఈశ్వర్‌నగర్‌ గ్రామ శివారులో చోటుచేసుకుంది. మండల కేంద్రంలో బుద్దనగర్‌ కాలనీకి చెందిన బోందలే రోహన్‌ (18) డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. శనివారం తన వ్యవసాయ పొలంలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అటుగా వెళ్తున్న వారు గమనించి కుటుంబసభ్యులకు సమాచారాన్ని అందించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ విషయమై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై నందిగామ నాగ్‌నాథ్‌ తెలిపారు.

*నకిలీ పత్తి విత్తన ముఠాలపై పోలీసులు ముప్పేట దాడులు చేశారు. ఏపీలోని కర్నూలు జిల్లా నంద్యాల నుంచి హైదరాబాద్‌కు ఓఆర్‌ఆర్‌ మీదుగా నకిలీ పత్తి విత్తనాలను తరలిస్తున్నట్లు గుర్తించి, దుండిగల్‌, ఎస్‌వోటీ పోలీసులు దాడులు చేసినట్లు బాలానగర్‌ డీసీపీ గోనె సందీప్‌ వెల్లడించారు. కరీంనగర్‌ జిల్లాకు చెందిన మూల హరీశ్‌, నంద్యాలకు చెందిన మధ్యవర్తి అలీషాతో కలిసి ఈ దందా చేస్తున్నట్లు వివరించారు. హరీశ్‌, మేడ్చల్‌లోని ఇందిరానగర్‌కు చెందిన డ్రైవర్‌ దేశం హరిప్రసాద్‌ను అరెస్టు చేసి, 400 కిలోల నకిలీ పత్తి విత్తనాలను సీజ్‌ చేశామని చెప్పారు. ఈ విత్తనాల విలువ రూ. 16.20 లక్షలుగా ఉంటుందని, అలీషా పరారీలో ఉన్నాడని తెలిపారు. అటు రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ సమీపంలోని పాల్మాకుల వద్ద ఎస్‌వోటీ పోలీసులు 570 కిలోల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారని శంషాబాద్‌ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి వెల్లడించారు. శుక్రవారం రాత్రి కృష్ణా జిల్లా కంచికచర్ల నుంచి తరలిస్తున్న 21.6 కిలోల బీటీ-3 పత్తి విత్తనాలను వ్యవసాయ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

*గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో ఓ కుటుంబంల్చో నలుగురు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లా శెట్టూరు మండలం ములకలేడు గ్రామంలో శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు, గ్రామానికి చెందిన కొలిమి రజాక్‌, అతని కుమారుడు అబ్దుల్లా కమ్మరి పనులు చేస్తుంటారు. రజాక్‌ భార్య రజియాబీ కొన్నేళ్ల క్రితం మృతిచెందింది. కుమారుడు అబ్దుల్లా భార్య కౌషన్‌ బాను తన కూతురు జైబాతో కలిసి మూడు రోజుల క్రితం పుట్టింటికి వెళ్లింది. దీంతో తండ్రి, కొడుకు శుక్రవారం రాత్రి ఇంట్లో వంట చేసుకుని భోజనం చేశారు. కానీ గ్యాస్‌ స్టవ్‌ ఆఫ్‌ చేయడం మరిచిపోవడంతో లీకైన గ్యాస్‌ ఇల్లంతా వ్యాపించింది. నమాజుకు వెళ్లేందుకు రజాక్‌ వేకువజామున నిద్రలేచి.. వంటగదిలో స్విచ్‌ వేయడంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో రజాక్‌ ఉంటున్న ఇంటితో పాటు పక్కనే ఉన్న అతని తమ్ముడు సదుద్దీన్‌ ఇల్లు కూడా ధ్వంసమైంది. ఆ ఇంట్లో నిద్రిస్తున్న సదుద్దీన్‌ భార్య జైనూబీ(60), కుమారుడు దాదాపీర్‌ (35), కోడలు షర్ఫన (30), మనవరాలు ఫీరూబీ (5) నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. రజాక్‌, అబ్దుల్లా తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు శబ్దం విన్న స్థానికులు.. రజాక్‌ ఇంటివద్దకు పరుగులు తీశారు. రెండు ఇళ్లు కూలిపోవడం గమనించి, సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని కళ్యాణదుర్గం ఆసుపత్రికి, మెరుగైన చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అగ్నిమాపక, పోలీస్‌, రెవెన్యూ శాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

*ఏడేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడో కామాంధుడు. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం గ్రామం రాజీవ్‌గాంధీ కాలనీలో నాపరాయి బండ పరుపుడు పనులు చేసే మందలపు శివప్రసాద్‌ (50) స్థానికంగా ఉండే ఏడేళ్ల బాలికను టీవీ చూద్దామంటూ శనివారం ఉదయం ఇంటికి తీసుకు వెళ్లాడు. మధ్యాహ్న సమయంలో ఇంటికి వచ్చిన చిన్నారిని తల్లిదండ్రులు ఎక్కడకి వెళ్లావంటూ ప్రశ్నించారు. శివప్రసాద్‌ ఇంటికి వెళ్లినట్టు చెప్పింది. కుమార్తె శరీరంపై మరకలు గుర్తించిన తల్లిదండ్రులు అనుమానంతో నాదెండ్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికను పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి పంపారు.

*సారా స్థావరాలపై దాడి చేసిన పోలీసులు 70లీటర్ల సారా, 1200 కేజీల బెల్లాన్ని శనివారం పట్టుకున్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేశారు. వీరిలో వైసీపీ నేత ఒకరు ఉన్నారు. వెదురు కుప్పం పోలీసు సబ్‌ఇన్స్‌పెక్టర్‌ గోపి తెలిపిన వివరాల మేరకు… వెదురుకుప్పం మండలం వేణుగోపాలపురం గ్రామ సమీపంలో పాతచెరువు వంక వద్ద సారా తయారీ చేస్తున్నట్లు సమాచారం అందడంతో తమ సిబ్బందితో దాడి చేసినట్లు చెప్పారు. ఈ క్రమంలో పాతచెరువు వంక వద్ద వేణుగోపాలపురం దళితవాడకు చెందిన వాసు, రాజీవ్‌గాంధీ అలియాస్‌ రాజా, భాస్కర్‌ సారా తయారీ చేస్తుండగా అరెస్టు చేసి 70 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నారు. అలాగే 1200 కేజీల బెల్లంను సీజ్‌ చేశామని చెప్పారు. పట్టుబడిన ముగ్గురిని విచారించగా వెదురుకుప్పం మండలం తిరుమలయ్యపల్లె పంచాయతీ చెంచుగుడికి చెందిన రామలింగారెడ్డి పేరును వెల్లడించడంతో ఆయనపై కేసు నమోదు చేశారు. వీరికి అతడు నల్లబెల్లం విక్రయిస్తున్నట్లు తెలిపారు.

*ఉరేసుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని ఈశ్వర్‌నగర్‌ గ్రామ శివారులో చోటుచేసుకుంది. మండల కేంద్రంలో బుద్దనగర్‌ కాలనీకి చెందిన బోందలే రోహన్‌ (18) డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. శనివారం తన వ్యవసాయ పొలంలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అటుగా వెళ్తున్న వారు గమనించి కుటుంబసభ్యులకు సమాచారాన్ని అందించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ విషయమై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై నందిగామ నాగ్‌నాథ్‌ తెలిపారు.

* నకిలీ పత్తి విత్తన ముఠాలపై పోలీసులు ముప్పేట దాడులు చేశారు. ఏపీలోని కర్నూలు జిల్లా నంద్యాల నుంచి హైదరాబాద్‌కు ఓఆర్‌ఆర్‌ మీదుగా నకిలీ పత్తి విత్తనాలను తరలిస్తున్నట్లు గుర్తించి, దుండిగల్‌, ఎస్‌వోటీ పోలీసులు దాడులు చేసినట్లు బాలానగర్‌ డీసీపీ గోనె సందీప్‌ వెల్లడించారు. కరీంనగర్‌ జిల్లాకు చెందిన మూల హరీశ్‌, నంద్యాలకు చెందిన మధ్యవర్తి అలీషాతో కలిసి ఈ దందా చేస్తున్నట్లు వివరించారు. హరీశ్‌, మేడ్చల్‌లోని ఇందిరానగర్‌కు చెందిన డ్రైవర్‌ దేశం హరిప్రసాద్‌ను అరెస్టు చేసి, 400 కిలోల నకిలీ పత్తి విత్తనాలను సీజ్‌ చేశామని చెప్పారు. ఈ విత్తనాల విలువ రూ. 16.20 లక్షలుగా ఉంటుందని, అలీషా పరారీలో ఉన్నాడని తెలిపారు. అటు రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ సమీపంలోని పాల్మాకుల వద్ద ఎస్‌వోటీ పోలీసులు 570 కిలోల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారని శంషాబాద్‌ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి వెల్లడించారు. శుక్రవారం రాత్రి కృష్ణా జిల్లా కంచికచర్ల నుంచి తరలిస్తున్న 21.6 కిలోల బీటీ-3 పత్తి విత్తనాలను వ్యవసాయ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

*సారా స్థావరాలపై దాడి చేసిన పోలీసులు 70లీటర్ల సారా, 1200 కేజీల బెల్లాన్ని శనివారం పట్టుకున్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేశారు. వీరిలో వైసీపీ నేత ఒకరు ఉన్నారు. వెదురు కుప్పం పోలీసు సబ్‌ఇన్స్‌పెక్టర్‌ గోపి తెలిపిన వివరాల మేరకు… వెదురుకుప్పం మండలం వేణుగోపాలపురం గ్రామ సమీపంలో పాతచెరువు వంక వద్ద సారా తయారీ చేస్తున్నట్లు సమాచారం అందడంతో తమ సిబ్బందితో దాడి చేసినట్లు చెప్పారు. ఈ క్రమంలో పాతచెరువు వంక వద్ద వేణుగోపాలపురం దళితవాడకు చెందిన వాసు, రాజీవ్‌గాంధీ అలియాస్‌ రాజా, భాస్కర్‌ సారా తయారీ చేస్తుండగా అరెస్టు చేసి 70 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నారు. అలాగే 1200 కేజీల బెల్లంను సీజ్‌ చేశామని చెప్పారు. పట్టుబడిన ముగ్గురిని విచారించగా వెదురుకుప్పం మండలం తిరుమలయ్యపల్లె పంచాయతీ చెంచుగుడికి చెందిన రామలింగారెడ్డి పేరును వెల్లడించడంతో ఆయనపై కేసు నమోదు చేశారు. వీరికి అతడు నల్లబెల్లం విక్రయిస్తున్నట్లు తెలిపారు.

*ఇంటి ముందు తల్లి చీరతో (కట్టిన ఊయల బాలికకు ఉరితాడైంది. ఊయలతో ఆడుకుంటున్న ఎనిమిదేళ్ల బాలికకు చీర మెడకు బిగిసుకుపోవడంతో ఊపిరి ఆడక మృతిచెందింది. ఈ ఘటన లాలాగూడ పోలీస్‌ స్టేషన్‌ (పరిధిలో జరిగింది. లాలాపేట్‌కు చెందిన రాజేష్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య ప్రసన్నజ్యోతిముగ్గురు కుమార్తెలున్నారు. పెద్ద కుమార్తె కోట ఎలీనా (శనివారం ఇంటి ముందు తల్లి చీరను మెట్లకున్న పెద్దమేకుకు కట్టి ఊయల చేసి ఆడుకుంటుండగా బాలిక మెడకు చుట్టుకుపోయి గట్టిగా బిగిసుకుంది. చీరను తీసేందుకు బాలిక ఎంత ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఊపిరి ఆడక ఎలీనా అక్కడికక్కడే మృతిచెందింది. ఆ సమయంలో తండ్రి ఊరెళ్లినట్లు తెలిపారు. తల్లి ఆలస్యంగా విషయాన్ని తెలుసుకుని బోరుమంది. స్థానికుల ఫిర్యాదు మేరకు లాలాగూడ పోలీసులు చిన్నారి మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు.

*అచ్చంపేట మండలం తాళ్లచెరువులో విషాదం చోటు చేసుకుంది. పురుగుల మందు తాగి చర్చిఫాదర్ బాసాని ప్రతాపరెడ్డి(మృతి చెందాడు. ఆర్సీయం చర్చిలో ఫాదర్గాబాసాని ప్రతాపరెడ్డి పనిచేస్తున్నాడు. గత కొంత కాలంగా చర్చి నిర్వాహణ విషయంలో వివాదాలు జరుగుతున్నాయి. అయితే.. సంఘం పెద్దలకుఫాదర్కు మధ్య మనస్పర్థాలు ఏర్పడటంతో ఆదివారం సూసైడ్ లెటర్ రాసి ఫాదర్ ప్రతాపరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

*జి. కొండూరు మండలంలోని చిన్న నందిగామలో విషాదం చోటు చేసుకుంది. కొడుకు చనిపోయాడనే మనస్థాపంతో దంపతులు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఇటీవల తమ కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుమారుడి మృతిని జీర్ణించుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డారు. కొడుకు లేని జీవితం వ్యర్థమని భార్యభర్తలు ఇద్దరు సూసైడ్ చేసుకోవడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి..కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు ఆరేపల్లి సాంబయ్యలక్ష్మీలుగా పోలీసులు గుర్తించారు.

*కాకినాడలోని అంబేద్కర్ భవన్‎లో రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు శనివారం అర్ధరాత్రి అతికిరాతకంగా రౌడీషీటర్ జగదీష్ (28)ను హత్య చేశారు. రక్తపు మడుగులో పడివున్న మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ హత్యకు గల కారణం గంజాయి వ్యాపారం లావాదేవీలు, పాతకక్షలుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

*సారా స్థావరాలపై దాడి చేసిన పోలీసులు 70లీటర్ల సారా, 1200 కేజీల బెల్లాన్ని శనివారం పట్టుకున్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేశారు. వీరిలో వైసీపీ నేత ఒకరు ఉన్నారు. వెదురు కుప్పం పోలీసు సబ్‌ఇన్స్‌పెక్టర్‌ గోపి తెలిపిన వివరాల మేరకు… వెదురుకుప్పం మండలం వేణుగోపాలపురం గ్రామ సమీపంలో పాతచెరువు వంక వద్ద సారా తయారీ చేస్తున్నట్లు సమాచారం అందడంతో తమ సిబ్బందితో దాడి చేసినట్లు చెప్పారు. ఈ క్రమంలో పాతచెరువు వంక వద్ద వేణుగోపాలపురం దళితవాడకు చెందిన వాసు, రాజీవ్‌గాంధీ అలియాస్‌ రాజా, భాస్కర్‌ సారా తయారీ చేస్తుండగా అరెస్టు చేసి 70 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నారు. అలాగే 1200 కేజీల బెల్లంను సీజ్‌ చేశామని చెప్పారు. పట్టుబడిన ముగ్గురిని విచారించగా వెదురుకుప్పం మండలం తిరుమలయ్యపల్లె పంచాయతీ చెంచుగుడికి చెందిన రామలింగారెడ్డి పేరును వెల్లడించడంతో ఆయనపై కేసు నమోదు చేశారు. వీరికి అతడు నల్లబెల్లం విక్రయిస్తున్నట్లు తెలిపారు.

*ఏపీలోని కాకినాడలో ఓ రౌడిషీటర్‌ హత్యకు గురయ్యాడు. పట్టణంలోని పాత బస్టాండ్‌ వద్ద ఉన్న అంబేద్కర్‌ భవన్ ప్రాంగణంలో అగంతుకులు ఇద్దరిపై కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో రౌడిషీటర్‌ జగదీశ్‌ మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి. మృతదేహాన్ని జీజీహెచ్ కు తరలించారు. జగదీశ్‌పై గతంలో పలు కేసులు నమోదయ్యాయి.

*రెచ్చగొట్టే నినాదాలు చేసినట్లు వచ్చిన ఆరోపణలపై నమోదైన కేసులో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) రాష్ట్ర కమిటీ సభ్యుడు యాహ్యా తంగల్‌ను కేరళ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. త్రిసూర్‌లోని పెరుంపిలవులో ఉన్న ఆయన ఇంటి వద్ద ఆయనను అదుపులోకి తీసుకుని, అలపుజకు తీసుకెళ్ళారు.

*అచ్చంపేట మండలం తాళ్లచెరువులో విషాదం చోటు చేసుకుంది. పురుగుల మందు తాగి చర్చిఫాదర్ బాసాని ప్రతాపరెడ్డి(55) మృతి చెందాడు. ఆర్సీయం చర్చిలో ఫాదర్గా బాసాని ప్రతాపరెడ్డి పనిచేస్తున్నాడు. గత కొంత కాలంగా చర్చి నిర్వాహణ విషయంలో వివాదాలు జరుగుతున్నాయి. అయితే.. సంఘం పెద్దలకు, ఫాదర్కు మధ్య మనస్పర్థాలు ఏర్పడటంతో ఆదివారం సూసైడ్ లెటర్ రాసి ఫాదర్ ప్రతాపరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.