Business

డబ్బే.. డబ్బు.. ఒక్కొక్కరి అకౌంట్లో రూ.13 కోట్లు

డబ్బే.. డబ్బు.. ఒక్కొక్కరి అకౌంట్లో రూ.13 కోట్లు

వివిధ ప్రాంతాల్లో HDFC బ్యాంకు ఖాతాదారులు ఒక్కసారి కోటీశ్వరులయ్యారు. HDFC బ్యాంకు అకౌంట్లలోకి కుప్పలు.. తెప్పలుగా డబ్బు వచ్చిపడటం చూసి షాక్ అయ్యారు. వివిధ ప్రాంతాల్లో HDFC బ్యాంకు ఖాతాదారులు ఒక్కసారి కోటీశ్వరులయ్యారు. HDFC బ్యాంకు అకౌంట్లలోకి కుప్పలు.. తెప్పలుగా డబ్బు వచ్చిపడటం చూసి షాక్ అయ్యారు. తమ మొబైల్​ ఫోన్​లకు వచ్చిన మెసేజ్​లు చూసి..కలనా నిజమా అన్న మీమాంసలో పడిపోయారు. ఎలా జరుగుతోందో.. ఏమో తెలియదు కాని.. చెన్నై నగరంలోని కొంత మంది బ్యాంక్‌ ఖాతాల్లో కోట్ల రూపాయలు వచ్చి పడ్డాయి. ఒక్కో HDFC అకౌంట్‌లో ఒకే సారి 13 కోట్ల 50 లక్షలు జమ అయ్యాయి. దాదాపు వంద మంది కస్టమర్ల ఖాతాల్లో కోట్లు పడ్డాయి. అసలు ఇది నిజమేనా అన్న కొందరు ఏటీఎం కేంద్రాలకు వెళ్లి చెక్ చేసుకున్నారు.

మరికొందరు బ్యాంక్ యాప్‌లో క్రాస్ చెక్ చేశారు. ఖాతాల్లో కోట్లలో బ్యాలెన్స్ చూపించడంతో.. ఎగిరి గంతేశారు మరికొందరు. ఒకే సారి కోట్లు వచ్చి పడడంతో ఇంకొందరు కంగారు పడి బ్యాంకుకు పరుగులు తీశారు. ఈ విషయం తెలుసుకున్న చెన్నైలోని బర్కిట్‌ రోడ్‌ HDFC బ్రాంచ్‌ అధికారులు అలర్ట్‌ అయ్యారు. దాదాపు వంద ఖాతాలను హోల్డ్‌ చేశారు. బ్యాంక్ సర్వర్లలో కొత్త సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేయడంతో.. ఇలా జరిగినట్లు తెలుస్తోంది. ఈ వార్త ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.చెన్నై ఘటన మరువకముందే తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ HDFC బ్యాంకు అకౌంట్లలోకి భారీగా నగదు జమ అయ్యాయి. పెద్దపల్లి జిల్లా మంథనిలోని ఓ మొబైల్ దుకాణం నిర్వాహకుడి ఖాతాలో 5 కోట్ల 28లక్షల నగదు జమ..హాట్‌ టాఫిక్‌గా మారింది. తన ఖాతాలోకి కోట్ల రూపాయలు రావటం చూసిన సాయి ఆశ్చర్యపోయాడు. ఆదివారం రాత్రి వేళ నగదు ఖాతాలోపడినట్లు తెలిపారు. ఇవాళ ఉదయమే బ్యాంకు అధికారులను సంప్రదించినట్లు వెల్లడించాడు. అటు మంథని ఘటన నుంచి తేరుకోకముందే..వికారాబాద్‌లో ఓ వ్యక్తికి చెందిన HDFC బ్యాంకు అకౌంట్లలోకి భారీగా నగదు వచ్చింది. మొబైల్ షాద్ యజమాని వెంకట్‌రెడ్డి ఖాతాల్లో 18కోట్ల 52లక్షలు జమ అయినట్లు తెలిపాడు. డబ్బులు ఎలాంటి బదిలీ జరగకుండా అకౌంట్ సీజ్ అయినట్లు పేర్కొన్నాడు.