న్యూజెర్సీ లో జరుగుతున్న తెలంగాణ తెలుగు అసోసియేషన్ మహాసభలకు హాజరైన తెలంగాణాకు చెందిన భాజపా కాంగ్రెస్ తెరాస నేతలు అమెరికాలో ఉంటున్న తమ తమ పార్టీలకు చెందిన అభిమానులు కార్యకర్తలతో శనివారం నాడు భేటీ అయ్యారు. టీపిసిసి అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి మాజీ ఎంపీ మధుయాష్కి ఇతర కాంగ్రెస్ నేతలు షెరటాన్ హోటల్లో ఆ పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. తెరాసకు చెందిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే సునీత తదితరులు తమ పార్టీ కార్యకర్తలు అభిమానులతో సమావేశమయ్యారు భాజపా ఎంపీ డి అరవింద్ డీకే అరుణ ఇతరులు ఫంక్షన్ హాల్ లో భాజపా పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు