DailyDose

సత్యసాయి జిల్లాలో రెండు ప్రమాదాలు – TNI నేర వార్తలు

సత్యసాయి జిల్లాలో రెండు ప్రమాదాలు – TNI  నేర వార్తలు

*పల్నాడు జిల్లా రెంటచింతల బీసీ కాలనీకి చెందిన వారంతా సరకు రవాణా చేసే టాటా ఏస్‌ వాహనంలో కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. శ్రీశైలం నుంచి తిరిగొస్తున్న వీరి వాహనం రెంటచింతల పొలిమేరలోకిరాగానే స్థానిక విద్యుత్తు ఉపకేంద్రం వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొంది. వాహనం పల్టీలు కొట్టడంతో ప్రయాణిస్తున్న వారంతా ఒకరిపై ఒకరు పడటంతో ఆర్తనాదాలు చేశారు. ప్రమాద సమయంలో 38 మంది కూలీలు ఉన్నారు.

*శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా కదిరి మండలంలో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఒకరు మృతి చెందగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి జయ ప్రవీణ్ సొంత ఊరు నుంచి కారులో బెంగళూరు వెళుతుండగా కదిరి మండలం కె.కుంట్లపల్లి వద్ద వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న బొలెరో వాహనాన్ని ఢీ కొట్టారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జయ ప్రవీణ్ను స్థానికులు కదిరి ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు అనంతపురం వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆయన మృతి చెందారు.

*వి.కోట ప్రైవేట్ బస్టాండ్ లో ఉద్రిక్తత..మహిళలపై చేయి చేసుకున్న ఈఓ యాదవ పతి..ప్రైవేటు బస్టాండ్ ఆవరణలో ని దుకాణాలను నోటీసులు లేకుండా ధ్వంసం చేసిన ఈఓ యాదవ పతి..గత 50 సంవత్సరాలుగా దుకాణాలు పెట్టుకుని పొట్టనింపుకుంటున్న మహిళలు..దుకాణాలను జేసిబితో ధ్వంసం చేసిన ఈఓ యాదవపతి..అడ్డుకున్న మహిళలపై చేయి చేసుకున్న ఈఓ..తిరగబడ్డ మహిళలు.. ఉద్రిక్తత..సంఘటనా స్థలానికి చేరుకుని సర్ది చెబుతున్న పోలీసులు.

*అనంతపురం జిల్లా కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ముట్టడికి వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. ముట్టడిలో భాగంగా కలెక్టరేట్‌కు మూడు వైపుల నుంచి వామపక్ష పార్టీల నేతలు తరలివచ్చారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో వామపక్ష పార్టీల నేతలు, పోలీసులకు మధ్య తీవ్రస్థాయిలో తోపులాట జరిగింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ రావు సహా వామపక్ష పార్టీల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. కలెక్టరేట్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో రౌడీలు, గుండాలను వదిలి పెట్టి ప్రజల కోసం పని చేస్తున్న వారిని అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసుల తీరు దారుణంగా ఉందన్నారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించకపోతే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల పట్ల అప్రజాస్వామికంగా నిరంకుశంగా అరెస్టు చేస్తున్నారని శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

*పల్నాడు జిల్లా రెంటచింతలలో రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 7 గురు మృతి చెందడం‌ బాధాకరమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సాకే శైలజానాథ్ పేర్కన్నారు. దైవ దర్శనానికి వెళ్లి ఇంటికి వస్తున్న సమయంలో ప్రాణాలు కోల్పోవడం కలచి వేసిందన్నారు. మృతుల కుటుబాలకు కాంగ్రెస్ పార్టీ తరఫున సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానన్నారు. క్షతగాత్రులకు ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలని శైలజానాథ్ కోరారు.

*హైదరాబాద్: నగరంలోని మియపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. మియపూర్ గోకుల్ ప్లాట్స్‌లో ఆన్‌లైన్‌లో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నిందితుడు తిరుమల శెట్టి రాజేష్(27)ను మాదాపూర్ ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా.. క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న బీమవరంకు చెందిన ప్రధాన నిందితుడు వర్మ పరారీలో ఉన్నాడు. పట్టుబడ్డ నింధితుని వద్ద నుండి 4 లక్షల 52 వేల నగదు, 23 సెల్ ఫోన్లు, ఒక ల్యాప్ టాప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

*Karimnagar రూరల్ మండలం ముగ్దుమ్‌పూర్ లో దారుణం జరిగింది. కరీంనగర్‌కు చెందిన వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. మద్యం మత్తులోనే హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. మద్యం దుకాణం వద్ద సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

*ధర్మపురిలో ఇటుకల బట్టీ యజమానిని దారుణంగా హత్య చేసిన లారీ డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ధర్మపరి జిల్లా పెన్నాగరంలో నివసిస్తున్న కందసామి (53) ఇటుకల బట్టీ నడుపుతూ పాల వ్యాపారం చేస్తున్నారు. అదే ప్రాంతంలో కుబేంద్రన్‌ (30) అనే లారీ డ్రైవర్‌ నివసిస్తున్నారు. కుబేంద్రన్‌కు అతడి బంధువులకు దారి విషయమై తగాదాలు ఉన్నాయి. రెండు రోజుల క్రితం కందసామి ఆ గొడవ తీర్చేందుకు ఇరుపక్షాలతో చర్చలు జరిపారు. ఈ విషయం తెలుసుకున్న కుబేంద్రన్‌ ఆదివారం ఉదయం బైకుపై వెళ్తున్న కందసామిని అడ్డగించాడు. తమ బంఽధువులతో రాజీ ప్రయత్నాలు చేస్తావా అంటూ కందసామిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో వారిద్దరి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం జరిగింది. దీంతో కుబేంద్రన్‌ వేటకొడవలితో కందసామిపై దాడి చేసి పారిపోయాడు. దీంతో కందసామి అక్కడికక్కడే మరణించాడు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా పరారైన కుబేంద్రన్‌ అదియమాన్‌కోట్టై వద్ద పోలీసుస్టేషన్‌లో లొంగిపోయేందుకు సిద్ధమవుతుండగా పోలీసులు అతడిని అరెస్టు చేశారు.

*తిరువళ్లూరు – తిరుత్తణి మార్గంలోని పుదూరు గ్రామం వద్ద శనివారం రాత్రి వేగంగా వెళ్తున్న ఓ కారు హఠాత్తుగా దగ్ధమైంది. ఆ కారులో ప్రయాణించిన దంపతులు సకాలంలో తలుపులు తెరచుకుని బయటపడటంతో ప్రాణగండం నుండి తప్పించుకున్నారు. తిరుత్తణి సుబ్రమణ్యనగర్‌లో నివసిస్తున్న రాజేశ్‌కుమార్‌ (45),, ఆషా (40) అనే భార్యాభర్తలు శనివారం రాత్రి తిరువళ్లూరుకు వెళ్ళి స్వస్థలానికి బయల్దేరారు. వారి కారు పుదూరు గ్రామం వద్ద వెళుతుండగా ఇంజన్‌ నుంచి పొగలు రేగాయి. కారు నడుపుతున్న రాజేశ్‌కుమార్‌ అది చూసి దిగ్ర్భాంతి చెందారు. వెంటనే కారు నిలిపి డోర్‌ తెరచుకుని భార్యాభర్తలు ఇద్దరూ బయపడ్డారు. కాసేపటికల్లా ఆ కారు మంటల్లో దగ్ధమైంది. ఈ సమాచారం తెలుసుకుని కనకమ్మసత్రం పోలీసులు అగ్నిమాపక సిబ్బంది తో అక్కడికి వెళ్ళారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

*దక్షిణ నైజీరియాలో శనివారం ఘోరం చోటుచేసుకుంది. స్థానిక పోర్ట్‌ హార్‌కోర్ట్‌ నగరంలో ఓ చర్చిలో ఉచితంగా ఇస్తున్న ఆహారాన్ని తీసుకునేందుకు జనం ఎగబడటంతో భారీగా తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో 31మంది మృతిచెందారు. చర్చి లోపలికి వచ్చే దారి చాలా సన్నగా ఉండటం, ఒక్కసారిగా వందలాదిగా వచ్చిపడిన జనాన్ని నిర్వాహకులు నియంత్రించలేకపోవడంతోనే ఈ దారుణం జరిగిందని అధికారులు తెలిపారు. ఘటన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించామని నగర పోలీసు శాఖ స్పష్టం చేసింది. ఆఫ్రికా ఖండంలోనే అత్యంత అధికంగా చమురును ఉత్పత్తి చేసే నైజీరియా, సంపదను సృష్టించుకోవడంలో మాత్రం విఫలమైంది. దేశంలో ప్రతి 10మందిలో నలుగురు కడుపేదరికంలో తినడానికి తిండి కూడా దొరకని దుర్భర దారిద్య్రంలో జీవిస్తుండటం విషాదకరం.

* మనస్తాపంతో లింగాలపాడు ఎస్సీ కాలనీకి చెందిన దువ్వారపు రాము (32) అనే యువకుడు ఆది వారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, కుటుంబ స భ్యుల వివరాల మేరకు… రాము పెయింటింగ్‌ పనులు చేసు కుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో కేన్సర్‌ బారినపడి కొన్నేళ్లుగా చికిత్స పొందుతున్నాడు. అయి నా ఆరోగ్యం కుదుట పడలేదు. దీంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో శ్లాబు హుక్కుకు తాడుకట్టి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చర్చికి వెళ్లిన భార్య యమున, పిన్ని చల్ల అసిరిపోలమ్మ ఇంటికి చేరుకుని చూడగా రాము విగతజీవిగా కనిపించడంతో బోరున విలపించారు. అసిరిపోలమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని శవపంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం కోటబొమ్మాళి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చే స్తున్నట్టు ఎస్‌ఐ పి.పారినాయుడు తెలిపారు. రాముకు రెండేళ్ల కుమారుడు ఉన్నాడు.

*ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని రెంటచింతల విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్ద ఆగి ఉన్న లారీని టాటా ఏస్‌ వాహనం ఢీకొట్టింది. దీంతో ఆరుగురు మరణించారు. ప్రమాదంలో మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను గురజాల ప్రభుత్వ దవాఖానకు తరలించారు.

*ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పర్యాటకుల టెంపో ట్రావెలర్‌ను లారీ ఢీకొనడంతో ఏడుగురు దుర్మరణం చెందారు. మరో 9 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో టెంపో డ్రైవర్‌, ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. వీరంతా కర్ణాటక రాష్ర్టానికి చెందినవారు. అయోధ్య సహా, ఉత్తరభారతంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. యూపీలోని మోతీపూర్‌ ప్రాంతం ననిహా మార్కెట్‌ వద్ద బహ్రెయిచ్‌-లఖీంపూర్‌ హైవేపై ఆదివారం ఉదయం 7 గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. టెంపోలో మొత్తం 16 మంది ప్రయాణిస్తున్నారని, వారిలో డ్రైవర్‌ సహా ఐదుగురు ఘటన స్థలంలోనే మరణించారని, మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారని ఏఎస్పీ అశోక్‌ కుమార్‌ పీటీఐకి తెలిపారు. మృతులను కలబురగికి చెందిన శివకుమార్‌ పుజారి(28), బీదర్‌లోని గణేశ్‌నగర్‌కు చెందిన జగదాంబ(52), పన్మథ(36), అనీల్‌(30), సంతోష్‌(35), శశికళ(38), సరస్వతి(47)గా గుర్తించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు. తీవ్ర గాయాలైన శివాని, సుజాత, దీపిక, వేవావతి, శీతల్‌, సంగమ, అనీల్‌లకు బహ్రెయిచ్‌ జిల్లా ఆస్పత్రి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. 15 ఏళ్ల భూమిక, మూడేళ్ల వైష్ణవిలకు స్వల్పగాయాలవగా, భూమిక ఘటన స్థలం నుంచి కుటుంబసభ్యులకు వీడియోకాల్‌ చేసి పోలీసులతో మాట్లాడించడం, ఫొటోలు షేర్‌ చేయడంతో మృతుల వివరాలు తెలిశాయని ఏఎస్పీ చెప్పారు.

* భైంసా మదీనా కాలనీలో శనివా రం అర్ధరాత్రి ఎలక్ట్రికల్‌ బైక్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో దగ్ధమైంది. కాలనీలో నివాసముంటున్న అబ్దుల్‌ ఆహాద్‌ రాత్రి ఎల క్ట్రికల్‌ బైక్‌ను పార్క్‌ చేసి ఇంట్లోకి వెళ్లాడు. నిమిషాల వ్య వధిలోనే బైక్‌కు షార్ట్‌ సర్క్యూట్‌ ఏర్పడి మంటలు వ్యాపిం చి దగ్ధమైంది. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు అప్రమ త్తమై అక్కడి ప్రాంతంలోని ఇతర వాహనాలను మంటల బారిన పడకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎ లక్ట్రికల్‌ బైక్‌కు వ్యాపించిన మంటలను అర్పివేసే సమ యానికే బైక్‌కు చెందిన పరికరాలు అధిక శాతం దగ్ధమ య్యాయి. ఆరు నెలలుగా వినియోగిస్తున్నట్లు యాజమాని అబ్దుల్‌ ఆహాద్‌ పేర్కొన్నారు.

*కాకినాడలోని అంబేద్కర్ భవన్‎లో రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు శనివారం అర్ధరాత్రి అతికిరాతకంగా రౌడీషీటర్ జగదీష్ (28)ను హత్య చేశారు. రక్తపు మడుగులో పడివున్న మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ హత్యకు గల కారణం గంజాయి వ్యాపారం లావాదేవీలు, పాతకక్షలుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

*సారా స్థావరాలపై దాడి చేసిన పోలీసులు 70లీటర్ల సారా, 1200 కేజీల బెల్లాన్ని శనివారం పట్టుకున్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేశారు. వీరిలో వైసీపీ నేత ఒకరు ఉన్నారు. వెదురు కుప్పం పోలీసు సబ్‌ఇన్స్‌పెక్టర్‌ గోపి తెలిపిన వివరాల మేరకు… వెదురుకుప్పం మండలం వేణుగోపాలపురం గ్రామ సమీపంలో పాతచెరువు వంక వద్ద సారా తయారీ చేస్తున్నట్లు సమాచారం అందడంతో తమ సిబ్బందితో దాడి చేసినట్లు చెప్పారు. ఈ క్రమంలో పాతచెరువు వంక వద్ద వేణుగోపాలపురం దళితవాడకు చెందిన వాసు, రాజీవ్‌గాంధీ అలియాస్‌ రాజా, భాస్కర్‌ సారా తయారీ చేస్తుండగా అరెస్టు చేసి 70 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నారు. అలాగే 1200 కేజీల బెల్లంను సీజ్‌ చేశామని చెప్పారు. పట్టుబడిన ముగ్గురిని విచారించగా వెదురుకుప్పం మండలం తిరుమలయ్యపల్లె పంచాయతీ చెంచుగుడికి చెందిన రామలింగారెడ్డి పేరును వెల్లడించడంతో ఆయనపై కేసు నమోదు చేశారు. వీరికి అతడు నల్లబెల్లం విక్రయిస్తున్నట్లు తెలిపారు.

* తాడికొండ మండలం లాంలో టీడీపీ నేత షేక్ సుభానీపై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. లాంలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై కలెక్టర్‌కు సుభానీ ఫిర్యాదు చేశారు. దీంతో సుభానీపై దాడి చేశారు. సుభానీ అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో జీజీహెచ్‎కు తరలించారు. తాడికొండ నియోజకవర్గం టీడీపీ మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా షేక్ సుభానీ ఉన్నారు. షేక్ సుభానీపై దాడిని స్థానిక టీడీపీ నేతలు ఖండించారు. నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

*డ్రైవర్‌ నిద్రమత్తు ఆరుగురి ప్రాణాలను బలితీసుకుంది! శ్రీశైలం దర్శనానికి వెళ్లొస్తున్న టాటా ఏస్‌ వాహనం ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు మృతిచెందినట్టు సమాచారం. 15 మంది గాయపడ్డారు. పల్నాడు జిల్లా రెంటచింతల విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ వద్ద ఆదివారం అర్ధరాత్రి ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెంటచింతలకు చెందిన 38 మంది టాటా ఏస్‌ వాహనంలో శ్రీశైలం వెళ్లి వస్తున్నారు. మరికొద్ది సేపట్లో ఇంటికి చేరుకుంటారనగా రెంటచింతల విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ వద్ద వారు ప్రయాణిస్తున్న వాహనం ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్టు తెలిసింది. క్షతగాత్రులను గురజాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎస్‌ఐ సమీర్‌ బాషా సిబ్బందితో సహాయక చర్యలు చేపట్టారు. నిద్రమత్తులో ఉన్న టాటా ఏస్‌ డ్రైవర్‌ రోడ్డు మార్జిన్‌లో ఆగివున్న లారీని గుర్తించకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

*ముత్తుకూరు మండలం కృష్ణపట్నం బీచ్‌లో సముద్రంలో స్నానం చేస్తూ యువకుడు గల్లంతయ్యాడు. గుండ్లపాలేనాకి చెందిన సతీష్ ముగ్గురు స్నేహితులతో కలసి సరదాగా బీచ్‌కు వచ్చి స్నానం చేస్తుండగా ఒక్కసారిగా అలల ఉధృతి పెరిగింది. దీంతో యువకుడు ఈదూరు సతీష్ నీళ్లలో కొట్టుకుపోయారు. విషయం తెలుసుకునన పోలీసులు యువకుడి కోసం గాలిస్తున్నారు. *తాడికొండ మండలం లాంలో టీడీపీ నేత షేక్ సుభానీపై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. లాంలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై కలెక్టర్‌కు సుభానీ ఫిర్యాదు చేశారు. దీంతో సుభానీపై దాడి చేశారు. సుభానీ అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో జీజీహెచ్‎కు తరలించారు. తాడికొండ నియోజకవర్గం టీడీపీ మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా షేక్ సుభానీ ఉన్నారు. షేక్ సుభానీపై దాడిని స్థానిక టీడీపీ నేతలు ఖండించారు. నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

* మనస్తాపంతో లింగాలపాడు ఎస్సీ కాలనీకి చెందిన దువ్వారపు రాము (32) అనే యువకుడు ఆది వారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, కుటుంబ స భ్యుల వివరాల మేరకు… రాము పెయింటింగ్‌ పనులు చేసు కుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో కేన్సర్‌ బారినపడి కొన్నేళ్లుగా చికిత్స పొందుతున్నాడు. అయి నా ఆరోగ్యం కుదుట పడలేదు. దీంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో శ్లాబు హుక్కుకు తాడుకట్టి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చర్చికి వెళ్లిన భార్య యమున, పిన్ని చల్ల అసిరిపోలమ్మ ఇంటికి చేరుకుని చూడగా రాము విగతజీవిగా కనిపించడంతో బోరున విలపించారు. అసిరిపోలమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని శవపంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం కోటబొమ్మాళి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చే స్తున్నట్టు ఎస్‌ఐ పి.పారినాయుడు తెలిపారు. రాముకు రెండేళ్ల కుమారుడు ఉన్నాడు.

* భైంసా మదీనా కాలనీలో శనివా రం అర్ధరాత్రి ఎలక్ట్రికల్‌ బైక్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో దగ్ధమైంది. కాలనీలో నివాసముంటున్న అబ్దుల్‌ ఆహాద్‌ రాత్రి ఎల క్ట్రికల్‌ బైక్‌ను పార్క్‌ చేసి ఇంట్లోకి వెళ్లాడు. నిమిషాల వ్య వధిలోనే బైక్‌కు షార్ట్‌ సర్క్యూట్‌ ఏర్పడి మంటలు వ్యాపిం చి దగ్ధమైంది. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు అప్రమ త్తమై అక్కడి ప్రాంతంలోని ఇతర వాహనాలను మంటల బారిన పడకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎ లక్ట్రికల్‌ బైక్‌కు వ్యాపించిన మంటలను అర్పివేసే సమ యానికే బైక్‌కు చెందిన పరికరాలు అధిక శాతం దగ్ధమ య్యాయి. ఆరు నెలలుగా వినియోగిస్తున్నట్లు యాజమాని అబ్దుల్‌ ఆహాద్‌ పేర్కొన్నారు.

*శ్రీశైలం శిఖరం సమీపంలో గిరిజనుడు అటవీశాఖ టికెట్ కౌంటర్ వద్ద పైపుకు తాడు కట్టుకుని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు మల్లికార్జున(30) అటవీశాఖలోని ఇష్టకామేశ్వరి టికెట్ కౌంటర్ వద్ద పనిచేస్తున్న వాచ్‌మెన్‌గా అధికారులు గుర్తించారు. మృతుడికి ఎవరూ లేనందున మానసికంగా ఆత్మహత్యకు పాల్పడి ఉండచ్చని అటవీశాఖ సిబ్బంది భావిస్తోంది.

*గుడుపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. గుడుపల్లి మండలం పోలీస్ స్టేషన్ వద్ద గుడుపల్లి మండలం ఒంటిపల్లి, చీకటిపల్లి గ్రామానికి చెందిన యువకులు హల్‌చల్ చేశారు. ఓ కేసు విషయంలో బాహాబాహీకి దిగారు. ఈ క్రమంలోనే పలువురుకి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.