న్యూజెర్సీలో మూడు రోజులపాటు వైభవంగా జరిగిన తెలంగాణ తెలుగు అసోసియేషన్ ఉత్సవాలు ఆదివారం రాత్రితో ముగిశాయి. ప్రముఖ రచయిత జొన్నవిత్తుల రచించిన తెలంగాణ వైభవం నాట్య రూపకాన్ని వందేమాతరం శ్రీనివాస్ ఆలపించారు. ఇక్కడ ఉంటున్న బాలికలు ఈ రూపకాన్ని ప్రదర్శించారు. ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ సంగీత విభావరి ఆకట్టుకుంది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. TTA వ్యవస్థాపక అధ్యక్షుడు పైళ్ల మల్లారెడ్డి, అధ్యక్షుడు P.మోహన్ రెడ్డి సలహా కమిటీ చైర్మన్ విజయ్ పాల్ రెడ్డి, కాన్ఫరెన్స్ కమిటీ కన్వీనర్ గనుగొని శ్రీనివాస్ తదితరుల ఆధ్వర్యంలో ఉత్సవాలు జరిగాయి. భాజపా ఎంపీ ధర్మపురి అరవింద్ పార్టీ NRI కార్యకర్తల సమావేశంలో ప్రసంగించారు. డీకే అరుణ తదితరులు పాల్గొన్నారు.